25-01-2022 16:55:09 About Us Contact Usకొద్దీ రోజుల క్రితం గూఢచారి,ఓ బేబీ తో తెలుగు నాట మంచి సినిమాలు నిర్మించే ప్రముఖ నిర్మాణ సంస్థగా పేరు పొందిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుండి ఒక ప్రకటన విడుదలైంది..లాక్ డౌన్ నియమాలను అతిక్రమించకుండా లఘు చిత్రాన్ని తీసి పంపాలి అన్నది సారాంశం..దానికి కొన్ని నియమాలు కూడా పెట్టారు..అందులో వారు ఇచ్చిన నేపథ్యం..మహిళా సాధికారత..అది కూడా అన్ని వసతులు పొందలేని వారి గురించి..(Empowerment of UnderPrivileged women).జ్యూరీలో దర్శకులు తేజ,హరీష్ శంకర్,నందిని రెడ్డి,వి.ఏన్.ఆదిత్య,బాల రాజశేఖరుని ఉన్నట్లు ప్రకటించారు.ఒక పక్క కొత్త వారికి అవకాశం ఇస్తూనే మరో పక్క సమాజానికి ఉపయోగ పదే కధాంశం ఇచ్చారు..దీనికి ముందుగా ఆ సంస్థకు,జ్యూరీని అభినందించాలి..

సినీ రంగం వారి పై తెలుగు వారిలో చాలా మందికి సందేహాలు ఉంటాయి..ఆ రంగంలోకి వెళితే చెడిపోతారు,వ్యసనాలకు బానిసలు అవుతారు అనే భయం కూడా ఉంటుంది..అవకాశాలు రావు అని,ఎవరినీ ఎడగనియ్యారు అని,..ఇలా సామాన్య ప్రజల్లో చాలానే చర్చలకు వస్తుంటాయి..వాటి వల్లనే మనకు తెలిసిన వారు ఎవరైనా సినీ రంగంలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నట్లు చెప్పగానే ఇక వారిని వారించేందుకు మిత్రులు,బంధువులు ప్రయత్నిస్తూ వుంటారు..ఇప్పుడిప్పుడే ఆ ఆలోచనలు ప్రజల్లో మారుతూ వస్తుంది..పూర్తిగా మారింది అని కాదు కానీ కొంతలో కొంత మార్పు వచ్చింది..


ఇప్పుడు ఈ విషయం ఎందుకు అంటే అక్కడికే వస్తున్నాను..ఇలా అనేక అపోహలు ఉన్న సినీ రంగంలోకి ఒక తెలుగు మహిళ రావాలి అంటే..ఇది చాలా కష్టం..ఇంట్లో వాళ్ళని ఒప్పించి ఈ రమాగంలోకి అడుగు పెట్టాలి అని చాలా మంది అమ్మాయిలకు ఆశగా ఉంటుంది కానీ అవి విఫలమయ్యి,వేరే రంగంలోకి వెళ్ళిపోయి వుంటారు..నా మిత్రులల్లో ఇద్దరూ ముగ్గురు అమ్మాయిలకు ఇష్టం ఉంది కూడా ఇప్పుడు ఈ రంగంలో లేరు..ఒక సంవత్సరం ప్రయత్నించే సమయం ఇవ్వడంతో ప్రయత్నించి వెనక్కి వెళ్లిపోయిన అమ్మాయి ఒక్కరైతే..లఘు చిత్రాలు అయితే చేసుకో..అంటే గాని సినిమాలు వద్దు అది కూడా పెళ్లి చేసే దాక మాత్రమే అని చెప్పడంతో లఘు చిత్రాలు చేసి ఆపేసిన అమ్మాయి ఒక్కరు..ఇక ఇంట్లో ఒప్పుకోక అసలు ఈ రంగం కూడా హైదరాబాద్ వదిలి బెంగళూర్ వెళ్లిపోయిన అమ్మయి మరొక్కరు..ఇలా మీకు కూడా చాలా మందే తెలిసే వుంటారు..


అలా అన్ని కష్టాలను,వ్యతిరేకతలను అధిగమించి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి తమదైన ముద్ర వేసిన,వేస్తున్న,వేసేందుకు అడుగులు వేస్తున్న మహిళలను మనం గుర్తించాలి..వారి గురించి,వారి కష్టాల గురించి,వారి విజయాల గురించి రాయాలి అని ఎప్పటినుండో ఉండేది..అప్పుడే కదా మరెందరికో స్ఫూర్తి కలిగి పరిశ్రమలోకి అడుగులు వేస్తారు..రానున్న రోజుల్లో తెలుగు అమ్మయిలు సైతం పరిశ్రమలోని ప్రతి విభాగంలో మగవారికి సమానంగా వుండే స్థాయికి రావాలి అని కోరుకుందాం..ఇప్పుడు ఈ లాక్ డౌన్ లో పీపుల్ మీడియా సంస్థ ప్రకటన నాకు మంచి అవకాశంలా కనిపించింది..రేపటి నుండి ఈ నెల 23వ తరికు వరకు రోజుకి ఒక్కరి గురించి వ్యాసాన్ని రాసి విడుదల చేసేందుకు నిర్ణయించాము..ప్రతి రోజు సాయంత్రం ఆ వ్యాసాలని విడుదల చేస్తాము..అందరి గురించి రాయలేము గనుక కొందరి గురించే రాయనున్నాము.మరొక్కసారి మిగతా వారిని కూడా గుర్తు చేసుకుందాం.ఈ నెల తొలి సోమవారం నుండి మూడవ శనివారం వరకు రాయనున్నాము..


ఇందులో భాగంగా రేపు తొలి వ్యాసంగా నటిగా ప్రస్థానం మొదలు పెట్టి,తమిళ,కన్నడ భాషల్లో నటిగా పేరు సంపాదించి ఆ తర్వాత దర్శకురాలిగా,నిర్మాతగా మారి తెలుగు చిత్ర పరిశ్రమకు అనేక సేవలు అందిస్తూ,తన ఇద్దరి కూతుర్లని హీరోయిన్లుగా పరిశ్రమకు పరిచయం చేసిన తెలుగు మహిళ జీవిత గారి గురించి ప్రారంభించనున్నాము…మీకు వీరి గురించి రాస్తే బాగుంటుంది అని అనిపిస్తే మాకు తెలియచేయండి..