11-04-2021 07:33:40 About Us Contact Us
నేడు మెగా స్టార్ అభిమాని నుండి నిర్మాత గా మారిన ఎస్.కె.ఎన్ పుట్టినరోజు.!

నేడు మెగా స్టార్ అభిమాని నుండి నిర్మాత గా మారిన ఎస్.కె.ఎన్ పుట్టినరోజు.!మెగాస్టార్ అభిమానిగా మొదలై..రివ్యూ రైటర్ గా మారి..సినిమా రిపోర్టర్ గా పని చేసి.. పి.ఆర్.ఓ గా పేరు తెచ్చుకొని..ఎక్సగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా..లైన్ ప్రొడ్యూసర్ గా..కో-ప్రొడ్యూసర్ గా చేసి..ఇప్పుడు నిర్మాతగా మారారు జి.శ్రీనివాస్ కుమార్..అందరికి తెలిసిన పేరు ఎస్.కె.ఎన్.. అలాంటి ఎస్.కె.ఎన్ పుట్టినరోజు నేడు.


శ్రీనివాస్ వెస్ట్ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు.చిన్నప్పటి నుండి మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని.చదువు తర్వాత ఏమవుతావు అని ఎవరైనా అడిగితే..చిరంజీవి గారి దగ్గరకు వెలిపోతా అనేంత అభిమానం.శ్రీనివాస్ కి ఆయన దగ్గర ఏమి చెయ్యాలో తెలియదు కానీ చిరంజీవి గారి దగ్గర ఉండాలి అనే ఆలోచన ఉండేది.సామాజిక మాధ్యమాలు కొత్తగా వచ్చిన రోజుల్లో..2000వ సంవత్సర సమయంలో మెగా అభిమానులకు ఆయన సినిమా సమాచారం ఇంటర్నెట్ లో దొరికింది అంటే అదే కచ్చితంగా ఎస్.కె.ఎన్ రాసిన ఆర్టికల్ ద్వారానే.అలా నాన్ స్టాప్ సినిమా అనే వెబ్సైట్ ప్రారంభించి సినిమా రివ్యూలు..సినిమా సమాచారం ఇవ్వడం ప్రారంభించారు.


అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ కు..తను ఇంటర్నెట్ లో ఎలా పని చేస్తున్నారో గమనించి..మెగా అభిమానిగా తన తపనను గుర్తించి నిత్యం అందుబాటులో ఉండేవారు.బన్నీ గంగోత్రి సినిమా ప్రారంభం అవుతున్న సమయంలో మా అన్నయ్య సినిమాలో హీరోగా అవుతున్నారు.తనకు పిఆర్వో..మేనేజర్ కావాలి.నువ్వు ఏమి చేస్తావు అని అడగడం.శిరీష్ కి పిఆర్వో అని చెప్పి అప్పుడే 24 గంటల వార్త ఛానల్ గా ప్రారంభమైన టీవీ9లో సినిమా రిపోర్టర్ గా ఉద్యోగం ప్రారంభించారు ఎస్.కె.ఎన్.అలా ఏలూరులో మెగా అభిమాని హైదరాబాద్ లో రిపోర్టర్ గా మారారు.


2009లో చిరంజీవి గారితో రాజకీయాల్లోకి వెళ్ళి..తిరిగి సినిమా ప్రారంచంలోకి వచ్చేశారు.సినీ ప్రయాణంలో దర్శకుడు మారుతి..నిర్మాత బన్నీ వాసు..ఏలూరు శ్రీను..యూవీ క్రియేషన్స్ వంశీ..శ్రేయస్ మీడియా శ్రీనివాస్ గార్లు మిత్రులుగా మారారు.వీరు గుంటూరు..వెస్ట్ గోడవరిలలో సినిమా డిస్ట్రిబ్యూషన్ చేసేవారు.మారుతి దర్శకుడిగా చేసిన ఈ రోజుల్లో సినిమాతో సినిమా నిర్మాణంలో అడుగు పెట్టిన ఎస్.కె.ఎన్..గీత ఆర్ట్స్ లో 100%లవ్ తో బన్నీ వాసుకు నిర్మాతగా అవకాశం రావడంతో ఆ సినిమా చిత్రీకరణ సమయంలో సినిమా నిర్మాత చెయ్యాల్సిన అన్ని విషయాలు తెలుసుకున్నారు.ఆ తర్వాత యూ.వి క్రయషన్స్ ప్రారంభించడంతో అందులో ఎక్సుగ్యుటివ్ ప్రొడ్యూసర్ గా పలు సినిమాలు చేశారు.టాక్సీ వాలా తో నిర్మాతగా మారారు.రెస్ట్ ఐస్ హిస్టరీ..


మెగాస్టార్ మీద అభిమానం హైదరాబాద్ కు చేరిస్తే..సినిమా పట్ల ప్రేమ..తన కష్టం తనను నిర్మాత స్థాయికి చేర్చింది.ఎప్పుడు సినిమా..మెగాస్టార్..బన్నీ గురించి మాత్రమే మాట్లాడే శ్రీనివాస్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంక్షలు.!

హీరోల పరువు తీస్తున్న కొందరు అభిమానులు..!

హీరోల పరువు తీస్తున్న కొందరు అభిమానులు..!అవును నిజమే.. అభిమానులు లేనిదే హీరోలు లేరు.. ఎంతమంది అభిమానులు ఉంటే ఆ హీరోకి అంత ఎక్కువ పారితోషకం వస్తుంది.. అలానే సినిమాను ఎంత ఎక్కువ మంది చూస్తే.. అంత ఎక్కువ డబ్బులు వస్తాయి.. అందుకే తెలుగు చిత్ర పరిశ్రమ ఎప్పుడు ప్రేక్షకులకు మర్యాద ఇచ్చింది.. వారిని ప్రేక్షక దేవుళ్ళు అని సంభోదించింది.. అలానే పిలుస్తూనే ఉంటుంది.. అలానే హీరోలు సైతం ఎప్పుడు వారి అభిమానులు కనిపించినా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు.. హీరో ను కలిసేందుకు సెట్స్ కి అభిమానులు వస్తే.. వారికి భోజనాలు సైతం ఏర్పాటు చేస్తుంటారు.. ఇక్కడ డబ్బుకు మించిన ప్రేమ అభిమానిది అయితే.. మేము తింటున్న భోజనం వీరి వల్లనే అనే కృతజ్ఞత ఆ సగటు సినిమా వారిది.. అందుకే హీరోలకు అభిమానులు పట్ల గౌరవం.. బాధ్యత ఉంటాయి..


తన అభిమాన హీరో సినిమా విడుదలవుతుంది అనగానే డబ్బులు లేకున్నా కట్ ఔట్ లకి పాలభిషేకాలు.. పూలమాలలు.. ర్యాలీలు చేస్తుంటారు.. తొలి రోజు తొలి ఆటకి అభిమాని సినిమా హాల్ ని ఒక కల్యాణ మండపంలా మారుస్తుంటారు.. అప్పట్లో కొందరు అభిమానులు పంతానికి పోయి.. రికార్డుల కోసం.. అప్పు చేసి మరీ సినిమాను.. థియేటర్ లో ఆడిస్తే.. ఆ తర్వాత అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటే ఆ నింద సగటు హీరో పైకి వచ్చేది.. అలా చేయమని హీరో ఎక్కడా చెప్పారు.. కానీ అభిమానం పేరుతో కొందరు చేసి.. హీరోని మానసికంగా బాధ పెట్టిన సంఘటనలు మనకు తెలియనివి కావు..


ఆ తర్వాతి రోజుల్లో అభిమానం సేవపైకి మళ్ళింది.. ఏ హీరో పుట్టినరోజుకి.. లేక సినిమా విడుదల రోజుకి.. ఎంత పెద్ద సేవా కార్యక్రమం చేస్తారు అనే పోటీ నెలకొనింది.. ఇది నచ్చిన చాలా మంది వ్యాపార వేత్తలు.. డబ్బు ఉన్న అభిమానులు.. వీరికి ఆర్థికంగా సహాయం చేయడంతో సేవా కార్యక్రమాలు బాగా జోరందుకున్నాయి.. అవి తెలుసుకొని హీరోలు సైతం గర్వంగా మా అభినులు గొప్ప అనే స్థాయికి చేరారు..కానీ .. ఇప్పుడు తరం మారింది.. కొత్త ట్రెండ్ వచ్చింది.. సామాజిక మద్యామాలలో అదే అభిమానులలో కొందరు ఆ హీరో పరువు తీస్తున్నారు..


పుట్టిన రోజు.. లేదా సినిమాకు సంబంధించిన ట్రెండ్ సామాజిక మాధ్యమాలలో జరగడం సర్వ సాధారణం అయిపోయింది.. ఇప్పుడు దానినే పరువుగా భావిస్తున్న కొందరు ఆ ట్రెండ్ ల కోసం ఫేక్ అకౌంట్స్ ఓపెన్ చెయ్యడం ప్రారంభించారు.. పిచ్చి బాగా ముదిరిన మరికొందరు.. ఏకంగా యంత్రాలను సైతం రంగంలోకి దించారు.. డబ్బులు ఇచ్చి బోట్స్ అని పిలిచే వాటితో ట్రెండ్స్ లో పాలుగోనడం మొదలు పెట్టారు.. టెక్నాలజీ బాగా పెరిగిన ఈ సమయంలో అవి ఇలా చేస్తున్నారు అని వేరే హీరోల అభిమానుల బయట పెట్టడం.. దింతో నిజంగా అభిమానించి ట్రెండ్ చేసిన అభిమానులు నిరుత్సాహ పడిపోతుంటే.. హీరో పరువు అక్కడ పోయింది.. దీనికి కారణం ఆ కొందరు అభిమానులే కదా..


సామాజిక మాద్యామాలలో ద్వారా అభిమానులకు.. ప్రేక్షకులకు.. దగ్గరైయే ప్రయత్నం చిత్ర పరిశ్రమలో వారు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలోనే లైవ్ లు అంటూ.. ప్రశ్నించండి(ask) అంటూ సినీ పరిశ్రమకు సంబంధించిన సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు.. అయితే వెంటనే కొందరు అభిమానాలు.. ఒక ముక్కలో అంటూ.. సగటు హీరో పేరు అడుగుతున్నారు.. వారి గురించి చెప్పడానికి.. లేక వారి గురించి ప్రేక్షకులు ఏమనుకుంటున్నారో తెలుసుకోవడానికి వస్తున్న ప్రతి సినీ సెలెబ్రిటీకి ఇదొక తల నొప్పిగా మారింది.. కేవలం హీరోల గురించి మాత్రమే చెప్పేందుకు హీరోయిన్లు.. కమిడియన్స్.. సహా నటులు.. దర్శక.. నిర్మాతలు.. సంగీత దర్శకులు.. సింగర్స్.. రైటర్స్.. సోషల్ మెడియాలోకి రావాలా..?? ఇదే అసహనం అనేక మంది అనేక సార్లు నాతోనే స్వయంగా చెప్పుకొచ్చారు.. ఒకవేళ వారి గురించి చెప్పకపోయినా.. తెలియదు అని చెప్పినా.. లేకుంటే ఈ ఇద్దరిలో ఎవరు అని అడిగిన ప్రశ్నకు ఒక హీరో పేరు చెప్పినా.. ఇక అంతే.. అదేంతో ఒక్కసారిగా అనేక అకౌంట్స్ నుండి దండ యాత్ర మొదలేదుతారు.. అసభ్య పదజాలంతో చదివేందుకు కూడా మనం ఇష్టపడలేనటు వంటి పదాలు వాడుతారు.. ఇక్కడ ఏ హీరో ఎవరిని అడగలేదు.. మా గురించి ప్రతి ఒక్కరిని అడగమని.. కానీ వీరే అడిగి.. వీరే రచ్చ చెయ్యడం మొదలు పెడతారు.. దింతో కొన్ని సార్లు.. సగటు హీరోకి ఆ సెగ తగులుతుంది.. ఏదో షో లో ఎక్కడో ఒక హీరోపై ఒక్కలు చేసిన చిన్న వ్యాఖ్యను పట్టుకొని రాదంతం చేస్తారు.. చివరకు.. ఏ మాత్రం ప్రతిభ లేకుండా పట్టుమని పది మందికి తెలియని వారు కూడా.. కేవలం కొందరు అభిమానుల అత్యుత్సాహం వల్ల సెలబ్రిటీగా ఇప్పుడు చలామణి అవుతున్నారు.. హీరోలు సైతం ఈ అభిమానులను ఎలా అదుపు చేయాలో తెలియక తలలు పట్టుకుంటుంటే.. నిజమైన అభిమానులు బాధ పడుతున్నారు..


అందుకే అంటున్నా కొందరి అభిమానుల వల్ల హీరోల పరువు పోతుంది..

ఉగాది రోజున నేను వస్తున్నాను అంటున్న చిరు

ఉగాది రోజున నేను వస్తున్నాను అంటున్న చిరు


దాదాపు నాలుగు దశాబ్దాలుగా ప్రపంచంలో ఉన్న ప్రతి తెలుగు వాడిని అలరిస్తున్న,ప్రతి తెలుగోడు ప్రేమగా మా ‘అన్నయ్య’ అని పిలుచుకునే
‘పద్మభూషణ్ డాక్టర్ మెగాస్టార్ కొణిదెల చిరంజీవి’ గారు ఇప్పుడు అభిమానులకు మరింత దగ్గరకనున్నారు.మారుతున్న కాలంతో పాటు మనం మారాలి అన్నట్లు ఆరు పదుల వయసులో కూడా కొత్త తరానికి దగ్గరైయెందుకు ప్రయత్నిస్తున్నారు చిరు.రేపు తెలుగు వారి పండగ ఉగాది.ఉగాది అంటే మన తెలుగు వారికి కొత్త సంవత్సరం ప్రారంభరోజు అని అర్థం.ఆ రోజున చిరంజీవి గారు కొత్త పనికి శ్రీకారం చుట్టనున్నారు.

నేటి తరం యువత టీవీ,పేపర్ల కన్నా సామాజిక మాద్యమం ద్వారానే సమాచారం తెలుసుకుంటున్నారు.ఇప్పటికే సీనియర్ నటులు ‘కింగ్ నాగార్జున’,’విక్టరీ వెంకటేష్’ సామాజిక మాద్యమాలల్లో వున్నారు.ఇక బాలీవుడ్ ‘బిగ్ బి అమితాబ్’,కోలీవుడ్ ‘సూపర్ స్టార్ రజినీకాంత్’ ట్విట్టర్ లో ఎప్పుడు వారి సందేశాన్ని పంచుతూ వుంటారు.ఇవన్ని చూసి తనేందుల్లో తక్కువ కాకూడదు అని అనుకున్నారో ఏమో గాని చిరంజీవి గారు సోషల్ మీడియాలోకి అడుగు పెడుతున్నట్లు ప్రకటించేశారు.తెలుగు కొత్త సంవత్సర ప్రారంభరోజైన ఉగాది పండుగ రోజు ఆయన సామాజిక మద్యంలోకి రానున్నట్లు వీడియో ద్వారా ఈ రోజు ప్రకటించారు.

సాధారణంగా ప్రతి సంవత్సరం జనవరి 1న చిరంజీవి గారి ఇంటి వద్ద తన అభిమానులు వచ్చి తనని కలుస్తూ ఉంటారు.అది కాక ఈ మధ్య ప్రతి సినిమా ఫంక్షన్ కి తానే ముఖ్య అతిధిగా వస్తూ అటు ఆ సినీ బృందానికి ప్రచారంలో సహాయపడుతూ ఇటు అభిమానులకు చేరువవుతూ వచ్చారు చిరు.సామాజిక స్పృహ ఎక్కువ ఉన్న చిరు తన సందేశాన్ని ఎప్పటికప్పుడు ప్రెస్ నోట్ ద్వారా,లేక కొణిదెల ప్రొడక్షన్ హౌస్ అకౌంట్ ద్వారా,లేక తన కోడలు ఉపాసన అకౌంట్ నుండి పంపేవారు.ఇప్పుడు నేరుగా ఆయనే సామాజిక మద్యంలోకి వస్తుండడంతో ఆయనే స్వయంగా అభిమానులకు తన సందేశాన్ని ఇవ్వనున్నారు.కరోనా వల్ల అటు సినిమా షూటింగ్స్ లేక పరిశ్రమ,ఇటు సినిమా ప్రదర్శనలు లేక తీవ్ర నిరాశతో ఉన్న తెలుగు సినీ ప్రేక్షకులకు చిరంజీవి గారి ప్రకటన కొంత ఆనందాన్ని పంచిందనే చెప్పాలి.

ఇక ఎవరు సోషల్ మీడియాలోకి వచ్చినా రికార్డ్స్ గురించి మాట్లాడుతుంటారు అభిమానులు,మరి ఇండస్ట్రీ మొత్తం ఇప్పటికే ఆయనకు స్వాగతం పలుకుతున్న వేళ ఆయనను తొలి రోజు ఎంతటి స్థాయిలో అభిమానులు అనుసరిస్తారో చూడాలి..!కేవలం సినిమా వేడుకలలో మాత్రమే ఆయన సందేశాన్ని ఇస్తున్న చిరు ఇక మీదట వీడియోల రూపంలో పెడుతూవుంటారా?ఎప్పుడైనా ఒక్కసారి లైవ్ లోకి వస్తారా?వస్తే నా ప్రశ్నకు సమాధానం ఇస్తారా అంటూ ఇప్పటికే మెగాభిమానులు సామాజిక మాధ్యమంలో మాట్లాడుకుంటున్నారు.


ఇప్పటికే క్యారివాన్ గురించి నేటి తరం నటీనటులకు ఒక క్లాస్ తీసుకొని ఇండస్ట్రీని ఒక కుదుపు కుదిపేసిన ‘బిగ్ బాస్’,మరి ఇప్పుడు సామాజిక మాధ్యమంలోకి వచ్చి అటు ఇండస్ట్రీ,ఇటు ప్రజలకు ఇంకేన్నీ క్లాసులు తీసుకుంటారో మనందరి మంచి కోరే మన ‘మాస్టారు’ అనేది చూడాలి..!

Chiranjeevi instagram official account
Chiru video

మహిళల విలువ చెప్పిన పవన్ కళ్యాణ్ మగువా మగువా పాట..!

మహిళల విలువ చెప్పిన పవన్ కళ్యాణ్ మగువా మగువా పాట..!


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి వకీల్ సాబ్ చిత్రం నుండి విడుదలైన మగువా..మగువా..పాట ఇప్పుడు పెను చాలనంగా మారింది.అతి తక్కువ సమయంలో ఎక్కువ మంది ఆ పాటను వింటున్నారు.

అసలే దేశం పట్ల భక్తి,మహిళల పట్ల గౌరవం చూపుతూ తన సినిమాలలో ఏదో ఒక సందేశాత్మక పాటను పేటెందుకు చూసే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమా,అందులోను మహిళలకు సంబంధించిన సినిమా.ఒక పక్క వరస హిట్స్ తో అభిమాన నటుడికి తొలిసారి స్వరాలను సమకూర్చిన తమన్,మరో పక్క పాటలతో అందరినీ మెపించే రామజోగయ్య శాస్ట్రీ గారు.తన గొంతుతో శ్రోతలను మైమరిమించేలా చేసే సిద్ శ్రీరామ్ గాత్రం.

దింతో ఆ పాట పై సాధారణంగానే అంచనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.దానికి తగ్గట్లే ఒక్క చక్కటి మెలోడీ రాగాన్ని తమన్ అందుకోగా రామజోగయ్య గారు మహిళల గురించి చక్కగా వర్ణించారు.ప్రతి మగువ గొప్పతనం చెప్పే ఈ పాట అందరినీ ఇప్పుడు అలరిస్తుంది.వీడియోలో మదర్ తెరెసా దగ్గర నుండి మన తెలుగు క్రీడా సంచలనం పి.వి.సింధు దాక అనేక రంగాలలో రాణించిన మహిళల ఫోటోలు అందులో చూపించారు.దింతో చిత్ర బృందం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు వారందరిని ఒక్కసారి తలుచుకున్నట్లు అనిపించింది.

దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి నుంచి విడుదలైన తొలి పాట కనుక వారి అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి.మరో పక్క మహిళలకు సంబంధించిన పాట అందులో మెలోడీ కావడంతో పాట వింటున్న శ్రోతలందరి నుండి మంచి ప్రశంసలే వస్తున్నాయి.సాధారణంగానే సామాజిక మద్యమలలో రికార్డ్స్ సృష్టించే పవన్ కళ్యాణ్ చాలా గ్యాప్ తర్వాత రావడంతో ఈ పాట సృష్టించబోయే రికార్డ్స్ గురించి ఆలోచించనక్కర్లేదు.

పాట గురించి రామజోగయ్య శాస్త్రి గారి మాటలలో అన్ని పాటలకు స్పందన వస్తుంది,కానీ కొన్ని పాటలకు మాత్రమే మర్యాద వస్తుంది ఇది అందులో ఒక్కటి అన్నారు.పాట వింటే అది నిజం అనక తప్పదు.భారీ తారగణంతో శ్రీరామ్ వేణు దర్శకత్వంలో బోనీ కపూర్ సమర్పణలో దిల్ రాజు శిరీష్ నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం వకీల్ సాబ్ ఈ వేసవికి విడుదల కానుంది.

తొలి పలుకు..!

తొలి పలుకు..!

ఎందరో కళామ తల్లి ముద్దు బిడ్డలు,మరెందరో ప్రేక్షకులు అందరికి వందనాలు..!

ప్రపంచానికి సినిమా ఒక వినోదం,కానీ ఒక సినిమా తెర మీద కనిపించే నటి,నటులు,నృత్య కళాకారులు,పోరాట యోధులతో పాటు తెర వెనుక పని చేసే దర్శక,సంగీత,ఎడిటింగ్, గ్రాఫిక్స్, డబ్బింగ్ విభాగాలు అంటూ ఎందరికో ఉద్యోగ అవకాశం ఇస్తుంది.ఇవి కాకుండా సినిమా ప్రారంభానికి ముందు ఆఫీస్ లో పని చేసే ఆఫీస్ బాయ్ నుండి విడుదలకు ముందు పోస్టర్స్ అతికించే వారి వరకు మరెందరికో పని కలిపిస్తుంది సినిమా.

88 సంవత్సరాల తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎందరినో ఆయా విభాగాలకు స్టార్ లను చేసింది,మరెందరికో ఉద్యోగావకాశాలను కలిపించింది.డిజిటల్ యుగంలో మన తెలుగు సినిమా స్థాయి రాష్ట్రాలు,దేశాలు, ఖండాంతరాలు దాటేసింది.ఒక పక్క ప్రజలకు వినోదం అందిస్తూ,మరో పక్క అనేక కుటుంబాలకు జీవనాధారంగా మారిన తెలుగు చిత్ర పరిశ్రమ “ఇంతింతై వటుడింతై” అన్నట్లు ప్రతి సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ ఒక ప్రాంతీయ పరిశ్రమ నుండి నేడు ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరిగే పరిశ్రమగా మారింది.

అటువంటి చిత్ర పరిశ్రమ విషయాలు తెలుసుకునేందుకు ప్రజలు సహజంగానే ఆశక్తి కనబరుస్తున్నారు.కేవలం చిత్ర పరిశ్రమ విశేషాలు అందించేందుకే ఎన్నో మ్యాగ్జైన్లు పుట్టుకొచ్చాయి.డిజిటల్ జమానలో అనేక వెబ్సైట్లు,యూట్యూబ్ ఛానల్ లు వెలిశాయి.ఇప్పటికీ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియాలో సినిమా వార్తలు మాత్రమే చదివే,చూసే పాఠకులు,వీక్షకులు వున్నారు.నిత్యం సినిమా ప్రకటనల రూపంలో ప్రింట్,ఎలక్ట్రానిక్,మరియు సోషల్ మీడియాకు ఎన్నో లక్షల రూపాయలు పరిశ్రమ ఇస్తుంది.కానీ అదే చిత్ర పరిశ్రమలోని వ్యక్తి ఒక చిన్న తప్పు చేసినా,ఆ వార్తకు ఇవ్వాల్సిన దానికంటే మించిన ప్రాధాన్యత ఇస్తుంటారు.

నేను,ఒక వెబ్సైట్ ప్రారంభించనునట్లు కొంత మందితో పంచుకున్నపుడు నాకు వారు చెప్పిన మాటలు కొంచెం కష్టపడితే బాగా డబ్బులు వస్తాయి.సినిమాకు రేటింగ్,రివ్యూ ఇవ్వు ప్రొడ్యూసర్స్ నుండి డబ్బులు డిమాండ్ చెయ్యి,గాసిప్స్ బాగా రాయి,వ్యక్తిగతంగా ఎవరైనా తప్పు చేసి దొరికితే ఒక్కటికి పది ఆర్టికల్స్ రాయి ఎక్కువ మంది చూస్తారు అని సలహా ఇచ్చారు. అంటే సినిమా విశేషాలు,నటి,నటుల,సాంకేతిక నిపుణుల నైపుణ్యాలను దాటి వారి వ్యక్తిగత విషయాల పై కొంతమంది ఎక్కువ దృష్టి పెడుతున్నారు.వాటికే ప్రజల నుండి కూడా భారీ స్పందన వస్తుండడంతో వాటికి ప్రాధాన్యత మరింత పెరిగిపోయింది. మరో పక్క ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా తొలి రోజు తొలి ఆట వరకే ప్రచారం,ఆ తర్వాత సినిమా బాగుందో లేదో ప్రేక్షకులు నిర్దారించేస్తారు. కానీ రివ్యూ,రేటింగ్ అంటూ అక్కడ కూడా కొందరు…,

ఈ వెబ్సైట్ లో కేవలం సినిమా విషయాలు, నటి,నటుల,సాంకేతిక నిపుణులు సినిమాకు వారందించిన సేవలు గురించి,కొత్త తరంలో కొత్తవారిని ప్రోత్సహించడం మాత్రమే తప్ప వారి వ్యక్తి గత విషయాలు,చిత్రం విడుదల అనంతరం రివ్యూలు అంటూ ఎటువంటి వ్యాసాలు రాయబడవు. చిన్నతనం నుండి పత్రికలు చదవడం,వార్తలు చూడడం,వ్యాసాలు రాయడం ఇష్టం,మరో పక్క వయసు పెరిగే కొద్ది చిత్ర పరిశ్రమపై ఆశక్తి పెరుగుతుండడంతో చిత్ర పరిశ్రమ గురించి వార్తలు రాసేందుకు వెబ్సైట్ ప్రారంభించాలి అని భావించాను.ఏమి చేసినా మనదైన ముద్ర ఉండాలి అని ఎవరైనా భావిస్తారు నేను అలాగే నా ధోరణిలో వెళ్ళేందుకు సిద్ధపడి,బ్రేక్ ది రూల్స్ అని నామకరణం చేశాను.చిత్ర పరిశ్రమ నాకు అర్థమైన విధానం,నేను చూసిన కోణంలో వ్యాసాలు రాస్తాను.నా వ్యాసాల పై మొహమాటం లేకుండా మీ అభిప్రాయాలను నాతో పంచుకుంటారని,నచ్చితే షేర్ చేసి ఆదరిస్తారు అని భావిస్తూ

ధన్యవాదాలు,
సెలవు.
మీ
నిఖిల్ కార్తీక్,
సంపాదకుడు.