25-01-2022 16:43:56 About Us Contact Usమెగా కుటుంబం నుంచి ముగ్గురి మావయ్యల ముద్దుల అల్లుడిగా 2014లో పిల్లా నువ్వు లేని జీవితం తో పరిచయమై..చూడగానే మన పక్కింటి కుర్రాడు అనే దగ్గర నుండి తెలుగువారు అందరూ.. మన ఇంటి కుర్రాడు అనేంతలా చేరువయ్యారు ధరమ్ తేజ్.తనదైన శైలిలో నటిస్తూ.. తనకంటూ ఒక ఇమేజ్ ని సాధించి.. సుప్రీమ్ హీరో గా ఎదిగారు పంజా సాయి ధరమ్ తేజ్. అటు మాస్.. ఇటు ఫామిలీ ఆడియాన్స్ కు బాగా చేరువయ్యారు తేజు.. మరిముఖ్యంగా తేజుకు అమ్మయిల ఫాలోయింగ్ కూడా కొంచెం ఎక్కువే.. అలాంటి సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కధనం..!


1986 అక్టోబర్ 15న మద్రాస్ లో జన్మించాడు తేజు.తన బాల్యం.. కొద్ది సంవత్సరాలు నెల్లూరులో.. మరి కొద్ది సంవత్సరాలు చెన్నై లో గడిచింది.పరిశ్రమ హైదరాబాద్ చేరిన క్రమంలో హైదరాబాద్ చేరిన తేజు.. డిగ్రీ మరియు ఎంబీఏ హైదరాబాద్ లో పూర్తి చేశారు.డిగ్రీ చదివే రోజుల నుండి ఇంట్లో డబ్బులు తీసుకోవడం మానేసిన తేజు.. డబ్బుల సంపాదన కోసం మిత్రులతో కలిసి అనేక వ్యాపారాలు చేశారు.ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకొని తొలుత తనకు బాగా దగ్గరైన పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు.ప్రతి విషయం తల్లితో పంచుకునే తేజు నెమ్మదిగా తల్లికి కూడా తెలిపారు.ఇలా ఏదో ఒక రోజు సినిమా అంటావు అని తెలుసు.. అంటూ ముందు ఎంబీఏ చదువు ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పారు తల్లి విజయ దుర్గ.అమ్మ కోసం అలా చదువు పూర్తి చేసి సినీ రంగం వైపు అడుగులు వేశాడు ఆ 23 ఏళ్ళ కుర్రాడు.


ఆ రోజుల్లో 132 కేజీల బరువు ఉన్న సాయి ధరమ్ తేజ్.. ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండా.. కఠోర శ్రమతో 50 కేజీలు పైన తగ్గాడు.అంతటితో అయిపోలేదు.పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఆయన గురువైన సత్యానంద మాస్టర్ వద్ద నటనా శిక్షణ పొందాడు.మెగా కుటుంబం నుండి వచ్చినా తేజు మాత్రం సినిమా అవకాశాల కోసం పరిశ్రమకు వచ్చిన కొత్త వారిలా ఫోటోలు పట్టుకొని దర్శక..నిర్మాతల ఆఫీసులు చుట్టు తిరిగాడు.ఫోటో వెనక పేరు సాయి అని.. ఫోన్ నెంబర్ రాసి అవకాశం ఉంటే చెప్పాలని చెప్పేవాడు.అలా తిరుగుతున్న తను ఒక రోజు మంచు మనోజ్ ఆఫీస్ లో క్రికెట్ అడుతుండగా వై.వి.ఎస్.చౌదరి గారి కంట్లో పడ్డారు.నీకు సినిమా ఇంట్రెస్ట్ ఉందా అని అడగటంతో సాయి ధరమ్ తేజ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది.


మెగా కుటుంబం నుండి వచ్చినా అవకాశాల కోసం తిరిగినా తన కష్టాలు పోలేదు.2010 లో ప్రారంభమైన రేయ్ సినిమా 2015లో విడుదలైంది.2012లో మొదలైన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సమయంలో 2013లో శ్రీహరి గారి మరణంతో సినిమాలో అనేక సన్నివేశాలు మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆ పాత్రను జగపతిబాబు గారు చేశారు.అలా 2010లో అవకాశం లభించినా ప్రేక్షకుల ముందుకు 2014లో వచ్చాడు తేజు.అక్కడ నుండి చరిత్ర..“చిత్రలహరి” లో “రేయ్” “తేజ్ ఐ లవ్ యూ” అంటే.. “ఇంటెలిజెంట్” గా.. “పిల్లా నువ్వు లేని జీవితం””ప్రతిరోజు పండగే” అని చెప్పి.. “సుబ్రమణ్యం ఫర్ సేల్” అంటూ తన “తిక్క” తో బాక్స్ ఆఫీస్ వద్ద “విన్నర్”గా.. నిలిచిన “జవాన్”. “సోలో బ్రతుకే సో బెటర్” అంటున్న.. “సుప్రీమ్”.. “నక్షత్రం”(స్టార్).. “పంజా సాయి ధరమ్ తేజ్”..!


కెరియర్ తొలి రోజుల్లో పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. సుప్రీమ్ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు.ఆ తర్వాత వరస ప్లాప్స్ వచ్చినా ఎక్కడా తన తదుపరి చిత్రం ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం కనపడలేదు.అంటే సాయి ధరమ్ తేజ్ సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా తనకంటూ ఒక మార్కెట్ ని సంపాదించుకున్నారు అని అర్థం.తిరిగి చిత్రాలహరి తో భారీ విజయం అందుకున్న సుప్రీమ్ హీరో ప్రతిరోజు పండగే సినిమాతో విజయం కొనసాగించారు.ఇప్పడు.. సోలో బ్రతుకే సో బెటర్.. మరియు దేవ కట్ట గారితో మరో సినిమా చేస్తున్నారు.


ఎప్పుడు ఎవరు కనిపించినా చిరునవ్వుతో పలకరిస్తూ.. అభిమానులతో సరదాగా మాట్లాడుతూ.. సొసైటీ కోసం తనవంతు బాధ్యతగా థింక్ పీస్(Think Peace)అనే స్వచ్చంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ చేసేందుకు ముందు వచ్చారు తేజు.గత సంవత్సరం తన పుట్టినరోజున విజయవాడ వృధాశ్రమాని పూర్తిగా మెరుగు పరిచారు.మా పెద్ద మామ చిరంజీవి గారు చిన్నతనం నుండి నన్ను చూసుకున్నారు..మా నాగబాబు మామ ఏం చదవాలి..ఏ ఆట ఆడాలి..అలా అనేక విషయాలు నేర్పారు..మా చిన్న మామ పవన్ కళ్యాణ్ గారు నా గురువు..అంటూ ముగ్గురి గురించి ఎప్పుడు చెప్పినా తన మొహంలో గర్వంతో కూడిన ఆనందం స్పష్టంగా కనిపిస్తుంటుంది.మెగాభిమానులకు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులలో సైతం తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు తేజ్.!


ఇలా దశాబ్ద సినిమా ప్రస్థానంలో పదమూడు సినిమాలు పూర్తి చేసుకున్నారు.మెగా కుటుంబం నుండి వచ్చిన మిగతా హీరోలకు భిన్నంగా సినిమా అవకాశాల కోసం కష్టపడి.. వరస పరాజయాలను ఎదురుకొని.. తన ప్రతిభ.. కష్టం.. ఓపికతో పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి.. అటు మాస్ ఇటు కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువైన మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..!