19-04-2021 08:52:17 About Us Contact Us
నేడు మెగా స్టార్ అభిమాని నుండి నిర్మాత గా మారిన ఎస్.కె.ఎన్ పుట్టినరోజు.!

నేడు మెగా స్టార్ అభిమాని నుండి నిర్మాత గా మారిన ఎస్.కె.ఎన్ పుట్టినరోజు.!మెగాస్టార్ అభిమానిగా మొదలై..రివ్యూ రైటర్ గా మారి..సినిమా రిపోర్టర్ గా పని చేసి.. పి.ఆర్.ఓ గా పేరు తెచ్చుకొని..ఎక్సగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా..లైన్ ప్రొడ్యూసర్ గా..కో-ప్రొడ్యూసర్ గా చేసి..ఇప్పుడు నిర్మాతగా మారారు జి.శ్రీనివాస్ కుమార్..అందరికి తెలిసిన పేరు ఎస్.కె.ఎన్.. అలాంటి ఎస్.కె.ఎన్ పుట్టినరోజు నేడు.


శ్రీనివాస్ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు.చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని.చదువు తర్వాత ఏమవుతావు అని ఎవరైనా అడిగితే..చిరంజీవి గారి దగ్గరకు వెలిపోతా అనేంత అభిమానం.శ్రీనివాస్ కి ఆయన దగ్గర ఏమి చెయ్యాలో తెలియదు కానీ చిరంజీవి గారి దగ్గర ఉండాలి అనే ఆలోచన ఉండేది.సామాజిక మాధ్యమాలు కొత్తగా వచ్చిన రోజుల్లో..2000వ సంవత్సర సమయంలో మెగా అభిమానులకు ఆయన సినిమా సమాచారం ఇంటర్నెట్ లో దొరికింది అంటే అదే కచ్చితంగా ఎస్.కె.ఎన్ రాసిన ఆర్టికల్ ద్వారానే.అలా నాన్ స్టాప్ సినిమా అనే వెబ్సైట్ ప్రారంభించి సినిమా రివ్యూలు..సినిమా సమాచారం ఇవ్వడం ప్రారంభించారు.


అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కు..తను ఇంటర్నెట్ లో ఎలా పని చేస్తున్నారో గమనించి..మెగా అభిమానిగా తన తపనను గుర్తించి నిత్యం అందుబాటులో ఉండేవారు.బన్నీ గంగోత్రి సినిమా ప్రారంభం అవుతున్న సమయంలో మా అన్నయ్య సినిమాలో హీరోగా అవుతున్నారు.తనకు పిఆర్వో..మేనేజర్ కావాలి.నువ్వు ఏమి చేస్తావు అని అడగడం.శిరీష్ కి పిఆర్వో అని చెప్పి అప్పుడే 24 గంటల వార్త ఛానల్ గా ప్రారంభమైన టీవీ9లో సినిమా రిపోర్టర్ గా ఉద్యోగం ప్రారంభించారు ఎస్.కె.ఎన్.అలా ఏలూరులో మెగా అభిమాని హైదరాబాద్ లో రిపోర్టర్ గా మారారు.


2009లో చిరంజీవి గారితో రాజకీయాల్లోకి వెళ్ళి..తిరిగి సినిమా ప్రారంచంలోకి వచ్చేశారు.సినీ ప్రయాణంలో దర్శకుడు మారుతి..నిర్మాత బన్నీ వాసు..ఏలూరు శ్రీను..యూవీ క్రియేషన్స్ వంశీ..శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గార్లు మిత్రులుగా మారారు.వీరు గుంటూరు..వెస్ట్ గోడవరిలలో సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు.మారుతి దర్శకుడిగా చేసిన ఈ రోజుల్లో సినిమాతో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన ఎస్.కె.ఎన్..గీత ఆర్ట్స్ లో 100%లవ్ తో బన్నీ వాసుకు నిర్మాతగా అవకాశం రావడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో సినిమా నిర్మాత చెయ్యాల్సిన అన్ని విషయాలు తెలుసుకున్నారు.ఆ తర్వాత యూ.వి క్రయషన్స్ ప్రారంభించడంతో అందులో ఎక్సుగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు చేశారు.టాక్సీ వాలా తో నిర్మాతగా మారారు.రెస్ట్ ఐస్ హిస్టరీ..


మెగాస్టార్ మీద అభిమానం హైదరాబాద్ కు చేరిస్తే..సినిమా పట్ల ప్రేమ..తన కష్టం తనను నిర్మాత స్థాయికి చేర్చింది.ఎప్పుడు సినిమా..మెగాస్టార్..బన్నీ గురించి మాత్రమే మాట్లాడే శ్రీనివాస్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!

గీతా ఆర్ట్స్ 2 సారధి.. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పుట్టిన రోజు నేడు.!

గీతా ఆర్ట్స్ 2 సారధి.. ప్రముఖ నిర్మాత బన్నీ వాసు పుట్టిన రోజు నేడు.!2001లో కొంత కుటుంబ ఇబ్బందుల నుంచి బయట పడ్డ ఒక ఇరవై ఏళ్ళ పాలకొల్లు కుర్రాడు.. హైదరాబాద్ కు చేరాడు.. ఒక మిత్రుడి వల్ల మరో కుర్రాడు పరిచయమయ్యాడు.. అలా వారి మధ్య కొంత స్నేహ బంధం ఏర్పడింది.. ఆ తర్వాత ఒక్కసారి ఆ పట్నం కుర్రాడు.. నాతో కలిసి పని చేస్తావా.. నేను ఈ దారిలో వెళ్తున్నాను అని అడిగాడు.. సరే అని ఆ రోజు ఆ పట్నం కుర్రాడి వెంట అడుగులు వేసిన ఆ పాలకొల్లు కుర్రాడు.. 20ఏళ్ళ తర్వాత చూస్తే.. ఆ పాలకొల్లు కుర్రాడు ఒక పెద్ద నిర్మాత.. గీతా ఆర్ట్స్ 2 ను నడిపిస్తున్న సారధిగా మారారు.. అవును అతనే బన్నీ వాసు.. ఆ పట్నం మిత్రుడు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్.. వీరిని కలిపిన మిత్రుడు దర్శకులు మారుతి..


2002లో ఏదో యానిమేషన్స్ అంటూ హైదరాబాద్ లో ఒక కంపెనీ ప్రారంభించాడు వాసు.. దానికి ఆయనకు తెలిసిన మంచి అనిమేటర్ మారుతి.. మారుతి దగ్గరకు యానిమేషన్ నేర్చుకునేందుకు వచ్చాడు అల్లు అర్జున్.. అలా పరిచయమయ్యారు.. 2002లో వీరి పరిచయంతో గీతా ఆర్ట్స్ లో జాన్నీ సినిమా లోగో డిజైన్ కోసం పరిశ్రమలో అడుగు పెట్టిన వాసు.. బన్నీ కి బాగా దగ్గరయ్యారు.. ఆ తర్వాత 2003లో గంగోత్రి నుండి బన్నీ తో కలిసి ప్రయాణం కొనసాగించాడు.. కొద్దీ రోజులకు డిస్ట్రిబ్యూషన్ లో అడుగు పెట్టారు.. ఆ తర్వాత రోజుల్లో బన్నీ స్టార్ అవ్వడంతో అల్లు అరవింద్ కు సహాయం చేస్తూ గీతా ఆర్ట్స్ లో ఉండిపోయారు.. అసలు ప్రపంచం బన్నీ ని హీరోగా గుర్తించక ముందు తనను నమ్మి.. తన వెంట నడిచారు బన్నీ వాసు.. అందుకే బన్నీ కి వాసు అంటే బాగా ఇష్టం.. అలానే తనను పరిశ్రమకు పరిచయం చేసిన బన్నీ అంటే వాసు గారికి గౌరవం..ఒక దశాబ్దం పైగా అటు బన్నీ.. ఇటు అల్లు అరవింద్ గారితో కలిసి ప్రయాణించిన వాసు.. 2015లో గీతా ఆర్ట్స్ 2 తో నిర్మాతగా మారారు.. అది కూడా డిస్ట్రిబ్యూషన్ చేసే రోజుల్లో మిత్రుడైన వంశీ తో కలిసి భలే భలే మొగాడివోయ్ సినిమాను నిర్మించారు.. ఆ సినిమాకు మిత్రుడు మారుతి దర్శకులు.. ఆ తర్వాత గీతా గోవిందం.. టాక్సీవాల.. ప్రతి రోజు పండగే సినిమాలు నిర్మించారు.. ఇప్పుడు అఖిల్ తో కలిసి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్.. అనే సినిమా చేస్తున్నారు.. చిత్రకరణ దాదాపుగా పూర్తయ్యింది.. తాజాగా కార్తికేయతో చావు కబురు చల్లగా అనే సినిమా ప్రారంభించారు.. అలానే నిఖిల్ హీరోగా 18పేజీస్ అనే సినిమాను కూడా నిర్మిస్తున్నారు..


తన ఇరవై ఏళ్ళ సినీ జీవితంలో ఎన్నో గెలుపులు.. ఓటములు చూశారు.. ఎన్ని జరిగినా కష్టాని మాత్రం నమ్ముకున్నారు.. ఎన్నడు నేను ఒక స్థాయికి వచ్చాను కాబట్టి ఈ పని నేను చేయకూడదు.. అని ఆలోచన చెయ్యరు.. అందరికి తెలియడం వల్ల వచ్చే కష్టాలను నేను హీరోల వల్ల చూశాను.. అంటూ మీడియాకు దూరంగా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు బన్నీ వాసు.. పవన్ కళ్యాణ్ గారి కోసం పరిశ్రమ విషయాలు పక్కన పెట్టి మరీ రాజకీయంలో జనసేనకు తనకు కుదిరిన పనులు చేసి తిరిగి వచ్చారు వాసు.. ఇక బిగ్ బాస్ మెగాస్టార్ అంటే అమితమైన గౌరవం.. అలా మెగా కుటుంబంలో ఒక వ్యక్తిగా.. అల్లు అరవింద్ కు నలుగోవ కుమారుడిగా.. చిత్ర పరిశ్రమలో అందరికి ఆప్తుడిగా.. సాగుతున్నారు బన్నీ వాసు.. నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.. కష్టం.. సహనం తో ఈ స్థాయికి చేరిన బన్నీ వాసు గారు.. మరిన్ని పుట్టిన రోజులు జరుపుకోవాలి అని.. మరిన్ని హిట్ సినిమాలు మనకు అందించాలి అని కోరుకుందాం… బన్నీ వాసు గారికి మా బి.ఆర్. మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు..