05-03-2021 10:15:03 About Us Contact Us


కమల్ హస్సన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీ కి పరిచయం అయినా శృతి హస్సన్ తెలుగు,తమిళ, హిందీ భాషల్లో నటించి మెప్పించింది.అనగానగా ఓ దీరుడు చిత్రంతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయినా శృతి హాసన్.. మొదటి సినిమాకే ఉత్తమ నటిమణిగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు సొంతం చేసుకుంది.


శృతి హాసన్ 1986 జనవరి 28 న కమల్ హాసన్, సారిక ఠాకూర్ దంపతులకు చెన్నైలో జన్మించింది.. శృతి హాసన్ కు అక్షర హాసన్ అనే చెల్లెలు కూడా ఉంది తను కూడా ఇప్పుడిప్పుడే సినిమాలలోకి రావడానికి ప్రయత్నాలు చేస్తుంది.శృతి హాసన్ బాల్యం అంతా చెన్నైలోనే గడిచింది 10వ తరగతి వరకు చెన్నైలోని అండల్ వెంకట సుబ్బారావు అనే గర్ల్స్ స్కూల్ లో చదువుకుంది.ఇంటర్మీడియట్ సెయింట్ ఆండ్రె కాలేజీలో, యూనివర్సిటీ అఫ్ ముంబై నుండి సైకాలజీలో పట్టా పొందింది.. చిన్నప్పటి నుండి చదువులో చురుకు అయినా అమ్మాయి శృతి హాసన్.. చదువుతో పాటు సంగీతం మీద ఎక్కువ ఆసక్తిగా ఉండేది.


చదువు పూర్తి అయినా తరువాత కాలిఫోర్నియాలో సంగీతం నేర్చుకుంది.2000 లో తన తండ్రి కమల్ హాసన్ జాతిపిత మహాత్మ గాంధీ జీవిత కథ ఆధారంగా తెరకేక్కించిన హే రామ్ అనే చిత్రంలో ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కూతురు పాత్రలో నటించి బాల నటిగా మెప్పించింది.తరువాత సంగీతం మీద ఎక్కువ దృష్టి సారించింది అలా ఉండగా తనకి సినిమాలలో నటించాలి అని కోరిక కలిగింది.. అదే విషయం తల్లిదండ్రులకు చెప్పగా వాళ్ళు కూడా ప్రోత్సహించారు.. కమల్ హాసన్ గారు తనకి ఉన్న పరిచయాలతో శృతి హాసన్ సినీ ఎంట్రీ పెద్ద కష్టం లేకుండానే జరిగిపోయింది.


మొదట హిందీలో లక్ అనే చిత్రంలో నటించిన శృతి హాసన్ ఆ చిత్రం ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో మళ్ళీ సినిమాలకు కొన్ని రోజులు బ్రేక్ ఇచ్చింది ఆ సమయంలో ఈనాడు వంటి చిత్రలో పాటలు పాడింది సింగర్ గా అవార్డులు కూడా అందుకుంది అలా మూడేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉండి తరువాత 2011 లో k రాఘవేంద్ర రావు తనయుడు k ప్రకాష్ దర్శకత్వంలో అనగనగా ఓ దీరుడు చిత్రంలో సిద్దార్ద్ కి జోడిగా నటించి మెప్పించింది ఈ చిత్రానికి గాను ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫెయిర్ అవార్డు కూడా అందుకుంది.


తరువాత మురగదాస్ దర్శకత్వంలో సూర్యతో 7 సెన్స్, హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ కి జోడిగా గబ్బర్ సింగ్ చిత్రాలలో నటించి బారి విజయాలు అందుకుంది.రవితేజ, జూ. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోల సరసన చేసి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది ఈ సంవత్సరం సంక్రాంతికి krack చిత్రంతో blockbuster అందుకుంది ఈ అమ్మడు.


పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్, కాటమరాయుడు తరువాత ముచ్చటగా మూడో సారి వకీల్ సాబ్ తో రాబోతుంది.. అలానే ప్రభాస్, ప్రశాంత్ నిల్ చిత్రం సాలర్ లో కూడా ఈ అమ్మడే కథనాయక అని చిత్రం బృందం తెలియచేసారు


ఇలాంటి మరెన్నో చిత్రాలు చెయ్యాలని చేసి ప్రేక్షకులను మరేంతగానో అలరించాలని కోరుకుంటూ BR మూవీ జోన్ తరుపున హృదయ పూర్వక జన్మదిన శుభాకాంక్షలు.