24-01-2021 12:27:47 About Us Contact Us



అవును.. ఒకప్పుడు సినిమా విడుదలకు ముందు రోడ్ల పైన మీ అభిమాన థియేటర్లలో అనే మాట వినేవాళ్ళం.. చదివేవాళ్ళం. ఎప్పుడు పరిశ్రమలో కొత్త ట్రెండ్ ని సెట్ చేసే డైరెక్టర్ సాయి రామ్ దాసరి తదుపరి చిత్రం మీ అభిమాన ఓ.టి.టిలలో అని ప్రకటించేశారు. ఇప్పటి వరకు కేవలం ఒక్కటే ఓ.టి.టి లో సినిమాలు విడుదల చేసేవారు. కానీ ఈయన ఏకంగా ఐదు ఓ.టి.టి లలో విడుదల చేస్తున్నారు.

సాధారణంగా సినిమా వల్ల వివాదాలు అవుతుంటాయి. కానీ.. అదే వివాదాల పై సినిమాలు తీసేవారు అరుదు. అలాంటి అరుడైన దర్శకులలో ఒక్కరైన సాయి రామ్ దాసరి తదుపరి చిత్రం DDD(డెడ్లీ డేంజరస్ డ్రీమ్).ఈ చిత్రంలో షకీలా ఒక ప్రధాన పాత్రలో నటించారు.

ఈ చిత్రాన్ని దర్శకుడు థ్రిల్లర్ జోనర్ లో అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది అని మనకి ట్రైలర్ చూస్తేనే అర్ధం అవుతుంది. అడ్వెంచర్ కోసం అడవిలోకి వెళ్లిన కొంతమందికి అక్కడ అనుకోని పరిస్థితిల్లో వాళ్లకి నరమాంస బక్షకులు ఎదురు పడితే? వారి బారి నుండి ఎలా బయట పడ్డారు? అనే కదాంశంతో అన్ని హంగులు సమాపళ్ళలో ఉన్నట్టుగా మనకి ట్రైలర్తోనే అర్ధం అవుతుంది. సీట్ ఏడ్జ్ థ్రిల్లర్స్ ని ఇష్టపడే వాళ్ళని ఈ చిత్రం తప్పకుండా అల్లరిస్తుంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

సాయిరాం దాసరి, లండన్ గణేష్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా అయిదు ottలలో (అమెజాన్ ప్రైమ్, M X ప్లేయర్,ఎయిర్టెల్ Xtream, విఐ సినిమా,హంగామా ప్లే ) ఒకే సారి ఇన్ని ott platforms లో మొదటి చిత్రం ఇదే కావడం విశేషం.

షకీలా తో పాటు.. లండన్ గణేష్.. విక్రాంత్ రెడ్డి.. మమతా.. నవ్య శ్రీ.. మధు.. హర్ష.. సందీప్.. వర్మ.. అర్జున్. ఈ సినిమాలో నటించారు. సంక్రాంతి కానుకగా మన అభిమాన ఓ.టి.టి లలో విడుదల కానున్న ఈ చిత్రం విజయం సాధించడమే కాక.. ఇలా కొత్త రకమైన విడుదల కు నాంది కావాలని ఆశిదాం..!