19-04-2021 07:48:38 About Us Contact Us
4వ ఏట వైయలిన్ నేర్చుకున్న కీరవాణి గారి పుట్టినరోజు నేడు

4వ ఏట వైయలిన్ నేర్చుకున్న కీరవాణి గారి పుట్టినరోజు నేడుమూడు దశాబ్దాల సినీ ప్రస్థానం.. ఐదు భాషలలో.. దాదాపు మూడు వందల సినిమాలలో రెండు వేలకు పైగా పాటలకు బాణీలు అందించిన సంగీత స్వరకర్త.. తన గాత్రంతో పాటలు పాడిన గాయకుడు.. తనలో ఒక రచయిత ఉన్నాడు అదే నాకు గర్వం అని చెప్పిన మరకటమణి కీరవాణి గారి పుట్టినరోజు నేడు.


1961 జులై 4న.. వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో కీరవాణి గారు జన్మించారు.తాతగారి సంగీతం పట్ల ఇష్టం ఉండటం.. తండ్రికి కూడా లలిత కళలలో ప్రవేశం ఉండటం.. ఆ తర్వాత సంగీతం.. సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు తండ్రి గారు..దింతో కీరవాణి గారికి చిన్నప్పటి నుండి పాటలు.. సంగీతం పట్ల ఇష్టం కలిగింది. నాలుగు ఏళ్ళ వయసులో వైయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా అక్కడ నుండి సంగీతం వైపు అడుగులు వేసిన ఆయన.. కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉద్యోగం అవసరం అని భావించి.. 1987లో చక్రవర్తి గారి దగ్గర చేరారు. అలా సినీ రంగ ప్రవేశం చేశారు కీరవాణి గారు.


1990లో తొలిసారి బాణీలు అందించిన కీరవాణి. 1991లో వచ్చిన క్షణ క్షణం సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. అక్కడ నుండి వెనకకు తిరిగి చేసుకుంది లేదు.మెలోడీ..భక్తి..మాస్.. ఇలా అన్ని రకాల పాటలలో తనదైన శైలిలో బాణీలు కట్టి.. విజయాలను సాధించారు.1991 నుండి 2010 వరకు వచ్చిన హీరోలు..దర్శకులలో ఆయన చెయ్యని వారు లేరనే చెప్పుచు.ఆయన పరిచయం చేసిన గాయని..గాయకులు అనేకం.తన దగ్గర ఒక్క పాట పాడాలి అని నేటి తరం గాయకులు కోరుకునే స్థాయికి చేరారు కీరవాణి గారు.ఒక తెలుగులోనే కాక తమిళం.. మలయాళం..కన్నడ..హిందీ భాషల్లో సైతం తన బాణీలకు అటు హీరోలతో ఇటు ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు.తమిళ..మలయాళ భాషల్లో మరకటమణి గా..హిందీ లో ఏం.ఏం.క్రీం గా ఆయనను పిలుస్తారు. ఇలా పలు పరిశ్రమలలో పలు పేర్లతో ప్రసిద్ధి చెందారు కీరవాణి గారు.


ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా చేసిన కీరవాణి గారు..ఇప్పటికి ఒక సాధారణ మనిషి లానే వుంటారు.. తాను ఒక స్టార్ సంగీత దర్శకుడు అనే భావన ఆయనను చూసిన ఎవ్వరికీ అనిపించదు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ.. చిన్నవారిని సైతం గౌరవంగా పిలుస్తూ వుంటారు.చూసేందుకు కోపంగా కనపడినా నిత్యం సరదాగా ఉంటారు.తనలో ఒక రచయిత ఉన్నారని.. తాను సమయం దొరికినప్పుడల్లా రాస్తుంటానని ఒక సందర్భంలో చెప్పారు.ప్రస్తృతనికి తన వద్ద మాత్రమే ఉన్న ఆ రాతలు త్వరలో పుస్తక రూపం దాల్చి మనముందుకు వచ్చే అవకాశం ఉంది.ఆ దిశగా ప్రయత్నం త్వరలో చేస్తాను అని కూడా ఆయన గతంలోనే ప్రకటించారు.


ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కీరవాణి గారు గడిచిన మూడు దశాబ్దాలుగా తన పాటలతో మనల్ని అలరించారు. ప్రసృతం రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్.ఆర్.ఆర్ కి పని చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 27వ సినిమాగా క్రిష్ దర్శత్వంలో వస్తున్న సినిమాకు బాణీలు అందించనున్నారు.. నేడు 59వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కీరవణిగారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!

అలజడి దర్శకుడు.. తెలుగు పరిశ్రమ గొంతుక.. భరద్వాజ గారి పుట్టినరోజు నేడు.!

అలజడి దర్శకుడు.. తెలుగు పరిశ్రమ గొంతుక.. భరద్వాజ గారి పుట్టినరోజు నేడు.!ఆరు అడుగులా రెండు అంగుళాల ఎత్తు కలిగిన దెబ్బయి ఏళ్ళు పైబడిన వ్యక్తి మనకు ఎదురైతే ఎలా ఉంటారు.!?నడుము ఒంగిపోయి.. మందగించిన చూపుతో.. వారికి ఉన్న చాదస్తంతో చెప్పిందే చెబుతూ.. పెద్దవాడిని కనుక అన్ని తెలుసు అని అహంకారంతో మాట్లాడుతుంటారు.. అలానే ఉంటారు అని ఒక వ్యక్తిని నేను రెండు సంవత్సరాల ముందు కలిశాను.. మేము ఎవరో తెలియకుండానే కూర్చోపెట్టి.. మాతో దాదాపు రెండు గంటల పాటు సంభాషించారు. చూపు స్పష్టంగా ఉంది.. అడుగులు వెయ్యడంలో.. చేతల్లో.. చాలా చురుకుగా ఉన్నారు. ఉస్మానియాలో చదివి.. ఆనాటి రాజకీయాల్లో పాలుగున్న విద్యార్థి.. సినీ రంగంలో నిర్మాతగా వచ్చి.. దర్శకుడిగా మారి విజయాలు అందుకున్న స్టార్.. పరిశ్రమకు సమస్య వస్తే.. తనే పరిశ్రమ గొంతుగా మారిన సినీరంగ ప్రముఖుడు.. అపారమైన తెలివి.. వయసుకు తగ్గిన అనుభవం.. ఇన్ని ఉంది కూడా మాతో ఆయన ఒక సాధారణ వ్యక్తిగా ఓపికగా మేము చెప్పింది విన్నారు. ఆయనే తమ్మారెడ్డి భరద్వాజ గారు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు..


1948లో కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించారు భరద్వాజ్ గారు. ఆంధ్రప్రదేశ్ లో ఆనాటి ఉద్యమ కారణంగా రాష్ట్రం విడిచి వెళ్ళమనడంతో చెన్నై చేరిన తన తండ్రి.. విద్య రంగం నుండి సినిమా రంగం వైపు అడుగులు వేశారు.. సారధి స్టూడియోస్ లో చేరి.. ఆ తర్వాత నిర్మాతగా మారారు.. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ స్థాపించి తొలి సినిమా ఎన్టీఆర్ తో లక్షాధికారి అనే సినిమా చేశారు. అలా నిర్మాతగా మారిన ప్రజా నాట్య మండలి సభ్యుడు తమ్మారెడ్డి కృష్ణ మూర్తి. ఆయన కుమారుడే భరద్వాజ గారు. పరిశ్రమతో పాటు హైదరాబాద్ చేరిన భరద్వాజ.. ఓయూ లో ఇంజనీరింగ్ చదివారు. కమ్యూనిస్ట్ కుటుంబంలో జన్మించడంతో యూనివర్సిటీ రాజకీయాల్లో చురుగ్గా పాలుగున్నారు.


ఇటీవల సినిమాగా వచ్చిన జార్జ్ రెడ్డికి మిత్రుడు భరద్వాజ్ గారు.. అలాంటి విప్లవ భావాలు ఉన్నా భరద్వాజ నిర్మాతగా సినిమా రంగంలో అడుగు పెట్టారు. 1979లో కోతల రాయుడు సినిమాతో నిర్మాతగా మారిన ఆయన.. 1989లో మన్మధ సామ్రాజ్యం సినిమాతో దర్శకుడిగా మారారు. రెండవ సినిమాగా తాను ఓయూ లో చూసిన గొడవల ఆధారంగా అలజడి అనే సినిమా తీశారు. ఆ సినిమా ఆనాడు తెలుగు నేల పై నిజంగానే అలజడి సృష్టించింది. అలా అటు దర్శకుడిగా 18 .. ఇటు నిర్మాతగా 15 సినిమాలు చేశారు. 1994లో చిత్ర పరిశ్రమ చేసిన స్ట్రైక్ లో పరిశ్రమ గొంతుకగా మారారు భరద్వాజ గారు. ఆ రోజుల్లో నన్ను అలా ముందుకు నెట్టారు అని ఆయన చెప్పుకున్నా.. ఆయన సమర్థుడు కనుకనే అలా ముందుకు రాణించారు అన్నది వాస్తవం.ఇప్పటికి చిత్ర పరిశ్రమలో ఎటువంటి సమస్య వచ్చినా అందరికి ముందుగా గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి భరద్వాజ గారు. చిన్న పేరు వచ్చినా సమాజంలో జరిగే విషయాల పై స్పందిస్తే మనల్ని నలుగురూ ఏమనుకుంటారో అని మాట్లాడకుండా ఉండే ఈ రోజుల్లో.. సమాజంలో జరిగే ఏ విషయం పట్ల నైనా.. తన గొంతును నిర్మొహమాటంగా చెప్తారు భరద్వాజ గారు. ఆనాడు విద్యార్థిగా తెలంగాణ పోరులో పాలుగున్నా.. మొన్న ప్రత్యేక హోదా కోసం ఆంధ్రాలో రోడ్ ఎక్కినా.. ప్రజలకు ఇది అవసరం అని నమ్మి అడుగు ముందుకు వేస్తుంటారు. పరిశ్రమలో ఎన్నో సమస్యలకు పరిష్కార మార్గాలు చూపిన వ్యక్తి. అందరికి ఈ వయసులో సైతం అందుబాటులో ఉంటుంటారు భరద్వాజ గారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా తన అభిప్రాయాన్ని నిత్యం ప్రజలతో పంచుకుంటుంటారు భరద్వాజ గారు.


గత సంవత్సరం తెలుగులో అనువాదించిన తమిళ సినిమా ఆమె. ఆ సినిమా తెలుగులో ఆయన సమర్పణలో విడుదలైంది. అలానే ఇటీవల విడుదలైన పలాస 1978 సినిమా సైతం ఆయన సమర్పణలోనే విడుదలైంది. సమాజానికి మంచి చెప్పే ఏ సినిమాకైనా తనదైన సహాయం చెయ్యడం ఆయన అలవాటు అనేందుకు ఈ రెండు సినిమాలు ఉదాహరణలు. మా లాంటి ఎందరో యువకులకు ఆయన స్ఫూర్తి. అలాంటి ఆయన గురించి రాస్తుపోతే పుస్తకామే అవుతుంది. అందుకే కేవలం కొన్ని విషయాలను మాత్రమే ఇక్కడ చెప్పుకొచ్చాము.


నేడు దెబ్బయి రెండవ పుట్టినరోజు జరుపుకుంటున్న తమ్మారెడ్డి భరద్వాజ గారు ఇలానే ఉత్సాహంగా పరిశ్రమలో మరిన్ని సంవత్సరాలు ఉండాలని కోరుకుంటూ.. మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున జన్మదిన శుభాకాంశాలు.

షకీలా తొలి U సర్టిఫికెట్ సినిమా..!

షకీలా తొలి U సర్టిఫికెట్ సినిమా..!షకీలా.. మలయాళం నటి.. ఈ పేరు తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండరు.. “నేను చేసిన కొన్ని సినిమాల వల్ల నా సినిమాలు చూడటానికి వెళ్తున్నాము అని భర్తలు తమ భార్యలకు చెప్పరు” అని స్వయంగా ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.. మరో పక్క సాయి రామ్ దాసరి తొలి సినిమా విడుదలకు ముందు ప్లాప్ మీట్ పెట్టిన దర్శకుడు.. రెండవ సినిమా కంట్రవర్సీ తో చల్లపల్లి జైలు కు వెళ్లారు.. తాను గత సంవత్సరం తీసిన ladies not allowed అనే సినిమాని సెన్సార్ బోర్డ్ సర్టిఫికెట్ ఇవ్వలేదు.. గత కొన్ని నెలలుగా దీని పై ఆయన పోరాటం చేస్తూనే ఉన్నారు.. ఇప్పుడు ఆ సినిమా సర్టిఫికెట్ ఫైల్ ఢిల్లీ లో ఉంది.. ఇప్పటికే శిలావతి అనే సినిమా వీరి కాంబినేషన్ లో వచ్చింది.. అలాంటి వీరిద్దరు కలిసి మరో సినిమా అంటూ గత సంవత్సరం ఒక ప్రకటన విడుదలైంది..


అంతలో టీజర్ వచ్చింది.. సినిమా పేరు “షకీలా రాసిన మొట్ట మొదటి కుటుంబ కథా చిత్రం”.. టైటిల్ ఏంటి ఇంత వెరైటీగా ఉండి అని అనుకుంటుందాగా.. టీజర్ లో ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల విషయంలో డైలాగ్ పెట్టి తన ట్రేడ్ మార్క్ పంచ్ వేశారు సాయి రామ్ దాసరి.. దింతో ఈ సినిమా ఇంకెంత కాంట్రవర్సీ అవుతుందో అని అనుకున్నారు అంతా.. అసలు ఇది సెన్సార్ బోర్డ్ దగ్గరకైనా వెళ్తుందా అని భావించారు.. లాక్ డౌన్ సడలించడంతో సినీ రంగంలో షూటింగ్ మినహా మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఇప్పటికే చిత్రీకరణ.. పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేసుకొని సెన్సార్ లో ఉన్న ఈ సినిమా నేడు సెన్సార్ బోర్డ్ ముందుకు వచ్చింది.. అయితే సినిమాకు క్లీన్ యూ సర్టిఫికెట్ వచ్చింది.. అటు షకీలా సినీ ప్రస్థానంలో గాని.. ఇటు సాయి రామ్ దాసరి సినీ జీవితంలో ఇదే తొలి క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా.. కేవలం “జగన్ అన్న” అనే ఒక పదం మ్యూట్ తప్ప ఎటువంటి కట్లు.. మ్యూట్లు లేవు.. అని తెలపడం ఆశ్చర్యానికి గురిచేసింది..


తన ప్రతి సినిమా విడుదలకు ముందు ఏదో ఒక కాంట్రవర్సీ తో వార్తల్లోకి ఎక్కే సాయి రామ్ దాసరి.. క్లీన్ యూ సర్టిఫికెట్ సినిమా తియ్యడంతో.. ఇప్పుడు టాక్ ఆఫ్ ఫిల్మ్ నగర్ అయ్యారు.. ఈ సినిమాకు సి.హెచ్. వెంకట్ రెడ్డి నిర్మిత.. లండన్ గణేష్ సహా నిర్మాత.. మధు పొన్నస్ సంగీత దర్శకులు.. ఇప్పటికే ఆయన బాణీలు అందించిన పాటలు విడుదలయ్యాయి..


రెండు గంటల రెండు నిమిషాల వ్యవధిలో 9 పాటలతో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు.. సంపూర్ణంగా కుటుంబ కథా చిత్రం అని.. ఇది నేరుగా ఓ.టి.టి.లో విడుదల చెయ్యాలా లేక సినిమా హాల్ లో విడుదల చెయ్యాలా అనే విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని సాయి రామ్ దాసరి తెలిపారు.. త్వరలో పూర్తి వివరాలు తెలుపుతాము అని చెప్పారు..

ఉగాది రోజున నేను వస్తున్నాను అంటున్న చిరు

ఉగాది రోజున నేను వస్తున్నాను అంటున్న చిరు


దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడిని అలరిస్తున్న,ప్రతి తెలుగోడు ప్రేమగా మా ‘అన్నయ్య’ అని పిలుచుకునే
‘పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి’ గారు ఇప్పుడు అభిమానులకు మరింత దగ్గరకనున్నారు.మారుతున్న కాలంతో పాటు మనం మారాలి అన్నట్లు ఆరు పదుల వయసులో కూడా కొత్త తరానికి దగ్గరైయెందుకు ప్రయత్నిస్తున్నారు చిరు.రేపు తెలుగు వారి పండగ ఉగాది.ఉగాది అంటే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభరోజు అని అర్థం.ఆ రోజున చిరంజీవి గారు కొత్త పనికి శ్రీకారం చుట్టనున్నారు.

నేటి తరం యువత టీవీ,పేపర్ల కన్నా సామాజిక మాద్యమం ద్వారానే సమాచారం తెలుసుకుంటున్నారు.ఇప్పటికే సీనియర్ నటులు ‘కింగ్ నాగార్జున’,’విక్టరీ వెంకటేష్’ సామాజిక మాద్యమాలల్లో వున్నారు.ఇక బాలీవుడ్ ‘బిగ్ బి అమితాబ్’,కోలీవుడ్ ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ ట్విట్టర్ లో ఎప్పుడు వారి సందేశాన్ని పంచుతూ వుంటారు.ఇవన్ని చూసి తనేందుల్లో తక్కువ కాకూడదు అని అనుకున్నారో ఏమో గాని చిరంజీవి గారు సోషల్ మీడియాలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించేశారు.తెలుగు కొత్త సంవత్సర ప్రారంభరోజైన ఉగాది పండుగ రోజు ఆయన సామాజిక మద్యంలోకి రానున్నట్లు వీడియో ద్వారా ఈ రోజు ప్రకటించారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 1న చిరంజీవి గారి ఇంటి వద్ద తన అభిమానులు వచ్చి తనని కలుస్తూ ఉంటారు.అది కాక ఈ మధ్య ప్రతి సినిమా ఫంక్షన్ కి తానే ముఖ్య అతిధిగా వస్తూ అటు ఆ సినీ బృందానికి ప్రచారంలో సహాయపడుతూ ఇటు అభిమానులకు చేరువవుతూ వచ్చారు చిరు.సామాజిక స్పృహ ఎక్కువ ఉన్న చిరు తన సందేశాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ ద్వారా,లేక కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అకౌంట్ ద్వారా,లేక తన కోడలు ఉపాసన అకౌంట్ నుండి పంపేవారు.ఇప్పుడు నేరుగా ఆయనే సామాజిక మద్యంలోకి వస్తుండడంతో ఆయనే స్వయంగా అభిమానులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారు.కరోనా వల్ల అటు సినిమా షూటింగ్స్ లేక పరిశ్రమ,ఇటు సినిమా ప్రదర్శనలు లేక తీవ్ర నిరాశతో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు చిరంజీవి గారి ప్రకటన కొంత ఆనందాన్ని పంచిందనే చెప్పాలి.

ఇక ఎవరు సోషల్ మీడియాలోకి వచ్చినా రికార్డ్స్ గురించి మాట్లాడుతుంటారు అభిమానులు,మరి ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికే ఆయనకు స్వాగతం పలుకుతున్న వేళ ఆయనను తొలి రోజు ఎంతటి స్థాయిలో అభిమానులు అనుసరిస్తారో చూడాలి..!కేవలం సినిమా వేడుకలలో మాత్రమే ఆయన సందేశాన్ని ఇస్తున్న చిరు ఇక మీదట వీడియోల రూపంలో పెడుతూవుంటారా?ఎప్పుడైనా ఒక్కసారి లైవ్ లోకి వస్తారా?వస్తే నా ప్రశ్నకు సమాధానం ఇస్తారా అంటూ ఇప్పటికే మెగాభిమానులు సామాజిక మాధ్యమంలో మాట్లాడుకుంటున్నారు.


ఇప్పటికే క్యారివాన్ గురించి నేటి తరం నటీనటులకు ఒక క్లాస్ తీసుకొని ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన ‘బిగ్ బాస్’,మరి ఇప్పుడు సామాజిక మాధ్యమంలోకి వచ్చి అటు ఇండస్ట్రీ,ఇటు ప్రజలకు ఇంకేన్నీ క్లాసులు తీసుకుంటారో మనందరి మంచి కోరే మన ‘మాస్టారు’ అనేది చూడాలి..!

Chiranjeevi instagram official account
Chiru video