13-04-2021 01:15:06 About Us Contact Usతన ఎనర్జీతో ప్రేక్షకులను అలరించే రామ్ ఈ సారి సంక్రాంతి అల్లుడుగా బరిలోకి దిగబోతున్నాడు.ఇప్పటికే ఇస్మార్ట్ శంకర్ వంటి ఇండస్ట్రీ హిట్ తో మంచి ఫార్మ్ లో ఉన్న రామ్ మరో విజయం తన ఖాతాలో ఖాయమని ధీమా తో ఉన్నారు.


రామ్ పోతినేని.. మాళవిక శర్మ జంటగా నీవేత పేతురాజ్ ముఖ్యపాత్రలో నటించిన చిత్రం రెడ్. తమిళ చిత్రం తడం ఆధారంగా తెరకేకుతున్న ఈ చిత్రాన్ని ఇప్పటికే రామ్ తో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ చిత్రాలతో విజయాలు అందుకున్న దర్శకుడు కిషోర్ తిరుమల.. హ్యాట్- ట్రిక్ సినిమాగా ఈ చిత్రాన్ని తెరకేక్కిస్తున్నారు. నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం జనవరి 14 న సంక్రాతి కానుకగా విడుదల కానుంది. విడుదలైన ప్రచార చిత్రాలకు.. పాటలకు అద్భుతమైన స్పందన వస్తుంది.


ఈ చిత్రంలో ప్రతేక ఆకర్షణగా హెబ్బా పటేల్ చేసిన ఐటమ్ సాంగ్ నిలవనుంది.. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన సంగీతం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఇప్పటికే విడుదలైన టీజర్ కి అయన ఇచ్చిన నేపథ్య సంగీతానికి విశేషమైన ఆదరణ లభిస్తుంది. ఇక పాటలు సమాజిక మాధ్యమాలలో మారు మొగుతున్నాయి.


రామ్.. కిషోర్ కలయికలో వచ్చిన రెండు చిత్రాలు కమర్షియల్ గా మంచి విజయాన్ని అందుకోవడం.. మరో పక్క తమిళనాట బ్లాక్ బస్టర్ ఐన కథ కావడంతో ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయ్.ఈ సినిమాలో రామ్ ద్విపాత్రాభినయం చ్చేసినట్లు పోస్టర్స్ ని చుస్తే తెలుస్తుంది.ఇది ఈ సినిమాకు మరో ఆసక్తి కలిగించే అంశం. ఎనర్జీటిక్ స్టార్ గా పేరు పొందిన రామ్ ఇమేజ్ తగ్గకుండా.. మంచి థ్రిల్లర్ సినిమాగా తెరకెకించినట్లు సినిమా బృందం తెలిపింది.


స్రవంతి మూవీస్ బ్యానర్ పై రవికిశోర్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ సంక్రాంతికి విడులవుతున్న సందర్భంగా మంచి విజయాన్ని అందుకోవాలి అని కోరుకుందాం.