“పోలీస్ వారి హెచ్చరిక”.. “లక్ష్య”.. “వరుడు కావలెను” అంటున్న నాగశౌర్య కి జన్మదిన శుభాకాంక్షలు
10 ఏళ్ళ ముందు హీరోగా పరిచయమై.. ఊహలు గుసగుసలాడే.. చలో వంటి భారీ విజయాలను నమోదు చేసుకొని.. 2ఒక పైగా సినిమాలు పూర్తి చేసి..ప్రసృతం మూడు సినిమాలు...
Read More
10రోజుల నుండి సినిమా హాల్స్ లేవు,గత వారం నుండి షూటింగ్స్ కూడా లేవు.దింతో గత కోడి రోజులుగా సినీ అభిమానులకు ఎటువంటి సినిమా వార్తలు,సంబరాలు లేక బాధలో ఉన్నారు,ఇంకా చెప్పాలి అంటే కరువులో ఉన్నారనచ్చు.ఇది చాలదు అన్నట్లు ఆ మహమ్మారి కరోనా ని ఎదురుకునేందుకు మరో 21 రోజులు అందరూ ఇంట్లోనే ఉండాలి అని నిన్న పిలుపునిచ్చారు మన దేశ ప్రధాని మోడీగారు.దింతో అందరూ నిరసలోకి వెళ్లిపోయారు.
కానీ ఈ సమయంలో అటు ఇండస్ట్రీకి ఇటు తెలుగు ప్రేక్షకులకు ఉగాది రోజున తన సినిమా టైటిల్ ని ప్రకటిస్తున్నట్లు తీపి వార్తను చెప్పి రాజమౌళి గారూ అందరికి ఉపిరిని పోశారు.ఆర్.ఆర్.ఆర్.సినిమా టైటిల్, అది కూడా మోషన్ పోస్టర్ తో విడుదల చేస్తున్నట్లు తెలిపారు.ఈ టైటిల్ తో మరో వారం సోషల్ మీడియాలో రచ్చ జరగడం ఖాయం అని అంతా భావిస్తున్నారు.ఒక తెలుగు సినిమా,దేశ స్థాయి నుండి ప్రపంచవ్యాప్తంగా ఇండియన్ సినిమా గా పేరు తెచ్చిన బాహుబలి తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో యావత్తు దేశమంతా ఈ సినిమా పై ఆసక్తి నెలోకొనింది.
ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక వెలుగు వెలుగుతున్న నందమూరి,కొణిదెల వంటి రెండు పెద్ద కుటుంభ వారసులు ఈ సినిమాలో కలిసి నటిస్తుండడంతో తెలుగు నాట ఈ సినిమా గురించి వార్త వచ్చినప్పటి నుండే అంచనాలు ఆకాశానికి చేరాయి.రామ్ చరణ్,రాజమౌళి,రామారావు అంటూ ఈ సినిమాకి ఆర్.ఆర్.ఆర్.అనే వర్కింగ్ టైటిల్ మొదలైంనప్పటి నుండి అది పూజా కార్యక్రమమైనా,షూటింగ్ ప్రారంభరోజు ఫోటో అయినా,తారక్,చరణ్,జక్కంల ఉమ్మడి ప్రెస్ మీట్ అయినా,హీరోయిన్ ల పేర్లు ఖరారైనా,సినిమాలోని కొందరి పోస్టర్స్ వచ్చినా,అజయ్ దేవగన్ షూట్ లోకి చేరిన రోజు ఫోటో అయినా సోషల్ మీడియా నుండి అంతర్జాతీయ మీడియా దాక ఓ స్థాయి లో ప్రచారం జరిగింది.మరో పక్క ఇది అల్లూరి సీతారామరాజు,కొమరం భీమ్ వంటి ఇద్దరు స్వతంత్ర వీరుల కధ కావడంతో ఈ సినిమా దేశం మొత్తాన్ని ఆకట్టుకుంటుంది అని అందరూ భావిస్తున్నారు.
అందరూ ఎదురుస్తున్న టైటిల్ మార్చ్25న అంటే ఉగాది రోజున మధ్యాహ్నం 12 గంటలకు విడుదలైంది.ఆర్.ఆర్.ఆర్ అంటే ‘రౌద్రం,రుదిరం,రణం’ అని అర్థం.నిప్పులలో నుంచి రామ్ చరణ్ రాగా,నీళ్ళల్లో నుంచి తారక్ వస్తున్నట్లుగా ఆ మోషన్ పోస్టర్ లో చూపారు.వారి ఇద్దరి చేతులు కలవడం లోగో లో ఉంది.మన దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఇద్దరి వీరుల కథను ఫిక్షన్ గా రానుంది ఆర్.ఆర్.ఆర్.మూవీ.మరి మరో వారం ఈ సినిమా మోషన్ పోస్టర్ శికరుకొట్టడం ఖాయం.2021లో అతి పెద్ద సినిమాగా మనం చెప్పుకోవచ్చు.చూడాలి మరి సినిమా ఎప్పుడు వస్తుందోఇద్దరు స్టార్ హీరోలు ఎలా వుండబోతున్నారో..!