17-04-2021 10:25:36 About Us Contact Us
సినిమాభిమానులకు సోలో బ్రతుకే సో బెటర్ తో పండగ మొదలైంది..!

సినిమాభిమానులకు సోలో బ్రతుకే సో బెటర్ తో పండగ మొదలైంది..!శుక్రవారం వచ్చింది అంటే చాలు కొత్త పెళ్లికూతురులా ముస్తాబు అయ్యేవి తెలుగు రాష్ట్రాల్లో సినిమా థియేటర్లు.. అదంతా కరోనాకి ముందు మాట..!


గడిచిన 9 నెలలుగా.. కరోనా కారణంగా జనం థియేటర్లకు కి దూరమయ్యారు.దాంతో.. థియేటర్ల యాజమాన్యంకి మాత్రమే కాకుండా దాని మీద ఆధారపడి జీవనం సాగించే ఎంతో మందికి పోస్టర్స్ అతికించే వాళ్ళ దగ్గర నుండి డిస్టిబ్యూటర్స్ వరకు ఒక్కరికి కూడా ఆదాయం లేకుండా పోయింది.ఎంత మనం ఇంట్లో ఓ టీ టీ లలో సినిమా చుసినా కూడా థియేటర్ కి వెళ్లి వెండితెర పై మన అభిమాన తారల సినిమాని చూసి ఈల వేసి గోల చెయ్యనిదే సినిమా చూసిన అనుభూతి కలగదు మనలో చాలామందికి.


దాదాపు 250 రోజుల తరువాత బాగా తయారయ్యి.. సినిమా హాల్ లోకి వెళ్తే.. అక్కడ తగిన జాగ్రత్తలు తీసుకున్నా.. హాల్ లో సంగం మంది మాత్రమే ప్రేక్షకులు ఉన్నా..మొహానికి మాస్క్ పెట్టుకొని ఉన్నా.. ఆ సినిమా చూసినంతసేపు.. బాహ్య ప్రపంచాన్ని.. కరోనాని మర్చిపోయి.. అభిమానుల అరుపులు.. కేకలు.. మధ్య మరో ప్రపంచానికి వెళ్లినట్లు అనిపించింది. హాస్య సన్నివేశాలకు అందరూ నవ్వుతుంటే చాలా ఆనందంగా అనిపించింది.మళ్ళీ మన సినిమాభిమానులకు మంచి రోజులు వచ్చాయి అనే సంతృప్తి ని ఇచ్చింది మన సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్ చిత్రం.


ఓ.టి.టి లకు అలవాటైన వాళ్ళు థియేటర్ కు వస్తారా?.. కరోనా భయంతో సినిమా హాల్ కు చేరుతారా??ఇలాంటి ప్రశ్నలన్నింటికి తొలి రోజు సినిమా హాళ్ళ వద్ద వచ్చిన జనం.. నిన్న నమోదైన కలక్షన్స్ తో ప్రేక్షక దేవుళ్లు దిమ్మతిరిగే సమాధానం ఇచ్చారు.ఈ చిత్రంతో థియేటర్స్ పునఃప్రారంభం అవ్వడం.. సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా సినిమాని ప్రేమించి ఆదరించే అందరికి ఒక శుభపరిణామం అనే చెప్పాలి.. సోలో బ్రతుకే సో బెటర్ తో ప్రారంభమైన హాల్స్ లోకి.. ప్రతి శుక్రవారం సినిమాలు విడుదలై.. తెలుగు చిత్ర పరిశ్రమకు పూర్వవైభవం రావాలని కోరుకుందాం.. వస్తుంది అని ఆశిద్దాం.!

అందరి నోటా..రేపు విడుదలవుతున్న “సోలో బ్రతుకే.. సో బెటర్”..!

అందరి నోటా..రేపు విడుదలవుతున్న “సోలో బ్రతుకే.. సో బెటర్”..!అటు సినిమా పరిశ్రమ.. ఇటు ప్రేక్షకులు.. అటు మీడియా.. ఇటు విమర్శకులు.. ఇలా అందరు ఎదురుచూస్తున్నది రేపటి కోసమే.రేపు… దాదాపు 9 నెలల తర్వాత ఒక పెద్ద తెలుగు సినిమా వెండితెర పై కనువిందు చేయనుంది.”నో పెళ్ళి..”పాట తో యువతకు బాగా చేరువైన.. సుప్రీమ్ హీరో సాయి తేజ్ నటించిన సినిమా “సోలో బ్రతుకే సో బెటర్”సినిమా హాల్స్ లో విడుదల కానుంది.ఆ సినిమా వివరాల్లోకి వెళ్తే..


వరసగా రెండు భారీ విజయాల తర్వాత.. సుప్రీమ్ హీరో సాయి తేజ్ నుండి వస్తున్న సినిమా “సోలో బ్రతుకే.. సోలో బెటర్”.ఇప్పటికే విడుదలైన టీజర్.. ట్రైలర్.. పాటలకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభించింది.ముఖ్యంగా పెళ్ళి చేసుకోవాలా.. సోలోగా ఉండాలా.. అనే డైలమాలో ఉన్న యువత.. తేజు పాత్రకు బాగా కనెక్ట్ అయ్యారు..ఇప్పటికే విడుదల చేసిన శ్లోకాలు బాగా వైరల్ గా మారాయి.ఈ నెల 25న సినిమా విడుదలవుతున్నట్లు ప్రకటన వచ్చినప్పటి నుండి సామాజిక మాధ్యమాలలో టికెట్స్ గురించే చర్చ.. అంతలా సినిమాకు యువత కనెక్ట్ అయ్యారు.


విడుదలైన ట్రైలర్ చూస్తుంటే.. ప్రేమ.. పెళ్ళి వద్దు.. సోలో బ్రతుకే సో బెటర్.. అనే సిద్దాంతాన్ని బలంగా నమ్మే ఒక యువకుడి జీవితంలోకి ఒక అమ్మయి వస్తే.. ఆ తర్వాత తన జీవితం ఎటు మలుపు తీసుకుంటుంది అనే కధాంశం తో వస్తున్న సినిమాగా అర్ధమవుతుంది.అటు యువతతో పాటు.. ఇటు ఫ్యామిలిస్ సైతం సినిమా చూసేలా దర్శకుడు సుబ్బు రూపుదిద్దునట్లు కనిపిస్తుంది.ఇక సంగీతం విషయానికి వస్తే..


థమన్.. సాయి తేజ్.. కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా ఆల్బమ్ హిట్.అలానే ఈ సినిమాలో విడుదలైన నాలుగు పాటలకు ప్రేక్షకుల నుండి అదిరిపోయే స్పందన లభించింది.ఇప్పటికే “నో పెళ్ళి..” పాటకు 20 మిలియన్ వ్యూస్ రాగా.. “హే ఇది నేనేనా..”పాటను మూడు కోట్ల మంది ఒక్క యూట్యూబ్ లోనే చూశారు.ఇటీవల విడుదలైన బ్రేకప్ సాంగ్.. మరియు టైటిల్ సాంగ్ కి సైతం ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వరా సినీ చిత్ర బ్యానర్ పై బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మస్తున్నరు.ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం కానున్నారు.నభా నటేష్.. సుప్రీమ్ హీరో సాయి తేజ్ జంటగా అలరించనున్నారు.ట్రేండింగ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. ఈ సినిమాకు సంగీతం అందించారు.వెన్నెల కిషోర్.. సత్య.. రావు రమేష్.. రాజేంద్ర ప్రసాద్.. నరేష్.. ఇలా భారీ తారాగణంతో సినిమా చిత్రీకరించారు.ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చింది.


లాక్ డౌన్ తర్వాత విడులవుతున్న మొదటి తెలుగు సినిమా కావడం.. అది కూడా మెగా హీరో నుండి వస్తుండటం.. సాయి తేజ్.. ఇప్పటికే వరసగా రెండు విజయాలు సాధించి ఫార్మ్ లో ఉండటంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమాకు వచ్చే ప్రేక్షకుల పైనే రానున్న సంక్రాంతికి ఎన్ని సినిమాలు విడుదలవుతాయో తేలనుంది.దింతో అటు మార్కెట్ వర్గాలు.. ఇటు నిర్మాతలు రేపటి కోసం ఎదురు చూస్తున్నారు.


అందరి యువతలాగే.. ప్రేమా.. సోలో బ్రతుకా అనే డైలమాలో ఉన్న నాకు..చిత్రాలహరితో పట్టుదలతో ప్రయత్నిస్తే విజయం నీదే అనే గొప్ప సందేశం ఇచ్చిన తేజు అన్న.. ఈ సోలో బ్రతుకే సో బెటర్ తో ఒక స్పష్టత ఇస్తాడాని ఎదురు చూస్తున్నా..అలానే తేజు అన్న హ్యాట్-ట్రిక్ విజయం సాధించాలని.. నవ దర్శకుడు సుబ్బుకు మంచి పేరు రావాలని కోరుకుంటూన్నా..వెండితెర పై సినిమా చూదాం.. చిత్ర పరిశ్రమను కాపాడుకుందాం.. నేను టికెట్ బుక్ చేసుకున్నా.. మరి మీరు??