18-04-2021 23:01:25 About Us Contact Us
2021 సంక్రాంతి పందెంకొళ్ళు సిద్ధం..ఇప్పటికి ఇవే ఖరారు..!

2021 సంక్రాంతి పందెంకొళ్ళు సిద్ధం..ఇప్పటికి ఇవే ఖరారు..!



ప్రతి ఏడాది సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద చిత్రాలు పోటీ పడుతూ ఉంటాయి.గత ఏడాది రెండు భారీ సినిమాలు సాధించిన వసూళ్లు మనం ఇప్పట్లో మర్చిపోలేము.అయితే.. కరోనా కారణంగా సినిమా హాళ్లు మూసివేయ్యడంతో ఈసారి వేడుక ఉండదేమో అనుకున్నారు అంతా. కానీ.. ఎప్పటిలాగే ఈ సారి కూడా తెలుగు వెండితెర మీద సందడి చేయడానికి సిద్ధమయ్యాయి మన సినిమాలు.ఆ చిత్రాలు ఏంటో చూద్దాం..


మాస్ మహారాజ్ రవితేజ కథానాయకుడిగా శృతిహాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన చిత్రం క్రాక్. ఈ చిత్రనికి థమన్ అందించిన బాణిలకు ఇప్పటికే మంచి స్పందన లభించింది.. అలాగే రవితేజ.. గోపీచంద్ మలినేని కలయికలో వస్తున్న మూడవ చిత్రం కావడంతో.. ఈ చిత్రంతో రవితేజ మంచి విజయాన్ని సొంతం చేసుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 14 న థియేటర్ల లోకి రాబోతుంది.


ఎనర్జెటిక్ స్టార్ రామ్ కథనాయకుడిగా తమిళ చిత్రం తడం కథ ఆధారంగా నేను శైలజ.. ఉన్నది ఒక్కటే జిందగీ.. చిత్రలని తెరకేక్కించిన కిషోర్ తిరుమల దర్శకత్వం లో వస్తున్న చిత్రం రెడ్. ఈ చిత్రం సెన్సర్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసుకుని జనవరి 14 విడుదలకి సిద్ధం అవుతుంది. ఈ చిత్రం లో కథనాయకలు గా అమ్రితా అయ్యర్.. మాళవిక శర్మ నటించగా.. నీవేత పేతురాజ్ ముఖ్యపాత్రలో నటించారు. ఇక.. హెబ్బా పటేల్ ఒక ప్రత్యేక పాటలో కనపడనున్నట్లు సమాచారం. మెలోడీ బ్రాహ్మ.. మణిశర్మ అందించిన పాటలకి మంచి స్పందన లభించగా ఈ మధ్య విడుదలైన టీజర్ కి కూడా అద్భుతమైన స్పందన వస్తుంది.



బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కధానాయకుడిగా కందిరిగా.. రభస చిత్రలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సంతోష్ శ్రీనివాస్ రౌతు దర్శకత్వంలో వస్తున్న చిత్రం అల్లుడు అదుర్స్.. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమాకురుస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది.


వీటితో పాటు తమిళ అగ్ర కథనాయకుడు విజయ్ నటించిన మాస్టర్ చిత్రం కూడా సంక్రాంతి బరిలో ఉంటుంది అని వార్తలు వినిపిస్తున్నాయి.ఇవి మాత్రమే కాక.. శ్రీముఖి నటించిన క్రేజీ అంకుల్స్.. మరి కొన్ని చిన్న చిత్రాలు బరిలోకి దిగేందుకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్నారు.ఈ నెల 25న విడుదలైన సోలో బ్రతుకే సో బెటర్ భారీ వసూళ్లు రాబట్టడంతో.. నిర్మాతలు తమ సినిమా విడుదల చేసేందుకు ముందుకు వస్తున్నారు.దింతో కరోనా కారణంగా ఆగిపోయిన సినిమా హాళ్లు మళ్ళీ పూర్వ వైభవం వైపు నడవనున్నాయి. ఈ సారి కూడా ప్రతి ఏడాది లానే బాక్స్ ఆఫీస్ కళకళలాడటం ఖాయం.


సంక్రాంతికి విడుదల అయ్యే చిన్నా.. పెద్ద అనే తేడా లేకుండా అన్ని చిత్రాలు మంచి విజయాలు సాధించాలి అని.. ప్రేక్షకులు వినోదాన్ని పొందాలని.. మరిన్ని చిత్రాలు మన ముందుకు రావాలని ఆశిదాం..!