25-01-2022 16:23:09 About Us Contact Usప్రముఖ దర్శకులు పూరి జగన్నాథ్ గారు నేడు SR కళ్యాణమండపం Est 1975 సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు.రాజావారు రాణిగారు సినిమా హీరో కిరణ్ అబ్బవరం హీరోగా.. టాక్సీవాల ఫేమ్ ప్రియా జవాల్కర్ హీరోయిన్ గా.. షార్ట్ ఫిల్మ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శ్రీధర్ గాదె డెబ్యూ డైరెక్టర్ గా చేస్తున్న సినిమా SR కళ్యాణమండపం.RX100 సినిమాతో యువతలో మంచి పేరు సంపాదించుకున్న చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.


లఘు చిత్రాలతో యువతకు దగ్గరై..తొలి సినిమా రాజావారు రాణిగారు తో వెండితెరకు పరిచయమై.. తొలి సినిమాతోనే విజయం అందుకున్నారు కిరణ్ అబ్బవరం.దర్శకుడు శ్రీధర్ గాదె..కిరణ్ కలయికలో గతంలో 1991 షార్ట్ ఫిల్మ్ ఈ దర్శకుడు చేశారు.తొలి సినిమాగా..SR కళ్యాణమండపం సినిమా రానుంది.రేపు..జులై 15న కిరణ్ అబ్బవరం పుట్టినరోజుని పురస్కరించుకొని హీరో ఫస్ట్ లుక్ ని దర్శకుడు పూరి జగన్నాథ్ గారు నేటి సాయంత్రం ఆరు గంటలకు విడుదల చేశారు.ఇప్పటికే విడుదలైన తొలి పోస్టర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది.అందులో హీరోయిన్ పుస్తకం వేటుకుంటుంటే..హీరో ఆమె నడుము తాకేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఉంటుంది.ఇప్పుడు విడుదలైన పోస్టర్ మాస్ ఆడియాన్స్ ని దగ్గర చేసేలా ఉంది.చుట్టు ఫ్యాషనిస్టులు ఉంటే.. హీరో మాత్రం బల్ల పై గొడ్డలి పట్టుకొని ఉంటాడు.మెడలో కాలేజీ ఐడీ కార్డ్ ఉంది.అలానే బాక్ గ్రౌండ్ లో ఉన్న బండిని చూస్తుంటే చిత్తూరు జిల్లా కేంద్రంగా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు అర్ధమవుతుంది.ఈ సినిమాను ఎలైట్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.ప్రమోద్..రాజులు నిర్మాతలు.ఈ బ్యానర్ లో ఇదే తొలి సినిమా.విశ్వాస్ సినెమత్తోగ్రఫీ చేస్తున్నారు.