05-03-2021 09:53:36 About Us Contact Us



మన తెలుగు నటి.. లాక్ డౌన్ లో అటు వెబ్ సిరీస్ ఇటు సినిమాలు విడుదల చేస్తూ ఓ.టి.టి లలో తనకంటూ ఒక క్రేజ్ ని పొందిన “చాందిని చౌదరి” మరియు విలక్షణ పాత్రలతో నటుడిగా గుర్తింపు పొందిన “నవిన్ చంద్ర” కలిసి నటించిన క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రం సూపర్ ఓవర్.. తెలుగు ఓ.టి.టి ఆహా లో రేపు (జనవరి 22న) కానుంది.


మన దేశంలో క్రికెట్ ఒక ఆట స్థాయి నుండి మతం అనే స్థాయికి చేరింది. అదే ఐపీఎల్ వచ్చింది అంటే క్రికెట్ ప్రేమికులతో పాటు క్రికెట్ మ్యాచ్ లో బెట్టింగ్ లు వేసే వారు.. మరియు బుకీల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతు వస్తుంది. బెట్టింగ్ సామ్రాజ్యంలో రాత్రికి రాత్రి కోటీశ్వరులైన వాళ్ళు ఉన్నారు రోడ్డున పడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి క్రికెట్ బెట్టింగ్ నేపథ్యంలో వస్తున్న చిత్రమే “సూపర్ ఓవర్”..


ఈ మధ్య విడుదలైన “సూపర్ ఓవర్” చిత్రం ట్రైలర్ విభిన్నంగా ఉంది. భీమవరం.. హైదరాబాద్ నేపథ్యంలో ఈ చిత్రం ఉండబోతున్నట్టు ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ట్రైలర్ లో చాందిని చౌదరి.. నవీన్ చంద్ర మంచి స్నేహితులుగా వాళ్ళు క్రికెట్ బెట్టింగ్ లో కోటి డెబ్భై లక్షలు కోల్పోగా.. అవి తీర్చడానికి ఎలాంటి పనులు చేసారు? ఆ పరిస్థితి నుండి బయటపడ్డారా? తరువాత ఏం జరిగింది అనేది మిగిలిన కథ



స్వామి రారా దర్శకుడు సుదీర్ వర్మ నిర్మాతగా వ్యవహారిస్తున్న ఈ చిత్రాన్ని ప్రవీణ్ వర్మ తెరకేక్కించారు.లాక్ డౌన్ కారణంగా ఎక్కువ ఓటీటీ విడుదల మీద ఆసక్తి చూపుతున్న తరుణంలో ఈ “సూపర్ ఓవర్” చిత్రాన్ని కూడా ప్రముఖ ఓ.టీ.టీ అయిన ఆహాలో జనవరి 22 విడుదల చేస్తున్నట్లు చిత్రం బృందం ప్రకటించింది. చాందిని చౌదరి.. నవీన్ చంద్ర.. అజయ్.. వాసు.. మురళి.. వైవా హర్ష ప్రధాన పాత్రలలో ఉండటం.. యువత బాగా ఇష్టపడే క్రికెట్ మరియు బెట్టింగ్ నేపథ్యంలో సాగే సినిమా కావడం.. పైగా ట్రిల్లర్ మూవీ అవ్వడంతో సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి.


రేపు వస్తున్న “సూపర్ ఓవర్” మరో ఓ టీ టీ బ్లాక్ బస్టర్ గా నిలవాలని.. చాందిని చౌదరి కి ఓ.టి.టి లో మరో విజయం లభించాలని.. ఈ చిత్ర దర్శకుడికి మంచి పేరు రావాలని ఆశిద్దాం.