17-04-2021 10:12:29 About Us Contact Us
అలజడి దర్శకుడు.. తెలుగు పరిశ్రమ గొంతుక.. భరద్వాజ గారి పుట్టినరోజు నేడు.!

అలజడి దర్శకుడు.. తెలుగు పరిశ్రమ గొంతుక.. భరద్వాజ గారి పుట్టినరోజు నేడు.!ఆరు అడుగులా రెండు అంగుళాల ఎత్తు కలిగిన దెబ్బయి ఏళ్ళు పైబడిన వ్యక్తి మనకు ఎదురైతే ఎలా ఉంటారు.!?నడుము ఒంగిపోయి.. మందగించిన చూపుతో.. వారికి ఉన్న చాదస్తంతో చెప్పిందే చెబుతూ.. పెద్దవాడిని కనుక అన్ని తెలుసు అని అహంకారంతో మాట్లాడుతుంటారు.. అలానే ఉంటారు అని ఒక వ్యక్తిని నేను రెండు సంవత్సరాల ముందు కలిశాను.. మేము ఎవరో తెలియకుండానే కూర్చోపెట్టి.. మాతో దాదాపు రెండు గంటల పాటు సంభాషించారు. చూపు స్పష్టంగా ఉంది.. అడుగులు వెయ్యడంలో.. చేతల్లో.. చాలా చురుకుగా ఉన్నారు. ఉస్మానియాలో చదివి.. ఆనాటి రాజకీయాల్లో పాలుగున్న విద్యార్థి.. సినీ రంగంలో నిర్మాతగా వచ్చి.. దర్శకుడిగా మారి విజయాలు అందుకున్న స్టార్.. పరిశ్రమకు సమస్య వస్తే.. తనే పరిశ్రమ గొంతుగా మారిన సినీరంగ ప్రముఖుడు.. అపారమైన తెలివి.. వయసుకు తగ్గిన అనుభవం.. ఇన్ని ఉంది కూడా మాతో ఆయన ఒక సాధారణ వ్యక్తిగా ఓపికగా మేము చెప్పింది విన్నారు. ఆయనే తమ్మారెడ్డి భరద్వాజ గారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు..


1948లో కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించారు భరద్వాజ్ గారు. ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ఉద్యమ కారణంగా రాష్ట్రం విడిచి వెళ్ళమనడంతో చెన్నై చేరిన తన తండ్రి.. విద్య రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేశారు.. సారధి స్టూడియోస్ లో చేరి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు.. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి తొలి సినిమా ఎన్టీఆర్ తో లక్షాధికారి అనే సినిమా చేశారు. అలా నిర్మాతగా మారిన ప్రజా నాట్య మండలి సభ్యుడు తమ్మారెడ్డి కృష్ణ మూర్తి. ఆయన కుమారుడే భరద్వాజ గారు. పరిశ్రమతో పాటు హైదరాబాద్ చేరిన భరద్వాజ.. ఓయూ లో ఇంజనీరింగ్ చదివారు. కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించడంతో యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా పాలుగున్నారు.


ఇటీవల సినిమాగా వచ్చిన జార్జ్ రెడ్డికి మిత్రుడు భరద్వాజ్ గారు.. అలాంటి విప్లవ భావాలు ఉన్నా భరద్వాజ నిర్మాతగా సినిమా రంగంలో అడుగు పెట్టారు. 1979లో కోతల రాయుడు సినిమాతో నిర్మాతగా మారిన ఆయన.. 1989లో మన్మధ సామ్రాజ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. రెండవ సినిమాగా తాను ఓయూ లో చూసిన గొడవల ఆధారంగా అలజడి అనే సినిమా తీశారు. ఆ సినిమా ఆనాడు తెలుగు నేల పై నిజంగానే అలజడి సృష్టించింది. అలా అటు దర్శకుడిగా 18 .. ఇటు నిర్మాతగా 15 సినిమాలు చేశారు. 1994లో చిత్ర పరిశ్రమ చేసిన స్ట్రైక్ లో పరిశ్రమ గొంతుకగా మారారు భరద్వాజ గారు. ఆ రోజుల్లో నన్ను అలా ముందుకు నెట్టారు అని ఆయన చెప్పుకున్నా.. ఆయన సమర్థుడు కనుకనే అలా ముందుకు రాణించారు అన్నది వాస్తవం.ఇప్పటికి చిత్ర పరిశ్రమలో ఎటువంటి సమస్య వచ్చినా అందరికి ముందుగా గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి భరద్వాజ గారు. చిన్న పేరు వచ్చినా సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తే మనల్ని నలుగురూ ఏమనుకుంటారో అని మాట్లాడకుండా ఉండే ఈ రోజుల్లో.. సమాజంలో జరిగే ఏ విషయం పట్ల నైనా.. తన గొంతును నిర్మొహమాటంగా చెప్తారు భరద్వాజ గారు. ఆనాడు విద్యార్థిగా తెలంగాణ పోరులో పాలుగున్నా.. మొన్న ప్రత్యేక హోదా కోసం ఆంధ్రాలో రోడ్ ఎక్కినా.. ప్రజలకు ఇది అవసరం అని నమ్మి అడుగు ముందుకు వేస్తుంటారు. పరిశ్రమలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన వ్యక్తి. అందరికి ఈ వయసులో సైతం అందుబాటులో ఉంటుంటారు భరద్వాజ గారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని నిత్యం ప్రజలతో పంచుకుంటుంటారు భరద్వాజ గారు.


గత సంవత్సరం తెలుగులో అనువాదించిన తమిళ సినిమా ఆమె. ఆ సినిమా తెలుగులో ఆయన సమర్పణలో విడుదలైంది. అలానే ఇటీవల విడుదలైన పలాస 1978 సినిమా సైతం ఆయన సమర్పణలోనే విడుదలైంది. సమాజానికి మంచి చెప్పే ఏ సినిమాకైనా తనదైన సహాయం చెయ్యడం ఆయన అలవాటు అనేందుకు ఈ రెండు సినిమాలు ఉదాహరణలు. మా లాంటి ఎందరో యువకులకు ఆయన స్ఫూర్తి. అలాంటి ఆయన గురించి రాస్తుపోతే పుస్తకామే అవుతుంది. అందుకే కేవలం కొన్ని విషయాలను మాత్రమే ఇక్కడ చెప్పుకొచ్చాము.


నేడు దెబ్బయి రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇలానే ఉత్సాహంగా పరిశ్రమలో మరిన్ని సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ.. మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున జన్మదిన శుభాకాంశాలు.

భారీ అంచనాలతో జులై 3న ఆహాలో విడుదల కానున్న భానుమతి రామకృష్ణ

భారీ అంచనాలతో జులై 3న ఆహాలో విడుదల కానున్న భానుమతి రామకృష్ణబానుమతి రామకృష్ణ.. నవీన్ చంద్ర.. సలోని లుత్ర జంటగా.. రాజా చెంబోలు.. వైవా హర్ష ప్రధాన పాత్రలలో.. శ్రీకాంత్ నగోతి దర్శకత్వంలో.. ప్రముఖ నిర్మాణ సంస్థ నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తున్న చిత్రం. శ్రవణ్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందించారు.. ఈ సినిమా జులై 3న ప్రేక్షకుల ముందు రానుంది.. ఆహా ద్వారా విడుదల చేయనున్నట్లు సినిమా బృందం ఇటీవల తెలిపింది..


ఇప్పటికే విడుదలైన టీజర్.. ట్రైలర్.. పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.. రెండు వేరు వేరు ప్రపంచాల నుండి వచ్చిన ముప్పయి ఏళ్ళు పైబడిన అమ్మాయి అబ్బాయి మధ్య జరిగే సంఘటనల సారాంశం ఈ సినిమా.. ఇండిపెండెంట్ ఉమెన్ గా సొసైటీ లో ఉంటూ.. 5ఏళ్ళు ప్రేమించిన రాము అనే అబ్బాయి వదిలేయడంతో ఆ బాధ నుండి బయటపడ్డ 30ఏళ్ళ అమ్మాయి భానుమతి కి.. తెనాలి తప్ప ఏ ఊరు తెలియని 33 ఏళ్ళ రామకృష్ణ హైదరాబాద్ కు వచ్చి తన ఆఫీస్ లో తనకు పరిచాయమవుతాడు.. అలా పరిచయమైన వీరిద్దరి కథ ఏమైంది అనేది సినిమా.. ట్రైలర్ చూస్తుంటే డైలాగ్స్ బాగా రాసుకున్నట్లు తెలుస్తుంది..


ఈ కాలంలో కెరియర్ లో సెటిల్ అవ్వాలి అని పెళ్ళికి ఆలస్యం చేస్తున్న అనేక మందికి ఈ కథ వారి జీవితంలా కనిపించవచ్చు.. ఇది ఓ.టి.టి. కంటెంట్ అని ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది.. దింతో సినిమాపై ప్రజల్లో ఆశక్తి నెలకొంది0.. ఇప్పటికే సినిమా చూసిన కొందరు విమర్శకుల నుండి మంచి స్పందన వచ్చింది.. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ గారు సైతం సినిమా విజయం సాధిస్తుంది అని..తను ఇటీవల కాలంలో ఇటువంటి మంచి ప్రేమ కథ కలిగిన సినిమా చూడలేదు అని చెప్పడంతో ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగిపోయాయి..


అందాల రాక్షసి సినిమాతో హీరోగా హిట్ అందుకున్న నవీన్ చంద్ర.. అరవింద సమేత వీరరాఘవతో నటుడిగా అటు విమర్శకుల ప్రశంసలు.. ఇటు ప్రజల ఆదరణ పొందారు.. ఇప్పుడు ఈ సినిమాతో అలాంటి గుర్తింపు వస్తుందని భావిస్తున్నారు.. ఇక కథనాయికి సలోని లుత్ర కు.. తెలుగులో ఇది తొలి సినిమా..ఇప్పటికే తమిళం.. హిందీలో సినిమాలు చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.. పలు యాడ్స్ లలో కూడా నటించారు.. ఈ సినిమాతో తెలుగులో సైతం మంచి పేరు లభిస్తుంది అని నమ్మకంతో ఉన్నారు.. ఈ సినిమాకి సాయి ప్రకాష్ సినిమాటోగ్రఫీ చెయ్యగా.. రవి పెరెపు ఎడిటర్ గా చేశారు..


జులై3న నేరుగా ఆహా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానుంది.. ఇప్పటికే ఓ.టి.టి లలో విడుదలవుతున్న చిత్రాలు విజయం సాధిస్తుండటంతో తమ సినిమాకు కూడా అలాంటి ఫలితమే వస్తుంది అని చిత్ర బృందం ఆశిసస్తుంది..

దక్షిణాదిన నేరుగా ఓ.టి.టిలో.. విడుదలవుతున్న తొలి భారీ చిత్రం కీర్తి సురేష్ పెంగ్విన్..

దక్షిణాదిన నేరుగా ఓ.టి.టిలో.. విడుదలవుతున్న తొలి భారీ చిత్రం కీర్తి సురేష్ పెంగ్విన్..మార్చ్ 13.. తెలుగులో చివరి సినిమా విడుదలైంది.. మార్చ్ మూడవ వారం నుండి కరోనా కారణంగా సినిమా హాళ్లు మూసివేయ్యడంతో తెలుగు ప్రజలు కొత్త సినిమా చూసి మూడు నెలలు గడిచింది.. గతంలో విడుదలై చూడని సినిమాలను ఓ.టి.టి లలో.. టీవీలలో చూస్తున్నారు.. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మరో నెల వరకు సినిమా థియేటర్లు తెరుచుకునే అవకాశం లేదు.. అందుకే సినిమాలను ఓ.టి.టి లలో నేరుగా విడుదల చేయాలని కొందరు ఆలోచిస్తుంటే.. మరి కొందరు సినిమా హాల్స్ ఓపెన్ చేశాక విడుదల చేయాలని భావించారు.. ఇలాంటి చర్చ నడుస్తున్న నేపథ్యంలో.. పెంగ్విన్ సినిమా దర్శక నిర్మాతలు జులై 19న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు..


మహానటి తో దక్షిణాదిన స్టార్ హీరోయిన్ గా మారిన కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెలుగు.. తమిళ.. మళయ భాషల్లో రేపు అమెజాన్ ప్రైమ్ లో పెంగ్విన్ విడుదల కానుంది.. ఇప్పటికే విడుదలైన టీజర్.. ట్రైలర్.. మరియు విడుదలైన సినిమాలోని ఒక్క పాటకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.. దక్షిణాదిన నేరుగా ఓ.టి.టి లో విడుదల కానున్న తొలి అతి పెద్ద సినిమా పెంగ్విన్..


ఈ సినిమాకు ప్రచారం చాలా గ్రాండ్ గా చేశారు.. ఎలాగో ఓ.టి.టి లో విడుదల కానుంది కనుక ప్రచారం కూడా సామాజిక మాధ్యమంలో చేశారు.. ఈ చిత్ర టీజర్ ను తెలుగులో సమంతా.. తమిళంలో త్రిష.. మలయాళంలో మంజు వారియర్.. హిందీలో తాప్సి విడుదల చేశారు.. తర్వాత కొద్దీ రోజులకు ట్రైలర్ ను తెలుగులో నాని.. తమిళంలో ధనుష్.. మలయాళంలో మోహన్ లాల్ విడుదల చేశారు.. మొన్న సినిమాలోని ఫస్ట్ సింగల్ ను ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ విడుదల చేశారు..


తమిళంలో మంచి పేరు పొందిన ప్రముఖ దర్శకుడు కార్తీక్ సబ్భారాజ్ నిర్మాణ సారథ్యంలో.. ఈశ్వర్ కార్తీక్ అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను తెరకెకించారు.. సంతోష్ నారాయణన్ సంగీత దర్శకుడు..


మూడు నెలల తర్వాత కొత్త సినిమా వస్తుండటం.. ఓ.టి.టి లో తొలి పెద్ద సినిమా కావడం.. ప్రచారం కూడా బాగా జరగడం.. ఇప్పటికే విడుదలైన పాట.. ట్రైలర్.. టీజర్.. బాగుండటంతో సినిమా పై ప్రజల్లో భారీ అంచనాలు నెలకొంది.. మరోవైపు ఓ.టి.టి లో నేరుగా సినిమా విదులైతే.. ప్రజల స్పందన ఎలా ఉంటుంది.. ఎంత మంది వీక్షిస్తారు అనే వాటి గురించి చిత్ర పరిశ్రమ కూడా ఆశక్తిగా ఎదురు చూస్తుంది.. ఒక క్రైమ్ త్రిల్లర్ గా సినిమా ఉండనున్నట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతుంది..

నేడు.. వకీల్ సాబ్ తో మళ్ళీ తెలుగులో చేస్తున్న అంజలి పుట్టిన రోజు!

నేడు.. వకీల్ సాబ్ తో మళ్ళీ తెలుగులో చేస్తున్న అంజలి పుట్టిన రోజు!అంజలి.. తెలుగు ప్రేక్షకులకు సీత.. ఇంట్లో బేబీ.. అసలు పేరు బాల త్రిపుర సుందరి అంజలి.. పుట్టింది నర్సాపురం..చదివింది రాజోలు.. వెళ్ళింది చెన్నై.. అక్కడే మోడలింగ్.. తెరంగేట్రం.. తెలుగు కన్నా తమిళంలో ఎక్కువ సినిమాలు తీసిన మన తెలుగమ్మాయి “అంజలి” .. అందంతో కూడిన అభినయం ఆమె సొంతం.. చక్కనైన గొంతు.. దింతో కుర్రాల మది చెదకొట్టేశారు.. ఐదు రాష్ట్రాల్లోని కోట్లాదిమంది.. అభిమానులుగా మారిపోయారు..”కట్టర్ పంటి”తో తమిళంలో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న అంజలి.. షాపింగ్ మాల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు.. జర్నీ తో రెండు భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నారు.. ఇక నేటి తరానికి తొలి పెద్ద మల్టీ స్టార్ సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు తో ప్రతి తెలుగు వారింట్లో.. వారి అమ్మాయిగా మారిపోయారు.. తొలి సినిమా నుండే సొంత డబ్బింగ్ చెప్తు తమిళ్,తెలుగులో స్టార్ హీరోయిన్ గా మారిన అంజలి గారి పుట్టిన రోజు సందర్భంగా.. ఆమె గురించి కొన్ని విషయాలు..


నర్సాపురంలో సెప్టెంబర్ 11న జన్మించిన అంజలి.. చదువంతా రాజోలు లోనే చేశారు.. ఇంటర్ చదివేందుకు చెన్నై లో ఉన్న పిన్ని దగ్గరకు వెళ్ళింది.. మోడలింగ్ చేస్తూ.. డాన్స్ నేర్చుకుంటున్న అంజలికి 2007లో తొలి సినిమా కట్టర్ పంటి సినిమాలో జీవ పక్కన నటించే అవకాశం లభించింది.. అప్పటికి తమిళం రాని ఆ తెలుగమ్మాయి.. ఏదో ఒక పాటకు ముందు నాలుగు మాటల కోసం తన గొంతుతో చెప్పమంటే ఆ వాయిస్ నచ్చడంతో.. నటన మొత్తం తెలుగులో డైలాగ్ చెప్పిన తను.. సినిమాకి తమిళంలో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది.. రాని తమిళంలోనే డబ్బింగ్ చెప్పిన తను.. ఇక తెలుగులో ఎందుకు చెప్పరు.. ఇక్కడా చెప్పేశారు.. తొలి సినిమా బ్లాక్ బస్టర్.. ఆ తర్వాత షాపింగ్ మాల్.. జర్నీ ఇలా తమిళంలో హిట్ మీద హిట్ కొడుతూ స్టార్ హీరోయిన్ గా మారిపోయారు అంజలి.. అప్పటికే 15 సినిమాలు దాటేశాయి..


అప్పుడు 2012లో ప్రతిష్టాత్మక సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాలో విక్టరీ వెంకటేష్ గారి పక్కన జోడిగా అవకాశం వచ్చింది.. తెలుగులో అప్పటికే గుర్తింపు తెచ్చుకున్న అంజలికి తెలుగులో సైతం స్టార్దం తెచ్చిపెట్టింది ఆ సినిమా.. ”ఏమో నాకు అన్ని అలా తెలిసిపోతాయి అంటే..” అంటూ తను చెప్పిన మాట.. మరో దశబ్దమైనా మనకు గుర్తుండిపోతుంది.. 2012లో మాస్ మహరాజ్ రవితేజ గారితో బలుపు.. వెంకటేష్ గారితో మసాలా తో వరసగా హాట్ట్రిక్ హిట్లు అందుకున్నారు.. 2014లో వచ్చిన గీతాంజలి సినిమాతో తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమాతోనే అద్భుతమైన హిట్ అందుకున్నారు.. ఆ సినిమాతో ఆమె ఇమేజ్ మరింత పెరిగింది.. నిఖిల్ తో శంకరాభరణం.. నతరత్న బాలకృష్ణ గారితో డిక్టేటర్.. అల్లుఅర్జున్ రసుగుర్రంలో స్పెషల్ సాంగ్ ఇలా తెలుగులో కూడా బాగా పేరు తెచ్చుకున్నారు అంజలి.. గతకొంత కాలంగా తమిళంలో వరుస సినిమాలలో బిజీగా ఉన్న అంజలి ఇప్పుడు మళ్ళీ నిశ్శబ్దం.. వకీల్ సాబ్ సినిమాలతో మన ముందుకు రానున్నారు..


పదమూడు సంవత్సరాలు.. తెలుగు.. తమిళం.. కన్నడ.. మలయాళం.. నాలుగు భాషలు.. నలబై ఆరు సినిమాలు.. ఒక హీరోయిన్ కి ఇంత బ్రహ్మదమైన లాంగ్ జర్నీ.. అందులోనూ మన తెలుగుమ్మాయికి ఈ మధ్యకాలంలో ఎవ్వరికీ దక్కలేదనే చెప్పాలి.. కష్టాలు.. కన్నీళ్లు.. విజయాలు.. ఆనందాలు అంటూ అన్నిటినీ చేసేశారు అంజలి.. వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోవడమే కాదు.. వాటిల్లో నుంచి ఏది మంచి రోల్ అనేది గుర్తుపట్టి సినిమాను ఎంపిక చేసుకున్నారు అంజలి.. రాని భాషలో డబ్బింగ్ చెప్పిన ఆమె పట్టుదలను ఎవరైనా మెచ్చుకోవాల్సిందే.. ఫిట్ నెస్ కోసం నిత్యం వర్క్ ఔట్ చేస్తూ ఆఖరికి క్యారివాన్ లో కూడా ఆసనాలు వేస్తుంటారు అంజలి..


అనేక భాషల్లో విడుదల కానున్న నిశ్శబ్దం.. మరో పక్క వకీల్ సాబ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో నటిస్తున్న అంజలి.. ఈ సినిమాలతో భారీ విజయాలను అందుకోవాలని.. మరిన్ని సంవత్సరాలు ఇలానే సినిమాలు చేస్తూ మనల్ని అలరించాలి అని కోరుకుందాం.. అలానే నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న అంజలి గారికి మా బి.ఆర్. మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు..

దాసరి ప్రకటనతో గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కిన రఘు కుంచే..!

దాసరి ప్రకటనతో గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కిన రఘు కుంచే..!20 సంవత్సరాల సినీ ప్రస్థానంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. నటుడిగా.. గాయకుడిగా.. సంగీత దర్శకుడిగా.. నిర్మాతగా చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసేందుకు అహర్నిశలు తపిస్తూ.. ఎందుకే రవనమ్మ.. పాటతో అందరికి సూపరిచితులుగా మారారు రఘు కుంచే.. నేడు అలాంటి రఘు గారి పుట్టిన రోజు.. ఆయన గురించి కొన్ని విషయాలు..


ఈస్ట్ గోదావరి జిల్లా రాజమండ్రి దగ్గరల్లో గదరద అనే పల్లెటూరులో ఒక పిల్లవాడికి చదువుకునే రోజుల్లో ఒక చెట్టు మీద దెయ్యం ఉందని బయపెట్టారు.. అప్పటి నుండి రాత్రి పూట ఆ చెట్టు మార్గం నుండి వెళ్తుంటే భయంతో కృష్ణ గారి సినిమాలోని ఆంజనేయ దండకం పాడటం మొదలు పెట్టాడు.. అలా పిల్ల వాడు ఒకే పాటను గెట్టిగా.. చిన్నగా.. ఇలా అన్ని విధాలుగా పడేవాడు.. ఆ పిల్లవాడు హై స్కూల్ లో.. కళాశాలలో అమ్మయిలు బాగా మాట్లాడుతున్నారు అని.. పాటలు పాడుతూ పోయాడు.. డిగ్రీ చదివే రోజుల్లో కొత్త గాయనీ.. గాయకులకు.. ఆహ్వానం అని దాసరి నారాయణ గారి పత్రికా ప్రకటన చూసి గోదావరి ఎక్స్ ప్రెస్ ఎక్కి హైదరాబాద్ బయలుదేరాడు.. రైలు లో పరిచయమై తోటి ప్రయాణికుడు రాధా కృష్ణ గారికి విషయం చెప్పాడు.. అది.. విని నవ్విన ఆయన.. ఆ బోగీలోనే పాట పాదించారు.. ఆ బోగీలో అందరూ పాటను మెచ్చుకున్నారు.. హైదరాబాద్ చేరాక ఇంట్లో భోజనం పెట్టి ఆ దాసరి గారి ఆడిషన్ వద్దకు తీసుకెలమని మనిషిని కుర్మాయించాడు.. అవకాశం రాలేదు.. కానీ డిగ్రీ పూర్తి చేసుకున్న ఆ కుర్రాడిని తిరిగి హైదరాబాద్ పంపమని తాన్ తండ్రికి ఆ రాధా కృష్ణ గారు ఉత్తరం రాయడంతో మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నాడు ఆ యువకుడు.. ఆ పిల్లవాడే ఇప్పటి మన రఘు కుంచే..


అలా వచ్చిన రఘుకు మొదట్లో అవకాశాలు రాలేదు.. కానీ.. తన ప్రయత్నం మాత్రం ఆపలేదు.. ఈ సమయంలోనే తనకు వచ్చిన డబ్బింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు.. అలానే నటనలో టీవీ సీరియల్ లో కొన్ని సింగల్ ఎపిసోడ్ పాత్రలు చేశారు.. అలా కాలం గడుపుతున్న రోజుల్లో ఒక కేఫ్ లో మరిచాయమయ్యాడు ఒక మిత్రుడు.. ఆ మిత్రుడు దర్శకుడిగా అవకాశం వచ్చిన రెండవ సినిమా నుండి రఘు కుంచే గారికి వెనుదన్నుగా నిలిచారు.. ఆయనే దర్శకులు పూరి జగన్నాథ్.. 2000 సంవత్సరంలో గాయకుడిగా బాచి లో తొలి సినిమా అవకాశం ఇచ్చింది పూరి గారే.. 2009లో బంపర్ ఆఫర్ సినిమాతో తొలిసారి సంగీత దర్శకుడిగా అవకాశం ఇచ్చింది ఆయనే.. పరిశ్రమలోకి వచ్చిన తొలి రోజుల్లోని స్నేహంతో పూరి ఇలా రఘు గారికి అవకాశం ఇచ్చారు అంటే.. రఘు కుంచే గారు ఆ రోజుల్లో పూరి గారికి ఎంతలా తన ప్రతిభ చూపించి ఉంటారో.. ఎంతలా తన తపన పంచుకొని ఉంటారో.. ఊహించవచ్చు..


అలా గాయకుడిగా మారిన రఘు కుంచే గారు ఇప్పటి వరకు 600 పాటలకు పైనే పడ్డారు.. దాదాపు ఇరవై సినిమాలకు సంగీతం అందించారు.. అడపాదడపా సినిమాల్లో కనిపించే రఘు గారు.. ఇటీవల వచ్చిన పలాస సినిమాలో ప్రతి నాయకుడు గురుమూర్తి పాత్రలో నటించి.. విమర్శకుల ప్రశంసలు పొందారు.. ఆయన పాటల గురించి.. ఆయన సంగీతం అందించిన సినిమాల గురించి అందరికి తెలిసినవే కనుక వాటి గురించి ప్రస్తావించడం లేదు.. కష్టం.. ప్రతిభను.. మాత్రమే నమ్ముకొని.. అవకాశాల కోసం ఎవరి భజనా చెయ్యను అని చెప్పారు.. సినిమా.. టెలివిజన్ రంగంలో ఏదో పని చేసుకుంటాను.. కానీ ఖాళీగా ఉండలేను.. అని కూడా తెలిపారు.. ఇటీవల వరసగా రాగల 24 గంటల్లో.. పలాస 1978తో ఫారం లోకి వచ్చినట్లు కనిపిస్తున్న రఘు కుంచే గారు ఇలానే.. మరిన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉండాలని.. మనల్ని మరింత అలరించాలని కోరుకుందాం.. బి.ఆర్. మూవీ జోన్ తరపున రఘు కుంచే గారికి జన్మదిన శుభాకాంక్షలు..