18-04-2021 23:15:36 About Us Contact Us
పుట్టినరోజున వెన్నెల గా కనిపించిన శివాని రాజశేఖర్

పుట్టినరోజున వెన్నెల గా కనిపించిన శివాని రాజశేఖర్చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చుడీదార్ ధరించి పక్కింటి తెలుగు అమ్మాయిగా కనిపించారు శివాని రాజశేఖర్. జీవితా.. రాజశేఖర్.. స్వయం కృషి తో పైకి వచ్చి.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు.. గౌరవం సంపాదించుకున్నారు.నటిగా పరిచయమైన జీవిత.. దర్శకురాలిగా.. నిర్మాతగా మారారు.అలాంటి వీరి పిల్లలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతున్నారు.ఇప్పటికే వీరి చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో పరిచయమయ్యారు.ఇప్పుడు తాజాగా పెద్ద కుమార్తె శివాని సైతం హీరోయిన్ గా మరిచయం కానున్నారు.


నేడు శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె తొలి సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.ఇప్పటికే ప్రొడ్యూసర్ గా చేసిన శివాని.. తన తండ్రి లాగా ఒక డాక్టర్.బాల నటుడిగా మంచి పేరు సంపాదించుకొని.. తాజాగా ఓ బేబీ.! తో తిరిగి వెండితెర పై అల్లరి చేసిన తేజ సజ్జా.. ఈ సినిమాలో హీరో. 3 సీజన్స్ తో యువతను బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ పెళ్లి గోల..ఆ వెబ్ సిరీస్ దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకులు. మహాతేజ క్రీయాషన్స్.. ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది.


డాక్టర్ నుంచి నటిగా మారిన శివాని.. తొలి సినిమా ప్రధమ పోస్టర్ లో చుడీదార్ తో కనిపించి తెలుగు అమ్మాయిలా ఆకట్టుకున్నారు.అలానే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేడ మీద కూర్చొని నెలవంకను చూస్తుంటే..నేటితరం యువతిలా కనిపించారు.ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు వెన్నెల.ఇప్పటికే తన చెల్లి శివాత్మిక పై సామాజిక మాధ్యమాలలో వచ్చిన ట్రోలింగ్స్ కి వేదికపై నుండి జవాబు చెప్పి.. తాను జీవిత కూతురుని అని నిరూపించుకున్న శివాని.. రానున్న రోజుల్లో తన తల్లి లాగా మంచి నటిగా కూడా పేరు తెచుకుంటారేమో చూడాలి.నేటి తరం కొత్త తరహా లైవ్ స్టోరీ అని బృందం చెబుతుంది.చిత్రకరణ ప్రారంభించుకున్న ఈ సినిమాకి ఇప్పటివరకు ఎటువంటి టైటిల్ ఖరారు కాలేదు.అలానే ఇందులో పనిచేస్తున్న నిపుణులు.. మరియు ఇతర తారాగణం వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.ఈ సినిమాతో హీరో గా తేజ సజ్జా. అలానే హీరోయిన్ గా శివాని రాజశేఖర్ పరిచయం కానున్నారు.


హీరోయిన్ గా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న శివాని.. నటిగా మంచి పేరు తెచ్చుకొని.. ఉన్నత స్థాయికి చేరాలని..నటిగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని కోరుకుంటూ..మా బి.ఆర్. మూవీ జోన్ బృందం తరపున శివాని కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

షకీలా తొలి U సర్టిఫికెట్ సినిమా..!

షకీలా తొలి U సర్టిఫికెట్ సినిమా..!షకీలా.. మలయాళం నటి.. ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరు.. “నేను చేసిన కొన్ని సినిమాల వల్ల నా సినిమాలు చూడటానికి వెళ్తున్నాము అని భర్తలు తమ భార్యలకు చెప్పరు” అని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. మరో పక్క సాయి రామ్ దాసరి తొలి సినిమా విడుదలకు ముందు ప్లాప్ మీట్ పెట్టిన దర్శకుడు.. రెండవ సినిమా కంట్రవర్సీ తో చల్లపల్లి జైలు కు వెళ్లారు.. తాను గత సంవత్సరం తీసిన ladies not allowed అనే సినిమాని సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. గత కొన్ని నెలలుగా దీని పై ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఆ సినిమా సర్టిఫికెట్ ఫైల్ ఢిల్లీ లో ఉంది.. ఇప్పటికే శిలావతి అనే సినిమా వీరి కాంబినేషన్ లో వచ్చింది.. అలాంటి వీరిద్దరు కలిసి మరో సినిమా అంటూ గత సంవత్సరం ఒక ప్రకటన విడుదలైంది..


అంతలో టీజర్ వచ్చింది.. సినిమా పేరు “షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం”.. టైటిల్ ఏంటి ఇంత వెరైటీగా ఉండి అని అనుకుంటుందాగా.. టీజర్ లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో డైలాగ్ పెట్టి తన ట్రేడ్ మార్క్ పంచ్ వేశారు సాయి రామ్ దాసరి.. దింతో ఈ సినిమా ఇంకెంత కాంట్రవర్సీ అవుతుందో అని అనుకున్నారు అంతా.. అసలు ఇది సెన్సార్ బోర్డ్ దగ్గరకైనా వెళ్తుందా అని భావించారు.. లాక్ డౌన్ సడలించడంతో సినీ రంగంలో షూటింగ్ మినహా మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఇప్పటికే చిత్రీకరణ.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ లో ఉన్న ఈ సినిమా నేడు సెన్సార్ బోర్డ్ ముందుకు వచ్చింది.. అయితే సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.. అటు షకీలా సినీ ప్రస్థానంలో గాని.. ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం “జగన్ అన్న” అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు.. మ్యూట్లు లేవు.. అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది..


తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లోకి ఎక్కే సాయి రామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో.. ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు.. ఈ సినిమాకు సి.హెచ్. వెంకట్ రెడ్డి నిర్మిత.. లండన్ గణేష్ సహా నిర్మాత.. మధు పొన్నస్ సంగీత దర్శకులు.. ఇప్పటికే ఆయన బాణీలు అందించిన పాటలు విడుదలయ్యాయి..


రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు.. సంపూర్ణంగా కుటుంబ కథా చిత్రం అని.. ఇది నేరుగా ఓ.టి.టి.లో విడుదల చెయ్యాలా లేక సినిమా హాల్ లో విడుదల చెయ్యాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సాయి రామ్ దాసరి తెలిపారు.. త్వరలో పూర్తి వివరాలు తెలుపుతాము అని చెప్పారు..

హీరోల పరువు తీస్తున్న కొందరు అభిమానులు..!

హీరోల పరువు తీస్తున్న కొందరు అభిమానులు..!అవును నిజమే.. అభిమానులు లేనిదే హీరోలు లేరు.. ఎంతమంది అభిమానులు ఉంటే ఆ హీరోకి అంత ఎక్కువ పారితోషకం వస్తుంది.. అలానే సినిమాను ఎంత ఎక్కువ మంది చూస్తే.. అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు ప్రేక్షకులకు మర్యాద ఇచ్చింది.. వారిని ప్రేక్షక దేవుళ్ళు అని సంభోదించింది.. అలానే పిలుస్తూనే ఉంటుంది.. అలానే హీరోలు సైతం ఎప్పుడు వారి అభిమానులు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు.. హీరో ను కలిసేందుకు సెట్స్ కి అభిమానులు వస్తే.. వారికి భోజనాలు సైతం ఏర్పాటు చేస్తుంటారు.. ఇక్కడ డబ్బుకు మించిన ప్రేమ అభిమానిది అయితే.. మేము తింటున్న భోజనం వీరి వల్లనే అనే కృతజ్ఞత ఆ సగటు సినిమా వారిది.. అందుకే హీరోలకు అభిమానులు పట్ల గౌరవం.. బాధ్యత ఉంటాయి..


తన అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది అనగానే డబ్బులు లేకున్నా కట్ ఔట్ లకి పాలభిషేకాలు.. పూలమాలలు.. ర్యాలీలు చేస్తుంటారు.. తొలి రోజు తొలి ఆటకి అభిమాని సినిమా హాల్ ని ఒక కల్యాణ మండపంలా మారుస్తుంటారు.. అప్పట్లో కొందరు అభిమానులు పంతానికి పోయి.. రికార్డుల కోసం.. అప్పు చేసి మరీ సినిమాను.. థియేటర్ లో ఆడిస్తే.. ఆ తర్వాత అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ నింద సగటు హీరో పైకి వచ్చేది.. అలా చేయమని హీరో ఎక్కడా చెప్పారు.. కానీ అభిమానం పేరుతో కొందరు చేసి.. హీరోని మానసికంగా బాధ పెట్టిన సంఘటనలు మనకు తెలియనివి కావు..


ఆ తర్వాతి రోజుల్లో అభిమానం సేవపైకి మళ్ళింది.. ఏ హీరో పుట్టినరోజుకి.. లేక సినిమా విడుదల రోజుకి.. ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తారు అనే పోటీ నెలకొనింది.. ఇది నచ్చిన చాలా మంది వ్యాపార వేత్తలు.. డబ్బు ఉన్న అభిమానులు.. వీరికి ఆర్థికంగా సహాయం చేయడంతో సేవా కార్యక్రమాలు బాగా జోరందుకున్నాయి.. అవి తెలుసుకొని హీరోలు సైతం గర్వంగా మా అభినులు గొప్ప అనే స్థాయికి చేరారు..కానీ .. ఇప్పుడు తరం మారింది.. కొత్త ట్రెండ్ వచ్చింది.. సామాజిక మద్యామాలలో అదే అభిమానులలో కొందరు ఆ హీరో పరువు తీస్తున్నారు..


పుట్టిన రోజు.. లేదా సినిమాకు సంబంధించిన ట్రెండ్ సామాజిక మాధ్యమాలలో జరగడం సర్వ సాధారణం అయిపోయింది.. ఇప్పుడు దానినే పరువుగా భావిస్తున్న కొందరు ఆ ట్రెండ్ ల కోసం ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చెయ్యడం ప్రారంభించారు.. పిచ్చి బాగా ముదిరిన మరికొందరు.. ఏకంగా యంత్రాలను సైతం రంగంలోకి దించారు.. డబ్బులు ఇచ్చి బోట్స్ అని పిలిచే వాటితో ట్రెండ్స్ లో పాలుగోనడం మొదలు పెట్టారు.. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ సమయంలో అవి ఇలా చేస్తున్నారు అని వేరే హీరోల అభిమానుల బయట పెట్టడం.. దింతో నిజంగా అభిమానించి ట్రెండ్ చేసిన అభిమానులు నిరుత్సాహ పడిపోతుంటే.. హీరో పరువు అక్కడ పోయింది.. దీనికి కారణం ఆ కొందరు అభిమానులే కదా..


సామాజిక మాద్యామాలలో ద్వారా అభిమానులకు.. ప్రేక్షకులకు.. దగ్గరైయే ప్రయత్నం చిత్ర పరిశ్రమలో వారు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే లైవ్ లు అంటూ.. ప్రశ్నించండి(ask) అంటూ సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.. అయితే వెంటనే కొందరు అభిమానాలు.. ఒక ముక్కలో అంటూ.. సగటు హీరో పేరు అడుగుతున్నారు.. వారి గురించి చెప్పడానికి.. లేక వారి గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వస్తున్న ప్రతి సినీ సెలెబ్రిటీకి ఇదొక తల నొప్పిగా మారింది.. కేవలం హీరోల గురించి మాత్రమే చెప్పేందుకు హీరోయిన్లు.. కమిడియన్స్.. సహా నటులు.. దర్శక.. నిర్మాతలు.. సంగీత దర్శకులు.. సింగర్స్.. రైటర్స్.. సోషల్ మెడియాలోకి రావాలా..?? ఇదే అసహనం అనేక మంది అనేక సార్లు నాతోనే స్వయంగా చెప్పుకొచ్చారు.. ఒకవేళ వారి గురించి చెప్పకపోయినా.. తెలియదు అని చెప్పినా.. లేకుంటే ఈ ఇద్దరిలో ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఒక హీరో పేరు చెప్పినా.. ఇక అంతే.. అదేంతో ఒక్కసారిగా అనేక అకౌంట్స్ నుండి దండ యాత్ర మొదలేదుతారు.. అసభ్య పదజాలంతో చదివేందుకు కూడా మనం ఇష్టపడలేనటు వంటి పదాలు వాడుతారు.. ఇక్కడ ఏ హీరో ఎవరిని అడగలేదు.. మా గురించి ప్రతి ఒక్కరిని అడగమని.. కానీ వీరే అడిగి.. వీరే రచ్చ చెయ్యడం మొదలు పెడతారు.. దింతో కొన్ని సార్లు.. సగటు హీరోకి ఆ సెగ తగులుతుంది.. ఏదో షో లో ఎక్కడో ఒక హీరోపై ఒక్కలు చేసిన చిన్న వ్యాఖ్యను పట్టుకొని రాదంతం చేస్తారు.. చివరకు.. ఏ మాత్రం ప్రతిభ లేకుండా పట్టుమని పది మందికి తెలియని వారు కూడా.. కేవలం కొందరు అభిమానుల అత్యుత్సాహం వల్ల సెలబ్రిటీగా ఇప్పుడు చలామణి అవుతున్నారు.. హీరోలు సైతం ఈ అభిమానులను ఎలా అదుపు చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంటే.. నిజమైన అభిమానులు బాధ పడుతున్నారు..


అందుకే అంటున్నా కొందరి అభిమానుల వల్ల హీరోల పరువు పోతుంది..

15సం|| పూర్తి చేసిన అనుష్క శెట్టి పై ప్రత్యేక కథనం

15సం|| పూర్తి చేసిన అనుష్క శెట్టి పై ప్రత్యేక కథనం


2004,ముంబయిలో నటన,డాన్స్ వచ్చో,రాదో తెలియని ఒక కన్నడ అమ్మాయి తెలిసిన వారు చెప్పారని అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ లలో ఒక్కరిగా పేరు తెచ్చుకున్న పూరి జగన్నాధ్ గారు నాగార్జున గారి సినిమా కోసం హీరోయిన్ ని వెతుకుతున్న సమయంలో కలిసింది.ఆ రోజుకి ఆమెకు సినిమా గురించి ఎంతలా తెలుసంటే ఫోటోలు ఇమ్మని అడిగితే పాస్ పోర్ట్ ఫోటో ఇచ్చేంత.చూసేందుకు అందంగా కనపడడంతో ఆ యోగా టీచర్ ని హైదరాబాద్ రమ్మన్నారు మన పూరి.

అలా విమానం ఎక్కిన ఆమె,విమనంలోనే దర్శకులు వై.వి.యెస్.చౌదరి గారి కంట పడింది.విమానంలొనే చౌదరి గారు సినిమాలలో చేసే ఆలోచన ఉందా అని అడగగా నేను సినిమా చేసేందుకే హైదరాబాద్ బయలుదేరాను అని చెప్పింది ఆ అమ్మాయి.ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ లో ససీనియర్ డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారిని కలిసింది,ఆ రోజే ఆయన ఆమె గొప్ప నటి అవ్వడం ఖాయం అని చెప్పరాట ఆమెకు,నాగార్జున గారికి.

ఇలా తొలి సినిమా చెయ్యక ముందే ముగ్గురు దర్శకుల ప్రశంస పొందిన ఆమె పూరి గారి దర్శకత్వంలో ‘సూపర్’ సినిమాతో తెరంగేట్రం చేసి,మంచి మార్కులే కొట్టేసింది.మూడవ సినిమాతో రాజమౌళి,రవితేజ కలయికలో వచ్చిన మాస్ మూవీ ‘విక్రమార్కుడు’లో నటించి తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యింది.అలా నాలుగు సంవత్సరాలు గడిచే సరికి తెలుగులో మెగాస్టార్ చిరంజీవి గారి నుండి అందరి హీరోలతో కలిసి 13 సినిమాలు చేసేసింది ఆ హీరోయిన్.

2009 ఆమె సినీ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.ఇలయథాలపతి విజయ్ తో వేటైకరణ్ అనే సినిమా తో రెండవసారి తమిళంలో ఒక సినిమా చేసింది ఆ ముద్దు గుమ్మ.ఆ సినిమా అక్కడ బ్లాక్ బస్టర్,అదే సంవత్సరం ఇక్కడ తెలుగులో ప్రభాస్ తో చేసిన బిల్లా సైతం బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద హిట్ గా నిలిచింది.ఇంతటితో అయిపోలేదు అదే సంవత్సరం ఈ రెండింటికి ముందు విడుదలయ్యింది అరుంధతి.ఆ సినిమా రికార్డ్స్ మాత్రమే కాక ఆమెకు నటిగా మంచి పేరు తెచ్చింది.ఇదే ఆమె చేసిన తొలి లేడీ ఓరియెంటెడ్ సినిమా.అక్కడ నుండి తిరిగి చేసుకున్నది లేదు.

2009-2019 వరకు పది సంవత్సరాలలో అటు తెలుగు ఇటు తమిళంలోని అగ్ర కధానాయకులందరితో కలిసి నటించింది.తమిళంలో రజినీకాంత్,అజిత్,విజయ్ ల నుండి సూర్య,కార్తీ,సింబు,ఆర్యల దాక ఇటు తెలుగులో మెగాస్టార్ చిరంజీవి,బాలకృష్ణ,నాగార్జున,వెంకటేష్,మహేష్ బాబు ల నుండి అల్లు అర్జున్,ప్రభాస్,రానా దాక ఎదరితోనో చేసింది.
అంతేనా అరుంధతి తో మొదలై పంచాక్షరీ,రుద్రమదేవి,సైజ్ జీరో,భాగమతి అంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలు చేసింది.తెలుగు,తమిళ భాషతో పాటు,డాన్స్ కూడా నేర్చుకుంది.కళ్ళతో హవాభావాలు పలికించడంతో పాటు తన శరీరం మొత్తం పాత్రకు తగ్గట్లు మార్చడం,ఆమెకు సినిమా పట్ల గౌరవం,పాత్ర కోసం ఆమె పడే తపన కనిపిస్తుంది.అందరితో మంచిగా మాట్లాడడం,తెలిసిన వారికి సహాయపడటం,క్రమశిక్షణ,చెప్పిన సమయానికి లొకేషన్ కి రావడం,ఫిట్ నెస్ వంటి ఏనో మంచి లక్షణాలు ఉన్నాయి కనుకనే ఆమె 40కి పైగా సినిమాలు చేయగలిగారు.

అందరి హీరోయిన్లలా గ్లామరస్ పాత్రలు మాత్రమే కాక ఎంతో ప్రతిష్టాత్మక బాహుబలిలో దేవసేన,సైరా,రుద్రమదేవి సినిమాలలో రుద్రమదేవి పాత్ర చెయ్యడం.వేదం సినిమాలో సరోజ పాత్ర,సైజ్ జీరో సినిమాలో స్వీటీ పాత్ర,అరుంధతి,భాగమతి పాత్రలతో ఆమెకు ప్రేక్షకులలో గౌరవం వచ్చింది.2004 పేరు అడిగితే అమాయకంగా స్వీటీ అని చెబుతూ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చిన ఆమె ఇప్పుడు అనుష్క శెట్టి గా దక్షిణాదిన లేడీ సూపర్ స్టార్ గా ఒక్క వెలుగు వెలుగుతున్నారు.ఇప్పుడు రానున్న నిశ్శబ్దం సినిమాతో మాట మాట్లాడకుండా నటిస్తూ,నటిగా మంచి పాత్ర తెచ్చే మరో పాత్ర చేస్తున్నారు.

వెండితెరకు పరిచయమై ఒక్కతిన్నర దశాబ్దం (15 సంవత్సరాలు) పూర్తి చేసుకున్న అనుష్క మరెనో సంవత్సరాలు సినిమాలు చేస్తూనే ఉండాలి అని కోరుకుంటూ తెలుగు ప్రేక్షకుల తరపున,చిత్ర పరిశ్రమ తరపున,ముఖ్యంగా ఆమె అభిమానుల తరపున,మా బి.ఆర్.మూవీ జోన్ టీం తరపున అభినందనలు,శుభాకాంక్షలు..!