22-04-2021 12:00:53 About Us Contact Us



వరస సినిమాలు చేస్తున్న యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం.. కలర్ ఫోటో తో అందరినీ మెప్పించిన మన తెలుగు నటి చాందిని చౌదరి జంటగా చేస్తున్న సినిమా సమ్మతమే. వివరాల్లోకి వెళ్తే..


రాజావారు రాణిగారు చిత్రంతో కథనాయకుడిగా పరిచయం అయ్యి విమర్శకుల ప్రశంసలు పొందిన హీరో కిరణ్ అబ్బవరం. ఇటీవల కాలంలో బాగా వినిపిస్తున్న పేరు. రెండవ సినిమా SR. కళ్యాణమండపం ప్రారంభించిన వెంటనే.. సెబాస్టియన్ పిసి 524 ప్రకటించారు. అలాంటి కిరణ్ హీరో గా..


మన తెలుగింటి కుందనపు బొమ్మ ఈ మధ్యనే కలర్ ఫుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన చాందిని చౌదరి హీరోయిన్ గా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మంచి పేరు గడించి.. ఇప్పుడు సినిమా అవకాశం దక్కించుకున్న నూతన దర్శకుడు గోపినాథ్ రెడ్డి తెరకేక్కిస్తున్న సినిమా సమ్మతమే. చిత్ర బృందం టైటిల్ పోస్టర్ ని నేడు విడుదల చేశారు.



ఇక ఈ చిత్రం పోస్టర్ విషయానికి వస్తే గోపికలకు శ్రీ కృష్ణుడు ఏమి చేసినా సమ్మతమే అనే భావం వచ్చేలా.. స్తంభానికి కట్టేసినా కూడా ఒక స్త్రీ తన్మయత్వంతో సమ్మతమే అనేలా నిలుచొని ఉంది. అలానే Love is Un Conditional.. అంటే.. ప్రేమ అనేది కొలమానం లేని కొలవలేని ఒక అనుభూతి అనే అర్థం. ఒక పక్క సమ్మతమే అనే టైటిల్.. కృష్ణుడి శ్రేష్ఠలు.. మరోపక్క ప్రేమ గురించి ఒక మాట.. దింతో ఇది ఒక మధురమైన ప్రేమ కథ అనే అర్థం వచ్చేలా ఉంది టైటిల్ పోస్టర్. ఎన్నో సినిమాలకు అద్భుతమైన పోస్టర్లు డిజైన్ చేసిన ఓంకార్ కడియం.. సినిమా కధాంశం ని తెలియచేసేలా పోస్టర్ ను చాలా బాగా డిజైన్ చేశారు.


UG Production నుండి ప్రొడక్షన్ లో తొలి సినిమాగా నిర్మాత కె.ప్రావీణా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కార్తికేయ.. ఎక్కడికి పోతావు చిన్నవాడా.. చిత్రాలతో మంచి సంగీత దర్శకుడిగా పేరు తెచ్చుకున్న శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం సమకురుస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రాహకుడిగా సతీష్ రెడ్డి మాసం వహిస్తున్నారు.. ఈయనకి కూడా ఇదే మొదటి చిత్రం కావడం విశేషం.


కొత్త సంవత్సరంలో మొదలైన కొత్త చిత్రం సమ్మతమే చిత్రం ద్వారా మంచి విజయాన్ని అందుకోని కొత్తవారు పరిశ్రమలో నిలదొక్కుకోవాలని ఆశిద్దాం..!