13-04-2021 00:09:14 About Us Contact Us
రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ 3డి సినిమా.!

రెబెల్ స్టార్ ప్రభాస్ 22వ సినిమా ఆదిపురుష్. భారీ బడ్జెట్ 3డి సినిమా.!


ఉదయం(ఆగస్ట్ 18న) ప్యాన్ ఇండియా హీరో.. రెబల్ స్టార్ ప్రభాస్ తదుపరి చిత్రం టైటిల్ పోస్టర్ విడుదల చేశారు. ప్రభాస్ 22వ సినిమా టైటిల్ ఆదిపురుష్. సినిమా యొక్క ట్యాగ్‌లైన్ “చెడుపై మంచి విజయాన్ని జరుపుకుంటుంది” అని ఆ పోస్టర్ లో ఉంది.దేశంలోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న 3డి మూవీ ఇది.వివరాల్లోకి వెళ్తే..


తన్హాజీ తో భారీ విజయం అందుకున్న ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌తో కలిసి ఒక పెద్ద వార్త రేపు ఉదయం చెప్తాను అని ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసినప్పటి నుండి అటు భారతీయ చిత్ర పరిశ్రమ తో పాటు ఇటు ప్రభాస్ డై హార్ట్ ఫాన్స్.. ఆ వార్త గురించి ఎదురు చూడటంతో పాటు అనేక ఊహాగానాలు చేశారు..


ఆదిపురుష్ గురించి పెద్దగా తెలియకపోయినా, రాబోయే కాలంలో, యాక్షన్ చిత్రంలో ప్రభువు రాముడి పాత్రను ప్రభాస్ పోషించినట్లు తెలుస్తుంది. పురాణ రామాయణం కూడా చెడుపై మంచి విజయాన్ని జరుపుకుంటుంది.. ట్యాగ్‌లైన్ కూడా అదే సూచిస్తుంది. వాస్తవానికి, ఆదిపురుష్ యొక్క పోస్టర్ మధ్యలో విల్లును పట్టుకున్న ప్రధాన పాత్రను కలిగి ఉంది మరియు ‘గడా’ పట్టుకున్న నేపథ్యంలో హనుమంతుడిలాంటి వ్యక్తి కూడా కనిపిస్తాడు. రావణుడి పది తలలు కూడా ఆదిపురుష్ పోస్టర్ మధ్యలో ఉన్నాయి.ఆదిపురుష్ హిందీ మరియు తెలుగు భాషలలో చిత్రీకరించబడుతుంది మరియు తమిళం, మలయాళం, కన్నడ మరియు అనేక అంతర్జాతీయ భాషలలో డబ్ చేయబడుతుంది.ఈ చిత్రం 2021 లో చిత్రీకరణ ప్రారంభించి 2022 లో విడుదల చేస్తారు. ఇది 3 డిలో చిత్రీకరణ చేయనున్నారు.ప్రముఖ నిర్మాణ సంస్థ టి.సిరీస్ ఈ సినిమాను తెరకెక్కిస్తుంది.


ఈ సినిమాతో ప్రభాస్ నేరుగా హిందీలో చేయబోయే తొలి సినిమా కానుంది.ఇప్పటికే బాహుబలి నుండి అన్ని సినిమాలు హిందీ లో విడుదలైనప్పటికి.. బాలీవుడ్ నిర్మాత.. దర్శకుడితో కలిసి సినిమా చేయడం ఇదే తొలిసారి.టైటిల్ పోస్టర్ తోనే అంచనాలు భారీగా పెంచిన ఈ సినిమా చూడాలంటే, 2022 దాక ఆగాల్సిందే.

ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్..!

ఆనంద్ దేవరకొండ రెండవ సినిమా మిడిల్ క్లాస్ మెలోడీస్..!భవ్య క్రియేషన్స్ తమ తదుపరి చిత్రం ఆనంద్ దేవరకొండతో అని ఇప్పటికే తెలిపింది.తాజాగా ఆ సినిమా పేరు మిడిల్ క్లాస్ మెలోడీస్ అని టైటిల్ ఖరారు చేసినట్లు చిత్ర బృందం తెలిపింది.వివరాలలోకి వెళ్తే..


విజయ్ దేవరకొండ తమ్ముడిగా పరిచయమై తొలి సినిమాతోనే తన నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన ఆనంద్ దేవరకొండ హీరోగా..తమిళ,మలయాళంలో హీరోయిన్ గా పేరు తెచ్చుకొని ..చూసి చూడంగానే.. అనే సినిమాతో తెలుగులో మరిచాయమైన వర్షా బొల్లం హీరోయిన్ గా కలిసి నటిస్తున్న సినిమా మిడిల్ క్లాస్ మెలోడిస్.వినోద్ అనంతోజు.. దర్శకుడిగా గా ఈ సినిమాతో పరిచయం కాబోతున్నారు.కేర్ ఆఫ్ కాంచరపాలెం మ్యూజిక్ దర్శకుడు స్వీకర్ అగస్తీ ఈ సినిమాకు బాణీలు అందించనున్నారు.భవ్య క్రియేషన్స్ పతాకం పై ఆనంద్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


గుంటూరు జిల్లా బాపట్ల వాసి వినోద్ ఇప్పటికే శున్యం అనే లఘు చిత్రం ద్వారా తన దర్శకత్వ ప్రతిభకు ప్రశంసలు అందుకున్నారు.ఆ తర్వాత కొన్ని లఘు చిత్రాలు చేసి హైదరాబాద్ లో చిత్ర పరిశ్రమలో పని చేస్తున్న వినోద్ పరిశ్రమలో సూపరిచితుడే.ఇప్పుడు తొలి సినిమా అవకాశం వచ్చింది.ఇప్పటికే ఈ సినిమా పట్ల పరిశ్రమలో అంచనాలు బాగానే ఉన్నాయి.దర్శకుడితో పాటు భవ్య క్రియేషన్స్.. నిర్మాణ సంస్థ కావడం..అంతేకాక ఆనంద్ దేవరకొండ దొరసాని తర్వాత చిత్రం కనుక కూడా అంచనాలు పెరగడానికి కారణం.


సినిమా టైటిల్ లోనే ఇది సామాన్యుడికి దగ్గరగా ఉండనున్నట్లు అర్ధమవుతుంది.త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు బృందం తెలిపింది.

కరోనా బాధితులకు వన్ స్టాప్ పరిష్కారంగా మారిన సాయి రాజేష్ ఆలోచన.!

కరోనా బాధితులకు వన్ స్టాప్ పరిష్కారంగా మారిన సాయి రాజేష్ ఆలోచన.!హృదయకాలయం దర్శకులు.. కొబ్బరిమట్ట నిర్మాత.. సంపూర్ణేష్ బాబు అనే పాత్ర సృష్టి కర్త సాయి రాజేష్ (స్టీఫెన్ శంకర్) గారు గతంలో తెలుగు రాష్ట్రాలలో ఎలాంటి సంఘటన జరిగినా మానవతా దృక్పథంతో ముందుకు వచ్చి సహాయం చేస్తుంటారు.కరోనా బాధితులకు సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు.. ఆంధ్రప్రదేశ్..తెలంగాణలలో హాస్పిటల్ లో బెడ్స్ దొరకడం కష్టంగా ఉంది..లేక ఎవరికి సమాచారం అందిస్తే తమవారికి కరోనా ఉన్నట్లు ప్రభుత్వాలకు తెలిసి వారికి వైద్యం అందుతుంది అని తెలియక కష్టాలు పడుతున్న వారి సమాచారం సేకరించి.. ఆ విషయాన్ని ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం మొదలు పెట్టారు. ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాలి అనుకుంటున్న కరోనా బాధితులు ట్విట్టర్ ద్వారా ఆంధ్ర వారు #COVID19APHELP అని..తెలంగాణ వారు #COVID19TSHELP అనే హాష్ ట్యాగ్ తో ట్వీట్లు వేస్తే వారి గురించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు.వారి పూర్తి వివరాలతో పాటు రెండు నంబర్స్ కూడా పెట్టాలి.


ఇప్పటికే ట్విట్టర్ ద్వారా సహాయం కోరిన వారికి మంత్రులు కేటీఆర్.. ఈటెల రాజేంద్ర గారు స్పందిస్తున్నారు.అయితే సాయి రాజేష్ చొరవతో టెస్టులు జగరాలి..అంబులెన్స్ కావాలి..హాస్పిటల్ లో బెడ్ కావాలి..రక్త సహాయం కావలి.. వెంటిలేటర్ పొందాలి అనుకునే కరోనా బాధితులకు సహాయం కావాలి అనుకుంటున్న వారికి ఇది ఉపయోగపడనుంది.


ఎప్పుడు సామాజిక మాధ్యమాలలో అందరికి అందుబాటులో ఉంటారు సాయి రాజేష్.ఇప్పటికే కరోనా వల్ల వచ్చిన లాక్ డౌన్ లో సహాయం చేశారు సాయి రాజేష్. ఇప్పటికే తమ వంతు బాధ్యతగా పరిశ్రమ మొత్తం ఆర్థిక సహాయం చేసింది..అలానే వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చే విషయంలో కూడా పరిశ్రమలో కొందరు ముందుకు వచ్చారు. ఇప్పుడు తాజాగా సాయి రాజేష్ ట్విట్టర్ ద్వారా ఇచ్చిన పిలుపుతో నేటి మధ్యాహ్నం నుండి తెలుగు పరిశ్రమలోని సెలబ్రిటీస్ ట్వీట్లు వెయ్యడం ప్రారంభించారు.సమాచారం లేక బాధ పడుతున్న అనేకమందికి ఇది పరిష్కారం కానుంది.ఎప్పుడు కొత్త ఆలోచనతో వచ్చే సాయి రాజేష్ ఆలోచన నేడు అనేకమందికి కరోనా సమయంలో ప్రాణాలు కాపాడనుంది.అందుకే మా వంతుగా సాయి రాజేష్ గారి ప్రయత్నాన్ని అభినందిస్తూ..ఆడికమండికి తెలిసేందుకు తొలిసారి సినిమా గురించి కాకుండా ఆర్టికల్ వేస్తున్నాం.త్వరగా మనం కరోనా నుండి బయటపడాలి అని కోరుకుందాం.


4వ ఏట వైయలిన్ నేర్చుకున్న కీరవాణి గారి పుట్టినరోజు నేడు

4వ ఏట వైయలిన్ నేర్చుకున్న కీరవాణి గారి పుట్టినరోజు నేడుమూడు దశాబ్దాల సినీ ప్రస్థానం.. ఐదు భాషలలో.. దాదాపు మూడు వందల సినిమాలలో రెండు వేలకు పైగా పాటలకు బాణీలు అందించిన సంగీత స్వరకర్త.. తన గాత్రంతో పాటలు పాడిన గాయకుడు.. తనలో ఒక రచయిత ఉన్నాడు అదే నాకు గర్వం అని చెప్పిన మరకటమణి కీరవాణి గారి పుట్టినరోజు నేడు.


1961 జులై 4న.. వెస్ట్ గోదావరి జిల్లా కొవ్వూరులో కీరవాణి గారు జన్మించారు.తాతగారి సంగీతం పట్ల ఇష్టం ఉండటం.. తండ్రికి కూడా లలిత కళలలో ప్రవేశం ఉండటం.. ఆ తర్వాత సంగీతం.. సాహిత్యం పట్ల మక్కువ పెంచుకున్నారు తండ్రి గారు..దింతో కీరవాణి గారికి చిన్నప్పటి నుండి పాటలు.. సంగీతం పట్ల ఇష్టం కలిగింది. నాలుగు ఏళ్ళ వయసులో వైయలిన్ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అలా అక్కడ నుండి సంగీతం వైపు అడుగులు వేసిన ఆయన.. కుటుంబ ఆర్థిక పరిస్థితి రీత్యా ఉద్యోగం అవసరం అని భావించి.. 1987లో చక్రవర్తి గారి దగ్గర చేరారు. అలా సినీ రంగ ప్రవేశం చేశారు కీరవాణి గారు.


1990లో తొలిసారి బాణీలు అందించిన కీరవాణి. 1991లో వచ్చిన క్షణ క్షణం సినిమాతో భారీ విజయం అందుకున్నారు.. అక్కడ నుండి వెనకకు తిరిగి చేసుకుంది లేదు.మెలోడీ..భక్తి..మాస్.. ఇలా అన్ని రకాల పాటలలో తనదైన శైలిలో బాణీలు కట్టి.. విజయాలను సాధించారు.1991 నుండి 2010 వరకు వచ్చిన హీరోలు..దర్శకులలో ఆయన చెయ్యని వారు లేరనే చెప్పుచు.ఆయన పరిచయం చేసిన గాయని..గాయకులు అనేకం.తన దగ్గర ఒక్క పాట పాడాలి అని నేటి తరం గాయకులు కోరుకునే స్థాయికి చేరారు కీరవాణి గారు.ఒక తెలుగులోనే కాక తమిళం.. మలయాళం..కన్నడ..హిందీ భాషల్లో సైతం తన బాణీలకు అటు హీరోలతో ఇటు ప్రేక్షకులతో స్టెప్పులు వేయించారు.తమిళ..మలయాళ భాషల్లో మరకటమణి గా..హిందీ లో ఏం.ఏం.క్రీం గా ఆయనను పిలుస్తారు. ఇలా పలు పరిశ్రమలలో పలు పేర్లతో ప్రసిద్ధి చెందారు కీరవాణి గారు.


ప్రతిష్టాత్మక బాహుబలి సినిమా చేసిన కీరవాణి గారు..ఇప్పటికి ఒక సాధారణ మనిషి లానే వుంటారు.. తాను ఒక స్టార్ సంగీత దర్శకుడు అనే భావన ఆయనను చూసిన ఎవ్వరికీ అనిపించదు. నమస్కారానికి ప్రతి నమస్కారం చేస్తూ.. చిన్నవారిని సైతం గౌరవంగా పిలుస్తూ వుంటారు.చూసేందుకు కోపంగా కనపడినా నిత్యం సరదాగా ఉంటారు.తనలో ఒక రచయిత ఉన్నారని.. తాను సమయం దొరికినప్పుడల్లా రాస్తుంటానని ఒక సందర్భంలో చెప్పారు.ప్రస్తృతనికి తన వద్ద మాత్రమే ఉన్న ఆ రాతలు త్వరలో పుస్తక రూపం దాల్చి మనముందుకు వచ్చే అవకాశం ఉంది.ఆ దిశగా ప్రయత్నం త్వరలో చేస్తాను అని కూడా ఆయన గతంలోనే ప్రకటించారు.


ఆయన సినీ ప్రస్థానంలో ఉన్నత శిఖరాలను అధిరోహించిన కీరవాణి గారు గడిచిన మూడు దశాబ్దాలుగా తన పాటలతో మనల్ని అలరించారు. ప్రసృతం రాజమౌళి ప్రతిష్టాత్మక సినిమా ఆర్.ఆర్.ఆర్ కి పని చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి 27వ సినిమాగా క్రిష్ దర్శత్వంలో వస్తున్న సినిమాకు బాణీలు అందించనున్నారు.. నేడు 59వ పుట్టిన రోజు జరుపుకుంటున్న కీరవణిగారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!

నేడు డాన్స్ మాస్టర్ నుండి హీరోయిన్ గా మారిన తేజస్వి పుట్టిన రోజు.!

నేడు డాన్స్ మాస్టర్ నుండి హీరోయిన్ గా మారిన తేజస్వి పుట్టిన రోజు.!7అప్ యాడ్ తో తొలిసారి స్క్రీన్ పై కనిపించి..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో నటిగా మారి.. ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమా చేసి.. గడిచిన ఏడేళ్ళలో దాదాపు పాతిక సినిమాలతో వెండితెరపై.. ఇటు షో లతో బుల్లి తెరపై మనల్ని అలరిస్తు.. ఎప్పుడు ఎనర్జిటిక్ గా కనిపిస్తూ.. తెలుగులో బాగా మాట్లాడుతూ.. తెలుగువారందరికీ మన ఇంటి అమ్మాయిలా అనిపించే తేజస్వి మడివాడ పుట్టిన రోజు నేడు..ఈ సందర్భంగా డాన్స్ టీచర్ నుండి స్టార్ గా ఎలా మరారో క్లుప్తంగా మీకోసం..


1991 జులై 3న హైదరాబాద్ లో ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించారు తేజస్వి. కుటుంబ నేపథ్యం విజయవాడ కాగా.. బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిపారు.. బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో చదువుకొని.. సైంట్. ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో మాస్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. తొలుత మీడియా లో వర్క్ చేసినా.. ఆ తర్వాత తనకు నచ్చిన డాన్స్ ని పది మందికి నేర్పుతూ కెరీర్ ప్రారంభించారు.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తో పాటు పలు కార్పొరేట్ కంపెనీలకు సైతం నేర్పేవారు.. అలానే సంగీత్ లకు కూడా నేర్పేవారు. 7అప్ యాడ్ లో డాన్సర్స్ తో షూట్ ఉండగా అలా అవకాశం తేజస్వికి వచ్చింది.. తొలి యాడ్ లోనే తమిళంలో శింబు.. తెలుగు అల్లు అర్జున్ తో చేశారు.


అక్కడ నుండి 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా చేశారు.ఇద్దరు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. దాదాపు 40మంది తారాగణం ఉన్న ఆ సినిమాలో సమంతకు చెల్లిగా చేసిన తేజస్వి.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అంతమంది మధ్యలో చేసి కూడా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత మనం.. హార్ట్ ఎటాక్ సినిమాలలో కనిపించారు. ఆ తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ లలో ఒకెక్కరైన ఆర్.జీ.వి. గారి ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. అలా హీరోయిన్ గా చేస్తూ కూడా మళ్లీ మళ్లీ.. ఇది రాని రోజు.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. శ్రీమంతుడు సినిమాలలో కథకు అవసరమైన పాత్రలు కూడా చేశారు.కేరింత సినిమాతో హీరోయిన్ గా భారీ విజయం నమోదు చేసుకున్నారు. అలానే రోజులు మారాయి సినిమాలో నెగటివ్ పాత్రలో సైతం అద్భుతంగా చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు తేజు.అలా అటు హీరోయిన్ గా.. ఇటు ప్రాధాన్యత కలిగిన పాత్రలతో మనల్ని అలరించారు తేజస్వి. గడిచిన ఏడేళ్ళల్లో దాదాపు 25 సినిమాలలో కనిపించారు తేజస్వి.తమిళంలో ఒక్క సినిమా చేశారు తేజస్వి.ఇక టెలివిజన్ లో ఈటీవీ లో సూపర్ సీజన్ 2.. అనే రియాలిటీ షో.. మా టీవీ లో బిగ్ బాస్ సీజన్ 2.. అలానే బ్రహ్మానందం గారు జడ్జిగా చేసిన ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అనే కామెడీ షోలో యాంకర్ గా చేశారు. తెలుగులో గబ గబా మాట్లాడుతూ.. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటూ.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు తేజస్వి.స్పష్టమైన తెలుగు మాత్రమే కాదు.. తమిళం.. హిందీ.. ఆంగ్లం సైతం అంటే బాగా మాట్లాడగలరు. అందం.. అభినయం..అద్భుతమైన నటన..డాన్స్..అటు సంప్రదాయ దుస్తులలో.. ఇటు ట్రెండింగ్ డ్రెస్ లతో కుర్రాల గుండెల్లో చెదరని ముద్ర వేశారు తేజస్వి. తనకంటూ ఒక అభిమానలను పొందారు.దేని గురించైనా నిర్మొహమాటంగా.. చెప్పేస్తుంటారు తేజస్వి. అదే ఆమెకు బలం.. కష్టాన్ని.. ట్యాలెంట్ ని నమ్ముకొని పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ గా మారారు తేజస్వి.


మన ముగ్గురి లవ్ స్టొరీ తో వెబ్ సిరీస్ సైతం చేసిన తేజస్వి.. కమిట్మెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం పోస్టర్ ని విడుదల చేశారు.రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చెయ్యాలని.. భారీ విజయాలను నమోదు చెయ్యాలని.. కొరుకుంటూ.. మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున తేజస్వి మడివాడ గారికి జన్మదిన శుభాకాంక్షలు.!