25-01-2022 16:34:09 About Us Contact Us7అప్ యాడ్ తో తొలిసారి స్క్రీన్ పై కనిపించి..సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో నటిగా మారి.. ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా తొలి సినిమా చేసి.. గడిచిన ఏడేళ్ళలో దాదాపు పాతిక సినిమాలతో వెండితెరపై.. ఇటు షో లతో బుల్లి తెరపై మనల్ని అలరిస్తు.. ఎప్పుడు ఎనర్జిటిక్ గా కనిపిస్తూ.. తెలుగులో బాగా మాట్లాడుతూ.. తెలుగువారందరికీ మన ఇంటి అమ్మాయిలా అనిపించే తేజస్వి మడివాడ పుట్టిన రోజు నేడు..ఈ సందర్భంగా డాన్స్ టీచర్ నుండి స్టార్ గా ఎలా మరారో క్లుప్తంగా మీకోసం..


1991 జులై 3న హైదరాబాద్ లో ఒక ఆర్మీ కుటుంబంలో జన్మించారు తేజస్వి. కుటుంబ నేపథ్యం విజయవాడ కాగా.. బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిపారు.. బేగంపేట ఎయిర్ ఫోర్స్ స్కూల్ లో చదువుకొని.. సైంట్. ఫ్రాన్సిస్ మహిళా కళాశాలలో మాస్ కమ్యూనికేషన్స్ చదువుకున్నారు. తొలుత మీడియా లో వర్క్ చేసినా.. ఆ తర్వాత తనకు నచ్చిన డాన్స్ ని పది మందికి నేర్పుతూ కెరీర్ ప్రారంభించారు.. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ తో పాటు పలు కార్పొరేట్ కంపెనీలకు సైతం నేర్పేవారు.. అలానే సంగీత్ లకు కూడా నేర్పేవారు. 7అప్ యాడ్ లో డాన్సర్స్ తో షూట్ ఉండగా అలా అవకాశం తేజస్వికి వచ్చింది.. తొలి యాడ్ లోనే తమిళంలో శింబు.. తెలుగు అల్లు అర్జున్ తో చేశారు.


అక్కడ నుండి 2013లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమా చేశారు.ఇద్దరు స్టార్ హీరోలు.. హీరోయిన్లు.. దాదాపు 40మంది తారాగణం ఉన్న ఆ సినిమాలో సమంతకు చెల్లిగా చేసిన తేజస్వి.. తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. అంతమంది మధ్యలో చేసి కూడా తనకంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. ఆ తర్వాత మనం.. హార్ట్ ఎటాక్ సినిమాలలో కనిపించారు. ఆ తర్వాత ఇండియన్ స్టార్ డైరెక్టర్ లలో ఒకెక్కరైన ఆర్.జీ.వి. గారి ఐస్ క్రీమ్ సినిమాతో హీరోయిన్ గా పరిచయమయ్యారు. అలా హీరోయిన్ గా చేస్తూ కూడా మళ్లీ మళ్లీ.. ఇది రాని రోజు.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. శ్రీమంతుడు సినిమాలలో కథకు అవసరమైన పాత్రలు కూడా చేశారు.కేరింత సినిమాతో హీరోయిన్ గా భారీ విజయం నమోదు చేసుకున్నారు. అలానే రోజులు మారాయి సినిమాలో నెగటివ్ పాత్రలో సైతం అద్భుతంగా చేసి విమర్శకుల ప్రశంసలు పొందారు తేజు.అలా అటు హీరోయిన్ గా.. ఇటు ప్రాధాన్యత కలిగిన పాత్రలతో మనల్ని అలరించారు తేజస్వి. గడిచిన ఏడేళ్ళల్లో దాదాపు 25 సినిమాలలో కనిపించారు తేజస్వి.తమిళంలో ఒక్క సినిమా చేశారు తేజస్వి.ఇక టెలివిజన్ లో ఈటీవీ లో సూపర్ సీజన్ 2.. అనే రియాలిటీ షో.. మా టీవీ లో బిగ్ బాస్ సీజన్ 2.. అలానే బ్రహ్మానందం గారు జడ్జిగా చేసిన ద గ్రేట్ తెలుగు లాఫ్టర్ ఛాలెంజ్ అనే కామెడీ షోలో యాంకర్ గా చేశారు. తెలుగులో గబ గబా మాట్లాడుతూ.. ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటూ.. తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు తేజస్వి.స్పష్టమైన తెలుగు మాత్రమే కాదు.. తమిళం.. హిందీ.. ఆంగ్లం సైతం అంటే బాగా మాట్లాడగలరు. అందం.. అభినయం..అద్భుతమైన నటన..డాన్స్..అటు సంప్రదాయ దుస్తులలో.. ఇటు ట్రెండింగ్ డ్రెస్ లతో కుర్రాల గుండెల్లో చెదరని ముద్ర వేశారు తేజస్వి. తనకంటూ ఒక అభిమానలను పొందారు.దేని గురించైనా నిర్మొహమాటంగా.. చెప్పేస్తుంటారు తేజస్వి. అదే ఆమెకు బలం.. కష్టాన్ని.. ట్యాలెంట్ ని నమ్ముకొని పరిశ్రమలో అడుగుపెట్టి స్టార్ గా మారారు తేజస్వి.


మన ముగ్గురి లవ్ స్టొరీ తో వెబ్ సిరీస్ సైతం చేసిన తేజస్వి.. కమిట్మెంట్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.నేడు ఆమె పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం పోస్టర్ ని విడుదల చేశారు.రానున్న రోజుల్లో మరిన్ని సినిమాలు చెయ్యాలని.. భారీ విజయాలను నమోదు చెయ్యాలని.. కొరుకుంటూ.. మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున తేజస్వి మడివాడ గారికి జన్మదిన శుభాకాంక్షలు.!