బుల్లితేర యాంకర్ గా పరిచయమై.. అటు బుల్లి తెర పై యాంకరింగ్ చేస్తునే.. ఇటు వెండితెర పై నటిగా మంచి గుర్తింపు పొందిన “అనసూయ భరద్వాజ్”.. మరియు అననగనగా ఓ ప్రేమ కథ చిత్రంతో వెండితెర పై పరిచయమై.. “మనసానమః” తో యూట్యూబ్ లో భారీ విజయం సాదించటంతో పాటు.. అందులోని నటనకు అనేక అవార్డులు అందుకున్న యువ హీరో “విరాజ్ అశ్విన్” ప్రధాన పాత్రలుగా రమేష్ రాపర్తి తెరకేక్కిస్తున్న చిత్రం “థాంక్ యు బ్రదర్ ”
ఈ చిత్ర టైటిల్ పోస్టర్ ను రాణా విడుదల చేయగా.. కిందటి వారం సూపర్ స్టార్ మహేష్ బాబు గారు మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. టైటిల్ పోస్టర్ తోనే అందరిని ఆకట్టుకున్న ఈ సినిమా.. మోషన్ పోస్టర్ తో ఆసక్తిని కలిగించింది. అలాంటి ఈ చిత్ర ట్రైలర్ ని తాజాగా విక్టరీ వెంకటేష్ గారి చేతుల మీదగా విడుదల చేశారు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. గర్భవతిగా ఉన్న ప్రియా(అనసూయా) లిఫ్ట్ లో అభి (అశ్విన్) తో పాటు ఇరుక్కుపోయిన తరువాత పరిణామాలు ఎలా ఉన్నాయ్? ఇంతకీ ఆ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన అభి మరియు ప్రియా ఎవరు? వాళ్ళు ఆ లిఫ్ట్ నుండి ఎలా బయటపడ్డారు?గర్భవతి గా ఉన్న ప్రియా ను నొప్పులు మొదలైతే.. మెడికల్ కు సంబంధం లేని అభి ఏం చేస్తాడు అనేది మనం పూర్తి సినిమా విడుదలైతే చూడాల్సిందే.
ట్రైలర్ చుస్తే.. కేవలం రెండు సినిమాలు మాత్రమే చేసిన హీరో అశ్విన్.. ఎన్నో సినిమాల అనుభవం గల నటుడిగా కనిపించారు. డబ్బులు.. ఆవేశం ఉన్న ఒక్క కుర్రాడు ఎలా ఉంటాడో అశ్విన్ చేసి చూపించారు. మంచి ఎత్తు.. చూసేందుకు కూడా అందంగా కనిపిస్తూ ఉందటం.. హావభావాలు బాగా పలుకుతూ వుంటాడం చూస్తుంటే.. ఈ కుర్ర హీరో త్వరలో గొప్ప హీరోల జాబితాలో చేరేలా ఉన్నారు. ఇక గర్భవతి పాత్రలో అనసూయ చాలా బాగా నటించారు. భిన్న పాత్రలతో ఇప్పటికే విమర్శకుల ప్రశంసలు పొందిన అనసూయ.. ఈ పాత్రతో తన నటనా ప్రావీణ్యం గురించి మరోసారి ప్రేక్షకులు మరియు పరిశ్రమ మాట్లాడుకునేలా చేశారు. మాగుంట శరత్ చంద్ర రెడ్డి నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రానికి గుణా బాలసుబ్రమణ్యం అందిస్తున్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదనపు బలమని చెప్పాలి.
చిత్ర దర్శకుడు రమేష్ రాపర్తి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఒక లిఫ్ట్ లో ఏం జరిగిందో అనే చిన్న లైన్ తో ఇంత సినిమా తియ్యడం మాములు విషయం కాదు. ట్రైలర్ చుస్తే.. ప్రతి సన్నివేశం సస్పెన్స్ థ్రిల్లర్ లా తెరకెక్కించినట్లు అర్థమవుతుంది. అతి తక్కువ రోజుల్లో.. లాక్ డౌన్ తరవాత తీసిన ఈ సినిమా అప్పుడే ప్రక్షుకుల ముందు రానుంది అంటే డైరెక్టర్ ప్రతిభ.. కష్టం అర్ధమవుతుంది. సినిమా అధ్యంతం థ్రిల్లర్ నేపథ్యంలో అన్ని రకాల బావోద్వేగాలను సమపాళ్ళలో తీర్చిదిద్దినట్లు ఉన్నారు దర్శకుడు రమేష్ రాపర్తి.
ఇప్పటికే ముప్పయి లక్షల మంది ఈ ట్రైలర్ ని చూశారు.. అలాంటి ఈ చిత్రం ద్వారా అనసూయా.. అశ్విన్ లకు మరియు.. సాంకేతిక బృందానికి.. మంచి పేరు రావాలని అద్భుతమైన విజయాన్ని అందుకోవాలని ఆశిద్దాం.
థాంక్ యు బ్రదర్ ట్రైలర్
నేడు ప్రముఖ ఛాయాగ్రాహకులు.. దర్శకులు తేజ పుట్టినరోజు.!
Director Teja Birthday: శివ సినిమా ద్వారా రామ్ గోపాల్ వర్మ తో పాటు సినీ ప్రస్థానం మొదలు పెట్టి.. చిత్రం సినిమాతో దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయమవ్వడంతోనే...
Read More