13-04-2021 00:44:03 About Us Contact Us
పుట్టినరోజు సందర్భంగా రేపు పవన్ అభిమానులకు మూడు కానుకలు.!

పుట్టినరోజు సందర్భంగా రేపు పవన్ అభిమానులకు మూడు కానుకలు.!


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు సందర్బంగా రేపు.. ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాల విశేషాలు విడుదల చేయనున్నట్లు మూడు నిర్మాణ సంస్థలు ప్రకటించాయి. దింతో ఆయన అభిమానుల ఆనందాలకు హద్దులు లేకుండా పోయాయి. ఇలా జరగడం ఆయన సినీ జీవితంలో ఇదే తొలిసారి.. వివరాల్లోకి వెళ్తే..


సాధారణంగానే హీరో లేదా హీరోయిన్ పుట్టినరోజున వారు ప్రసృతం చేస్తున్న సినిమా టైటిల్.. ఫస్ట్ లుక్.. టీజర్.. పాట.. ఇలా ఏదొకటి విడుదలవ్వడం లేకుంటే తదుపరి సినిమాకు సంబంధించి ఒక సమాచారం ఇవ్వడం గత కొంతకాలంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఆనవాయితీగా మారిపోయింది. కానీ.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆయన అభిమానులకు సినిమా వార్తలు కరువయ్యాయి.రాజకీయాల్లో ఆయనతో పాటు క్రియాశీలకంగా పాలుగుంటున్నా.. 2017 సెప్టెంబర్ 2 తర్వాత.. ఏ హీరో పుట్టినరోజు వచ్చినా మా హీరో పుట్టినరోజున ఇలాంటి వార్తలు మేము వినలేమే అనే బాధ ఆయన అభిమానుల్లో ఎక్కడో కొంచం కనిపించేది.


2019 ఎన్నికల తర్వాత.. తాను ఇదివరకే ఒప్పుకున్న సినిమాలను త్వరతిగతిన పూర్తి చేసేందుకు సిద్ధమయ్యారు పవన్ కళ్యాణ్. దింతో వరసగా మూడు సినిమాల దర్శక.. నిర్మాతల సమాచారం బయటకు వచ్చేశాయి. ఇప్పటికే వకీల్ సాబ్ ఫస్ట్ లుక్ తో పాటు.. ఒక పాట కూడా విడుదలయ్యింది. కరోనా లేకుంటే ఇప్పటికే సినిమా విడుదల చేసేవారు.రేపు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఉదయం తొమిది గంటలా తొమిది నిమిషాలకు(09:09AM) ఒక వీడియోను విడుదల చేయనున్నట్లు శ్రీ వెంకటేశ్వరా క్రియేషన్స్ తెలిపింది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత.


వకీల్ సాబ్ తర్వాత.. ఏ.ఎం. రత్నం నిర్మాతగా క్రిష్ దర్శకత్వంలో సినిమా చేయన్నున్నారు.ఈ సినిమాకు సంబంధించి కూడా ఒక వార్తను రేపు మధ్యాహ్నం పండిండు గంటలా ముప్పయి నిమిషాలకు (12:30PM) విడుదల చేయనున్నట్లు నిర్మాత ప్రకటించారు. ఆ రెండు సినిమాల తర్వాత మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో.. పవన్ కళ్యాణ్ గారి వీరాభిమాని.. మాస్ డైరెక్టర్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. ఆ సినిమా గురించి రేపు సాయంత్రం నాలుగు గంటలా ఐదు నిమిషాలకు(04:05PM) ఒక వార్తను తెలపనున్నట్లు మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు.


తన సినీ జీవితంలో సంవత్సరానికి ఒక సినిమా చేస్తూ వచ్చారు…అలాంటిది,ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. మూడు సినిమాల విశేషాలు బయటకు వస్తుండటం.. అది కూడా బాగా గ్యాప్ తర్వాత కావడంతో ఆయన అభిమానులు రేపటి కోసం ఎదురు చూస్తున్నారు. ఒక పక్క ఇప్పటికే పుట్టిన రోజు డీపీ తోనే ప్రపంచ రికార్డ్ అందుకొని.. రేపు పుట్టినరోజుకు కానుకగా… 100 మిలియన్ ట్వీట్స్ వేసేందుకు సిద్ధపడిన కళ్యాణ్ గారి అభిమానులకు ఇలా 26,27,28 సినిమాల విశేషాలు వస్తున్నట్లు వార్తలు రావడంతో ఫుల్ “ఖుషీ”గా “జల్సా” చేస్తున్నారు..

పవన్ కళ్యాణ్ చెయ్యబోయే నాలుగు సినిమాలు ఇవే

పవన్ కళ్యాణ్ చెయ్యబోయే నాలుగు సినిమాలు ఇవేతమ్ముడు..తొలిప్రేమ..బద్రి..ఖుషి..జల్సా..గబ్బర్ సింగ్..అత్తారింటికి దారేది..వంటి సినిమాలతో బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినా చూపించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..ప్రజల కోసం ఏదో ఒకటి చెయ్యాలి అని నిత్యం తపించిపోయే ఆ పుస్తక ప్రియుడు..ప్రజల కోసం కెర్రీర్ పీక్స్ స్టేజ్ లో ఉన్న సమయంలో రాజకీయాల వైపు అడుగులు వేశారు..దింతో 2018 జనవరి నుండి వెండితెర పై ఆయన కనిపించలేదు..సంపూర్ణంగా సినిమాలు వదిలేసేందుకు సిద్ధపడిన జనసేనాని..తాను 2018కి ముందు ఇచ్చిన మాట కోసం తిరిగి మళ్ళీ సినీ రంగంలోకి అడుగు పెట్టారు..ఎప్పుడు లేని విధంగా తన పందాకు పూర్తి భిన్నంగా విరామం లేకుండా సినిమాల షూటింగ్స్ లో పాలుగున్నారు..నిజానికి అన్ని అనుకున్నట్లు జరిగితే ఈ సంవత్సరం మే నెలలో ఒక సినిమా.. డిసెంబర్ నెలలో లేదా వచ్చే సంక్రాంతికి మరో సినిమా..వచ్చే సంవత్సరం చివరి నాటికి మరో రెండు సినిమాలు విడుదల కావాలి..కానీ కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ కారణంగా మొత్తం అన్ని పనులు ఆగిపోయాయి..


పవన్ 26వ సినిమాగా హిందీ లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ చేసిన పింక్ సినిమా రీమేక్..దీనికి వకీల్ సాబ్ అని టైటిల్ ఖరారు చేశారు..ఇందులో లాయర్ గా కళ్యాణ్ గారు కనిపించనున్నారు..వేణు శ్రీరామ్ దర్శకుడు..థమన్ స్వరాలు అందిస్తున్నారు..బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు..శిరీష్ నిర్మిస్తున్నారు..ఇప్పటికే “మగువా..మగువా..”అనే పాట విడుదల చేశారు..చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ సినిమా ప్రభుత్వ అనుమతులతో జూన్ మొదటి వారం నుండి షూటింగ్ ప్రారంభించి..వీలైనంత త్వరగా పూర్తి చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది..


27వ సినిమాగా పవన్ కళ్యాణ్ గారికి ఖుషి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ఏ.ఎం.రత్నం గారు నిర్మిస్తున్నారు..వేదం..కంచె..వంటి క్లాసిక్ సినిమాలు చేసిన క్రిష్ జాగర్లమూడి..ఈ సినిమాకు దర్శకులు..ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని..షూటింగ్ ప్రారంభమైంది..అయితే కరోనా లాక్ డౌన్ తో సినిమా పనులు పూర్తిగా ఆగిపోయాయి..జులై రెండవ వారం నుండి సినిమా చిత్రీకరణలో పవన్ కళ్యాణ్ గారు చేరనున్నట్లు సమాచారం..వచ్చే వేసవిలో సినిమా మన ముందుకు వచ్చే అవకాశం ఉంది..ఇప్పటికే ఈ సినిమాకు వీరుపక్ష అనే టైటిల్ అనుకుంటున్నట్లు..ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారిది ఒక cow boy వంటి పాత్ర అని..ఔరంగ్ జెబ్ కాలంలో నాటి కధ అని. వార్తలు వస్తున్నా ఎక్కడా అధికారిక ప్రకటన లేదు..28వ సినిమా..ఒక అభిమాని..తన అభిమాన నటుడిని దర్శకత్వం చేసే అవకాశం వస్తే ఎలా ఉంటుందో.. గబ్బర్ సింగ్ సినిమా చూపించింది..పవర్ స్టార్ అభిమానులకు చాలా సంవత్సరాలు తర్వాత ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా..కళ్యాణ్ గారి వీరాభిమాని..హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాసింది..8 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ 28వ సినిమాకి హరీష్ శంకర్ దర్శకత్వం..దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నరు..మైత్రి మూవీ మేకర్స్ సినిమాను నిర్మిస్తున్నారు..గబ్బర్ సింగ్ టీం మళ్ళీ జత కట్టడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి..ఇప్పటికే హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ గారి అభిమానుల నుండి సామాజిక మాధ్యమంలో బ్లాక్ బస్టర్ హిట్ కావాలి అని విన్నపాలు అందుతున్నాయి..ఈ ఏడాది చివర్లో లేదా..వచ్చే సంవత్సరం ప్రారంభంలో సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది..ఇప్పటికే మరో సినిమా ప్రకటించిన హరీష్..ఈ సినిమా తర్వాతే మిగతావి అని కూడా ప్రకటించారు..ప్రసృతం..ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి..


29వ సినిమా..ఇప్పటికే పవన్ కళ్యాణ్ గారి తో గోపాల..గోపాల..కాటమరాయుడు..వంటి రెండు రీమేక్ సినిమాలకు దర్శకత్వం వహించిన డాలీ..ఈ సారి తానే స్వయంగా ఒక కథ సిద్ధం చేశారట..ఇప్పటికే లైన్ విని గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవర్ స్టార్..పూర్తి కథతో రావాలి అని కోరినట్లు సమాచారం..ఆ పనుల్లో నిమగ్నమయ్యారు డాలీ..మాస్ మహరాజ్ రవితేజ తో వరసగా రెండు సినిమాలు నిర్మించిన రామ్ తళ్లూరి ఈ సినిమాకు నిర్మాత..ఇప్పటికే ఆయనతో సినిమా చేసేందుకు పవన్ కళ్యణ్ గారు మాట ఇచ్చారట..కథ నచ్చితే డాలీ తోనే సినిమా సెట్స్ పైకి వెళ్తుంది..లేకుంటే దర్శకుడు మారే అవకాశం ఉంది..కానీ రామ్ తళ్లూరి నిర్మాతగా కొనసాగుతారు..ఇప్పటికైతే ఎలాంటి అధికారిక ప్రకటన వెలుపడలేదు..


ఇలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్..2021 చివరి దాక బిజీ..బిజీ..గా గడపనున్నారు..అయితే తన తొలి ప్రాధాన్యత ప్రజా సమస్యలని..ప్రజలకు అవరసరం అంటే తాను షూటింగ్ కు రాలేను అని..ఇప్పటికే నిర్మాతలతో స్పష్టం చేశారట..ప్రజల కోసం వెళ్తున్నారు కనుక దీనికి పూర్తిగా అంగీకరించారట..నిర్మాతలు…

‘పంచ్ డైలాగ్స్’ కి కేర్ ఆఫ్ అడ్రస్.. ‘మాస్ దర్శకులు’ ‘హరీష్ శంకర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.!

‘పంచ్ డైలాగ్స్’ కి కేర్ ఆఫ్ అడ్రస్.. ‘మాస్ దర్శకులు’ ‘హరీష్ శంకర్’ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు.!షాక్ తో పరిచయమై.. మిరపకాయతో భారీ విజయం అందుకొని.. గబ్బర్ సింగ్ తో స్టార్ దర్శకులలో ఒక్కటిగా చేరి.. రామయ్య వస్తావయ్యా.. సుప్రీమ్.. డి.జే.. గడ్డలకొండ గణేష్.. వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు అత్యంత చేరువైన నేటి తరం దర్శకులు హరీష్ శంకర్ గారి పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం.


ఎక్కడో ఇప్పటి తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ధర్మపూరి అనే ఊరిలో 1979 మార్చ్ 31న జన్మించాడు ఒక బాలుడు. ఆ కుర్రాడు సినిమాల పై అమితమైన ప్రేమ పెంచుకున్నాడు. చిన్నతనం నుండి సినిమాలు చేస్తూ పెరగడమే కాదు,నాటకాలు కూడా వేశాడు. కళ ఎంత గొప్పదో ఆ నాటక రంగం ఆ కుర్రాడికి తెలిపింది. హైదరాబాద్ కి దాదాపు 250కిలోమీటర్ల దూరంలో ఉన్నా,తాను సినిమా పరిశ్రమలో పని చెయ్యాలి అని భావించాడు. తనకు సినిమా మీద వున్న ప్రేమ ఆ 250కిలోమీటర్ల దూరం చాలా చిన్నదైపోయింది. హైదరాబాద్ వచ్చేశాడు,చదువు కూడా పూర్తి చేశాడు,తెలుగు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశాడు.తొలుత స్క్రిప్ట్ రైటర్ గా ప్రారంభించి,అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసి,ఆ తర్వాత తిరుగులేని మాస్ డైరెక్టర్ గా పేరు పొందిన ఆనాటి బాలుడు మరెవరో ఎవరో కాదు, ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ గారితో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక స్టార్ డైరెక్టర్ గా నిలిచిన ‘హరీష్ శంకర్’..!


పరిశ్రమకి వచ్చిన తొలి రోజుల్లో కోనా వెంకట్,పూరి జగన్నాథ్ లతో కలిసి పని చేశారు మన హరీష్ శంకర్. 2003లో కోన వెంకట్ స్టోరీ రైటర్ గా చేసిన సినిమా ‘నిన్నే ఇష్టపడ్డాను’ అనే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యాడు.2004లో ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చెయ్యడంతో ‘మాస్ రాజా రవితేజ’కు బాగా దగ్గరయ్యాడు. ఆ సన్నిహిత్యంతోనే ‘షాక్’ సినిమా కథ చెప్పాడు హరీష్.2005 లో ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ సినిమాకు కో-రైటర్ గా పని చేశాడు. రామ్ గోపాల్ వర్మ ప్రొడ్యూస్ చేయగా,కోనా వెంకట్ మాటలు రాయగా,రవితేజ నటించిన ‘షాక్’ సినిమాతో 2006లో హరీష్ శంకర్ దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అయ్యాడు. మరి ఎక్కడ ఏ లెక్క తప్పిందో కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది.


అంతటి ఆగలేదు హరీష్,తిరిగి కోనా వెంకట్ తో ‘చింతకాయల రవి’ సినిమాకి కో-రైటర్ గా చేశాడు,ఇదే సమయంలో పూరి దర్శకత్వం వహించిన ‘బుజ్జిగాడు’ సినిమాకి సైతం కో-రైటర్ గా పని చేశాడు.2009లో ‘కొంచం ఇష్టం కొంచం కష్టం’ సినిమాతో హరీష్ శంకర్ కో-రైటర్ గా వరసగా మూడు విజయాలు అందుకున్నాడు. దింతో మళ్ళీ కథ రాయడం మొదలు పెట్టాడు.ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలవాలి అనుకున్నాదేమో కాని,హరీష్ మళ్ళీ రవితేజకే కథ చెప్పి,ఒప్పించాడు.ఐదు సంవత్సరాలు తర్వాత 2011లో మరోసారి రవితేజతో ‘మిరపకాయ్’ అంటూ దర్శకుడిగా ప్రేక్షకుల ముందు వచ్చాడు. ఆ సినిమా రవితేజ కెర్రీర్ లో వన్ ఆఫ్ బెస్ట్ హిట్స్ లో నిలిచింది. అందులో రవితేజ క్యారెక్టర్ ఆనాటి యూత్ కి పిచ్చి పిచ్చి గా ఎక్కేసింది.ఈ సారి బండ్ల గణేష్ నిర్మిస్తున్న హిందీ ‘దబాంగ్’ రిమేక్ ను డైరెక్ట్ చేసే అవకాశం వచ్చింది.ఆ సినిమాలో హీరో తాను ఎంతో ఇష్టపడే ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’. దింతో హరీష్ ఎక్కడా తగ్గలేదు,దాదాపు 10 సంవత్సరాల నుండి సరైన హిట్ లేక అటు పవన్ కళ్యాణ్ ఫాన్స్ బాధలో వున్నారు,అప్పుడప్పుడే ‘జల్సా’తో సంబరాలు జరుపుకున్నా ఇంకా ఏదో వెలితి వారిలో ఉంది. సరిగ్గా అప్పుడే సినిమాలో ఒక డైలాగ్ బయటకు వచ్చింది. “నాకు కొంచెం తిక్కుంది,కానీ దానికో లెక్కుంది”ఈ ఒక్క మాట సినిమా పై అంచనాలు పెంచింది. మరోపక్క ‘దేవిశ్రీ ప్రసాద్’ అందించిన ఆడియో సూపర్ హిట్,ఆ వేడుకకు అన్నయ్యలు ‘మెగాస్టార్ చిరంజీవి’గారు,’నాగబాబు’గారు రావడం ఒక్క హైలైట్ అయితే,అక్కడ బండ్ల గణేష్ మాట్లాడిన స్పీచ్ ఆ నాటి వేడుకకు అతి పెద్ద హైలైట్. ఇలా అన్ని కలగలిసి సినిమా పై భారీ అంచనాలు పెరిగిపోయాయి. 2012 మే11న వచ్చిన ఆ సినిమా,తెలుగు చిత్ర పరిశ్రమలో అప్పటి వరకు ఉన్న అన్ని రికార్డ్స్ ని బద్దలు కొట్టేసింది. అభిమానులు పవన్ కళ్యాణ్ కట్ ఔట్ లను దాదాపు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఊరిలో మాత్రమే కాక దేశంలోని అన్ని ప్రధాన నగరాలలో కూడా ఊరేగించారు. ఆ సినిమాతో హరీష్ శంకర్ పవర్ స్టార్ అభిమానులకు ఇష్టమైన దర్శకుడిగా మారిపోయ్యాడు. చిత్ర పరిశ్రమలో స్టార్ డైరెక్టర్ హోదా అందుకున్నాడు.


అక్కడ నుండి మళ్ళీ వెనక్కి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది.2013లో ‘రామయ్య వస్తావయ్యా’ తో ‘తారక్’ తో కలిసి బాగా అలరించాడు,2015లో సాయి ధరమ్ ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ తో మెగా ఫాన్స్ కి మరింత దగ్గరవుతూ కమర్షియల్ హిట్ అందుకున్నాడు,2017లో బన్నీ తో కలిసి ‘డిజే’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు కి దగ్గరయ్యారు. 2019లో వచ్చిన ‘వాల్మీకి’ అదే ‘గద్దలకొండ గణేష్’ సినిమాతో మెగా హీరోల ఫేవరేట్ డైరెక్టర్ గా మారిపోయాడు. రీమేక్ సినిమా అయినా వరుణ్ తేజ్ లుక్స్ నుండి యాక్టింగ్ వరకు అన్ని ఆకట్టుకున్నాయి. ఆ సినిమా కూడా భారీ విజయం అందుకుంది.ఇప్పుడు మళ్లీ తిరిగి మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ లో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్’ తో సినిమా చేసేందుకు సిద్ధపడుతున్నారు. ఇక వేదికల పై ఆయన మైక్ తీసుకుంటే ఆయనను ఆపడం అసాధ్యం.. ఆయన స్పీచ్ లకు కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఇక ఆయన సినిమాలలో హీరోయిన్లను చూపించే తీరు వర్ణనాతీతం..!


సినిమా పై ప్రేమతో చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టడం,ఒక ప్లాప్ అందుకున్నా ఐదేళ్లు నిరీక్షించి మళ్ళీ అదే హీరోతో హిట్ కొట్టిన విధానం. వేదిక ఏదైనా సినిమా పట్ల తనకున్న ప్రేమను చెప్పడం. తాజాగా మధ అనే సినిమా ఎన్నో అవార్డ్స్ పొందింది కానీ విడుదలకు నోచుకోలేదు అని తెలిసి ఆ సినిమా విడుదలకు తనవంతు సహాయం అందించిన హరీష్ శంకర్ అభినందనియుడు.అంతేనా తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు పతకంలోని డబ్బులు తనకు అవసరం లేదు అని చెప్పి,ఆ ప్రభుత్వ డబ్బు అవసరం ఉన్న మరొక్కరికి అందించిన విశాల హృదయం కలవాడు హరీష్. ఇలా తనకు తెలిసిన వారికి ఎప్పుడు సహాయపడుతూనే ఉన్న హరీష్ శంకర్ మంచి మనసున్న వ్యక్తి. కృషి,పట్టుదల,ఇతరులకు సహాయపడే గుణం,ఓర్పు ఇలా నేటి తరం యువత తన నుండి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి.తన ప్రతి సినిమాను వర్ణిస్తూ రాయాలి అని వున్నా ఆర్టికల్ కాస్త పుస్తకమవుతుందేమో అని భయపడి ఆపేస్తున్న..


నేటితో 42 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ‘బిగ్ బి’ అభిమాని.. రవితేజ ఆప్తుడు.. పవర్ స్టార్ భక్తుడు..’మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్’ గారికి చిత్ర పరిశ్రమ తరుపున,ప్రేక్షకుల తరపున మరి ముఖ్యంగా ఆయన అభిమానుల తరపున.. మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.ఈ సందర్భంగా మరిన్ని విజయాలు అందుకోవాలని.. తెలుగు చిత్ర పరిశ్రమలో మరెన్నో మైలురాళ్లు అధిగమించాలి అని కోరుకుందాం.!

‘మధ’ సినిమా పై ప్రత్యేక కథనం

‘మధ’ సినిమా పై ప్రత్యేక కథనం


గత కొన్ని రోజులుగా మనం తరుచు సామాజిక మద్యమలలో వింటున్న సినిమా పెరు ‘మధ’.ఈ సినిమాకి ఇంత హైప్ ఎందుకో తెలియాలి అంటే పూర్తిగా ఈ ఆర్టికల్ ఒక్కసారి చదవాల్సిందే..!

తెలంగాణలోని మెదక్ లో జన్మించి,హైదరాబాద్ లో స్థిరపద్ద ఒక్క అమ్మాయి శ్రీ విద్య బసవ.2010-12 మధ్య సమయంలో యాడ్స్ షూట్ చేసుకుంటూ కాలం గడుపుతున్న విద్య సినిమాల పట్ల మక్కువతో ఒక కథ రాసుకుంది.కొన్ని సంవత్సరాలకు 2017లో ఆ కథను తన డబ్బులతో తీయాలి అని మొదలు పెట్టింది,అటు ప్రొడ్యూసర్ గా ఇటు దర్శకురాలిగా రెండు తానే చేస్తూ సినిమాను పూర్తి చేసింది.తన తల్లి ఇందిరా ప్రోత్సాహంతో ఆ కథ,’మధ’అనే సినిమాగా చిత్రీకరించుకుంది.

చిన్న సినిమాకు విడుదల ఎంత కష్టమో మన అందరికి బాగానే తెలుసు,కానీ తను తన సినిమాని ఎన్నో జాతీయ అంతర్జాతీయ సినిమా పోటీలకు పంపింది.గడిచిన రెండు సంవత్సరాలలో ఉత్తమ దర్శకురాలిగా ఎనిమిది,ఉత్తమ టెక్నిషియన్ గా ఏడు,ఉత్తమ సినిమాగా మూడు,ఉత్తమ నటిగా మూడు ఇలా 26 అవార్డులను మద సినిమా గెలుచుకుంది.మన తెలుగు సినిమా స్థాయిని మరోసారి ప్రపంచానికి ఎన్నో జాతీయ అంతర్జాతీయ వేదికలపై తెలిపిన సినిమా ‘మధ’.

ఈ సినిమా టీజర్ చూసిన దర్శకుడు హరీష్ శంకర్ ఆ చిత్ర బృందాన్ని అభినందించారు.ఆ తర్వాత ఆ సినిమా విడుదలకు ఇబ్బందులు పడుతుంది అని తెలుసుకున్న హరీష్ ఆ సినిమా విడుదలకు సహాయపడవాల్సిందిగా మహేష్ కొనేరును కోరారు,అంతటితో ఆగకుండా ఈ సినిమా ప్రచార బాధ్యతలను సైతం తానే తీసుకున్నారు.వీరిద్దరి సహృదయం వల్ల ఈ సినిమా ఈ నెల 13న మనందరి ముందరికి రానుంది.

ఈ ఇద్దరు మాత్రమే కాక మంచి సినిమాను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చి నటి రకుల్ ప్రీత్ సింగ్,మంచు లక్ష్మి,హీరో నవదీప్,దర్శకుడు నాగ అశ్విన్ తమదైన మాట సహాయం చేస్తున్నారు.మంచి సినిమా అని భావించి ఇలా ముందుకు వచ్చిన వీరందరూ అభినందనీయులు.

సినిమా ట్రైలర్ చూస్తే ఇది సైకలాజికల్ త్రిల్లెర్ అని అర్ధమవుతుంది.మన తెలుగు అమ్మాయి ‘మధ’తో జాతీయ,అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు పొంది,ఇప్పుడు మన ముందుకు వస్తుంది కనుకనే ఇంతటి హైప్,ఇంత బజ్ సినిమాకు వచ్చింది.ఈ శుక్రవారం (మార్చ్13న)మద మనందరి ముందుకు రానుంది.’మధ’సినిమాతో మరో మహిళా దర్శకులు తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం కానుంది.మంచి సినిమాను ఎప్పుడు ఆదరించే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఆదరిస్తారు అని కోరుకుందాం.

అలానే సినిమా టీజర్ నచ్చి సినిమాకు ఈ స్థాయిలో సహాయపద్ద దర్శకుడు హరీష్ శంకర్ గురించి తన మాటలలో “‘యాక్షన్’ అని చెప్పడానికి వచ్చి ‘కట్’చెప్పి వెళ్లిపోయే దర్శకుడు కాదు హరీష్,సినిమా పట్ల తన ప్రేమను,ఎదుటి వారికి సహాయ పడేందుకు ముందుకు వస్తూనే ఉంటాడు”.అందుకే తెలుగు చిత్ర పరిశ్రమలో “హరీష్ శంకర్ స్థాయి వేరు,తన స్థానం వేరు”.

శ్రీ విద్య బసవ,తన తల్లి ఇందిరా బసవ గారికి,నటించిన ట్రిష్ణ ముఖర్జీ,వెంకట రాహుల్,సినిమాటోగ్రఫీ అభిరాజ్ నైర్,సంగీత దర్శకుడు నరేష్ కుమారన్ కు విడుదల సందర్భంగా శుభాకాంక్షలు,శుభాశిస్సులు..!