05-03-2021 10:14:22 About Us Contact Us
ఫిబ్రవరి26న.. “అక్షర”గా అలరించునున్న “నందిత  శ్వేత”!

ఫిబ్రవరి26న.. “అక్షర”గా అలరించునున్న “నందిత శ్వేత”!

Nandita Swetha Akshara : విభిన్న కథలతో.. విచిత్రమైన పాత్రలు చేస్తున్న నందిత శ్వేత ప్రధాన పాత్రలో.. విద్యావిధానంలో నేటి సమాజంలో జరుగుతున్న అన్యాయాలకు అర్థంపడుతూ.. త్రిల్లర్ జోనర్ లో వస్తున్న చిత్రం “అక్షర”. ఇప్పటికే విడుదలైన టీజర్.. ట్రైలర్.. పాటలకు మంచి స్పందన రాగా.. తాజాగా చిత్రం బృందం.. ఈ సినిమాను ఈ నెల (ఫిబ్రవరి)26న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. వివరాల్లోకి వెళ్తే..


నిఖిల్ కథనాయకుడుగా వచ్చిన ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రంతో మంచి పేరు తెచ్చుకుని తరువాత అనేక చిత్రలాలో మెరిసిన నటి నందిత శ్వేత తదుపరి చిత్రం “అక్షర”. బి.చిన్ని కృష్ణ దర్శకత్వంలో వస్తున్న అక్షర చిత్రంలో నంధితా తో పాటు శకలక శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. విద్యా వ్యవస్థ మీద పోరాటం నేపథ్యంలో సాగే ఈ చిత్ర ట్రైలర్ ని చిత్రం బృందం ఇటీవలే విడుదల చేసింది.


ప్రస్తుత విద్యా వ్యవస్థలో విద్యా నారాయణో సిరి.. అని అడ్డగోలుగా ఫీజులు పెంచి చదువు సామాన్యుడి నుండి దూరం చేస్తున్న కార్పొరేట్ యాజమాన్యలకి దీటుగా నిలబడి పోరాటం సాగించే యువతిగా నందిత శ్వేత నటించారు. చదువు ని డబ్బుతో కొనుక్కోవడం తప్పు అనే కాన్సెప్ట్ ని హైలైట్ చేస్తూ ఉన్న సంభాషణలు ఆసక్తి పెంచుతున్నాయి.
ఓ కాలేజీలో జరిగిన హత్య ని ఎలా చెదించారు అస్సలు హత్యకి కారకులు ఎవరు అనే దగ్గర మొదలై.. విద్యావిధానాలను ప్రశ్నించారు ఈ చిత్ర దర్శకుడు. ఎవరు.. ఎందుకు హత్య చేశారు అని తెలియలన్నా.. విద్యావిధానాల్లో లోపాలను తెలుసుకోవాలన్నా.. పూర్తి సినిమా చూడాల్సిందే.


ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ దర్శకులు.. మాటల మాంత్రికులు.. త్రివిక్రమ్ శ్రీనివాస్ విడుదల చేయగా.. ఈ చిత్రాన్ని సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ సంయుక్తంగా.. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మించారు. సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం అదనపు ఆకర్షణగా నిలిచింది.. ప్రతి సీన్ ఆసక్తికరంగా నిలవడంలో సహాయపడ్డాడు. సరైన కూర్పు తో దర్శకుడు బి. చిన్ని కృష్ణ సగం విజయం సందిచారనే చెప్పాలి. ఇక నిర్మాత అహితేజ ఎక్కడా తగ్గకుండా సినిమాను నిర్మించినట్లు ట్రైలర్ చుస్తే తెలుస్తుంది.


నిర్మాణంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం ఫిబ్రవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. సందేశాత్మక చిత్రంగా అన్ని కమర్షియల్ హంగులతో వస్తున్న ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకోవాలని.. నటీనటులకు.. సాంకేతిక నిపుణులకు గుర్తింపు.. నిర్మాతలకు డబ్బులు రావాలని.. ఇటువంటి వైవిధ్యమైన సినిమాలు మరెనో వచ్చేందుకు ఈ చిత్రం నాంది పలకాలని కోరుకుందాం.


అక్షర ట్రైలర్

ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి