08-03-2021 02:18:51 About Us Contact Usబాల నటుడిగా పరిచయమై.. ఆరేళ్ళ నుండి హీరోగా అలరిస్తున్న ఆరడుగుల అందగాడు.. అమ్మయిలలో మంచి ఫాలోవింగ్ సంపాదించి.. అటు మాస్ ఇటు క్లాస్ అని తేడా లేకుండా.. తన సినిమా అంటే వెళ్లి చూడచ్చు అనే స్థాయికి చేరిన హీరో.. విమర్శకుల ప్రశంసలు పొందిన నటుడు.. టవర్ స్టార్.. మన నవ్వుల బాబు.. నాగబాబు గారి తనయుడు.. “మెగా ప్రిన్స్” “కొణిదెల వరుణ్ తేజ్”. నేడు అలాంటి వరుణ్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక కథనం..


కెర్రీర్ ప్రారంభం నుండి మెగా హీరో అనే ఒక ట్యాగ్ పడకుండా జాగ్రత్త పడ్డారు వరుణ్ తేజ్. పెదనాన్న.. తండ్రి.. బాబాయ్.. పేరు వాడుకొని క్రేజ్ సంపాదించాలనుకోకుండా.. తన స్టోరీ సెలక్షన్ తో అభిమానులను పొందారు వరుణ్ తేజ్. ముకుంద చిత్రంతో హీరోగా మొదలైన తన సినీ ప్రస్థానం.. అనతి కాలంలోనే తన వైవిధ్యమైన పాత్రాల ఎంపికతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు ఈ కొణిదెల వారసుడు. రెండవ సినిమా కంచె లో తన నటనకు విమర్శకుల నుండి ప్రశంసలు పొందారు. లోఫర్.. గడ్డలకొండ గణేష్ సినిమాలతో మాస్ ఆడియాన్స్ కి బాగా చేరువయ్యారు.


తొలిప్రేమ తో యువతకు.. ఫిదా తో అమ్మయిలకు ఫేవరేట్ హీరో గా మారిపోయారు. ఇక ఎఫ్2 లో మన విక్టరీ వెంకటేష్ గారితో తాను చేసిన హంగామా అంతా.. ఇంతా కాదు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా తాను చేస్తున్న తదుపరి చిత్రాలు ఎఫ్ 3 మరియు బాక్సింగ్ కధాంశం తో తెరకెక్కుతున్న గని సినిమా పోస్టర్స్ విడుదల చేశారు. గని పోస్టర్ కు సామాజిక మాధ్యమాలలో మంచి స్పందన వస్తుంది. వరుణ్ తేజ్ ఆన్ స్క్రీన్ విషయాలు కాసేపు పక్కన పెడితే..అటు సెట్ లో.. ఇటు ఈవెంట్స్ లలో.. ఎప్పుడు చిరునవ్వుతో అందరిని పలకరిస్తూ.. చాలా ప్రశాంతంగా కనిపిస్తూ ఉంటారు. రెండవ సారి నుండి నన్ను ఎక్కడ చూసినా చాలా ఆప్యాయంగా పలకరిస్తుంటే మీడియా కాబట్టి నన్ను గుర్తు పెట్టుకున్నారేమో అనుకున్నాను. కానీ.. అభిమానులను సైతం ఆయన అలానే గుర్తుపెట్టుకొని మాట్లాడుటారు అని తర్వాత తెలిసింది. అందుకే మెగా అభిమానులలో వరుణ్ తేజ్ కి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒక మూస ధోరణి లో వెళ్లకుండా అన్ని రకాల సినిమాలను చెయ్యడం ద్వారా అందరిని ఆకట్టుకున్న ఈ మెగా ప్రిన్స్.. ఆఫ్ కెమెరా లో ఎక్కడా స్టార్ హీరో అని గాని.. మెగా ఫామిలీ హీరో అనే అహం కనపడకపోవడం.. నాగబాబు గారి పెంపకానికి నిదర్శనం. అందుకే ఆఫ్ కెమెరాలో ప్రవర్తన వల్ల హీరోలలో కొందరికే అభిమానులు ఉంటారు.. అలాంటి జాబితాలో వరుణ్ ఒక్కరు.


మెగా బ్రదర్స్ చిరంజీవి.. నాగబాబు గార్లు కలిసి నటించిన “హాండ్స్ అప్” సినిమాతో బాల నటుడిగా కనిపించి.. “ముకుందా” తో హీరోగా పరిచయమై.. “కంచె” తో విమర్శకుల ప్రశంసలు పొంది.. “లోఫర్” తో మాస్.. “మిస్టర్” తో ఫామిలీ ఆడియన్స్ కి చేరువై.. ఎంతో మంది అమ్మయిలను “ఫిదా” చేసి.. తన “తొలిప్రేమ” తో “అంతరిక్షం” స్థాయి విజయం అందుకొని.. “ఎఫ్ 2 ” తో క్లాస్.. మాస్ అనే భేదం లేకుండా అందరిని అలరించిన “గడ్డలకొండ గణేష్” అలియాస్ “గని”.. అమ్మయిలలో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న ఆజానుభావుడు “మెగా ప్రిన్స్” “కొణిదెల వరుణ్ తేజ్” గారికి మా బి.ఆర్. మూవీ జోన్ తరపున “జన్మదిన శుభాకాంశాలు”.!