05-03-2021 09:55:10 About Us Contact Us



తెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ ది ప్రత్యేకమైన పందా.. వకీల్ సాబ్ టీజర్ రాక తో మరోసారి రుజువు. 3ఏళ్ళ క్రితం రాజకీయాల కోసం తన సినీ కెరీర్ ని పక్కన పెట్టేసిన పవన్ కళ్యాణ్ మళ్ళీ తన రిఎంట్రీ కి రంగం సిద్ధం చేసుకున్నారు.


హిందీలో అమితాబ్ నటించిన సూపర్ హిట్ చిత్రం పింక్ ఆధారంగా వస్తున్న చిత్రం వకీల్ సాబ్. సందేశంతో కూడిన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంలో సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అకృత్యాలను ఎదిరించి నిలిచే లాయర్ పాత్రలో పవర్ స్టార్ నటించగా.. శృతి హస్సన్,అంజలి, నీవేతా థామస్ ప్రధాన పాత్రలో పోషించారు. MCA.. ఓ మై ఫ్రెండ్.. చిత్రాల దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం టీజర్ ని సంక్రాంతి కానుకగా విడుదల చేసింది చిత్రం బృందం.


టీజర్ ఫాన్స్ మూడేళ్ల నిరీక్షణకి శుభం కార్డ్ వేస్తూ పవన్ కళ్యాణ్ ఫాన్స్ ని దృష్టిలో పెట్టుకుని కళ్యాణ్ గారి స్టైలిష్ లుక్స్ మరియు ఫైట్స్ ని మరొక్క సారి అద్భుతంగా చూపించారు వేణు శ్రీ రామ్. కోర్టులో వాదించడం వచ్చు.. కోటు తీసి కోట్టడమూ వచ్చు.. అంటూ పవన్ కళ్యాణ్ చెప్పే పంచ్ డైలాగ్ టీజర్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.


టీజర్ లో వచ్చే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయితే అద్భుతం అనే చెప్పుకోవాలి. థమన్ అందించిన నేపథ్య సంగీతం చెవులకు వినసొంపుగా అనిపించింది. ఈ టీజర్ విడుదలను అభిమానులు పండుగలా జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పవన్ అభిమానులు థియేటర్లలో వకీల్ సాబ్ టీజర్ ని ప్రదర్శించి థియేటర్ బయట టపాసులు కాలుస్తూ పవన్ ఫ్లెక్సీలకి పాలభిషేకాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు.


టీజర్ విడుదల అయినా 24గంటల్లో 700k + లైక్స్ పొంది పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏంటో తెలియచేసింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వేసవిలో విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తుంది.