16-04-2021 16:22:49 About Us Contact Us
నేడు డాన్స్ మాస్టర్ నుండి హీరోయిన్ గా మారిన తేజస్వి పుట్టిన రోజు.!

నేడు డాన్స్ మాస్టర్ నుండి హీరోయిన్ గా మారిన తేజస్వి పుట్టిన రోజు.!



7అప్ యాడ్ తో తొలిసారి స్క్రీన్ పై కనిపించి..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో నటిగా మారి.. ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమా చేసి.. గడిచిన ఏడేళ్ళలో దాదాపు పాతిక సినిమాలతో వెండితెరపై.. ఇటు షో లతో బుల్లి తెరపై మనల్ని అలరిస్తు.. ఎప్పుడు ఎనర్జిటిక్ గా కనిపిస్తూ.. తెలుగులో బాగా మాట్లాడుతూ.. తెలుగువారందరికీ మన ఇంటి అమ్మాయిలా అనిపించే తేజస్వి మడివాడ పుట్టిన రోజు నేడు..ఈ సందర్భంగా డాన్స్ టీచర్ నుండి స్టార్ గా ఎలా మరారో క్లుప్తంగా మీకోసం..


1991 జులై 3న హైదరాబాద్ లో ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించారు తేజస్వి. కుటుంబ నేపథ్యం విజయవాడ కాగా.. బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిపారు.. బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో చదువుకొని.. సైంట్. ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో మాస్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. తొలుత మీడియా లో వర్క్ చేసినా.. ఆ తర్వాత తనకు నచ్చిన డాన్స్ ని పది మందికి నేర్పుతూ కెరీర్ ప్రారంభించారు.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తో పాటు పలు కార్పొరేట్ కంపెనీలకు సైతం నేర్పేవారు.. అలానే సంగీత్ లకు కూడా నేర్పేవారు. 7అప్ యాడ్ లో డాన్సర్స్ తో షూట్ ఉండగా అలా అవకాశం తేజస్వికి వచ్చింది.. తొలి యాడ్ లోనే తమిళంలో శింబు.. తెలుగు అల్లు అర్జున్ తో చేశారు.


అక్కడ నుండి 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా చేశారు.ఇద్దరు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. దాదాపు 40మంది తారాగణం ఉన్న ఆ సినిమాలో సమంతకు చెల్లిగా చేసిన తేజస్వి.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అంతమంది మధ్యలో చేసి కూడా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత మనం.. హార్ట్ ఎటాక్ సినిమాలలో కనిపించారు. ఆ తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ లలో ఒకెక్కరైన ఆర్.జీ.వి. గారి ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. అలా హీరోయిన్ గా చేస్తూ కూడా మళ్లీ మళ్లీ.. ఇది రాని రోజు.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. శ్రీమంతుడు సినిమాలలో కథకు అవసరమైన పాత్రలు కూడా చేశారు.కేరింత సినిమాతో హీరోయిన్ గా భారీ విజయం నమోదు చేసుకున్నారు. అలానే రోజులు మారాయి సినిమాలో నెగటివ్ పాత్రలో సైతం అద్భుతంగా చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు తేజు.అలా అటు హీరోయిన్ గా.. ఇటు ప్రాధాన్యత కలిగిన పాత్రలతో మనల్ని అలరించారు తేజస్వి. గడిచిన ఏడేళ్ళల్లో దాదాపు 25 సినిమాలలో కనిపించారు తేజస్వి.తమిళంలో ఒక్క సినిమా చేశారు తేజస్వి.



ఇక టెలివిజన్ లో ఈటీవీ లో సూపర్ సీజన్ 2.. అనే రియాలిటీ షో.. మా టీవీ లో బిగ్ బాస్ సీజన్ 2.. అలానే బ్రహ్మానందం గారు జడ్జిగా చేసిన ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అనే కామెడీ షోలో యాంకర్ గా చేశారు. తెలుగులో గబ గబా మాట్లాడుతూ.. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటూ.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు తేజస్వి.స్పష్టమైన తెలుగు మాత్రమే కాదు.. తమిళం.. హిందీ.. ఆంగ్లం సైతం అంటే బాగా మాట్లాడగలరు. అందం.. అభినయం..అద్భుతమైన నటన..డాన్స్..అటు సంప్రదాయ దుస్తులలో.. ఇటు ట్రెండింగ్ డ్రెస్ లతో కుర్రాల గుండెల్లో చెదరని ముద్ర వేశారు తేజస్వి. తనకంటూ ఒక అభిమానలను పొందారు.దేని గురించైనా నిర్మొహమాటంగా.. చెప్పేస్తుంటారు తేజస్వి. అదే ఆమెకు బలం.. కష్టాన్ని.. ట్యాలెంట్ ని నమ్ముకొని పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ గా మారారు తేజస్వి.


మన ముగ్గురి లవ్ స్టొరీ తో వెబ్ సిరీస్ సైతం చేసిన తేజస్వి.. కమిట్మెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం పోస్టర్ ని విడుదల చేశారు.రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చెయ్యాలని.. భారీ విజయాలను నమోదు చెయ్యాలని.. కొరుకుంటూ.. మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున తేజస్వి మడివాడ గారికి జన్మదిన శుభాకాంక్షలు.!

పుట్టినరోజున వెన్నెల గా కనిపించిన శివాని రాజశేఖర్

పుట్టినరోజున వెన్నెల గా కనిపించిన శివాని రాజశేఖర్



చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చుడీదార్ ధరించి పక్కింటి తెలుగు అమ్మాయిగా కనిపించారు శివాని రాజశేఖర్. జీవితా.. రాజశేఖర్.. స్వయం కృషి తో పైకి వచ్చి.. ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో తమకంటూ ఒక గుర్తింపు.. గౌరవం సంపాదించుకున్నారు.నటిగా పరిచయమైన జీవిత.. దర్శకురాలిగా.. నిర్మాతగా మారారు.అలాంటి వీరి పిల్లలు ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో అడుగు పెడుతున్నారు.ఇప్పటికే వీరి చిన్నమ్మాయి శివాత్మిక దొరసాని సినిమాతో పరిచయమయ్యారు.ఇప్పుడు తాజాగా పెద్ద కుమార్తె శివాని సైతం హీరోయిన్ గా మరిచయం కానున్నారు.


నేడు శివాని రాజశేఖర్ పుట్టినరోజు సందర్భంగా.. ఆమె తొలి సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది చిత్ర బృందం.ఇప్పటికే ప్రొడ్యూసర్ గా చేసిన శివాని.. తన తండ్రి లాగా ఒక డాక్టర్.బాల నటుడిగా మంచి పేరు సంపాదించుకొని.. తాజాగా ఓ బేబీ.! తో తిరిగి వెండితెర పై అల్లరి చేసిన తేజ సజ్జా.. ఈ సినిమాలో హీరో. 3 సీజన్స్ తో యువతను బాగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్ పెళ్లి గోల..ఆ వెబ్ సిరీస్ దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాకు దర్శకులు. మహాతేజ క్రీయాషన్స్.. ఎస్ ఒరిజినల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సినిమా ఇది.


డాక్టర్ నుంచి నటిగా మారిన శివాని.. తొలి సినిమా ప్రధమ పోస్టర్ లో చుడీదార్ తో కనిపించి తెలుగు అమ్మాయిలా ఆకట్టుకున్నారు.అలానే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మేడ మీద కూర్చొని నెలవంకను చూస్తుంటే..నేటితరం యువతిలా కనిపించారు.ఈ సినిమాలో ఆమె పాత్ర పేరు వెన్నెల.ఇప్పటికే తన చెల్లి శివాత్మిక పై సామాజిక మాధ్యమాలలో వచ్చిన ట్రోలింగ్స్ కి వేదికపై నుండి జవాబు చెప్పి.. తాను జీవిత కూతురుని అని నిరూపించుకున్న శివాని.. రానున్న రోజుల్లో తన తల్లి లాగా మంచి నటిగా కూడా పేరు తెచుకుంటారేమో చూడాలి.



నేటి తరం కొత్త తరహా లైవ్ స్టోరీ అని బృందం చెబుతుంది.చిత్రకరణ ప్రారంభించుకున్న ఈ సినిమాకి ఇప్పటివరకు ఎటువంటి టైటిల్ ఖరారు కాలేదు.అలానే ఇందులో పనిచేస్తున్న నిపుణులు.. మరియు ఇతర తారాగణం వివరాలు త్వరలో ప్రకటించనున్నట్లు సమాచారం.ఈ సినిమాతో హీరో గా తేజ సజ్జా. అలానే హీరోయిన్ గా శివాని రాజశేఖర్ పరిచయం కానున్నారు.


హీరోయిన్ గా తొలి పుట్టినరోజు జరుపుకుంటున్న శివాని.. నటిగా మంచి పేరు తెచ్చుకొని.. ఉన్నత స్థాయికి చేరాలని..నటిగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని కోరుకుంటూ..మా బి.ఆర్. మూవీ జోన్ బృందం తరపున శివాని కి పుట్టినరోజు శుభాకాంక్షలు.

సామాజిక మాధ్యమ ‘మహనటి సావిత్రి’ ‘చాందిని చౌదరి’

సామాజిక మాధ్యమ ‘మహనటి సావిత్రి’ ‘చాందిని చౌదరి’


20వ దశాబ్దం చివర్లో అప్పుడప్పుడే ఇంటర్నెట్ వేగంగా వ్యాప్తి చెందుతున్న రోజులు..,యాహు,జిమెయిల్ నుండి సామాజిక మాధ్యమం అంటూ మన దేశ యువత ఆర్కుట్,ఫేస్బుక్ లలోకి వస్తున్న రోజులు,సరిగ్గా అప్పుడే యూట్యూబ్ అనే అప్లికేషన్ లో వీడియోలు చూడచ్చు అని తెలుసుకుంటున్న రోజులు.యువత నోకియా బేసిక్ మోడల్ ఫోన్స్ నుండి స్మార్ట్ ఫోన్లు వాడడం మొదలు పెట్టారు.

2010 నాటికి చదువుకుంటున్న యువతకి ఫేస్బుక్,యూట్యూబ్ చాలా సాధారణం అయిపోయాయి.ఇంతలో మన తెలుగు నేల పై షార్ట్ ఫిలిమ్స్ అనే పిలుపు వినిపించింది.పోటీల కోసం తీస్తున్న లఘు చిత్రాలను ఎక్కడో విశాఖలో చదువుకుంటున్న కొందరు యూట్యూబ్ లో పెట్టడం మొదలు పెట్టారు.తర్వాతి రోజుల్లో,ఆ సంస్థ కు ఏం.ర్.ప్రొడక్షన్స్ అని నామకరణం చేసి యూట్యూబ్ వీక్షకుల కోసం షార్ట్ ఫిలిమ్స్ తీసే స్థాయికి చేరింది.

దశాబ్దం గడిచే సరికి అనేక మంది నటీనటులు మన వెండితెరకు ఆ యూట్యూబ్ షార్ట్ ఫిలిమ్స్ నుండి పరిచయమయ్యారు.ప్రతి రోజు ప్రపంచంలో ఏదో ఒక చోట నుండి తెలుగులో ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ విడుదల అవుతుంది.కానీ ఇప్పటికీ,అప్పటికీ ఒక నటి గురించి చిన్న విషయమైనా సామాజిక మద్యమలలో యువత ఆసక్తి చూపుతుంటారు.ఒక్కటి రెండు రోజులు తన వద్ద నుండి అప్డేట్ రాకుంటే తనకేమైందో అని పోస్టులు పెట్టె వారు నేటికి వున్నారు.ఆమె లఘు చిత్రాలు వదిలి వెండితెర పైకి వెళ్లి దాదాపు అర్దదశాబ్దం అవుతున్నా మరెందరో నటీమణులు వచ్చినా ఆమె స్థానం చెక్కు చెదరలేదు.ఇప్పటికి ఏ షార్ట్ ఫిల్మ్ హీరోయిన్ ని పోల్చాలన్నా అమెతోనే.

కళ్ళతో అభినయం,మంచి పొడుగు,చక్కటి వస్త్రాలు,చూసేందుకు అచ్చ తెలుగు ఆడ పిల్లలా చూసేందుకు అందంగా ఉండటమే కాదు.తన కొంటె చూపులతో ఆ రోజు నుండి నేటి వరకు ఎందరో కుర్రకారులను తన అభిమానులుగా చేసుకుంది.నిన్న మొన్న ఆమె నటించిన వెబ్ సిరీసులను కూడా కేవలం ఆమె కోసం చూసిన వారు ఉన్నారు అంటే ఆమెకు ఎంత క్రేజ్ ఉందో చెప్పనక్కర్లేదు.ఆమె ఎవరో కాదు సామాజిక మాధ్యమ ‘మహనటి’ ‘చాందిని చౌదరి’.ఆమెను ‘సామాజిక మాధ్యమ సావిత్రి’ అని పిలవడం అతిసేయోక్తి కాదేమో…!

వెబ్సైట్ లో లఘు చిత్రాలు అనే కాలమ్ పెట్టాము,కొత్తగా వచ్చే యువతను వారి ప్రతిభను అభినందించేందుకే పెట్టాము.తొలి ఆర్టికల్ ఎవరి పైన రాయాలి అని ఆలోచిస్తుంటే నాకు ఇప్పటి వారిలో అనేక పేర్లు వెంటవెంటనే గుర్తుకొచ్చాయి.అంతలో తొలి ఆర్టికల్ నేటి తరం వారికి,రానున్న యువతకు స్ఫూర్తి దాయకంగా ఉండాలి అనిపించింది.వెంటనే నాకు గుర్తుకు వచ్చిన పెరు చాందిని చౌదరి.తన నటన,తన పట్టుదల కచ్చితంగా నేటి తరానికి స్ఫూర్తి.

చాందిని చౌదరి తొలి రోజుల షార్ట్ ఫిలిమ్స్ హీరోయిన్.ఇప్పుడంటే అమ్మయిలు టిక్-టాక్ లు చేస్తున్నారు కానీ ఆ రోజుల్లో తెలుగమ్మాయి తన ఫోటో సామాజిక మాద్యమంలో పెట్టిన వెంటనే ఇంట్లో దాని పై పెద్ద గొడవే జరిగేది.ఇక షార్ట్ ఫిలిమ్స్ అంటూ యూట్యూబ్ లో చేసినప్పుడు బంధుమిత్రుల నుండి తనకు,తన తల్లి తండ్రులకు ఎంతటి విమర్శలు వచ్చి ఉంటాయో ఉహించండి.ఇప్పుడంటే ఎక్కడో కొందరు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్స్ చేస్తుంటారు,కానీ తాను చేసే రోజుల్లో మన అనుకున్న వారే అనేక మాటలు మొహం మీద అని వుంటారు కదా.!కూతురి పై నమ్మకంతో తనకు ఇష్టమైన పని చేసేందుకు స్వేచ్ఛ ఇచ్చిన తన తల్లితండ్రులు కచ్చితంగా అభినందనియులు.అందుకే ఆమె కచ్చితంగా సినీ రంగంలోకి ఇప్పుడు వచ్చిన,రానున్న ఎంతో మంది తెలుగు అమ్మాయిలకు స్ఫూర్తి.చాందిని చౌదరి మరెనో సంవత్సరాలు సినీ రంగంలో కొనసాగించాలి అని కోరుకుందాం..!