25-01-2022 16:32:52 About Us Contact Us“వాసు”,2002లో వచ్చిన ఈ సినిమా తెలియని ఆనాటి యువత లేరు అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.”తొలిప్రేమ”,”యువకుడు”వంటి యూత్ హిట్స్ అందుకున్న దర్శకుడు “కరుణాకరన్”దర్శకత్వంలో అప్పుడే “నువ్వు నాకు నచ్చావ్” లాంటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న “విక్టరీ వెంకటేష్” కాంబినేషన్ లో సినిమా.ఇక “ఖుషి” లాంటి భారీ విజయం అందుకొని గతంలో అదే కరుణాకరన్ తో పని చేసిన “భూమిక” హీరోయిన్.దింతో ఆ సినిమా వార్తలు పేపర్ లోనే అంచనాలు పెంచింది.ఇక గిటార్ తో,భూమిక తో వెంకటేష్ పూర్తిగా లవర్ బాయ్ గెటప్ లో కనిపించాడు,దింతో పోస్టర్స్ గోడ మీద పడగానే సినిమా గురించి చర్చలు మొదలైపోయాయి,యువత ఆ లుక్స్ ని అదే ఫాలో అవ్వడం అదే ఆ పిల్లి గడ్డం పెట్టుకోవడం ప్రారంభించారు..”వాసు” సినిమాకి ” వాయిస్ ఆఫ్ యూత్” అనే శీర్షిక


అప్పుడే పాటలు విడుదలయ్యాయి,తమిళంలో రెండు,మూడు సినిమాలు మాత్రమే చేసి హిట్ అందుకున్న యువ సంగీత దర్శకుడు హారీస్ జయరాజ్ పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.ఎంతలా అంటే ఇప్పటికి ‘పాట కు ప్రమాణం పల్లవి అయితే’ అనే పాట పెట్టగానే ఆ తరం యువత గొంతు కలిపేంతల..,నేటి తరం యువత కూడా ఆ పాటలు వింటున్నారు..అది ఆ రోజులు ఆ పాటల విషయం.ఆల్బమ్ మొత్తం హిట్ అనే చెప్పాలి.


ఇక ఇంత పెద్ద మ్యూజిక్ హిట్ అందుకున్న సినిమా 2002 ఏప్రిల్ 10న విడుదలయ్యింది.తొలి స్కీన్ లోనే ఇది ఒక యూత్ సినిమా అని అందరికి అర్థమైపోతుంది,ఇక సోనారే,సోనారే..,” స్పోర్టివ్ బాయ్స్,స్పైసీ గార్ల్స్..”అంటూ వచ్చిన పాట నుండి మొదలు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ పంచ్ లతో మంచి కామెడీ సన్నివేశాలు ఉంటాయి.తనకు నచ్చిన మ్యూజిక్ ఒక పక్క,తండ్రికి ఇష్టమైన పోలీస్ జాబ్ మరో పక్క,ఇలా ప్రతి ఇంట్లో తనకు ఇష్టమైన వృతిలోకి వెళ్లాలా లేక తల్లితండ్రులు చెప్పిన ఉద్యోగం చెయ్యాలా అనే యువకుని కధ ఇది.దింతో యువత బాగా కనెక్ట్ అయ్యారు.శీర్షిక కు తగ్గట్లు ఆనాటి యువత గొంతుక అయింది ఈ సినిమా..


దీనికి తోడు నచ్చిన అమ్మాయిని తనవైపు తిప్పుకొనేందుకు పడే పాట్లు మనల్ని బాగా అలరించాయి.అసలు సినిమా ఎక్కడా బోర్ అనే ఫీలింగ్ రాదు.ఒక పక్క భూమికతో రొమాన్స్,ఫ్రెండ్స్ తో కామెడీ,ఫామిలీ తో సెంటిమెంట్ ఇలా అన్ని సన్నివేశాలలో వెంకటేష్ జీవించేశాడు.అందుకే కదా మరి మన విక్టరీ వెంకీ మామ అటు ఫామిలీ ఇటు యూత్ కి బాగా దగ్గరై అందరి హీరోగా నిలిచాడు.బాలు అదేనండి మన సునీల్ స్కీన్ లు ఎన్నిసార్లు చూసినా, టీవీలో వస్తుంటే నవ్వు అపుకోవడం కష్టమే మనకి.అలా అన్ని కలగలిసిన సినిమా వాసు.అలాంటి సినిమా వచ్చి 18ఏళ్ళు గడిచింది అంటే నమ్మసఖ్యంగా లేదు.ఆ సినిమా లోని ప్రతి సన్నివేశం ఇంకా కళ్ళ ముందరే ఉంది.లవ్ స్టొరీ తో పాటు యువతకు,వారి తల్లితండ్రులకు మంచి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమా వాసు.ఇక ఆ రోజు నుండి యువత ఆ గిటార్ లతో ఫోటోలు దిగటం ఇప్పటికి మానలేదు.వెంకటేష్ లుక్స్ సినిమాకి పెద్ద హైలైట్.”మార్తాండ్.కె.వెంకటేష్” గారు ఈ సినిమాకి ఎడిటర్.”కె.ఎస్.రామారావు” గారు ‘క్రియేటివ్ కమర్షియల్స్’ లో ఈ సినిమాని చిత్రీకరించారు.18ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో సోషల్ మీడియాలో “వాసు”ట్రెండ్ అవుతుంది..


దాదాపు రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న “వాసు”, మరో రెండు దశాబ్దాలు గడిచినా మన తెలుగు వారి జ్ఞాపకాలలో ఉంటుంది.ఇదంతా చదివాక సినిమా గుర్తుకొస్తుందా,చూసి చాలా రోజులు అయింది అనుకుంటున్నారా ఇంకెందుకు ఆలస్యం ఇంట్లోనేగా వున్నారు మరోసారి చూసేయండి..