19-01-2021 19:23:41 About Us Contact Us



మాస్ మహరాజ్ రవితేజ నూతన సంవత్సర ప్రారంభరోజున రెండు కానుకలను అభిమానులకు ఇచ్చారు.రెండు కూడా మాస్ ప్యాక్డ్ గిఫ్ట్ లు కావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.


రవితేజ శృతి హాసన్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా రాబోతున్న చిత్రం krack. ఇప్పటికే.. థమన్ అందించిన పాటలకు అద్భుతమైన స్పందన లభించగా నూతన సంవత్సరం కానుకగా చిత్రం బృందం విడుదల చేసిన Krack ట్రైలర్ కి ప్రేక్షకుల నుండి విపరీతంగా స్పందన వస్తుంది. వరలక్ష్మి.. సముద్రఖని.. రవి కిషన్ ఇలా భారీ తారగణం తో మాస్ మహారాజ్ రవితేజలోని ఎనర్జీ ని చాలా రోజుల తరువాత చూపించి హై వాల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకేక్కించిన చిత్రం krack అనే విషయం ట్రైలర్ చుస్తే అర్థమవుతుంది.


అభిమానుల అంచనాలను అందుకునే విధంగా సినిమా అనే నమ్మకాన్ని కల్పించింది ఈ ట్రైలర్. ట్రైలర్ చూసిన ఎవరైనా.. డైరెక్టర్ గోపిచంద్ మలినేని కథా.. సన్నివేశాలతో పాటు మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ ని కూడా పొగడాల్సిందే. రవితేజ కెరీర్ లో వేగవంతమైన 200k మార్క్ ని అందుకున్న ట్రైలర్ గా krack ట్రైలర్ సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. ఇప్పటికే.. ఈ ట్రైలర్ 8 మిలియన్ వ్యూస్ అందుకుంది.



ఖిలాడి ఫస్ట్ లుక్ :-

రవితేజ Krack చిత్రం విడుదలకి సిద్ధం అవుతున్న తరుణంలో తన తదుపరి చిత్రం ఖిలాడి ఫస్ట్ లుక్ విడుదల చేసి డబల్ ధమాకా ఇచ్చాడు.


రవితేజతో గతంలో వీర చిత్రం తెరకేక్కించిన రమేష్ వర్మ పెన్మత్స ఈ సినిమా దర్శకుడు. 2019లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ రాక్షసుడుతో మంచి విజయాన్ని అందుకున్న తర్వాత చేస్తున్న సినిమా కావడంతో సినిమా పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రంలో రవితేజ ద్విపత్రాబినయం చేస్తున్నరు. దింపుల్ హాయటి.. మీనాక్షి చౌదరి కథానాయికలు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకురుస్తున్నారు.


అటు డబల్ యాక్షన్.. ఇటు డబల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్.. అటు క్రాక్.. ఇటు ఖిలాడి అంటూ ప్రేక్షకుల ముందు వస్తున్న మాస్ మహరాజ్ సినిమాలు ఏ స్థాయి విజయం సాధిస్తాయో చూడాలి..!