25-01-2022 16:57:25 About Us Contact Us



సుమ..ప్రపంచంలో తెలుగువారు ఎవ్వరైనా ఆమెను చూడటమే కాదు..ఆమె గొంతు వినపడినా గుర్తుపడుతారు..తెలుగులో చానల్స్ కన్నా ముందు బుల్లి తెరంగేట్రం చేశారు సుమ..గడిచిన 15ఏళ్ళల్లో పని చెయ్యని టీవీ ఛానల్ లేదనే చెప్పాలి..హీరో ఎవరైనా..సినిమా ఏదైనా..యాంకర్ సుమ..చిత్ర పరిశ్రమలో ఉన్న తెలుగు మహిళల గురించి రాస్తూ..సుమ పుట్టింది తెలుగు కాదని ఆమె గురించి రాయకపోతే..చాలా పెద్ద తప్పవుతుంది అని అనిపించింది..నేటి తరం తెలుగు నటీనటులు మాట్లాడే తెలుగు భాషతో పోల్చుకుంటే సుమ గారు నూటికి నూరు శాతం బాగా మాట్లాడుతారు..గడించిన 20ఏళ్ళుగా మనల్ని అలరిస్తూన్న సుమ గారి గురించి ఈ వ్యాసము..


సుమ ఒక మళయాలం కుటుంభంలో జన్మించింది..తండ్రి రైల్వే ఉద్యోగి కావడంతో హైదరాబాద్ లో పని చేసేవారు..సుమ హైదరాబాద్ లోనే చదువుకున్నారు..చిన్నతనంలోనే తన తల్లి తెలుగు తాను చేరుకొని సుమకు నేర్పారు..తల్లికి కళల పట్ల ఇష్టం ఉండటంతో నాట్యం..సంగీతం సుమకు నేర్పారు..ఇంటర్ లోనే దూరదర్శన్ లోని సీరియల్స్ తో టీవీకి పరిచయమయ్యారు..1991లో మొదలైన ఆమె ప్రస్థానం సీరియల్స్ నుండి సినిమాలు దాక సాగింది..తెలుగులో కేవలం దాసరి నారాయణ రావు గారు దర్శకత్వంలో కల్యాణ ప్రాప్తిరస్తు అనే ఒక్క సినిమాలో హీరోయిన్ గా చేశారు..మళయంలో మూడు సినిమాలు చేసినా తిరిగి తెలుగులోకి వచ్చారు..మళ్ళీ సీరియల్స్ చేస్తూ కాలం గడిపారు..


మధ్యలో పెళ్లి..పిల్లలు అంటూ కాస్త విరామం రావడం ఆ తర్వాత షోలకు యాంకర్ గా చేసినా పెద్దగా అవకాశాలు రాలేదు..దింతో కొద్దీ రోజులు విజయవాడలో లోకల్ ఛానల్ లో షోలు చేశారు..సరిగ్గా అప్పుడే లైవ్ షో లు రావడంతో తిరిగి హైదరాబాద్ వచ్చిన సుమ 2006 నుండి నేటి వరకు విశ్రాంతి లేకుండా పని చేస్తూనే ఉన్నారు..ఎంతో మంది గడిచిన 15ఏళ్ళల్లో యాంకర్లు వచ్చారు వెళ్లిపోయారు..కానీ సుమ మాత్రం చెక్కు చెదరలేదు..ఆమె టైమింగ్ చూస్తుంటే ఎవరైనా అవ్వక్ అవ్వాల్సిందే..ఎన్నో ఆడియో వేడుకలు చేశారు సుమ..మనకు తెలుసు ఒక హీరో ఆడియో వేడుకలో మరో హీరో పేరు చెబితే ఏమైపోతుందో..ఇన్ని వేడుకలు యాంకర్ గా చేసిన సుమ ఎప్పుడు తప్పు చెప్పలేదు..అంటే ఆమె ఎంత అలర్ట్ గా ఉంటారో అర్థం చేసుకోవచ్చు..లైవ్ షోలు..రియాలిటీ షోలు..మహిళల షోలు..ఆటల షోలు..ఇంటర్వ్యూ షోలు..ఇలా ఒక్కటి ఏమిటి అన్ని చేసేశారు సుమ..


అప్పుడప్పుడు సినిమాల్లో తల్లుకుమనే సుమ షోలు మాత్రమే నాకు కంఫర్ట్ అని అంటుంటారు..పెళ్లికి ముందు ఒక అమ్మాయి ఇలా బిజీగా గడపడం చాలా సులువు కానీ పిల్లలను పెట్టుకొని అంటే చాలా కష్టం..చిన్నప్పుడు బాగోలేక పోతే నేను నిల్చున్న పోడియం కింద మా పాప ఉండేది అని..నా పిల్లలు ఇద్దరు లొకేషన్ లోనే పెరిగారు..వారికి లొకేషన్ సెకండ్ హోమ్ అని చెప్పారు..ఒక పక్క షో చేస్తూ క్మరో పక్క పిల్లలను చూసుకోవడం అంటే అది సాధారణ విషయం కాదు..ఇలా ఎన్నో కష్టాలు తెర వెనుక ఉన్నా..మనకు స్క్రీన్ ముందుకు రాగానే చక్కటి నవ్వుతో వెంట వెంటనే పంచ్ లు వేస్తూ..అందరిని అలరించటమే ఆమెకు తెలుసు..యాంకర్ అనగానే అందం ఉంటే సరిపోతుంది అనే స్థాయి నుండి యాంకర్ అంటే ఇలా చెయ్యాలి అందంతో పాటు ఇవన్ని ఉండాలి అని ఒక బెంచ్ మార్క్ ను సెట్ చేశారు సుమ కనకాల..


ఒక యాంకర్ సంవత్సరానికి ఒక స్టార్ హీరోయిన్ అంత డబ్బులు సంపాదించచ్చు అని నిరూపించారు సుమ..అంటే వాళ్ళు మూడు నెలల్లో ఒక సినిమా చేస్తే ఆమె సంవత్సరం అంతా పని చేయాల్సి ఉంటుంది..కానీ ఆ స్థాయికి ఎదిగిన ఏకైక యాంకర్ సుమ..ఒక్క మాటలో చెప్పాలి అంటే..సుమ చేసిన అన్ని షోలు..అన్ని ఎపిసోడ్స్..అన్ని సినిమా వేడుకలు..మరొకరు చెయ్యడం..అసాధ్యమనే చెప్పాలి..ఒక షో ని ఎక్కువ ఎపిసోడ్స్ హోస్ట్ చేసిన యాంకర్ గా లిమ్కా బుక్ ఆ రికార్డ్స్ లో ఐదేళ్ల ముందరే అందుకున్నారు సుమ..మరి ఇప్పటికి ఆ “స్టార్ మహిళ” షో వస్తూనే ఉంది..అంటే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నని రోజులు ఆ రికార్డ్ సుమ గారి పేరు మీద ఉండిపోతుంది..అలాంటి సుమ గారి నుండి పరిశ్రమలోకి రావాలి అని అనుకునే నేటి తరం అమ్మయిలు తెలుగు బాష పై పట్టు..చేస్తున్న పని పట్ల శ్రద్ధ..ఓపిక..కష్టపడటం..నేర్చుకోవాలి


పేరుకి రాజీవ్ కనకాల గారి ఇంట్లో ఉంటారు గాని నిత్యం మనందరి ఇంట్లోకి వచ్చి మనల్ని అలరించే సుమగారు..మరో ఇరవై ఏళ్ళు ఇలానే అలరించాలని..ఇప్పుడు ఉన్న స్టార్ హీరోల కొడుకుల ఆడియో వేడుకలు కూడా ఆమె హోస్ట్ చెయ్యాలి అని కోరుకుందాం..మహిళా సాధికారతలో భాగంగా చిత్ర పరిశ్రమలోని తెలుగు మహిళలను గౌరవించుకుంటు నేడు సుమ గారి పై వ్యాసము..రేపు..నటిగా మానందరిని అలరించి తమిళంలో వరుస సినిమాలు చేస్తున్న మదనపల్లె అమ్మయి..బిందు మాధవి గారి గురించి కథనం..