05-03-2021 08:55:21 About Us Contact Us

Zombie Reddy (జాంబి రెడ్డి)  :  AWE చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో.. మెగాస్టార్ చిరంజీవి గారి ఇంద్ర సినిమాతో బాల నటుడుగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ఓ బేబీ చిత్రంలో సమంత తో పాటు కీలక పాత్రలో నటించిన తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన చిత్రం (Zombie Reddy) జాంబి రెడ్డి.ఈ చిత్ర ట్రైలర్ ని రెబల్ స్టార్ ప్రభాస్ చేతుల మీదగా విడుదల చేసారు చిత్ర బృందం.




ఇక ట్రైలర్ విషయానికి వస్తే ఆసక్తి రేకేతించే విధంగా ఉంది. జోంబిస్ ఒక ఫ్యాక్షన్ ఏరియాకి వెళితే ఎలా ఉంటుంది.. వాటిని అ ప్రాంత ప్రజలు ఎలా ఎదురుకున్నారు అనేది చిత్ర కథగా తెలుస్తుంది.


ఇప్పటి వరకు చూడని వినూత్న కథ..కధనంతో వస్తుంది ఈ చిత్రం. వినూత్న దర్శకుడిగా పేరు తెచ్చుకున్న యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ.. ఈ చిత్రంతో ఇంకొక ప్రయోగం చేశాడనే చెప్పాలి. బాల నటుడిగా అదరగొట్టిన తేజ సజ్జ.. ఈ చిత్రంతో మరొక సారి అలరించడానికి సిద్ధం అయ్యాడు. తేజకి జంటగా దక్ష నగర్కర్ నటించగా.. ముఖ్య పాత్రలో బస్టాప్ చిత్ర ఫేమ్..ఆనంది నటిస్తున్నారు.


ఆపిల్ ట్రీ స్టూడియో బ్యానర్ లో రాజశేఖర్ వర్మ గారు తెరకేక్కిస్తున్న ఈ చిత్రానికి మార్క్ కె రోబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు హంగులు అద్ధాయి. రోబిన్ స్వరపరించిన గో కరోనా అనే పాట ఇప్పటికి బాగా ప్రచుర్యం
పొందింది.

Zombie reddy


జనవరిలోనే విడుదల అవ్వాల్సిన ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొంచెం ఆలస్యం అవ్వడంతో ఫిబ్రవరి 5న విడుదల చేస్తున్నారు. ఎప్పుడు కొత్తదనాన్ని ప్రోత్సహించే తెలుగు ఆడియన్స్.. ఈ చిత్రాన్ని కూడా ఆదరించి.. మంచి విజయం అందిస్తారని.. చిత్రం బృందానికి.. మరపురాని విజయంగా నిలవాలని.. మనస్ఫూర్తిగా కోరుకుందాం.

 

ఇలాంటి మరిన్ని కొత్త సినిమాల అప్డేట్ కోసం బి.ఆర్. మూవీ జోన్ ఫాలో అవ్వండి 
జాంబి ట్రైలర్