20-01-2021 02:14:19 About Us Contact Us
సంవత్సరంలో 8 సినిమాలు చేసిన అల్లరి నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!

సంవత్సరంలో 8 సినిమాలు చేసిన అల్లరి నరేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు..!



నరేష్.. అల్లరి నరేష్.. తెలుగు ప్రేక్షకులను తమ కుటుంబ సభ్యులతో మనసారా నవ్వుకునేలా చేసిన ఈ.వి.వి. సత్యనారాయణ గారి అబ్బాయి.. తొలి సినిమా తోనే తన పేరుకు ముందు టైటిల్ తగిలించుకున్న హీరో.. కామెడీ మాత్రమే కాదు విలన్ గా కూడా చేయగలను అని రుజువుచేసిన నటుడు.. అప్పట్లో రాజేంద్రప్రసాద్ గారు ఇప్పట్లో అల్లరి నరేష్ అనే స్థాయికి ఎదిగిన కామెడీ కింగ్.. మన సడన్ స్టార్.. అలాంటి స్లిమ్ స్టార్ అల్లరి నరేష్ గారి పుట్టినరోజు నేడు..


1982లో చెన్నైలో జన్మించిన నరేష్.. తన విద్యాబ్యాసం కూడా అక్కడే చేశారు. పరిశ్రమ హైదరాబాద్ వచ్చిన క్రమంలో కుటుంబంతో పాటు హైదరాబాద్ చేరారు నరేష్.. ప్రముఖ దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ గారి అబ్బాయి నరేష్ హీరోగా.. ప్రముఖ నటులు చలపతిరావు గారి అబ్బాయి రవి బాబు దర్శకత్వం లో సినిమా అనే వార్త అప్పట్లో టాక్ ఆఫ్ ఇండస్ట్రీ అయింది.. 2002లో అల్లరి పేరుతో ఆ సినిమా విడుదలైంది.. సినిమా భారీ విజయం సాధించింది.. నాటి నుండి ఆయన పేరుకు ముందు అల్లరి చేరిపోయింది.. అల్లరి నరేష్ గా మారిన నరేష్.. తొట్టి గ్యాంగ్.. మా అల్లుడు వెరీ గుడ్.. డేంజర్.. కితకితలు.. గోపి గోడ మీద పిల్లి.. సీమశాస్ట్రీ సినిమాలతో మంచి విజయాలు సాధించారు.. 2002 నుంచి 2007 వరకు 18 సినిమాలు చేశారు..


2008లో ఒక పక్క తన స్పీడ్.. మరో పక్క తన నటనా వైవిధ్యం.. అటు పరిశ్రమకు.. ఇటు ప్రజలకు.. తెలియ చేశారు నరేష్. నేటి తరం ఏ హీరో చేయలేని విధంగా ఒక సంవత్సరంలో తాను నటించిన 8 సినిమాలు విడుదలయ్యాయి. అందులో విశాఖ ఎక్స్ ప్రెస్ సినిమాతో హీరో గా మాత్రమే కాకుండా ఒక నెగటివ్ పాత్రలో కనిపించారు.. ఆ సినిమాలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు లభించాయి.. అదే సంవత్సరం విడుదలైన మరో సినిమా గమ్యం.. శర్వానంద్ తో కలిసి నటించిన ఆ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసుకోవడంతో పాటు నరేష్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు. అదే సంవత్సరం బాపు..రమణ గార్ల సినిమా సుందరఖండ లో సైతం నటించారు. నేటి తరం హీరోలలో ఎవరికి ఆ అవకాశం దక్కలేదు. అలా 2008లో అనేక రికార్డులు అందుకున్నారు నరేష్.



ఆ తర్వాత వరసగా కామెడీ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిపోయారు నరేష్. 2012లో వచ్చిన సుడిగాడు.. ఒక టికెట్ తో వంద సినిమాలు అనే శీర్షక సినిమా నరేష్ ను సడన్ స్టార్ గా మార్చేసింది.. 100 సినిమాల పేరడీ తో తీసిన ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం నమోదు చేసుకుంది. 2013లో దేశంలోనే తొలి కామెడీ 3డి సినిమా చేశారు నరేష్. 2014లో లడ్డు బాబు తో భారీ ఆకారంలో కనిపించి నవ్వించారు నరేష్. ఇలా కామెడీ సినిమాలలో సైతం భిన్నంగా.. తనదైన ముద్ర ఉండేలా సినిమాలు చేశారు నరేష్.


2019లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో పల్లెటూరు పాత్రలో చాలా బాగా చేసి.. అందరిని అలరించారు నరేష్. 2004లో తను నటించిన నేను సినిమా పాత్రకు ఈ పాత్ర దగ్గరగా ఉంటుంది.. ఇప్పుడు తాజాగా నాంది సినిమాతో మరో విలక్షణ పాత్రకు శ్రీకారం చుట్టినట్లు పోస్టర్స్ చూస్తే తెలుస్తుంది.. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా నాంది టీజర్ విడుదల కానుంది.. అలానే తాను నటించిన మరో సినిమా బంగారు బుల్లోడు సినిమా టీజర్ సైతం నేడే విడుదల కానుంది..


18 ఏళ్ళ సినీ ప్రస్థానం.. 57 సినిమాలతో మనని అలరించిన కామెడీ కింగ్.. సడన్ స్టార్.. స్లిమ్ స్టార్.. అల్లరి నరేష్ గారు ఇలానే మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని.. మనల్ని ఇలానే అలరించాలని.. భారీ విజయాలు నమోదు చేయాలని ఆసిస్తూ.. మా బి.ఆర్. మూవీ జోన్.. తరపున జన్మదిన శుభాకాంక్షలు..!

పోస్టర్స్ తో ఆకట్టుకున్న నాంది టీజర్ రేపే విడుదల

పోస్టర్స్ తో ఆకట్టుకున్న నాంది టీజర్ రేపే విడుదల



అల్లరి నరేష్ హీరోగా.. కొత్త దర్శకుడు విజయ్ కనమేడల దర్శకత్వంలో.. ఎస్.వి.2 ఎంటర్టైన్మెంట్ సంస్థ ద్వారా సతీష్ వేగేశ్న నిర్మిస్తున్న చిత్రం “నాంది”. ఈ నెల (ఏప్రిల్)30న టీజర్ ను విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి.


గత సంవత్సరం చివర్లో ఎస్.వి.2 నిర్మాణ సంస్థ.. నరేష్ 57వ సినిమాగా.. ఈ సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్మాణ సంస్థకు ఇదే తొలి సినిమా.. అలానే దర్శకుడికి సైతం ఇదే తొలి సినిమా. ఈ ఏడాది జనవరి 18న.. సినిమా ముహూర్తం 20న నిర్చయించినట్లు ఒక పోస్టర్ ద్వారా ప్రకటించారు.. రక్తంతో ఉన్న నరేష్ ఫోటో చూసి సినిమా విభిన్నంగా ఉండనున్నట్లు అనిపించింది.. ప్రారంభోత్సవరోజున నాంది అనే టైటిల్ పోస్టర్ ను విడుదల చేసింది బృందం. ఆ పోస్టర్ లో నరేష్ నగ్నంగా సంకెళ్లతో చేతులు..కాళ్ళు.. కట్టేసి.. దూలానికి ఎలాడతీశినట్లు ఉంది. దింతో సినిమా పై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. నరేష్ గత సినిమాలకు ఈ సినిమాకు సంబంధం లేదు అని చెప్పే ప్రయత్నంలో దర్శకుడు విజయ్ విజయం సాధించారు. ఆ తర్వాత తొలి రెండు షెడ్యూల్స్ ని పూర్తి చేసుకొని.. ఎడిటింగ్ ను ఒక్కసారి.. డబ్బింగ్ ను మరోసారి ప్రారంభించినట్లు తెలిపింది నిర్మాణ సంస్థ.



రేపు (ఏప్రిల్ 30న) టీజర్ విడుదల చేస్తున్నట్లు 27న పోస్టర్ లో తెలిపారు.. అందులో నరేష్ పోలీస్ స్టేషన్ లో నగ్నం కూర్చోనున్నట్లు ఉంది. దింతో తొలి పోస్టర్ లో నరేష్ ని సెల్ లో ఉంచినట్లు అర్ధమవుతుంది. ఈ మధ్య టీజర్.. ట్రైలర్ లకు కొత్త పేర్లు పెడుతున్న ట్రెండ్ ని ఈ సినిమా బృందం ఫాలో అయ్యారు. టీజర్ కు ఫస్ట్ ఇంపాక్ట్ రివీల్ అని పేరు పెట్టారు.. షార్ట్ ఫారం లో ఎఫ్.ఐ.ఆర్ వచ్చేలా అన్నమాట. నిన్న వరసగా నాలుగు పోస్టర్స్ తో పాత్రలను పరిచయం చేశారు. తొలుత ప్రవీణ్ కార్ నడుపుతున్న సంతోష్ గా.. హరీష్ ఉత్తమన్ పోలీస్ ఆఫీసర్ కిషోర్ గా.. ప్రసృతం అటు హీరోగా ఇటు కమెడియన్ గా ట్రెండింగ్ లో ఉన్న ప్రియదర్శి.. ల్యాప్ టాప్ వాడుతున్న రాధ ప్రకాష్ గా పోస్టర్స్ విడుదల చేశారు. చివరిగా అటు తమిళం.. ఇటు తెలుగులో నటిగా మంచి పేరు సంపాదించుకున్న వరలక్ష్మి.. లాయర్ ఆద్య పాత్ర చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు. ప్రతి పోస్టర్ తో ఆ సినిమా ప్రపంచంలోకి తీసుకువెళ్లారు.


దింతో రేపు విడుదల కానున్న టీజర్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలానే పోస్టర్స్ తోనే సినిమాపై సైతం భారీగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ బ్రాహ్మ కడలి ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్. సినెమత్తోగ్రఫీ సీడ్ చెయ్యగా.. సంగీతం శ్రీ చరణ్ పకల అందించారు. చోటా. కె. ప్రసాద్ ఎడిటర్. సినిమా విజయం సాధిస్తుందని.. చిత్ర బృందం బలంగా నమ్ముతుంది. సినిమా చిత్రీకరణ పూర్తిగా అయిపోయిందా.. తీయటర్లు ఓపెన్ చేసేదాక అగుతారా..లేక ఓ.టి.టి లో విడుదల చేస్తారా అని అంశాలపై సినిమా బృందం ఎక్కడా అధికారికంగా ప్రకటించలేదు. రేపు టీజర్ విడుదల తర్వాత మిగతా విషయాలు తెలిసే అవకాశం ఉంది.