18-04-2021 23:23:42 About Us Contact UsYash Birthday: కే.జీ.ఎఫ్ సినిమాతో ఒక ప్రాంతీయ భాష హీరో స్థాయి నుండి.. భారతదేశం మొత్తం తెలిసే స్థాయికి చేరిన నటుడు. ఇటీవల ముఖ్యంగా మన తెలుగులో విపరీతమైన ప్రజాదరణ పొందిన పరభాషా నటుడు యష్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కథనం…


మనం యష్ అని పిలుచుకునే రాకింగ్ స్టార్ అసలు పేరు నవీన్ కుమార్ గౌడ.. కర్ణాటకలో జన్మించిన యష్ మైసూర్లో ఉన్న మహాజన్ హై స్కూల్ లో ప్రాధమిక విద్యని అభ్యసించాడు.ఈ స్కూల్ లో చదువుకుంటున్న సమయంలోనే త్రిపాటీలు వేసే నాటకాలను చూసి ఆసక్తి పెంచుకున్నాడు. స్కూల్ విద్య అయిపోయిన తరువాత ప్రముఖ నాటక కర్త బి వి కారత్ గారు స్థాపించిన బేరకా అనే నాటక సంస్థలో జాయిన్ అయ్యి నటనలో మెలకువలు నేర్చుకున్నాడు.


తరువాత యష్ నాటకాలను సీరియల్ డైరెక్టర్ అశోక్ కాశ్యప్ చూసి.. తాను డైరెక్ట్ చేస్తున్న నందగోకులే అనే సీరియల్ లో అవకాశం ఇచ్చాడు ఈ సీరియల్ ఈటీవీ కన్నడలో ప్రసారం అయ్యేది. ఉదయ్ టీవీ లో రోజా నటించిన ఉతరాయణ అనే సీరియల్లో కూడా నటించాడు. ఇలా సీరియల్స్ లో నటిస్తూనే సినిమా అవకాశలకోసం ప్రయత్నాలు చేసే వాడు నవీన్ కుమార్ గౌడ అలియాస్ యష్….


ఆలా ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో డైరెక్టర్ ప్రియదర్శి దర్శకత్వం లో వచ్చిన జమబలపూడిగిలో అంత ప్రాధాన్యత లేని పాత్రలోనైనా సరే కష్టపడి చేసిన తత్వం చుసిన డైరెక్టర్ శశాంక్.. తన చిత్రం మగ్గిన మనసు అనే చిత్రంలో ఒక ప్రాధాన్యం ఉన్న పాత్ర ఇచ్చారు. ఈ చిత్రం 2008 లో విడుదలై మంచి విజయం సాధించింది. ఈ చిత్రానికి గాను యష్ కి ఫిల్మ్ ఫేర్ అవార్డు కూడా వచ్చింది.


ఆ తర్వాత.. రాజధాని, డ్రామా,గూగ్లీ వంటి చిత్రాలతో సూపర్ హిట్స్ అందుకున్నారు. తనతో మగ్గిన మనసు, డ్రామా వంటి చిత్రాల్లో తనకి జంటగా నటిచ్చిన రాధికా పాండేను 2016 డిసెంబర్ 9 న బెంగళూరు లో వివాహం చేసుకున్నారు.


అప్పటి వరకు ఉన్న యష్ క్రేజ్ ని కే.జి.ఎఫ్ చిత్రం శిఖరాగ్రానికి తీసుకుని వెళ్లి కన్నడ చిత్రసీమలో యష్ ని సింహాసనం మీద కూర్చోపెట్టింది. డిసెంబర్ 21, 2018 న ప్రశాంత్ నీళ్ దర్శకత్వం వహించిన కే.జీ.ఎఫ్ చిత్రం విడుదలైన అన్ని బాషల్లోను అద్భుతమైన విజయాన్ని అందుకుంది.


ఇప్పుడు దానికి పార్ట్ -2 కూడా వస్తుంది. కే.జీ.ఎఫ్ చాప్టర్ 2 టీజర్ విడుదలకి ఒకరోజు ముందు అనగా నిన్న రాత్రి లీక్ అవ్వడంతో చిత్ర యూనిట్ ఇవాళ విడుదల చేయాల్సిన టీజర్ ని నిన్న రాత్రి 9:29 కి విడుదల చేసారు. విడుదలైన ఈ టీజర్ ఇప్పటి వరకు ఉన్న యూట్యూబ్ రికార్డ్స్ ని తిరగరాస్తూ 24 గంటలు గడవకముందే 50M విక్షకులతో 3M లైక్స్ ని సొంతం చేసుకుంది.


ఇలాంటి మరిన్ని చిత్రాలాతో ప్రేక్షకులని అల్లరిస్తూ ఎన్నో విజయాలను సొంతం చేసుకుని.. మనస్పూర్తిగాగా కోరుకుంటూ మా బి.ఆర్. మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు తెలుపుకుంటు.. ఆయనను చూసి యువత.. వచ్చిన ప్రతి అవకాశాన్ని విజయాలుగా ఎలా మలుచుకోవాలో తెలుసుకుంటారు అని ఆశిస్తున్నాం.

కే.జీ.ఎఫ్ టీజర్