19-04-2021 08:00:54 About Us Contact Us
నేడు70వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ బాబు గారు పై ప్రత్యక కథనం

నేడు70వ పుట్టినరోజు జరుపుకుంటున్న మోహన్ బాబు గారు పై ప్రత్యక కథనం


విశ్వనట సార్వభౌమ,మాజీ రాజ్యసభ సభ్యులు,పద్మ శ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారు.ఈ పేరు చెప్పగానే మనకు గుర్తుకొచ్చేవి ఆయన డైలాగ్ డెలివరీ.నాలుగున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో 500లకు పైగా సినిమాలలో నటించి,ఎన్నో పాత్రలకు జీవం పోసిన డైలాగ్ కింగ్ మన మోహన్ బాబు గారు.రెండు దశాబ్దాల వెనక్కి వెళితే బాక్స్ ఆఫీస్ వద్ద మోహన్ బాబు సినిమా ఏ స్థాయి రికార్డ్స్ సృష్టించిందో తెలుస్తుంది.

చాలా మంది నటులకి మహా అయితే 10 పాత్రల పేర్లు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటాయి.కానీ మోహన్ బాబు గారికి మాత్రం ఆయాన చేసిన ప్రతి పాత్ర ప్రజల గుండెల్లో నిలిచిపోయింది.తరాలు మారినా ఇప్పటికి ఆయన సినిమాలు బుల్లి తెర(టీవీలో)పై వస్తుంటే నేటి తరం యువకులు సైతం సినిమాలు చూస్తున్నారు అంటే ఆయన ఎంచుకున్న సినిమాలు అలాంటివి,ఆయన పోషించిన పాత్రలు విలువ అలాంటిది.నేటి తరం ఇప్పుడు చూస్తున్న ముల్టిస్టార్ల చిత్రాలు ఆ రోజుల్లో చాలానే చేశారు మోహన్ బాబు గారు.

తనను ఇంతటి వాడిని చేసిన తెలుగు సినీమా రంగంలోనే తిరిగి తన సంపాదన పెట్టి నిర్మాత అయ్యారు.ఆయనలోనే ఒక్క నిర్మాత,ఒక్క దర్శకుడు,ఒక్క నటుడు.చివరకు ఒక సినిమాను చూసి కొన్ని కోట్లమంది ప్రేక్షకులు దీని ఎలా ఆదరించబోతున్నారో చెప్పగలిగే విశ్లేషకుడు కూడా ఆయనే.సినీ రంగంలో ఆయన పేరు చెప్పగానే తొలుత అందరూ గుర్తు చేసుకునే విషయం క్రమశిక్షణ,ముక్కుసూటితనం.సినిమా పట్ల గౌరవం,బాధ్యత,ప్రేమ వల్లనే ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా అటు ప్రజల నుండి ఇటు సినీ రంగం నుండి అభిమానం పొందగలుగుతున్నారు.

సినీ పరిశ్రమలో అనేక మంది మొహానికి కెమెరా ముందే కాక నిజ జీవితంలోనూ రంగు వేసుకుంటారు అని అంటుంటారు.అంటే నిజం చెప్పకుండా కాలం గడుపుతుంటారు అని,దానినే లౌక్యం అంటుంటారు.కానీ మోహన్ బాబు గారు ఎదుటివాడు ఎంతటి వారైనా నిజాన్ని నిర్భయంగా మొహం మీద చెప్పేస్తారు.ఇలాంటి మిత్రుడు ప్రతి ఒక్కరికి ఉంటే వారి జీవితంలో వారు కచ్చితంగా ఉన్నత స్థాయికి వెళ్ళటారు,మనం చేసే తప్పులు కచ్చితంగా చెప్తే మనం సరిదిద్దుకొని ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది కదా!

రాబోవు తరాలకు నాణ్యమైన విద్య లభించాలి అని,క్రమశిక్షణ అలవరచుకోవాలి అని ఆయన 1975లొనే శ్రీ విద్యానికేతన్ అనే విద్యాలయాని ప్రారంభించారు.ఇప్పుడు ఆ సంస్థ తెలుగు రాష్ట్రాలలో క్రమశిక్షణకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది.ఇక్కడ ఒక్క చిన్న సంఘటన నాకు గుర్తుకొస్తుంది,నేను చిన్నప్పుడు,నెల్లూరులో చదువుకునే వాడిని అక్కడ తల్లితండ్రులు తరచుగా తమ పిల్లతో ఇలా అనేవారు “నువ్వు సరిగ్గా చదువుకోకపోతే నిన్ను తిరుపతి విద్యానికేతన్ స్కూల్ లో వేస్తాను,అక్కడ మోహన్ బాబు నిన్ను దారిలోకి తెస్తారు” అని.అంటే ఆయన విద్య సంస్థ ఏ స్థాయి పేరు గడించిందో అర్థం చేసుకోవచ్చు.అక్కడ విద్యావిధానం,ఆహారాం,వ్యాయమ,క్రీడలు గురించి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు నిత్యం మాట్లాడుకుంటూనే వుంటారు.ఇవే కాక అనేక సేవ కార్యక్రమాలతో పాటు తన,తన మిత్ర బృందం ద్వారా తెలిసిన అనేక మందిని ఆర్థికంగా ఆదుకున్నారు అని వారు చెప్పడమే తప్ప తనకు తాను ఎప్పుడు చెప్పుకోలేదు మోహన్ బాబు గారు.

ఇక ఆయనకు వచ్చిన అవార్డుల గురించి,ఆయన పాత్రల గురించి,ఆయన చేసిన సినిమాల గురించి కొత్తగా తెలుగువారికి నేను చెప్పేది ఏమి లేదు,ఇలా చెప్పుకోవాలి అంటే పుస్తకామే రాయాల్సి వస్తుంది.ఇదే చిత్ర పరిశ్రమలో ఆయన యుగపురుషులు ఎన్టీఆర్ అనే అన్నయ్యను పొందారు,దర్శకరత్న దాసరి నారాయణరావు గారు వంటి గురువును పొందారు,తమిళ నాట సూపర్ స్టార్ రజినికాంత్,మన మెగాస్టార్ చిరంజీవి మంచి మిత్రులు,ఇక శ్రేయోభిలాషులు అయితే ఎందరో ఉన్నారు.

ఇప్పటికే కొడుకులు విష్ణు,మనోజ్ సినీ రంగంలో వున్నారు,ఇక కుతురు మంచు లక్ష్మి సినిమాల ద్వారా,బుల్లితెర యాంకర్ గా అందరికి సుపరిచితురాలు.ప్రతి ఏటా పుట్టిన రోజు వేడుకలను ఘనంగా విద్యార్థులు,బంధువులు,శ్రేయోభాలాషుల మధ్య తిరుపతిలో శ్రీ విద్యానికేతన్ లో జరుపుకోవడం జరుగుతుంది.కానీ,ప్రపంచాన్ని భయపెడుతున్న మహమ్మారి కరోనా కారణంగా దానిని నిలిపివేస్తున్నట్లు ఇటీవలే ప్రతికా ప్రకటన ఇచ్చారు మోహన్ బాబు గారు.ఎన్టీఆర్ పెట్టిన టీడీపీలో చేరి రాజకీయ ప్రవేశం చేసిన మోహన్ బాబు గారు,1995లో రాజ్యసభకు ఎన్నికై 2001 వరకు పదవిలో వున్నారు.ఇటీవల జరిగిన ఆంధ్ర ఎన్నికల ముందు వైస్సార్సీపీలో చేరి,చంద్రబాబుకు వెతిరేకంగా ప్రచారం చేశారు.

ఇలా సినీ,విద్య,రాజకీయ రంగాలలో తనదైన ముద్ర వేస్తూ ముందుకు వెళ్తున్న మోహన్ బాబు గారు నేడు 70వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు.తెలుగు చిత్ర పరిశ్రమ తరపున,తెలుగు ప్రేక్షకుల తరపున,తన అభిమానుల తరపున మా బి.ఆర్.బృందం తరపున మోహన్ బాబు గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు.తాను పూజించే ఆ వేంకటేశ్వరుడు,షిర్డీ సాయి బాబా ఆశీసులతో ఆరోగ్యంగా మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలి అని కోరుకుందాం.

పుట్టిన రోజు వేడుకలు వద్దు:మోహన్ బాబు,రామ్ చరణ్

పుట్టిన రోజు వేడుకలు వద్దు:మోహన్ బాబు,రామ్ చరణ్


హీరోలను అభిమానించే అభిమానులకు వారి హీరో చేసే సినిమా సమాచారమే పెద్ద శుభ వార్త,ఇక సినిమా పాటలు వస్తే వాటిని వింటూనే వుంటారు.అదే సినిమా విడుదలైతే పండగే,ఈ రోజుల్లో అంతా డిజిటల్ కాబట్టి మనకు తెలియడం లేదు కానీ,ఆ రోజుల్లో రీల్ వారి ఊరికి చేరగానే దానిని ఊరేగిస్తూ తీసుకెళ్లే వారు.అలాంటి హీరోల పుట్టిన రోజు వస్తే అభిమానులకు అది పెద్ద పండగే.వారి పుట్టినరోజులు జరుపుకుంటారో లేదో కానీ,వారి అభిమాన హీరో పుట్టిన రోజును మాత్రం ఘనంగా జరుపుకుంటారు అభిమానులు.

భారీ ర్యాలీలు,టపాసుల మోతలతో తమ అభిమాన నటుడి కట్ ఔట్ కి పలాభిషేకలు చేస్తూ ఊరేగిస్తారు.ఆ తరువాత కేక్ కటింగ్ చేస్తూ తమ అభిమాన హీరోకి పుట్టిన రోజు శుభాకాంక్షలు వీడియోల రోపంలో తెలియచేస్తారు.సేవా కార్యక్రమాలు కూడా జరుగుతాయి.వృధాశ్రమలలో పండ్లు,దుప్పట్లు,మందులు పంచుతారు,అనాధాశ్రమలలో పుస్తకాలు,బట్టలు పంచుతుంటారు.బ్లడ్ క్యాంపులు,మజ్జిగ ప్యాకెట్లు,వాటర్ పాకెట్ల పంచుతుంటారు,అన్నదనాలు చేస్తుంటారు.

ఈ రోజుల్లో తమ అభిమాన నటుల పుట్టినరోజు వేడుకలను వారోత్సవాలుగా జరుపుకోవడం మనం చూస్తున్నాం.అటువంటి వాటిని ఈ సంవత్సరం ఆపమని హీరోలే ప్రకటించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.

ప్రతి సంవత్సరం మార్చ్ 19న తిరుపతిలోని తన విద్యానికేతన్ కళాశాలలో అభిమానులు,శ్రేయోభిలాషులు,విద్యార్థుల నడుమ పుట్టిన రోజు వేడుకను ఘనంగా జరుపుకునే డైలాగ్ కింగ్ పద్మశ్రీ డాక్టర్ మోహన్ బాబు గారు తన పుట్టినరోజు వేడుకను ఈ సంవత్సరం జరుపుకొవ్వడంలేదని ప్రకటించారు.అభిమానులను సైతం ఈసారికి వేడుకలకు దూరంగా వుండాల్సిందిగా ఆయన ఆదేశించినట్లు సమాచారం.

మెగాస్టార్ డాక్టర్ పద్మభూషణ్ కొణిదెల చిరంజీవి గారి కొడుకు,సినీ వారసుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం ఈ సంవత్సరం వేడులకలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.మెగా అభిమానులు ఇప్పటికే మార్చ్ 22న రాష్ట్రంలో అనేక చోట్ల బ్లడ్ క్యాంప్ లు నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.ఇక మార్చ్ 27న అయితే పెద్ద పండగ వాతావరణంలో రాష్ట్రమంతా వేడుకలు జరిపేందుకు కార్యాచరణ రూపండించింది చిరంజీవి యువతలోని రాష్ట్ర రామ్ చరణ్ అభిమాన సంఘం.కానీ చెర్రీ వేడుకలు చేసుకోవద్దు అంటూ పత్రికా ప్రకటన విడుదల చెయ్యడంతో వీరంతా ఎక్కడ పనులు అక్కడ ఆపేశారు.

పుట్టినరోజు వేడుకలంటే అభిమానులు అధిక సంఖ్యలో హాజరవుతారు.దింతో అక్కడ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్న నేపథ్యంలో తమ పుట్టినరోజు వేడుకలు జరుపుకుని అక్కడ ఏమైనా జరిగితే అభిమానులకే ఇబ్బంది అని భావించిన కథానాయకులు ఈ నిర్ణయాన్ని ప్రకటించినట్లు తెలుస్తుంది.తమ పుట్టినరోజు ప్రతి సంవత్సరం వస్తుంది కనుక ఈ విపత్కర పరిస్థితులలో జరుపుకోవద్దు అని అభిమానుల ఆరోగ్యాలను దృష్టిలో ఉంచుకొని ఇలా ప్రకటించారు మోహన్ బాబు గారు,రామ్ చరణ్.

ఈ ప్రకటనలు చూస్తుంటే తమ అభిమానులపై హీరోలకు ఎంత ప్రేముందో తెలుస్తుంది.ఇప్పటికే సినిమా చిత్రీకరణలు ఆగిపోయాయి,తెలంగాణలో సినిమా హాల్స్ మూతపడ్డాయి.వీరి ప్రకటనలతో పుట్టినరోజు వేడుకలు కూడా దూరమయ్యాయి.ప్రస్తృతనికి మనందరం అత్యవసరమైతే తప్ప బయటకు రాకుండా ఇంట్లో ఉంటూ క్రోనా వ్యాప్తి చెందకుండా చేసుకుందాం.త్వరగా అన్ని మళ్ళీ సాధారణ స్థితికి రావాలి అని కోరుకుందాం.

Ram charan press note on birthday