11-04-2021 05:39:38 About Us Contact Us
“మెగా ప్రిన్ సెస్” “సూర్యకాంతం” “నిహారిక కొణిదెల” పుట్టిన రోజు ప్రత్యేకం.!

“మెగా ప్రిన్ సెస్” “సూర్యకాంతం” “నిహారిక కొణిదెల” పుట్టిన రోజు ప్రత్యేకం.!



బుల్లి తెర పై యాంకర్ గా పరిచయమై.. వెబ్ సిరీస్ తో సామాజిక మాధ్యమం లో భారీ విజయం సాధించి.. వెండితెర పై నటించి.. తన ప్రతిభ తో తెరపై.. తన చలాకీతనం తో బుల్లి తెరపై.. గడించిన ఆరున్నర సంవత్సరాలుగా అటు పిల్లలు నుండి ఇటు పెద్దల వరకు బాగా చేరువైన తెలుగమ్మాయి.. కొత్త పెళ్ళి కూతురు.. మెగా ప్రిన్ సెస్ కొణిదెల నిహారిక.అలాంటి నిహారిక.. నేడు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా ఈ ప్రత్యేక కథనం.


మెగా కుటుంబం నుండి అప్పటికే అనేకమంది హీరోలు తెరంగేట్రం చేశారు… కానీ.. తొలిసారి ఒక్క అమ్మాయి 2014 మార్చ్ 19న బుల్లి తెర పై డాన్స్ షో లో వ్యాఖ్యాతగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఆమె.. మెగా బ్రదర్ నాగబాబు గారి గారాల పట్టి.. నిహారిక కొణిదెల. అచ్చ తెలుగులో.. గల..గలా మాట్లాడుతూ..పిల్లల షో అయినప్పటికీ.. యాంకరింగ్ తొలి సారి చేస్తున్నప్పటికీ.. తన మాటలతో.. తన అల్లరి చేష్టలతో.. షో ని చాలా బాగా నడిపించారు.అలా రెండవ సీజన్ ముగిసే సమయానికి.. మంచి హోస్ట్ గా పేరు సంపాదించుకున్నారు నిహారిక.అటు పిల్లలకు.. ఇటు పెద్దలకు బాగా దగ్గరయ్యారు.అక్కడితో ఆగలేదు.. వెబ్ సిరీస్ అంటూ యువతను సైతం తన వైపు తిప్పుకున్నారు.


2015 లో యూట్యూబ్ లో తనకంటూ ఒక ఛానల్ ప్రారంభించదమే కాకుండా.. పింక్ ఎలిఫెంట్ అనే నిర్మాణ సంస్థ ను ప్రారంభించారు.తాను నిర్మించిన తొలి వెబ్ సిరీస్ “ముద్ద పప్పు.. ఆవకాయ..” లో హీరోయిన్ గా నటించారు. తెలుగులో యూట్యూబ్ కేంద్రంగా భారీ విజయం అందుకున్న తొలి వెబ్ సిరీస్ గా ముద్దపప్పు ఆవకాయ పేరు గడిచింది.అప్పటి వరకు తెలుగులో లఘు చిత్రాలు మాత్రమే వచ్చేవి.. ఆ విజయంతో వెబ్ సిరీస్ లు ప్రారంభమయ్యాయి.ఇలా సామాజిక మాధ్యమ చరిత్రలో చెరిగిపోని రికార్డులను తన పేరిట లిఖించారు నిహారిక.నటిగా వెండితెర వైపు అడుగులు వేసిన నిహారిక తన సంస్థలో రెండవ వెబ్ సిరీస్ గా.. తండ్రి నాగబాబు గారితో కలిసి “నాన్న కూచి” లో నటించారు. తాజాగా మ్యాడ్ హౌస్ అనే వెబ్ సిరీస్ ని నిర్మిస్తున్నారు..తన నిర్మాణ సంస్థ ద్వారా.. ఇలా కొత్త వారికి అవకాశం కల్పిస్తూన్నారు.



ఇంతటితో సంతృప్తి చెందలేదు నిహారిక.. అప్పటికే పలు సినీ కుటుంబాలకు చెందిన అమ్మాయిలు వెండితెర పై నటించాలని ముందుకు వచ్చినా.. కొందరికి సాధ్యపడలేదు.. మరి కొందరు కేవలం ఒక సినిమా తో ఆగిపోయారు.అలా అనేక సినీ కుటుంబాల నుండి ప్రయత్నించి వదిలేసిన ఆ వెండితెర పై “ఒక మనసు” సినిమా తో మెగా ప్రిన్ సెస్ గా అడుగు పెట్టడమే కాక.. “సూర్యకాంతం”గా విజయాలు సాధించారు.నటిగా విమర్శకుల ప్రశంసలు పొందారు.తమిళంలో సైతం నటించారు.. విజయ్ సెట్టుపతి గారి సినిమాలో తన నటనకు అక్కడా మంచి పేరు లభించింది.. “మెగాస్టార్ చిరంజీవి” గారి ప్రతిష్టాత్మక చిత్రం “సైరా..నర్సింహ రెడ్డి” సినిమాలో పాత్ర దక్కించుకోవడమే కాక.. ఉన్నది కాసేపైనా.. సినిమాలో తన మార్క్ ను విడిచారు.. ప్రక్షకుల నుండి కితాబులు పొందారు.అలా తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక పేజీని రాసేసుకున్నారు నిహారిక.


వ్యక్తిగతంగా తాను ఎప్పుడు.. మెగా కుటుంబం నుండి వచ్చిన కొణిదెల నిహారిక లా ఉండేందుకు ఇష్టపడలేదు. పరిశ్రమకు వచ్చిన ఒక తెలుగు అమ్మాయిగా.. నిహారికగా మెలిగారు.అది బలి తెర షో సెట్ లోనైనా.. వెబ్ సిరీస్ చిత్రీకరణలో ఐనా.. సినిమా షూటింగ్ అయినా.. లేదా ఏదైనా సినీ వేడుకలోనైనా.. ఆమె అందరినీ అలరించడమే చూశాము తప్ప.. ఎక్కడా గర్వం.. అహం తన దగ్గర కనపడలేదు.అనేక సందర్భాలలో అతి దగ్గర నుండి చూసిన నేను..ఇటీవల జరిగిన రెండు సంఘటలు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను.



లాక్ డౌన్ తర్వాత నాగబాబు గారు ప్రారంభించిన షో.. “ఖుషి ఖుషిగా”.. ఒక రోజు ఆ సెట్ కి వెళ్ళాను.అక్కడ నిహారిక గారు సైతం ఉన్నారు.షాట్ గ్యాప్ లో నాగబాబు గారు తన వ్యక్తిగత సిబ్బందిలో ఎవరినో అరిచారు.. దాంతో సెట్ అంతా నిశ్శబ్దంగా మారిపోయింది.అది గమనించిన నిహారిక వెంటనే తండ్రిని అరవద్దు అని చిన్నగా చెప్పారు.. తానే ఒక జోక్ వేసి మళ్ళీ తిరిగి సెట్ ని నవ్వించింది.తరవాత నాగబాబు గారు సైతం అరేయ్ మీరంతా ఇలా బయపడితే ఎలా.. నేను ఏదో.. వేరే గోలలో వున్నాను అని అన్నారు.అలానే ఇటీవల నిహారిక గారి రిసెప్షన్ వేడుక జరిగింది.వేడుక అనంతరం.. తన భారీ దుస్తుల కారణంగా కార్ ఎక్కేందుకు చాలా కష్టపడుతున్నారు.. ఆ సమయంలో అక్కడ ఒక అత్యుత్సాహుడు ఫోటో దిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.. అది చూసిన నిహారిక..”బ్రదర్.. నేను ఏం చేస్తున్నా.. నువ్వేం చేస్తున్నావు”అని అన్నారు.వెంటనే అక్కడ వారు ఆ అబ్బాయిని పక్కకు లాగారు.కానీ.. లోపల కూర్చున్న తర్వాత సదరు కుర్రాడికి సెల్ఫీ ఇచ్చి వెళ్లారు.ఇలా అనేక సినిమా వేడుకలలో నిహారిక ప్రవర్తన చూసి నేను ఆశ్చర్యానికి లోనైనవి కోకొల్లలు.


చిన్నతనంలోనే యాంకరింగ్ చేసి సొంతగా సంపాదించడం ప్రారంభించిన నిహారిక.. ఈ ఆరున్నర సంవత్సరాలలో ఆమె వేసిన ప్రతి అడుగు.. నేటి తరం అమ్మాయిలకు స్ఫూర్తి దాయకం.ముఖ్యంగా సినిమా రంగం వైపు అడుగు వేసే అమ్మాయిలకు ఆమె ఒక రోల్ మోడల్.కొత్త జీవితం ప్రారంభించిన నిహారిక గారికి శుభాకాంశాలు తెలుపుకుంటూ.. ఇలా ఎప్పుడు ఎనర్జీ తో అందరినీ అలరించాలని.. సినిమా రంగంలో నటిగానో.. యాంకర్ గానో.. నిర్మాతగానో.. మళ్ళీ తనదైన ఎంట్రీ ఇవ్వాలని.. కొత్త ప్రతిభను తన నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చెయ్యాలని కోరుకుంటు.. మా బి.ఆర్.మూవీ జోన్ తరపున.. మెగాభిమానుల తరపున.. పుట్టిన రోజు శుభాకాంక్షలు.!

హీరోల పరువు తీస్తున్న కొందరు అభిమానులు..!

హీరోల పరువు తీస్తున్న కొందరు అభిమానులు..!



అవును నిజమే.. అభిమానులు లేనిదే హీరోలు లేరు.. ఎంతమంది అభిమానులు ఉంటే ఆ హీరోకి అంత ఎక్కువ పారితోషకం వస్తుంది.. అలానే సినిమాను ఎంత ఎక్కువ మంది చూస్తే.. అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు ప్రేక్షకులకు మర్యాద ఇచ్చింది.. వారిని ప్రేక్షక దేవుళ్ళు అని సంభోదించింది.. అలానే పిలుస్తూనే ఉంటుంది.. అలానే హీరోలు సైతం ఎప్పుడు వారి అభిమానులు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు.. హీరో ను కలిసేందుకు సెట్స్ కి అభిమానులు వస్తే.. వారికి భోజనాలు సైతం ఏర్పాటు చేస్తుంటారు.. ఇక్కడ డబ్బుకు మించిన ప్రేమ అభిమానిది అయితే.. మేము తింటున్న భోజనం వీరి వల్లనే అనే కృతజ్ఞత ఆ సగటు సినిమా వారిది.. అందుకే హీరోలకు అభిమానులు పట్ల గౌరవం.. బాధ్యత ఉంటాయి..


తన అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది అనగానే డబ్బులు లేకున్నా కట్ ఔట్ లకి పాలభిషేకాలు.. పూలమాలలు.. ర్యాలీలు చేస్తుంటారు.. తొలి రోజు తొలి ఆటకి అభిమాని సినిమా హాల్ ని ఒక కల్యాణ మండపంలా మారుస్తుంటారు.. అప్పట్లో కొందరు అభిమానులు పంతానికి పోయి.. రికార్డుల కోసం.. అప్పు చేసి మరీ సినిమాను.. థియేటర్ లో ఆడిస్తే.. ఆ తర్వాత అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ నింద సగటు హీరో పైకి వచ్చేది.. అలా చేయమని హీరో ఎక్కడా చెప్పారు.. కానీ అభిమానం పేరుతో కొందరు చేసి.. హీరోని మానసికంగా బాధ పెట్టిన సంఘటనలు మనకు తెలియనివి కావు..


ఆ తర్వాతి రోజుల్లో అభిమానం సేవపైకి మళ్ళింది.. ఏ హీరో పుట్టినరోజుకి.. లేక సినిమా విడుదల రోజుకి.. ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తారు అనే పోటీ నెలకొనింది.. ఇది నచ్చిన చాలా మంది వ్యాపార వేత్తలు.. డబ్బు ఉన్న అభిమానులు.. వీరికి ఆర్థికంగా సహాయం చేయడంతో సేవా కార్యక్రమాలు బాగా జోరందుకున్నాయి.. అవి తెలుసుకొని హీరోలు సైతం గర్వంగా మా అభినులు గొప్ప అనే స్థాయికి చేరారు..కానీ .. ఇప్పుడు తరం మారింది.. కొత్త ట్రెండ్ వచ్చింది.. సామాజిక మద్యామాలలో అదే అభిమానులలో కొందరు ఆ హీరో పరువు తీస్తున్నారు..


పుట్టిన రోజు.. లేదా సినిమాకు సంబంధించిన ట్రెండ్ సామాజిక మాధ్యమాలలో జరగడం సర్వ సాధారణం అయిపోయింది.. ఇప్పుడు దానినే పరువుగా భావిస్తున్న కొందరు ఆ ట్రెండ్ ల కోసం ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చెయ్యడం ప్రారంభించారు.. పిచ్చి బాగా ముదిరిన మరికొందరు.. ఏకంగా యంత్రాలను సైతం రంగంలోకి దించారు.. డబ్బులు ఇచ్చి బోట్స్ అని పిలిచే వాటితో ట్రెండ్స్ లో పాలుగోనడం మొదలు పెట్టారు.. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ సమయంలో అవి ఇలా చేస్తున్నారు అని వేరే హీరోల అభిమానుల బయట పెట్టడం.. దింతో నిజంగా అభిమానించి ట్రెండ్ చేసిన అభిమానులు నిరుత్సాహ పడిపోతుంటే.. హీరో పరువు అక్కడ పోయింది.. దీనికి కారణం ఆ కొందరు అభిమానులే కదా..


సామాజిక మాద్యామాలలో ద్వారా అభిమానులకు.. ప్రేక్షకులకు.. దగ్గరైయే ప్రయత్నం చిత్ర పరిశ్రమలో వారు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే లైవ్ లు అంటూ.. ప్రశ్నించండి(ask) అంటూ సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.. అయితే వెంటనే కొందరు అభిమానాలు.. ఒక ముక్కలో అంటూ.. సగటు హీరో పేరు అడుగుతున్నారు.. వారి గురించి చెప్పడానికి.. లేక వారి గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వస్తున్న ప్రతి సినీ సెలెబ్రిటీకి ఇదొక తల నొప్పిగా మారింది.. కేవలం హీరోల గురించి మాత్రమే చెప్పేందుకు హీరోయిన్లు.. కమిడియన్స్.. సహా నటులు.. దర్శక.. నిర్మాతలు.. సంగీత దర్శకులు.. సింగర్స్.. రైటర్స్.. సోషల్ మెడియాలోకి రావాలా..?? ఇదే అసహనం అనేక మంది అనేక సార్లు నాతోనే స్వయంగా చెప్పుకొచ్చారు.. ఒకవేళ వారి గురించి చెప్పకపోయినా.. తెలియదు అని చెప్పినా.. లేకుంటే ఈ ఇద్దరిలో ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఒక హీరో పేరు చెప్పినా.. ఇక అంతే.. అదేంతో ఒక్కసారిగా అనేక అకౌంట్స్ నుండి దండ యాత్ర మొదలేదుతారు.. అసభ్య పదజాలంతో చదివేందుకు కూడా మనం ఇష్టపడలేనటు వంటి పదాలు వాడుతారు.. ఇక్కడ ఏ హీరో ఎవరిని అడగలేదు.. మా గురించి ప్రతి ఒక్కరిని అడగమని.. కానీ వీరే అడిగి.. వీరే రచ్చ చెయ్యడం మొదలు పెడతారు.. దింతో కొన్ని సార్లు.. సగటు హీరోకి ఆ సెగ తగులుతుంది.. ఏదో షో లో ఎక్కడో ఒక హీరోపై ఒక్కలు చేసిన చిన్న వ్యాఖ్యను పట్టుకొని రాదంతం చేస్తారు.. చివరకు.. ఏ మాత్రం ప్రతిభ లేకుండా పట్టుమని పది మందికి తెలియని వారు కూడా.. కేవలం కొందరు అభిమానుల అత్యుత్సాహం వల్ల సెలబ్రిటీగా ఇప్పుడు చలామణి అవుతున్నారు.. హీరోలు సైతం ఈ అభిమానులను ఎలా అదుపు చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంటే.. నిజమైన అభిమానులు బాధ పడుతున్నారు..


అందుకే అంటున్నా కొందరి అభిమానుల వల్ల హీరోల పరువు పోతుంది..

“‘రంగస్థల’ ‘మగధీరుడు'” “చరణ్” ‘రామరాజు’ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!

“‘రంగస్థల’ ‘మగధీరుడు'” “చరణ్” ‘రామరాజు’ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!


నేడు ‘ప్రపంచ రంగస్థలదినోత్సవం’,అలాంటి ఈ రోజున సరిగ్గా 35 సంవత్సరాల క్రితం,అంటే 1985,మార్చ్27న మద్రాస్ లో ‘పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి’,’సురేఖ’ గార్ల దంపతులకు ఒక్క మగ బిడ్డ జన్మించాడు,చెన్నైలోనే తన విద్యాభ్యాసం ప్రారంభించి,ఊటీలో చదువు పూర్తి చేశాడు.ఆ తర్వాత 2007లో యువకులందరిలానే తన తండ్రి,బాబాయిలు ఉన్న రంగంలో అడుగు పెట్టాడు.అప్పుడే తెలుగువారికి ఆ పేరు తెలిసింది,నాటి నుండి నేటి వారకు ఆ పేరు ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వారి నోట వినిపిస్తూనే ఉంది.అతనే 2007లో ‘చిరుత’ సినిమాతో తెరంగేట్రం చేసి,రెండవ సినిమాకే దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ‘మగధీరుడు’,’కొణిదెల’ వంశ వారసుడు,’మెగా పవర్ స్టార్ రామ్ చరణ్’.

అది 2007వ సంవత్సరం,అప్పటికే రెండు దశాబ్దాల నుండి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కటవ స్థానం పై కూర్చున ‘అన్నయ్య’ ‘ఇంద్రసేనుడు చిరంజీవి’ ఒక పక్క,దశాబ్దం నుండి ‘తొలిప్రేమ’,’బద్రి’,’ఖుషి’ వంటి సినిమాలతో యావత్తు తెలుగు నాట ఉన్న యువతను ఉర్రుతలు ఊగిస్తున్న ‘తమ్ముడు’ ‘పవన్ కళ్యాణ్’ మరో పక్క.మధ్యలో అర్దదశాబ్దం క్రితం వచ్చి ‘ఆర్య’,’హ్యాపీ’ అంటూ హిట్లు కొడుతు ఆ సంవత్సరంలో ‘దేశముదురు’ అంటూ పెద్ద హిట్ అందుకున్న ‘బన్నీ’.ఇటువంటి మెగా కుటుంభం నుండి వారసుడు వస్తున్నాడు అనగానే.!చిరంజీవి,బన్నీలలా డాన్సులు వెయ్యగలడా?పవన్ కళ్యాణ్ లా మ్యానరిజం ఉంటుందా అంటూ అనేక ప్రశ్నలు.తొలి సినిమా ‘చిరుత’ తో జవాబు ఇచ్చాడు ‘రామ్ చరణ్ తేజ్’.డాన్స్,ఫైట్స్ అదిరిపోయాయి,ఇక పూరి జగన్నాథ్ క్యారెక్టర్ కనుక అందరికి ఎక్కేసింది,ఎంతలా అంటే చిన్న పిల్లాడు కూడా సినిమా నుంచి బయటకు వస్తు ,అడివి నాదే,వేటా నాదే, చిరుతా..,’ అని అరిచేంతలా..!

అంతలో 2008లో మెగాస్టార్ చిరంజీవి సినీ రంగంలోని సింహాసనం వీడి రాజకీయాల్లోకి వెళ్లిపోయారు.ఆ సంవత్సరం చరణ్ నుండి ఒక్క సినిమా కూడా రాలేదు.మళ్ళీ చరణ్ 2009 జులై 31న రాజమౌళి దర్శకత్వంలో ‘మగధీర’ అనే భారీ బడ్జెట్ సినిమాతో వచ్చాడు.ఈ సారి రెండు పాత్రలతో తెలుగు చిత్ర పరిశ్రమకు గుర్తుండిపోయే హిట్ కొట్టాడు,దేశం మొత్తం ‘మగధీర’ ప్రకంపనలు సృష్టించింది. యాక్టింగ్,డాన్స్,ఫైట్స్,గుర్రపు సవారీ,ఇలా ఒక్కటి ఏంటి అన్ని రంగాల్లో చరణ్ శభాష్ అనిపించాడు.మావయ్య అల్లు అరవింద్ కు కాసుల వర్షం కురిపించింది.ఆ తర్వాత గీతా ఆర్ట్స్ ఆ సినిమాను రెండు సంవత్సరాలకి అంటే 2011లో తమిళం,మాలయంలో కూడా విడుదల చేశారు.అన్నయ్య చిరంజీవి కి సినీ వారసుడు అంటూ,అన్నయ్య సినిమాలు లేని లోటును భర్తీ చేసేందుకే వచ్చాడు అంటూ మెగాభిమానులు సంబరాలు జరుపుకున్నారు.

అంత పెద్ద సినిమా తర్వాత చరణ్ ‘ఆరంజ్’ లాంటి ఒక లవ్ స్టోరీలో చక్కగా ఒదిగిపోయాడు.ఆరంజ్ సినిమా పాటలు ఇప్పటికీ మనం వింటూనే ఉంటాం,ఇక ఆ సినిమాతో చరణ్ లవర్ బాయ్ గా మారిపోయాడు,అమ్మాయిలకు చరణ్ అంటే ఎంత పిచ్చో సామాజిక మాధ్యమాలు చూస్తే తెలుస్తుంది.,.వెంటనే పక్క కమర్షియల్ ఎలెమెంట్స్ తో ‘రచ్చ’ సినిమా చేసి బాక్స్ ఆఫీస్ ని ‘రచ్చ రచ్చ’ చేశాడు.’నాయక్’,’ఎవడు’,’బ్రూస్ లీ’,’ధ్రువ’ వంటి సినిమాలతో మాస్ ప్రేక్షకులకు కి బాగా దగ్గరయ్యాడు చరణ్.మధ్యలో ‘జంజీర్’ తో హిందీలో కూడా ఒక సినిమా చేశాడు,’గోవిందుడు అందరివాడే’ అనే సినిమాతో ఫామిలీ ఆడియాన్స్ కి చేరువయ్యాడు.అటు మాస్ ఇటు క్లాస్ సినిమాలతో హిట్స్ అందుకున్న చరణ్ స్టార్ హీరోగా ఎడిగిపోయాడు.చిరంజీవి కొడుకు అనే స్థాయి నుండి చరణ్ తండ్రి అని నేటి తరం చెప్పుకునే స్థాయికి వచ్చాడు.తన కంటూ ప్రత్యేక అభిమానులను పొందారు.

సినిమాలు హిట్లు కొడుతున్నా ఎక్కడో మెగాభిమానులకు తృప్తి లేదు,ఇవేవీ చరణ్ స్థాయి హిట్స్ కాదు అనేది వారి అభిప్రాయం,సరిగ్గా అప్పుడే సుకుమార్ తో కలిసి రంగస్థలం చేశాడు.పక్కా పల్లెటూరి కథ,అందులోనూ హీరో కి వినపడదు,సాధారణంగా స్టార్ హీరోలు ఇలాంటి సినిమాలు చేయడానికి ఆలోచిస్తారు,అయినా కథ పట్ల సుకుమార్ పట్ల నమ్మకంతో ముందుకు అడుగేశాడు చరణ్.ఈ సినిమా మొత్తం తెలుగు సినిమా వసూళ్ల లెక్కలు మరోసారి మార్చేసింది.నాడు మగధీర,నేడు రంగస్థలంతో తెలుగు సినిమా మార్కెట్ ని మరో మెట్టు ఎక్కించాడు చరణ్.తన నటనకి అటు పరిశ్రమ ఇటు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపించారు.ఇప్పుడు మళ్లీ రాజమౌళి దర్శకత్వంలో ‘యంగ్ టైగర్’ ‘జూనియర్ ఎన్టీఆర్’ తో కలిసి ‘ఆర్.ఆర్.ఆర్’ తో 2021 సంక్రాంతికి రానున్నాడు.

తండ్రి కోసం కొత్త అవతారం:-

తన తండ్రి రాజకీయాల్లోకి వెళ్తే ఒక సినిమా మాత్రమే చేసిన చరణ్,తన తండ్రి కోసం సినీ భవిషత్తు గురించి ఆలోచించకుండా ప్రచారంలో తన వంతు బాధ్యత నిర్వర్తించాడు.తిరిగి తన తండ్రి దాదాపు దశాబ్దం తర్వాత సినిమాల్లోకి వస్తుంటే,ప్రేక్షకులు ఎలా తీసుకుంటారో అనే ఆలోచన లేకుండా తానే ప్రొడ్యూసర్ అవతారం ఎట్టి ‘ఖైదీ 150’ చేశాడు.తండ్రికి మర్చిపోలేని బహుమతి ఇవ్వాలి అని తలచి,150 సినిమాలు చేసిన చిరంజీవికి నచ్చిన పాత్ర నరసింహారెడ్డి కథను భారీ తారాగణంతో ఖర్చుకు వెనకాడకుండా,లాభమా,నష్టమా అని లెక్కలు వెయ్యకుండా ‘సైరా’ అంటూ దేశ స్థాయి సినిమా నిర్మించాడు.ఇక తండ్రి కొడుకులు కలిసి ‘మగధీర’,’ఖైదీ 150′,’బ్రూస్ లీ’ లలోని కొన్ని నిమిషాలు మాత్రమే కనిపించినా చూసేందుకు చాలా బాగుంది.వీరిద్దరి కలిసి చేసిన డాన్స్,హార్స్ రైడ్ ఎప్పటికి మరువలేనిది.

బాబాయ్ కి తోడుగా:-

చరణ్,పవన్ కళ్యాణ్ మధ్య ప్రేమ బాబాయ్,అబ్బాయి కంటే అన్నా,తమ్ముడులా కనిపిస్తూ ఉంటుంది.మగధీర కోసం వీరిద్దరూ చేసిన ఇంటర్వ్యూలో వీరి మధ్య బంధం ఎలాంటిదో అర్ధమవుతుంది,అలానే రంగస్థలం హిట్ ని పవన్ కళ్యాణ్ ఎంత గర్వపద్దాదో మనకు తెలిసిందే.ఇక ‘నాయక్’ ఆడియో విడుదల కార్యక్రమంలో “బాబాయ్ దగ్గరకు వెళ్ళాలి అంటే ముందు నన్ను దాటాలి” అంటూ చరణ్ ఫైర్ అవ్వడం నాడు టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది.బాబాయ్ రాజకీయ ప్రచారంలో అస్వస్థ అంటే హుటాహుటిన విజయవాడలో ప్రత్యక్షమయ్యాడు చరణ్.తిట్లీ బాధితులను అడుకోమని చరణ్ కి మీడియా ముఖంగా జనసేనాని అభ్యర్దించగా శ్రీకాకుళంలో కొన్ని గ్రామాలను దత్తతు తీసుకున్నాడు,నిన్న తాజాగా కళ్యాణ్ కరోనా బాధితుల కొరకు 2కోట్లు అంటే బాబాయ్ స్పూర్తితో నేను అంటూ 70 లక్షలు ప్రకటించాడు.

వ్యాపారం,సహాయం:-

మిత్రురాలు,ప్రేయసి,భార్య ఉపాసన తో కలిసి వ్యాపారవేత్తగా కూడా చరణ్ రాణిస్తున్నారు.ఇప్పటికే ‘ట్రూ జెట్’ అంటూ విమాన రంగంలోకి,తనకిష్టమైన గుర్రపు సవారీ అంటూ ‘ఆర్.సి.హైదరాబాద్ పోలో రైడింగ్ క్లబ్’ తో ఆ రంగంలోకి అడుగు పెట్టాడు.ఇక చరణ్ గురించి సినిమా రంగం వారిని కడిపితే తన బాబాయ్ పవన్ కళ్యాణ్ లా చరణ్ అడిగిన వారికి ఎప్పుడు కాదనకుండా సహపడుతాడు అంటూ అనేక ఉదాహరణలు చెబుతుంటారు.

తోటి నటి,నటులతో:-

చరణ్ ఇప్పటికే బన్నీ,నవదీప్ లతో కలిసి నటించాడు.వరుణ్ తేజ్,ధరమ్ తేజ్ వంటి తన కుటుంభ హీరోలకు ఎప్పుడు తోడుగా నిలిచాడు.శర్వానంద్,రానా మంచి మిత్రులు.అఖిల్ తో చరణ్ కలిసి తిరగడం బాగానే చూశాం,వీరి మధ్య బంధం గురించి హెలో వేదిక పై వారే చెప్పుకొచ్చారు.ఇక గత కొంతకాలంగా మహేష్,తారక్,చరణ్ తెగ పార్టీలు చేసుకుంటూ వుండడం,ఆ ఫోటోలు బయటకు రావడం మనం చూశాం.ఇక తాజాగా చరణ్,మంచు మనోజ్ సినిమా ప్రరంభ వేడుకకు హాజరవ్వడం.ఆ తర్వాత మనోజ్,”నా ప్రాణ మిత్రుడు చరణ్” అని సంభోదించాడు.ఇలా తోటి హీరోలతో చరణ్ బాగా కలిసిపోయాడు.

కథానాయికలు తమన్నా,కాజల్,కీయారా అద్వానీ వంటి వారు చరణ్ మంచి మిత్రుడు అని పలు సందర్భాలలో తెలిపారు.

చివరిగా:-

నటనలో చిరంజీవి,మంచితనంలో పవన్ కళ్యాణ్ కలగలిసి మెగా పవర్ స్టార్ గా ఒక వెలుగు వెలుగుతున్న ‘సురేఖ కుమారుడిని’ చూసి ఆ ‘అంజన పుత్రులు’ గర్వపడుతున్నారు.అలాంటి రామ్ చరణ్ ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని జరుపుకోవాలని,చిత్ర పరిశ్రమకు ఎప్పుడు ఇలానే తోడుండాలి అని,తనదైన హిట్లతో బాక్స్ ఆఫీస్ ని షేక్ చెయ్యాలి అని కోరుకుంటూ అటు చిత్ర పరిశ్రమ తరుపున,ఇటు ప్రేక్షకుల తరపున,మరి ముఖ్యంగా మెగాభిమానుల తరపున మా “బి.ఆర్ మూవీ జోన్” బృందం తరపున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు..!

ఉగాది రోజున నేను వస్తున్నాను అంటున్న చిరు

ఉగాది రోజున నేను వస్తున్నాను అంటున్న చిరు


దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడిని అలరిస్తున్న,ప్రతి తెలుగోడు ప్రేమగా మా ‘అన్నయ్య’ అని పిలుచుకునే
‘పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి’ గారు ఇప్పుడు అభిమానులకు మరింత దగ్గరకనున్నారు.మారుతున్న కాలంతో పాటు మనం మారాలి అన్నట్లు ఆరు పదుల వయసులో కూడా కొత్త తరానికి దగ్గరైయెందుకు ప్రయత్నిస్తున్నారు చిరు.రేపు తెలుగు వారి పండగ ఉగాది.ఉగాది అంటే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభరోజు అని అర్థం.ఆ రోజున చిరంజీవి గారు కొత్త పనికి శ్రీకారం చుట్టనున్నారు.

నేటి తరం యువత టీవీ,పేపర్ల కన్నా సామాజిక మాద్యమం ద్వారానే సమాచారం తెలుసుకుంటున్నారు.ఇప్పటికే సీనియర్ నటులు ‘కింగ్ నాగార్జున’,’విక్టరీ వెంకటేష్’ సామాజిక మాద్యమాలల్లో వున్నారు.ఇక బాలీవుడ్ ‘బిగ్ బి అమితాబ్’,కోలీవుడ్ ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ ట్విట్టర్ లో ఎప్పుడు వారి సందేశాన్ని పంచుతూ వుంటారు.ఇవన్ని చూసి తనేందుల్లో తక్కువ కాకూడదు అని అనుకున్నారో ఏమో గాని చిరంజీవి గారు సోషల్ మీడియాలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించేశారు.తెలుగు కొత్త సంవత్సర ప్రారంభరోజైన ఉగాది పండుగ రోజు ఆయన సామాజిక మద్యంలోకి రానున్నట్లు వీడియో ద్వారా ఈ రోజు ప్రకటించారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 1న చిరంజీవి గారి ఇంటి వద్ద తన అభిమానులు వచ్చి తనని కలుస్తూ ఉంటారు.అది కాక ఈ మధ్య ప్రతి సినిమా ఫంక్షన్ కి తానే ముఖ్య అతిధిగా వస్తూ అటు ఆ సినీ బృందానికి ప్రచారంలో సహాయపడుతూ ఇటు అభిమానులకు చేరువవుతూ వచ్చారు చిరు.సామాజిక స్పృహ ఎక్కువ ఉన్న చిరు తన సందేశాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ ద్వారా,లేక కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అకౌంట్ ద్వారా,లేక తన కోడలు ఉపాసన అకౌంట్ నుండి పంపేవారు.ఇప్పుడు నేరుగా ఆయనే సామాజిక మద్యంలోకి వస్తుండడంతో ఆయనే స్వయంగా అభిమానులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారు.కరోనా వల్ల అటు సినిమా షూటింగ్స్ లేక పరిశ్రమ,ఇటు సినిమా ప్రదర్శనలు లేక తీవ్ర నిరాశతో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు చిరంజీవి గారి ప్రకటన కొంత ఆనందాన్ని పంచిందనే చెప్పాలి.

ఇక ఎవరు సోషల్ మీడియాలోకి వచ్చినా రికార్డ్స్ గురించి మాట్లాడుతుంటారు అభిమానులు,మరి ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికే ఆయనకు స్వాగతం పలుకుతున్న వేళ ఆయనను తొలి రోజు ఎంతటి స్థాయిలో అభిమానులు అనుసరిస్తారో చూడాలి..!కేవలం సినిమా వేడుకలలో మాత్రమే ఆయన సందేశాన్ని ఇస్తున్న చిరు ఇక మీదట వీడియోల రూపంలో పెడుతూవుంటారా?ఎప్పుడైనా ఒక్కసారి లైవ్ లోకి వస్తారా?వస్తే నా ప్రశ్నకు సమాధానం ఇస్తారా అంటూ ఇప్పటికే మెగాభిమానులు సామాజిక మాధ్యమంలో మాట్లాడుకుంటున్నారు.


ఇప్పటికే క్యారివాన్ గురించి నేటి తరం నటీనటులకు ఒక క్లాస్ తీసుకొని ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన ‘బిగ్ బాస్’,మరి ఇప్పుడు సామాజిక మాధ్యమంలోకి వచ్చి అటు ఇండస్ట్రీ,ఇటు ప్రజలకు ఇంకేన్నీ క్లాసులు తీసుకుంటారో మనందరి మంచి కోరే మన ‘మాస్టారు’ అనేది చూడాలి..!

Chiranjeevi instagram official account
Chiru video

మహిళల విలువ చెప్పిన పవన్ కళ్యాణ్ మగువా మగువా పాట..!

మహిళల విలువ చెప్పిన పవన్ కళ్యాణ్ మగువా మగువా పాట..!


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ చిత్రం నుండి విడుదలైన మగువా..మగువా..పాట ఇప్పుడు పెను చాలనంగా మారింది.అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఆ పాటను వింటున్నారు.

అసలే దేశం పట్ల భక్తి,మహిళల పట్ల గౌరవం చూపుతూ తన సినిమాలలో ఏదో ఒక సందేశాత్మక పాటను పేటెందుకు చూసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా,అందులోను మహిళలకు సంబంధించిన సినిమా.ఒక పక్క వరస హిట్స్ తో అభిమాన నటుడికి తొలిసారి స్వరాలను సమకూర్చిన తమన్,మరో పక్క పాటలతో అందరినీ మెపించే రామజోగయ్య శాస్ట్రీ గారు.తన గొంతుతో శ్రోతలను మైమరిమించేలా చేసే సిద్ శ్రీరామ్ గాత్రం.

దింతో ఆ పాట పై సాధారణంగానే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.దానికి తగ్గట్లే ఒక్క చక్కటి మెలోడీ రాగాన్ని తమన్ అందుకోగా రామజోగయ్య గారు మహిళల గురించి చక్కగా వర్ణించారు.ప్రతి మగువ గొప్పతనం చెప్పే ఈ పాట అందరినీ ఇప్పుడు అలరిస్తుంది.వీడియోలో మదర్ తెరెసా దగ్గర నుండి మన తెలుగు క్రీడా సంచలనం పి.వి.సింధు దాక అనేక రంగాలలో రాణించిన మహిళల ఫోటోలు అందులో చూపించారు.దింతో చిత్ర బృందం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారందరిని ఒక్కసారి తలుచుకున్నట్లు అనిపించింది.

దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి విడుదలైన తొలి పాట కనుక వారి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.మరో పక్క మహిళలకు సంబంధించిన పాట అందులో మెలోడీ కావడంతో పాట వింటున్న శ్రోతలందరి నుండి మంచి ప్రశంసలే వస్తున్నాయి.సాధారణంగానే సామాజిక మద్యమలలో రికార్డ్స్ సృష్టించే పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత రావడంతో ఈ పాట సృష్టించబోయే రికార్డ్స్ గురించి ఆలోచించనక్కర్లేదు.

పాట గురించి రామజోగయ్య శాస్త్రి గారి మాటలలో అన్ని పాటలకు స్పందన వస్తుంది,కానీ కొన్ని పాటలకు మాత్రమే మర్యాద వస్తుంది ఇది అందులో ఒక్కటి అన్నారు.పాట వింటే అది నిజం అనక తప్పదు.భారీ తారగణంతో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వకీల్ సాబ్ ఈ వేసవికి విడుదల కానుంది.