05-03-2021 09:05:23 About Us Contact Us
ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఉప్పెన!

ట్రైలర్ తో అంచనాలు పెంచేసిన ఉప్పెన!

Uppena Trailer  : మెగా ఫ్యామిలీ నుండి వస్తున్నా మరొక హీరో పంజా వైష్ణవ్ తేజ్ ని కథనాయకుడిగా పరిచయం చేస్తూ బుచ్చిబాబు సాన దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఉప్పెన.


ఈ చిత్ర ట్రైలర్ ని ( Uppena Trailer ) యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతులు మీదగా విడుదల చేసారు చిత్ర బృందంట్రైలర్ అధ్యంతం ఒక చక్కటి ప్రేమకథలానే తీర్చిదిద్ధారు దర్శకుడు బుచ్చిబాబు సాన.. ప్రేమంటే వదిలేయడం కాదు పట్టుకోవడం అని హీరోయిన్ కృతి శెట్టి చెప్పే డైలాగ్ తోనే సినిమా లవ్ మరియు అధిపథ్యం బ్యాక్ డ్రాప్ లోనే ఉండపోతుంది అని అర్ధమైంది.


ఈ చిత్రాన్ని ఉత్తరాంద్ర మాండాలికంలో తెరకేకేంచిన ఈ చిత్రం అత్యధికంగా బీమిలి తీరంలోనే చిత్రికరించారు సంభాషణలు కూడా అ ప్రాంతానికి దగ్గరగా ఉండేలా జాగ్రత్త పడ్డారు దర్శకుడు.ఇకపోతే విలన్ గా తమిళ స్టార్ హీరో మెక్కల్ సెల్వమ్ విజయ్ సేతుపతి నటిస్తున్నారు ఆయనకు సాయి కుమార్ తమ్ముడు రవి శంకర్ గాత్ర దానం చేసారు.

uppena trailer



ఈ చిత్రానికి అదనపు ఆకర్షణ సమాదాట్ సైయినిద్దీన్ సినిమాటోగ్రాఫి ఒక్కో ఫ్రేమ్ ఒక అందమైన పెయింటింగ్ లాగ చూపించారు.దేవి శ్రీ ప్రసాద్ అందించిన పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అవ్వగా ట్రైలర్ లో నెపధ్య సంగీతం అయితే అద్భుతంగా ఉంది అనే చెప్పాలి


ప్రేమికుల రోజులు కానుకగా రెండు రోజుల ముందు ఫిబ్రవరి 12 న విడుదల చేస్తున్నారు చిత్ర బృందం.. మెగా మేనల్లుడు మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.

ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి