22-04-2021 12:18:05 About Us Contact Us
నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!

నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!

Director Teja Birthday: శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ తో పాటు సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. చిత్రం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమవ్వడంతోనే భారీ విజయం నమోదు చేసుకున్న దర్శకులు.. జయం సినిమాతో అగ్ర దర్శకుల జాబితాలో చేరి.. నేనే రాజు.. నేనే మంత్రి.. సీత వంటి వరస విజయాలతో ఊపు మీద ఉన్న ఎందరో నటీనటులను పరిశ్రమకు పరిచయం చెయ్యడమే కాక.. తన సినిమాల్లో నటించే నటీనటులకు బాగా నటన నేర్పిస్తారని పేరు గడించిన తేజ గారి పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ప్రత్యేక కథనం..


దర్శకుడి తేజ బాల్యం అంతా మద్రాస్ లోనే గడిచింది. తన తండ్రి తిరుమల తిరుపతి దేవస్థానంలో తలనీలాలు తీసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేవారు,అలాగే వాళ్ళకి టెక్సటైల్ వ్యాపారం కూడా ఉండేది. మద్రాస్ లోని తొలి 10 సంపన్నుల కుటుంబాలలో తేజ గారి ఫ్యామిలీ కూడా ఒకటి. తేజ మద్రాస్ లోని గురుకుల పాఠశాలలో విద్యాబ్యాసం చేశారు. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈయనకి సూపర్ సీనియర్. పాండి బజార్ వెళ్లి సినిమావకాశాల కోసం ప్రయత్నాలు చేసే వారు.. అలా ప్రయత్నలలో భాగంగా కెమరామెన్ రవి కన్నా దగ్గర అసిస్టెంట్ గా చేరి కెమెరా వర్క్ లో మెలకువలు నేర్చుకున్నారు.


అలా అక్కడ రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడింది. దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మ కు నాగార్జున తో శివ సినిమాలో అవకాశం వచ్చింది. ఆ సినిమాకి కెమెరామెన్ గా తేజకి అవకాశం ఇద్దాం అనుకున్నాడు.. కానీ ప్రొడ్యూసర్ కొత్త వాళ్ళు ఒద్దనడంతో ఆ అవకాశం చెయ్యి జారిపోయింది. బయట వాళ్లు సినిమాలు చేస్తే తనకి నచ్చిన టెక్నీషియన్స్ ని పెట్టుకోవడం కుదరడం లేదని.. తనే ఒక బ్యానర్ స్థాపించి రాత్రి అనే చిత్రం తీశారు అందులో తేజ కెమరామెన్. కెమెరామెన్ గా తేజ వర్క్ నచ్చి.. తరువాత తీసిన మనీ చిత్రానికి కూడా తేజ గారినే తీసుకున్నారు ఆర్.జి.వి.


తేజ బాలీవుడ్ లో బిజీ అయిపోయాడు.. తన బాలీవుడ్ చిత్రాలు అన్ని షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరిగేలా చూసుకునేవారు.. తన ఇంటికి సౌలభ్యంగా ఉంటుందని. అది తెలుసుకున్న రామోజీ రావు గారు తేజతో మాట్లాడి కథ ఉంటే చెప్పామన్నారు.. తను ‘చిత్రం’ కథ చెప్పారు.. 40లక్షల బడ్జెట్ లో సినిమా పూర్తి చేశారు. ఆ చిత్రం బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది తరువాత నితిన్ కథనాయకుడిగా జయం, నవదీప్ తో జై.. సూపర్ స్టార్ మహేష్ తో నిజం.. ఇలా 13 ఏళ్ళ సినీ జీవితంలో 13 చిత్రాలు తీశారు తేజ.


వరస విజయాలతో జోరు మీద ఉన్న తేజ.. తనకి భారీ విజయాన్ని అందించిన చిత్రంకి కొనసాగింపుగా చిత్రం1.1 ని తెరకేక్కిస్తున్నారు. ఇప్పటి మన స్టార్ హీరోలకి కెరీర్ ప్రారంభంలో మంచి విజయాలు అందించిన తేజ గారు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని బి.ఆర్.మూవీ జోన్ తరపున కోరుకుంటున్నాం.


ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి