24-01-2022 15:54:21 About Us Contact Usరెండు దశాబ్దాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సినిమాతో ఒక యువకుడు తెలుగు ప్రజలకు దర్శకుడిగా పరిచయమయ్యాడు.తొలి సినిమాతోనే తన సినిమాలో హీరో క్యారెక్టర్లు మున్ముందు ఎలా ఉంటాయో చూపించాడు.ఆ రోజు పవన్ కళ్యాణ్ సైతం ఊహించి ఉండదు తను మెడ మీద చెయ్యి పెట్టడం తన మ్యానరిజం అవుతుంది అని.ఇక యువత బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ గారికే కాక తొలి సినిమా దర్శకత్వం చేసిన దర్శకునికి కూడా బాగా కనెక్ట్ అయ్యారు.నాటి బద్రి నుంచి నిన్నటి ఇస్మార్ట్ శంకర్ వరకు హిట్లు,ఫ్లాప్లు అనే సంబంధం లేకుండా రెండు దశాబ్దాలుగా యువతకు చేరువైన ఏకైక దర్శకుడు పూరి జగన్నాథ్ గారు తెలుగు చిత్ర పరిశ్రమకి దర్శకుడుగా పరిచయమై నేటితో 20ఏళ్ళు..


తొలి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో భారీ విజయం అందుకున్న పూరి,వెంటనే జగపతిబాబుగారితో బాచి సినిమా తీశారు.ఆ తరవాత కన్నడలో శివ రాజ్ కుమార్ తో మన తెలుగు తమ్ముడిని రీమేక్ చేసిన పూరి.2001లో రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం అనే సినిమాతో హిట్ అందుకున్నారు.ఇలా వరస హిట్స్ తో ఉన్న పూరీని 2003 కన్నడ స్టార్ హీరో శివ రాజకుమార్ తమ్ముడు పునీత్ రాజ్ కుమార్ ను పరిచయం చేయమని కోరగా పూరి అప్పు అనే సినిమా చేశారు.అది అక్కడ ఘన విజయం అందుకుంది.ఆ సినిమానే మన తెలుగులో రవితేజను స్టార్ హీరో చేసిన ఇడియట్ సినిమా..ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమ్మిళ అమ్మాయి సీనిమాతో పూరి,రవితేజ కంబోగా వరస హాట్-ట్రిక్ హిట్స్ అందుకున్నారు.

2003 లో నాగార్జున తో చేసిన శివమణి సినిమా ఇప్పటికి ప్రేక్షకులు చూస్తూనే వున్నారు.2004లో ఎన్టీఆర్ తో ఆంధ్రవాలా,బాలీవుడ్ లో మన బద్రి రీమేక్ షార్ట్,తమ్ముడు సాయి ని పరిచయం చేస్తూ 143 సినిమాలు చేశారు.2005లో నాగ్ తో మళ్ళీ సూపర్ అనిపించుకున్నారు.2006లో ప్రిన్స్ మహేష్ బాబు తో చేసిన పోకిరి సినిమాతో అప్పటి తెలుగు సినిమా రికార్డ్స్ అన్ని తుడిచిపెట్టుకుపోయ్యాయి,దాదాపు మూడు సంవత్సరాలు ఆ సినిమా ఆడింది.పూరి సినిమా స్టామినా చూపించిన సినిమాగా పోకిరి నిలిచిపోయింది.2007లో దేశముదురులో అల్లు అర్జున్ సిక్స్ ప్యాక్ తో కనిపించడం ద్వారా తెలుగు పరిశ్రమలోకి సిక్స్ ప్యాక్ ట్రెండ్ వచింది.ఆ సినిమాలోని ప్రతి డైలాగ్ అందరికీ గుర్తుంటాయి.


అదే 2007లో చిరుత సినిమాతో మెగాస్టార్ చిరంజీవి వారసుడు రామ్ చరణ్ ని పరిచయం చేశారు పూరి.తొలి సినిమాతోనే రామ్ చరణ్ ప్రజల్లో మెప్పు పొందాడు అంటే అది పూరి దర్శక్వత ప్రతిభ అనే చెప్పాలి,చరణ్ లోని ట్యాలెంట్ ని ప్రేక్షకుల ముందు పెట్టారు పూరి.2008 యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో బుజ్జిగాడు,రవితేజ తో నేనింతే సినిమాలతో ప్రేక్షకులను అలరించారు పూరి.2009లో మళ్ళీ ప్రభాస్ తో ఎక్ నిరంజన్,2010లో గోపిచంద్ తో గోలిమార్,2011లో రానా తో నేను నా రాక్షసి సినిమాలు చేశారు.అదే సంవత్సరం హిందీ లో బుద్దా హోగా తెర బాప్ అనే సినిమాతో తన అభిమాన నటుడు బిగ్ బి అమితా బచ్చన్ గారిని డైరెక్ట్ చేశారు పూరి.2012లో మళ్ళీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో బిజినెస్ మ్యాన్ అనే సినిమాతో భారీ విజయం అందుకున్నారు.2012లో రవితేజ తో దేవుడు చేసిన మనుషులు,పవన్ కళ్యాణ్ తో కెమరామెన్ గంగతో రాంబాబు సినిమాలు చేసి ఒక్క సంవత్సరంలో మూడు సినిమాలు విడుదల చేసిన నేటి తరం దర్శకుడిగా చరిత్ర సృష్టించారు.


2013లో బన్నీ తో ఇద్దరమ్మాయిలు,2014లో నితిన్ తో హార్ట్ ఎటాక్,రోమియో,2015లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో టెంపర్ సినిమా చేసి దాదాపు ఈ తరం అందరి స్టార్ హీరోలతో హిట్ అందుకున్న స్టార్ డైరెక్టడ్ గా మరో అరుదైన రికార్డ్ అందుకున్నారు పూరి.అదే సంవత్సరం చార్మీ తో జ్యోతిలక్ష్మి,వరుణ్ తేజ్ తో లోఫర్ సినిమాలు చేసి విజయాలు అందుకున్నారు.2016లో కళ్యాణ్ రామ్ తో ఇజం,2017లో రోగ్ అనే సినిమా కన్నడ,తెలుగు బాషలలో చేశారు..బాలకృష్ణ తో పైసా వసూల్ తో ఫుల్ పైసా వసూల్ చేశారు పూరి.2018లో కొడుకు ఆకాష్ తో కలిసి మెహబూబా అనే సినిమా చేశారు..2019లో రామ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మరో సారి పూరి రేంజ్ హిట్ అందుకున్నారు,రామ్ కారియర్ లో అదే పెద్ద హిట్.ఇప్పుడు 2020లో స్టార్ హీరోగా మారిన నేటి తరం రౌడి విజయ్ దేవరకొండ తో కలిసి భారీ సినిమా చేస్తున్నారు పూరి,ఈ సినిమా నిర్మాణంలో హిందీ కరణ్ జోహార్ కుడా ఉన్నారు..

ఇలా తన 20ఏళ్ళ సినీ జీవితంలో 32 సినిమాలు చేశారు.నేటి తరం దర్శకులలో చాలా మంది జీవితంలో చేసే సినిమాలు ఆయన ఈ 20ఏళ్లలో చేశారు.ఆ కాలంలో మెగాస్టార్ చిరంజీవి,విక్టరీ వెంకటేష్..నేటి తరంలో నాగ చైతన్య,సాయిధరమ్,నాని.. తప్ప మిగతా స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడమే కాక వారి కెరీర్ లో గుర్తుండిపోయే సినిమాలు ఇచ్చారు పూరి.ఇక ఒకే సంవత్సరం 3 సినిమాలు చేసినా,అతి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసినా అవన్నీ పూరి మార్క్ దర్శకత్వ ప్రతిభకు అర్థం పడతాయి..


పవన్ కళ్యాణ్-బద్రి,నువ్వు నందా,నందా అయితే నాకేంటి నేను బద్రి బద్రీనాథ్.
మహేష్ బాబు-పోకిరి,ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లోక్ అవుడో వాడు పండు,నేనే..
నాగార్జున-శివమణి,నా పేరు శివమణి,నాకు కొంచెం మెంటల్.
అల్లు అర్జున్-దశముదురు,జాయింట్లు జారిపోతాయి,ఫిలమెంట్లు రాలిపోతాయి..
రవితేజ-ఇడియట్,సిటీ కి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు..పోతుంటారు..కానీ చంటి లోకల్..
ఎన్టీఆర్-నా పేరు దయా,నాకు లేనిదే అది..
ప్రభాస్-బుగ్గిగాడు,టిప్పర్ లారీ వచ్చి గుడితే ఎలా ఉంటుందో తెలుసా..


ఇలా ప్రతి సినిమాలో పదుల సంఖ్యలో డైలాగ్స్ మనకు టక్కున గుర్తొచ్చేస్తాయి..హీరోల మనరిజంలలో సైతం పూరి మార్క్ ఉంటుంది..ఆయన సినిమా డైలాగ్స్ లో జీవిత సత్యాలు కూడా ఉంటాయి..అందులో ఉదాహరణకు,నాకు బాగా నచ్చిన డైలాగ్..నేనింతే సినిమాలో ప్రపంచంలో ప్రతీ ఒక్కడు స్వార్థ పరుడే ఇదే మాటచెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు..తన సినిమాలో హీరో క్యారక్టర్ ఎప్పుడు మనల్ని నిరాసపరచదు..ప్రపంచంలో జరుగుతున్న నిజాలని పూరి చూపించే విధానం అద్భుతం..కొంచం ఘాటుగా చెప్పినా ఆయన ప్రతి సినిమాలో ఒక చక్కటి సందేశం ఉంటుంది,సమాజం పట్ల తనకున్న బాధ్యత తను నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది..

ఏడవ తరగతిలోనే తన మిత్రులతో మాట్లాడుకోవడానికి ఆఫీస్ పెట్టుకున్న విశాఖ జిల్లా కుర్రాడు,పూరిలా కాకపోతే ఇంకెలా ఉంటాడు..ఆయన సినిమాలే జీవిత సత్యాలు,చాలామందికి ఆదర్శాలు..ప్రేమ,దేశం పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఆయన సినిమాలు చూస్తే మనకు అర్ధమవుతుంది.మనలో చాలా మంది ఆయన మాటలలో ఆటో,ఇటో వెళ్లకుండ మధ్యలో ఊగిసులడుతుంటాం..వీరే ఈ దేశానికి ప్రమాదకరం..వీరు ఉండకూడదు అన్నదే తాన తపనలా కనిపిస్తూ ఉంటుంది.సొంతగా పూరి కనెక్స్ అనే నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు నిర్మించడమే కాక చాలామందికి అవకాశాలు,మరెందరికో ఉద్యోగాలు ఇస్తున్నారు పూరి.తన పుట్టినరోజు నాడు సినిమాలు చెయ్యలేని వయసు మళ్లిన దర్శకులకు ఆర్థిక సహాయం అందించారు పూరి.ఇదే కాదు,చేసిన సహాయం ఎన్నడూ చెప్పుకోలేదు పూరి..హీరోయిన్ లను చూపించడంలో కూడా తనదైన మార్క్ ఉంటుంది..సాధారణంగా ప్రేక్షకులు మాట్లాడుకుంటూ..మా హీరో ఎలా చెయ్యగలదో చేస్తావు ఆగు,పూరి గారి సినిమా వస్తుంది..ఆ అమ్మాయిని సరిగ్గా ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు..ఇప్పుడు పూరితో సినిమా చేస్తుంది కదా..ఇప్పుడు చూడు ఎలా చూపిస్తాడో పూరి..అంటున్నారు.


పాటలకు పూరి సినిమాలో మరో ప్రాత్యేక స్తానం ఉంటుంది,అందుకే పూరి సినిమా పాటలు మన ఆల్బమ్ లో కచ్చితంగా ఎక్కువే ఉంటాయి..ఇలా పూరి గారి గురించి రాస్తుపోతే పుస్తకమే రాయచ్చు..తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెన్ సెషన్,డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్,మాస్ సినిమాలకు పర్మనెంట్ అడ్రస్..పూరి మాటలలో చెప్పాలి అంటే..పూరీ నువ్వు తోపు రా..పూరి నువ్వు తురుము రా..పూరి నువ్వే మా అందరి రుస్తుం..


మరిన్ని దశాబ్దాలు దాదాపు 100 సినిమాలు దర్శకత్వం వహించాలి అని,మీడియా,పోలీస్,రాజకీయం అనే తేడా లేకుండా సమాజంలో తప్పు చేసే ప్రతి యడవను కడిగేయ్యాలి అని కోరుకుంటూ..రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుభాకాంశాలు..!