నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!
Director Teja Birthday: శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ తో పాటు సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. చిత్రం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమవ్వడంతోనే...
Read More
చందమామతో మంచి పేరు సంపాదించి.. మగధీర తో స్టార్ హీరోయిన్ గా మారి.. 2009 నుంచి అదే హోదాలో దక్షిణాదిన ఉన్న దాదాపు అందరూ స్టార్ హీరోలతో పని చేసి.. ఇప్పటికే అంటే క్రేజ్ తో ముందుకు దూసుకువెళ్తున్నారు.. పంజాబీ భామ.. కాజల్ అగర్వాల్.. అలాంటి కాజల్ నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. గడిచిన 13 ఏళ్ళల్లో 48 సినిమాలు చేసిన కాజల్ కు తెలుగు.. తమిళ.. హిందీ భాషలలో ఆమెకు కోట్లాదిమంది అభిమానులు వున్నారు..
1985 జూన్ 19న.. ముంబై లో స్థిరపడ్డ ఒక పంజాబీ.. వ్యాపారా కుటుంబంలో జన్మించారు కాజల్.. విద్యాబ్యాసం మొత్తం ముంబైలోనే చేశారు.. మాస్ కమ్యూనికేషన్ చదివి మోడలింగ్ వైపు అడుగులు వేశారు.. 2004లో హిందీలో క్యూ హో గయా నా అనే అమితాబ్ సినిమాలో దియా మీర్జా కు చెల్లిగా చేశారు.. 2007లో దర్శకుడు తేజ తీసిన లక్ష్మీ కల్యాణం సినిమాలో కళ్యాణ్ రామ్ తో జత కట్టారు.. హీరోయిన్ గా ఇదే ఆమె తొలి సినిమా.. అదే సంవత్సరం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన చందమామ సినిమా లో నటించారు.. ఈ సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది.. 2008 లో తమిళంలో కూడా అడుగు పెట్టారు.. తెలుగులో కూడా అవకాశాలు వస్తూనే వున్నాయి.. అప్పుడు 2009లో వచ్చింది ఒక సినిమా.. ఆ సినిమా రికార్డుల మోతకి కాజల్ కు తెలుగులో స్టార్దం తెచ్చి పెట్టింది.. అదే మన రాజమౌళి గారి మగధీర.. ఇక 2009 నుంచి అందరికి తెలిసిన చరిత్ర..
చిరంజీవి.. పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు.. ప్రభాస్.. అల్లు అర్జున్.. జూనియర్ ఎన్టీఆర్.. రామ్ చరణ్.. నాగ చైతన్య.. రవితేజ.. రాణా.. శర్వానంద్.. రామ్.. నితిన్.. నవదీప్.. సుమంత్ అక్కినేని.. నిఖిల్ సిద్దార్థ్.. కళ్యాణ్ రామ్.. బెల్లంకొండ శ్రీను.. ఇది తెలుగు హీరోల లిస్ట్ కాదు.. కాజల్ అగర్వాల్ తెలుగు చేసిన హీరోల పేర్లు.. అలానే తమిళంలో అజిత్.. విజయ్.. ధనుష్.. అర్జున్.. విశాల్.. సూర్య.. కార్తీ.. జీవ.. జయం రవి.. భరత్.. వైభవ్.. వీరితో కలిసి సినిమా చేసింది.. ఆమె అందం.. అభినయం.. పట్టుదల.. తో ఆమె ఈ స్థాయికి చేరారు.. ఇంత మందితో ఇన్ని సంవత్సరాలు నుండి ఇన్ని సినిమాల్లో నటించడం సాధారణ విషయం ఏ మాత్రం కాదు..
స్టార్దం రావడం ఎంత కష్టమో.. దానిని నిలబెట్టుకోవడం కూడా అంతే కష్టం.. కాజల్ తన సినీ ప్రస్థానంలో నిరూపించి చూపించారు.. పరిశ్రమలో అడుగు పెట్టి 13ఏళ్ళు గడిచినా ఆమె ఇమేజ్ ఏ మాత్రం చెక్కు చెదరలేదు.. మంచు విష్ణు తో మోసగాళ్ళు.. చిరంజీవి గారి ఆచార్య.. కమల్ హాసన్ తో ఇండియన్ 2.. డూల్కర్ సల్మాన్ హే సినామిక.. హిందీ లో ముమ్బి సాగా.. లేడీ ఓరియెంటెడ్ సినిమా పారిస్.. పారిస్.. అనే తమిళం సినిమాలో ఆమె ఇప్పుడు నటిస్తున్నారు.. ఇలానే ఆమె మరిన్ని సినిమాలలో నటించాలని కోరుకుందాం.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గారికి.. బి.ఆర్. మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకంక్షాలు..