22-04-2021 13:44:46 About Us Contact Us
4వ ఏట వైయలిన్ నేర్చుకున్న కీరవాణి గారి పుట్టినరోజు నేడు

4వ ఏట వైయలిన్ నేర్చుకున్న కీరవాణి గారి పుట్టినరోజు నేడుమూడు దశాబ్దాల సినీ ప్రస్థానం.. ఐదు భాషలలో.. దాదాపు మూడు వందల సినిమాలలో రెండు వేలకు పైగా పాటలకు బాణీలు అందించిన సంగీత స్వరకర్త.. తన గాత్రంతో పాటలు పాడిన గాయకుడు.. తనలో ఒక రచయిత ఉన్నాడు అదే నాకు గర్వం అని చెప్పిన మరకటమణి కీరవాణి గారి పుట్టినరోజు నేడు.


1961 జులై 4న.. వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో కీరవాణి గారు జన్మించారు.తాతగారి సంగీతం పట్ల ఇష్టం ఉండటం.. తండ్రికి కూడా లలిత కళలలో ప్రవేశం ఉండటం.. ఆ తర్వాత సంగీతం.. సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు తండ్రి గారు..దింతో కీరవాణి గారికి చిన్నప్పటి నుండి పాటలు.. సంగీతం పట్ల ఇష్టం కలిగింది. నాలుగు ఏళ్ళ వయసులో వైయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా అక్కడ నుండి సంగీతం వైపు అడుగులు వేసిన ఆయన.. కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉద్యోగం అవసరం అని భావించి.. 1987లో చక్రవర్తి గారి దగ్గర చేరారు. అలా సినీ రంగ ప్రవేశం చేశారు కీరవాణి గారు.


1990లో తొలిసారి బాణీలు అందించిన కీరవాణి. 1991లో వచ్చిన క్షణ క్షణం సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. అక్కడ నుండి వెనకకు తిరిగి చేసుకుంది లేదు.మెలోడీ..భక్తి..మాస్.. ఇలా అన్ని రకాల పాటలలో తనదైన శైలిలో బాణీలు కట్టి.. విజయాలను సాధించారు.1991 నుండి 2010 వరకు వచ్చిన హీరోలు..దర్శకులలో ఆయన చెయ్యని వారు లేరనే చెప్పుచు.ఆయన పరిచయం చేసిన గాయని..గాయకులు అనేకం.తన దగ్గర ఒక్క పాట పాడాలి అని నేటి తరం గాయకులు కోరుకునే స్థాయికి చేరారు కీరవాణి గారు.ఒక తెలుగులోనే కాక తమిళం.. మలయాళం..కన్నడ..హిందీ భాషల్లో సైతం తన బాణీలకు అటు హీరోలతో ఇటు ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు.తమిళ..మలయాళ భాషల్లో మరకటమణి గా..హిందీ లో ఏం.ఏం.క్రీం గా ఆయనను పిలుస్తారు. ఇలా పలు పరిశ్రమలలో పలు పేర్లతో ప్రసిద్ధి చెందారు కీరవాణి గారు.


ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా చేసిన కీరవాణి గారు..ఇప్పటికి ఒక సాధారణ మనిషి లానే వుంటారు.. తాను ఒక స్టార్ సంగీత దర్శకుడు అనే భావన ఆయనను చూసిన ఎవ్వరికీ అనిపించదు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ.. చిన్నవారిని సైతం గౌరవంగా పిలుస్తూ వుంటారు.చూసేందుకు కోపంగా కనపడినా నిత్యం సరదాగా ఉంటారు.తనలో ఒక రచయిత ఉన్నారని.. తాను సమయం దొరికినప్పుడల్లా రాస్తుంటానని ఒక సందర్భంలో చెప్పారు.ప్రస్తృతనికి తన వద్ద మాత్రమే ఉన్న ఆ రాతలు త్వరలో పుస్తక రూపం దాల్చి మనముందుకు వచ్చే అవకాశం ఉంది.ఆ దిశగా ప్రయత్నం త్వరలో చేస్తాను అని కూడా ఆయన గతంలోనే ప్రకటించారు.


ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కీరవాణి గారు గడిచిన మూడు దశాబ్దాలుగా తన పాటలతో మనల్ని అలరించారు. ప్రసృతం రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్.ఆర్.ఆర్ కి పని చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 27వ సినిమాగా క్రిష్ దర్శత్వంలో వస్తున్న సినిమాకు బాణీలు అందించనున్నారు.. నేడు 59వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కీరవణిగారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!

సంవత్సరంలో 8 సినిమాలు చేసిన అల్లరి నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!

సంవత్సరంలో 8 సినిమాలు చేసిన అల్లరి నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!నరేష్.. అల్లరి నరేష్.. తెలుగు ప్రేక్షకులను తమ కుటుంబ సభ్యులతో మనసారా నవ్వుకునేలా చేసిన ఈ.వి.వి. సత్యనారాయణ గారి అబ్బాయి.. తొలి సినిమా తోనే తన పేరుకు ముందు టైటిల్ తగిలించుకున్న హీరో.. కామెడీ మాత్రమే కాదు విలన్ గా కూడా చేయగలను అని రుజువుచేసిన నటుడు.. అప్పట్లో రాజేంద్రప్రసాద్ గారు ఇప్పట్లో అల్లరి నరేష్ అనే స్థాయికి ఎదిగిన కామెడీ కింగ్.. మన సడన్ స్టార్.. అలాంటి స్లిమ్ స్టార్ అల్లరి నరేష్ గారి పుట్టినరోజు నేడు..


1982లో చెన్నైలో జన్మించిన నరేష్.. తన విద్యాబ్యాసం కూడా అక్కడే చేశారు. పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన క్రమంలో కుటుంబంతో పాటు హైదరాబాద్ చేరారు నరేష్.. ప్రముఖ దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ గారి అబ్బాయి నరేష్ హీరోగా.. ప్రముఖ నటులు చలపతిరావు గారి అబ్బాయి రవి బాబు దర్శకత్వం లో సినిమా అనే వార్త అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది.. 2002లో అల్లరి పేరుతో ఆ సినిమా విడుదలైంది.. సినిమా భారీ విజయం సాధించింది.. నాటి నుండి ఆయన పేరుకు ముందు అల్లరి చేరిపోయింది.. అల్లరి నరేష్ గా మారిన నరేష్.. తొట్టి గ్యాంగ్.. మా అల్లుడు వెరీ గుడ్.. డేంజర్.. కితకితలు.. గోపి గోడ మీద పిల్లి.. సీమశాస్ట్రీ సినిమాలతో మంచి విజయాలు సాధించారు.. 2002 నుంచి 2007 వరకు 18 సినిమాలు చేశారు..


2008లో ఒక పక్క తన స్పీడ్.. మరో పక్క తన నటనా వైవిధ్యం.. అటు పరిశ్రమకు.. ఇటు ప్రజలకు.. తెలియ చేశారు నరేష్. నేటి తరం ఏ హీరో చేయలేని విధంగా ఒక సంవత్సరంలో తాను నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అందులో విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరో గా మాత్రమే కాకుండా ఒక నెగటివ్ పాత్రలో కనిపించారు.. ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.. అదే సంవత్సరం విడుదలైన మరో సినిమా గమ్యం.. శర్వానంద్ తో కలిసి నటించిన ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు నరేష్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. అదే సంవత్సరం బాపు..రమణ గార్ల సినిమా సుందరఖండ లో సైతం నటించారు. నేటి తరం హీరోలలో ఎవరికి ఆ అవకాశం దక్కలేదు. అలా 2008లో అనేక రికార్డులు అందుకున్నారు నరేష్.ఆ తర్వాత వరసగా కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు నరేష్. 2012లో వచ్చిన సుడిగాడు.. ఒక టికెట్ తో వంద సినిమాలు అనే శీర్షక సినిమా నరేష్ ను సడన్ స్టార్ గా మార్చేసింది.. 100 సినిమాల పేరడీ తో తీసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. 2013లో దేశంలోనే తొలి కామెడీ 3డి సినిమా చేశారు నరేష్. 2014లో లడ్డు బాబు తో భారీ ఆకారంలో కనిపించి నవ్వించారు నరేష్. ఇలా కామెడీ సినిమాలలో సైతం భిన్నంగా.. తనదైన ముద్ర ఉండేలా సినిమాలు చేశారు నరేష్.


2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో పల్లెటూరు పాత్రలో చాలా బాగా చేసి.. అందరిని అలరించారు నరేష్. 2004లో తను నటించిన నేను సినిమా పాత్రకు ఈ పాత్ర దగ్గరగా ఉంటుంది.. ఇప్పుడు తాజాగా నాంది సినిమాతో మరో విలక్షణ పాత్రకు శ్రీకారం చుట్టినట్లు పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది.. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాంది టీజర్ విడుదల కానుంది.. అలానే తాను నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు సినిమా టీజర్ సైతం నేడే విడుదల కానుంది..


18 ఏళ్ళ సినీ ప్రస్థానం.. 57 సినిమాలతో మనని అలరించిన కామెడీ కింగ్.. సడన్ స్టార్.. స్లిమ్ స్టార్.. అల్లరి నరేష్ గారు ఇలానే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని.. మనల్ని ఇలానే అలరించాలని.. భారీ విజయాలు నమోదు చేయాలని ఆసిస్తూ.. మా బి.ఆర్. మూవీ జోన్.. తరపున జన్మదిన శుభాకాంక్షలు..!

పోస్టర్స్ తో ఆకట్టుకున్న నాంది టీజర్ రేపే విడుదల

పోస్టర్స్ తో ఆకట్టుకున్న నాంది టీజర్ రేపే విడుదలఅల్లరి నరేష్ హీరోగా.. కొత్త దర్శకుడు విజయ్ కనమేడల దర్శకత్వంలో.. ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం “నాంది”. ఈ నెల (ఏప్రిల్)30న టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.


గత సంవత్సరం చివర్లో ఎస్.వి.2 నిర్మాణ సంస్థ.. నరేష్ 57వ సినిమాగా.. ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్మాణ సంస్థకు ఇదే తొలి సినిమా.. అలానే దర్శకుడికి సైతం ఇదే తొలి సినిమా. ఈ ఏడాది జనవరి 18న.. సినిమా ముహూర్తం 20న నిర్చయించినట్లు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.. రక్తంతో ఉన్న నరేష్ ఫోటో చూసి సినిమా విభిన్నంగా ఉండనున్నట్లు అనిపించింది.. ప్రారంభోత్సవరోజున నాంది అనే టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది బృందం. ఆ పోస్టర్ లో నరేష్ నగ్నంగా సంకెళ్లతో చేతులు..కాళ్ళు.. కట్టేసి.. దూలానికి ఎలాడతీశినట్లు ఉంది. దింతో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నరేష్ గత సినిమాలకు ఈ సినిమాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నంలో దర్శకుడు విజయ్ విజయం సాధించారు. ఆ తర్వాత తొలి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొని.. ఎడిటింగ్ ను ఒక్కసారి.. డబ్బింగ్ ను మరోసారి ప్రారంభించినట్లు తెలిపింది నిర్మాణ సంస్థ.రేపు (ఏప్రిల్ 30న) టీజర్ విడుదల చేస్తున్నట్లు 27న పోస్టర్ లో తెలిపారు.. అందులో నరేష్ పోలీస్ స్టేషన్ లో నగ్నం కూర్చోనున్నట్లు ఉంది. దింతో తొలి పోస్టర్ లో నరేష్ ని సెల్ లో ఉంచినట్లు అర్ధమవుతుంది. ఈ మధ్య టీజర్.. ట్రైలర్ లకు కొత్త పేర్లు పెడుతున్న ట్రెండ్ ని ఈ సినిమా బృందం ఫాలో అయ్యారు. టీజర్ కు ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ అని పేరు పెట్టారు.. షార్ట్ ఫారం లో ఎఫ్.ఐ.ఆర్ వచ్చేలా అన్నమాట. నిన్న వరసగా నాలుగు పోస్టర్స్ తో పాత్రలను పరిచయం చేశారు. తొలుత ప్రవీణ్ కార్ నడుపుతున్న సంతోష్ గా.. హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ కిషోర్ గా.. ప్రసృతం అటు హీరోగా ఇటు కమెడియన్ గా ట్రెండింగ్ లో ఉన్న ప్రియదర్శి.. ల్యాప్ టాప్ వాడుతున్న రాధ ప్రకాష్ గా పోస్టర్స్ విడుదల చేశారు. చివరిగా అటు తమిళం.. ఇటు తెలుగులో నటిగా మంచి పేరు సంపాదించుకున్న వరలక్ష్మి.. లాయర్ ఆద్య పాత్ర చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ప్రతి పోస్టర్ తో ఆ సినిమా ప్రపంచంలోకి తీసుకువెళ్లారు.


దింతో రేపు విడుదల కానున్న టీజర్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే పోస్టర్స్ తోనే సినిమాపై సైతం భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ బ్రాహ్మ కడలి ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్. సినెమత్తోగ్రఫీ సీడ్ చెయ్యగా.. సంగీతం శ్రీ చరణ్ పకల అందించారు. చోటా. కె. ప్రసాద్ ఎడిటర్. సినిమా విజయం సాధిస్తుందని.. చిత్ర బృందం బలంగా నమ్ముతుంది. సినిమా చిత్రీకరణ పూర్తిగా అయిపోయిందా.. తీయటర్లు ఓపెన్ చేసేదాక అగుతారా..లేక ఓ.టి.టి లో విడుదల చేస్తారా అని అంశాలపై సినిమా బృందం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. రేపు టీజర్ విడుదల తర్వాత మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది.

సమంత తొలి హీరో.. రాహుల్ రవీంద్రన్ పుట్టినరోజు నేడు.!

సమంత తొలి హీరో.. రాహుల్ రవీంద్రన్ పుట్టినరోజు నేడు.!రాహుల్ రవీంద్రన్.. టీవీ యాడ్ లో నటుడిగా కెరీర్ ప్రారంభించి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారి.. దర్శక శాఖలో చేరాలనుకొని.. కథానాయకుడిగా అవకాశం పొంది.. నటుడిగా మంచి పేరు తెచ్చుకొని.. ఇప్పుడు దర్శకుడిగా రెండు సినిమాలు చేశారు.. నేడు అలాంటి రాహుల్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి కొన్ని విషయాలు..


రాహుల్ పుట్టి.. పెరిగింది అంతా చెన్నై లోనే.. చెన్నైలో కామర్స్ డిగ్రీ పొంది.. ఎంబీఏ ముంబైలో చదివారు.. అక్కడే ఒక ప్రముఖ మీడియా పరిశ్రమలో అసిస్టెంట్ మేనేజర్ గా పని చేశారు.. అలా ఒక రోజు రాత్రి హోటల్లో డిన్నర్ చేస్తుండగా.. తనకు ప్రముఖ యాడ్ డైరెక్టర్ డిబాకర్ బెనర్జీ నుంచి ఒక యాడ్ లో నటించే అవకాశం లభించింది.. ఆ యాడ్ తో బాగా ఫేమ్ రావడంతో రాహుల్ కు అవకాశాలు వచ్చాయి.. అదే సమయంలో పవర్ రేంజర్స్ మిస్ట్రిక్ ఫాస్లో రెడ్ రేంజర్ కు.. ఎస్.పి.డి లో వైట్ రేంజర్ కు తమిళంలో డబ్బింగ్ చెప్పారు.. ఆ తర్వాత అన్ని వదిలి తిరిగి చెన్నై చేరారు..అసిస్టెంట్ డైరెక్టర్ గా చేరాలి అని భావించిన రాహుల్ కు ప్రముఖ కెమరామెన్ రవి వర్మన్ గారి బృందంలో ఒక్కరు రాహుల్ యాడ్ షూట్ నచ్చడం వల్ల.. రవి వర్మన్ గారు స్వయంగా రాసుకొని.. దర్శకత్వం చేస్తున్న సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది.. సమంత హీరోయిన్ గా చేసిన తొలి సినిమా కూడా ఇదే.. థమన్ సంగీత దర్శకులు.. సినిమా పేరు మొస్కోవిన్ కావేరీ.. సినిమా పేరు.. 2008లో షూటింగ్ ప్రారంభించిన ఈ సినిమా రవి వర్మన్ కు కెమరామెన్ గా మిగతా సినిమాలు ఎక్కువ ఉండటం వల్ల 2010లో విడుదలైంది.. అలా తమిళనాట హీరోగా పరిచయమయ్యారు రాహుల్.. ఆ తర్వాత రెండు తమిళ సినిమాలు నటించారు.. ఆంగ్లంలో ఒక సినిమా చేసినా.. అది విడుదల కాలేదు.. అప్పుడు 2012 లో వచ్చింది అందాల రాక్షసి.. తెలుగు అదే తొలి సినిమా.. భారీ విజయం నమోదు చేసుకుంది.. అక్కడ నుండి అందరికి తెలిసిన విషయాలే.. 2010 నుండి అటు తమిళం.. ఇటు తెలుగులో 15 సినిమాలలో నటించారు రాహుల్.. అందులో జీ5 లో నేరుగా విడుదలైన దృష్టి అనే సినిమాతో విమర్శకుల ప్రశంసలు పొందారు.. U-టర్న్ సినిమాతో రెండు బాషలలో ప్రేక్షకుల వద్ద మంచి నటుడుగా బాగా పేరు సంపాదించుకున్నారు..


2018లో దర్శకుడిగా మారిన రాహుల్.. చి౹౹ ల౹౹ సౌ౹౹ అనే సినిమా చేశారు.. సుశాంత్ కెరీర్ లో మంచి విజయం సాధించిన సినిమా జాబితాలో ఇది ఒక్కటి.. ఈ సినిమాతో డైరెక్టర్ గా మంచి మార్కులు పడ్డాయి.. 2019లో తాను దర్శకుడిగా మన్మథుడు 2 నే సినిమా కూడా చేశారు.. అలా తన 15ఏళ్ళ సినీ ప్రస్థానం లో అటు నటుడిగా.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా.. హీరో గా.. ఇప్పుడు దర్శకుడిగా చేశారు.. నేడు 38వ పుట్టిన రోజు జరుపుకుంటున్న రాహుల్.. ఇలానే అటు నటుడిగా.. ఇటు దర్శకుడిగా మరిన్ని సినిమాలు చేసి.. భారీ విజయాలు నమోదు చేయాలని కోరుకుందాం.. మా బి.ఆర్. మూవీ జోన్ బృందం తరుపున రాహుల్ రవీంద్రన్ కి జన్మదిన శుభాకాంక్షలు..

దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్న హీరో నిఖిల్..!

దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్న హీరో నిఖిల్..!నిఖిల్ సిద్దార్థ్.. కొత్త పెళ్ళి కొడుకు.. నేడు అర్జున్ సురవరం జీ తెలుగు లో రానున్న సందర్భంగా ప్రచారం కొరకు.. సామాజిక మాధ్యమంలో కాసేపు అభిమానులతో మాట్లాడారు.. ఇందులో అభిమానులు సంధించిన కొన్ని ప్రశ్నలకు ఆయన సమాధానాలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారాయి..


ఇప్పటికే లాక్ డౌన్ లో మేక్ ఓవర్ అవుతున్నట్లు ఫోటోలు బయట పెట్టిన నిఖిల్ ను సిక్స్ ప్యాక్ ఎప్పుడు అని అడుగగా.. కార్తికేయ 2 లో ఉండచ్చు అని చెప్పారు.. అలానే మరో ప్రశ్నకు కార్తికేయ2 లో పాము కాదు పాములు ఉంటాయి అని బదులిచ్చారు.. అలానే తను కొత్తగా లాక్ డౌన్ లో ఏం నేర్చుకున్నారు అని అడిగితే.. తాను ఫిల్మ్ మేకింగ్ పాఠాలు గత 3 నెలలుగా హాజరవుతునట్లు చెప్పారు.. లాక్ డౌన్ కారణంగా చిత్ర పరిశ్రమ పూర్తిగా స్తంభించిపోయింది.. దింతో అందరూ ఇంట్లో నుండి మొబైల్.. కంప్యూటర్ ద్వారా వీడియో కాల్స్.. మాట్లాడుతున్నారు.. ఇదే కోవలో ఎవరి దగ్గరో నిఖిల్ దర్శకత్వ పాఠాలు నేర్చుకుంటున్నరా.. లేక ఇప్పటికే అప్లోడ్ చేసిన ఏవైనా ఆన్ లైన్ క్లాసుల వీడియోలు చూస్తున్నారా అనే విషయం ఆయన చెప్పలేదు..


14 సంవత్సరాల సినీ జీవితంలో.. 17 సినిమాలు నటించిన అనుభవం.. తో 35 ఏళ్ళ వయసులో దర్శకత్వ మెలకవులు నేర్చుకుంటున్నరు నిఖిల్ సిద్దార్థ్.. ఇప్పటికైతే.. లాక్ డౌన్ వల్ల వచ్చిన కాళీ సమయాన్ని వృధా చేయకుండా.. తను పని చేస్తున్న చిత్ర పరిశ్రమలోని కొత్త విషయాలు నేర్చుకోవడం అనే తపనతో పాఠాలు వింటునట్లు అర్ధమవుతుంది.. ప్రస్తృతనికి తానేడో నిజంగా దర్శకత్వం చేయాలి అనే ఆలోచన లేకున్నా.. భవిషత్తులో ఏమి జరుగుతుందో ఎవరు ఉహించలేము కదా.. కానీ.. అటు వర్క్ ఔట్స్.. ఇటు డైరెక్షన్ పాఠాలు రెండు కూడా తను ఉన్న చిత్ర పరిశ్రమకు సంబంధించిన అంశాలే.. సినీ రంగంపై నిఖిల్ కు ఎంత ఇష్టం ఉందో.. ఉహించకుండా దొరికిన కాళీ సమయాన్ని తాను గడుపుతున్న విధానం చూస్తే అర్ధమవుతుంది.. నిఖిల్.. కార్తికేయ 2.. 18 పేజీస్ అనే రెండు సినిమాలలో నటిస్తున్నారు.. వాటిల్లో కొత్తగా ఎలా కనపడుతారో చూడాలి.. ఇదండీ సరదాగా అభిమానులతో నిఖిల్ పంచుకున్న విషయాలు..