24-01-2022 15:14:48 About Us Contact Us


2010 ఏప్రిల్ 16న విడుదలైన ప్రస్థానం సినిమాతో తెలుగు వెండితెరకు పరిచయమయ్యాడు సందీప్ కిషన్.దింతో నేటితో పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నారంటూ ఆయన మిత్రులు,శ్రేయోభిలాషులు,అభిమానులు సామాజిక మాధ్యమాలలో శుభాకాంక్షలు తెలుపుతూన్నారు.అయితే ఇక్కడ మీ అందరికి ఒక విషయం చెప్పాలి సందీప్ కిషన్ హీరోగా పరిచయమై 10ఏళ్ళు అయింది కానీ తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టి పుష్కర కాలం గడించిది.ఆయన గౌతమ్ మీనన్ వద్ద పని చేశారు.ఒక పాట సైతం హీరో కాకముందే పాడారు.విద్యాభ్యాసం చెన్నై లయోలలో చేసిన సందీప్,గడిచిన 10ఏళ్ళల్లో తెలుగుతో పాటు తమిళంలో సైతం సినిమాలు చేశారు.నేటి తరంలో ఏ తెలుగు,తమిళ హీరోలకు ఇది సాధ్యపడలేదు.అడపాదడపా ఒక సినిమా చేయడమో లేక డబ్బింగ్ చేయడమో చేశారు తప్ప ఇలా రెండు భాషలలో ఇన్ని స్ట్రెయిట్ సినిమాలు మరే ఏ హీరో చెయ్యలేదు,చెయ్యడం కూడా కష్టమనే చెప్పాలి..ప్రస్తానంతో తన సినీ ప్రస్థానం మొదలు పెట్టిన సందీప్ ఒకో మెట్టు ఎదుగుతూ వచ్చాడు,హిట్ల తో పాటు ఫ్లాప్ లను చూశాడు.10 సంవత్సరాలలో తమిళం,తెలుగు,గెస్ట్ రోల్స్ తో కలిపి 22 సినిమాలు పూర్తి చేశాడు సందీప్.గడించిన అర్దదశాబ్దం నుంచి సంవత్సరానికి రెండు తెలుగు సినిమాలు విడుదల చేశాడు..జయాపజయాలకు సంబంధం లేకుండా తదుపరి సినిమాలు ప్రకటిస్తూ చిత్ర పరిశ్రమని ఆశ్చర్యపరుస్తున్నారు సందీప్.తొలి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకున్న సందీప్ కిషన్,గుండెలో గోదారి సినిమాతో పరిపక్వత గలిగిన నటుడిగా గుర్తింపు పొందాడు.వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ సినిమా తో హీరోగా భారీ విజయం అందుకున్నారు.గత సంవత్సరం విడుదలైన “నిను వీడని నీడను నేనే” అనే త్రిల్లర్ సినిమా తో మరో భారీ విజయం అందుకొని బాక్స్ ఆఫీస్ వద్ద తన స్టామినాని చూపించారు.కథల విషయంలో సందీప్ చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు కనిపిస్తుంది.వరసగా ఏ రెండు సినిమాలు ఒకేలా ఉండవు,ఒక సారి హాస్యం,ఒకసారి ప్రేమ,ఒకసారి త్రిల్లర్,ఒకసారి యాక్షన్ ఇలా చాలా విభిన్నంగా ఉంటుంది.అంటే కాదు తన సినిమాలు చూస్తే స్టార్దం కోసం తను పాకులాడుతున్నట్లు కనిపించదు..ఎప్పుడు రొటీన్ కమర్షియల్ సినిమాలు సందీప్ చెయ్యలేదు.తన సినిమాలలో కథ ప్రధాన పాత్ర పోషిస్తూ ఉంటుంది.అందుకే హీరోగా కన్నా నటుడిగా మంచి మార్కులు పొందారు సందీప్.ఇప్పటి వరకు ఏ దర్శకుడితో రెండవ సినిమా చెయ్యలేదు.అంటే కాదు సుధీర్ బాబు,నారా రోహిత్,అది తో కలిసి మల్టీ స్టార్ సినిమా చేసిన సందీప్ ఆ తర్వాత సాయి ధరమ్ తేజ్,తనీష్ లతో కలిసి నక్షత్రంలో చేశారు.ఇలా తన తోటి హీరోలతో కలిసి సినిమాలు చేశారు సందీప్.తెలుగులో తొలిసారిగా మన జాతీయ క్రీడ అయిన హాకీ నేపథ్యంలో సందీప్ కిషన్ A1 ఎక్స్ ప్రెస్ సినిమాతో రానున్నారు.తాను వెంకటాద్రి టాకీస్ అనే ప్రొడక్షన్ బ్యానర్ ని సైతం ప్రారంభించారు.నిను నీడను విడను నేనే,A1 ఎక్స్ ప్రెస్ అందులో నిర్మిచినవే.ఇలా 10ఏళ్ళల్లో ఎన్నో అవార్డులు,రివార్డులు,హిట్లు,ఫ్లాపులు అందుకున్నారు.తోటి నటీనటులతో చాలా మంచి అనుబంధాన్ని కొనసాగిస్తూ వుంటారు సందీప్.సాయి ధరమ్ తేజ్,సుధీర్ బాబు,నిఖిల్ నుండి కొత్తగా వెండితెర పైకి వచ్చిన విశ్వక్ సేన్,కార్తికేయలతో దాక దాదాపు అందరితో మంచి సాన్నిహిత్యం కొనసాగిస్తూ వుంటారు.ఏ సినిమా ట్రైలర్,టీజర్,విడుదలైనా నచ్చితే వెంటనే తన అభిప్రాయాన్ని పంచుకుంటూ ఉంటారు సందీప్.సామాజిక స్పృహ గురించి వస్తే ప్రజలకు ఎప్పుడు తనకు సాధ్యమైనంత వరకు సహాయం చేస్తూ వార్తలలో నిలుస్తూవుంటారు సందీప్ కిషన్.ఇలాంటి సందీప్ కిషన్ కు శుభాకాంశాలు తెలుపుతూ మరిన్ని దశాబ్దాల పాటు తెలుగు,తమిళ చిత్ర పరిశ్రమలో మరిన్ని చిత్రాలు చేయాలి అని కోరుకుందాం..