24-01-2022 15:35:45 About Us Contact Usసునీత..ఆమె పేరు వినగానే మంచి అందమైన మొహం అందులో చక్కటి నవ్వు తో మంచి చీర కట్టుకున్న అచ్చ తెలుగు అమ్మాయి మైక్ చేత పట్టుకొని మధురమైన పాట పడుతున్నట్లు మనకు ఆమె బొమ్మ మనకు కనిపిస్తుంది… ఆమె పాడిన పాటలు వింటూ ఎవ్వరైనా ఈ లోకాన్ని మరిచి మరో ప్రపంచంలోకి వెళ్లిపోవాల్సిందే..25ఏళ్ళల్లో ఎన్నో సినిమాలలో కొన్ని వందల పాటలు..స్టార్ హీరోయిన్లకు డబ్బింగ్..టీవీ షోలు..జాతీయ..అంతర్జాతీయ స్థాయి వేదికలపై ప్రోగ్రాములు..అలాంటి సునీత గారి సినీ జీవితం నేటి తరానికి కచ్చితంగా ప్రేరణ కలుగుతుంది..నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సునీత గారి సినీ జీవితం చూస్తే..


పువ్వు పుట్టగానే పరిమలిస్తుంది అని అంటారు..అలానే సునీత గారు కూడా..విజయవాడలో పుట్టి..గుంటూరులో విద్యాబ్యాసం చేసిన సునీత గారు..తన ఆరవ ఏట నుండే సంగీతం నేర్చుకోవడం మొదలు పెట్టారు..అక్కడ నుండి అల్ ఇండియా రేడియో వారు తలపెట్టిన పోటీల దాక ఎన్నో ప్రోగ్రాం లలో చిన్న వయసులోనే పోటీ చేశారు..13ఏళ్లకే తన గురువుగారితో కలిసి త్యాగరాజ ఆరాధన ఉత్సవాలలో పాలుగున్నారు..17ఏళ్లకు సినీ రంగ ప్రవేశం చేశారు..1995లో విడుదలైన గులాబీ సినిమాలోని..”ఈ వేళలో నీవు”అనే పాటతో తెరంగేట్రం చేశారు..తొలి పాట తోనే తనకంటూ అభిమానులను పొందారు సునీత గారు..
అక్కడ నుండి కీరవాణి..కోటి..రమణ గోకుల..మణిశర్మ..చక్రి..వందేమాతరం శ్రీనివాస్..ఆర్.పి.పట్నాయక్..కళ్యాణ్ మాలిక్ గార్ల నుండి..నేటి తరం సంగీత దర్శకులు దేవి శ్రీ ప్రసాద్..అనూప్ రూబెన్స్..మిక్కీ జె మేయర్..ఆస్కార్ అవార్డ్ గ్రహీత ఏ.ఆర్.రెహ్మాన్ గారి దాక అందరి దగ్గర పాటలు పాడారు..


అప్పటి దాక హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పిన రాశి గారికి 1997లో పెళ్లి పందిరి సినిమాకు డబ్బింగ్ చెప్పి ఈ రంగంలోకి ప్రవేశించారు..1998లో బ్లాక్ బస్టర్ గా నిలిచిన మెగాస్టార్ చిరంజీవి గారి చూడాలి అని ఉంది సినిమాలో సౌందర్య గారికి డబ్బింగ్ చెప్పారు..అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 110 పై మంది ఆర్టిస్టులకు దాదాపు 750 పైన చిత్రాలలో డబ్బింగ్ చెప్పారు..ఇది ఆమె ట్రాక్ రికార్డ్ కాదు..అల్ టైం రికార్డ్..ఒకే సంవత్సరంలో 60 సినిమాలకు డబ్బింగ్ చెప్పి అరుదైన రికార్డ్ నెలకొల్పారు..ఒక పక్క పాటలతో అలరిస్తూనే..మరో పక్క హీరోయిన్ లకు తన గాత్రాని అందించారు..అలాంటి అగ్ర కథానాయికలు రాశి..సౌందర్య..తాబు..సిమ్రాన్ నుండి నేటి తరం అనుష్క..నయనతార..రరిచా..రెజినా..స్నేహ ఉల్లాల్ దాక 110 మంది పైగా ఈ జాబితాలో వున్నారు..


టివి షోల విషయానికి వస్తే..1995లో డిడి మొదలైన ప్రయాణం..ఈటీవీ..మాటీవీ..జీటీవీ..జెమినీ..ఎస్.వి.బి.సి. అంటు ఆ ఛానల్..ఈ ఛానల్..అనే తేడా ఏమీ లేకుండా షోలు చేశారు..జడ్జ్ గా..యాంకర్ గా..గాయని గా..12కి పైగా షోలతో బుల్లి తెర ప్రేక్షకులకు సైతం చేరువయ్యారు..వేదికపై అంటే దేశ..విదేశాలలో ఆమె ప్రోగ్రాములు చేశారు..ఆమెను చూడగానే కచ్చితంగా ఎవరికైనా తెలుగు వారి ఇళ్లలో మాతృమూర్తిలా కనిపిస్తుంది..మా మిత్రుడు ఒక సందర్భంలో అన్నాడు.. “సునీత గారి లాంటి భార్య కావాలి రా..ఆమె పద్ధతి ఎంత బాగుంటుంది రా” అని….ఆమె చీరలకు ఆడవారిలోనే కాదు..మగవారిలో సైతం అభిమానులు వున్నారు..


“పెదవి దాటని మాట..”అంటూ తమ్ముడు సినిమాలో రమణ గోకుల గారితో పాడగలరు..రాం గోపాల్ వర్మ గారి ఇచే క్రీమ్ లో “కిస్ మీ..ఎవరీ వేర్”అని పాడగలరు..”ఏం సందేహం లేదు” అంటూ పాడగలరు..అన్నిటికన్నా ముఖ్యంగా రామదాస్ సినిమాలో “చాలు చాలు..చాలు..” అసలు ఆ పాటలో ఆమె నవ్వు అద్బుతమే అని చెప్పాలి..ఆమె పాటల గురించి రాస్తుపోతే..1995 నుండి సినీ ప్రస్థానం రాసినట్లే అవుతుంది..ఎందుకంటే ఆమె పాడని..అగ్ర..హీరో..దర్శకుడు..సంగీత దర్శకుడు ఉంది ఉండరు కనుక..అన్ని పాటలు పాడారు..సునీత గారు..తమిళ..కన్నడ భాషల్లో సైతం పాటలు పాడారు..ఈ మధ్యనే రెండు షార్ట్ ఫిలిమ్స్ లో నటించిన సునీత గారు..మున్ముందు సినిమాలలో కూడా నటించాలి అని మనల్ని అలరించాలి అని కోరుకుందాం..


ఒక 17ఏళ్ల అమ్మాయిగా సినీ రంగ ప్రవేశం చేసిన సునీత ఎన్నో సార్లు ఏడ్చారాట..ఎక్కడా మనకు స్క్రీన్ పై ఆమె ఏడుపు మనకు కనపడదు..సింగల్ పేరెంట్ గా పిల్లలను పెంచుతూ..తల్లి తండ్రులను చూసుకుంటూ..ఇన్ని రంగాల్లో రాణించడం అంటే అంత సాధారణమైన విషయం కాదు..ఓర్పు..సహనం..పట్టుదల..కృషి..బాధను దిగమింగడం..కష్టాన్ని ఎదురిది పోరాడటం..ఇవన్నీ ఆమె చేస్తున్నారు కనుకనే ఈ స్థాయికి చేరారు..నేటి తరం అమ్మయిలు ఆమెను చూసి నేర్చుకోవాల్సిన లక్షణాలు అనేకం ఉన్నాయి….ఎన్ని కష్టాలు చూసినా ఆమె చెరగని చిరునవ్వు..అన్ని రంగాలల్లో రాణించడం చూసి..తన తోటి మహిళలకే కాదు..మగవారికి కూడా అసూయ కలిగి ఉంటుంది…అందుకే నేను అంటాను..”ఆమె సినీ జీవితం అణితర సాద్యం”


మహిళా సాధికారతలో భాగంగా సినీ రంగంలో గల తెలుగు మహిళలను గౌరవించుకుంటున్న సందర్భంగా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సునీత గారిపై కథనం..రేపు తెలుగు నేల పై పుట్టి ప్రసృతం తమిళ నాట స్టార్ హీరోయిన్ గా మారిన గోడవరి జిల్లా రాజోలు అమ్మాయి అంజలి గారి పై వ్యాసము..తెలుగు చిత్ర పరిశ్రమలో 25ఏళ్ళ ప్రయనంతో తనకంటూ ఒక పేరు సంపాదించుకున్న సునీత గారు ఇలానే మరో 25ఏళ్ళు మనల్ని అలరించాలి అని కోరుకుంటూ..నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న సునీత గారికి మా బి.ఆర్.మూవీ.జోన్ బృందం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు..!