25-01-2022 16:00:06 About Us Contact Usఫిదా లో వరుణ్ తేజ్ కి అన్నయ్యగా..దృవా లో రామ్ చరణ్ కి మిత్రుడిగా..మనకు బాగా సూపరిచితమైన నటుడు రాజా చెంబోలు.. అంతరిక్షం.. మిస్టర్.మజును.. హ్యాపీ వెడ్డింగ్..నాపేరు సూర్య..నా ఇల్లు ఇండియా.. ఏ.బి.సి.డి..రణరంగం సినిమాలలో కూడా కనిపించారు..ఇప్పటికే పలు సినిమాలలో తన నటనను చూసి ప్రక్షుకులు మెచ్చుకున్నారు..సవ్వడి అనే షార్ట్ ఫిల్మ్ లో తన నటనకు గత సంవత్సరం బాగా పేరు వచ్చింది..విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు..ఇలా కొన్ని సంవత్సరాలుగా మనకు దగ్గరవుతూ వస్తున్న రాజా ఎవరో కాదు..గత కొన్ని దశాబ్దాలుగా తన కలంతో మనల్ని అన్ని భావోద్వేగాలకు లోను చేసిన పాటల రచయిత..సిరి వెన్నెల సీతారామ శాస్ట్రీ..గారి కుమారుడు..ఎక్కడా తండ్రి పేరు లేకుండా ప్రేక్షకులను తన ప్రతిభతో గుర్తింపు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు..


ఇప్పటికే తాజాగా విడుదలైన మస్తీ అనే వెబ్ సిరీస్ తో యువతకు బాగా చేరువయ్యారు..త్వరలో తనే కథానాయకుడి గా ఒక వెబ్ సిరీస్ చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి..తన ప్రతిభను..కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ముందుకు అడుగు వేస్తున్న రాజా నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు..కరోనా నేపథ్యంలో తన కుటుంబ సభ్యులు..అత్యంత ఆప్తులతో మాత్రమే పుట్టిన రోజు వేడుకలు జరుపుకుంటున్నారు..మరిన్ని సినిమాలు చెయ్యాలని..నటుడిగా మంచి గుర్తింపు పొందుతూ..ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటూ..రాజా చెంబోలు గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు..