25-01-2022 16:25:29 About Us Contact Us


ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుని కుటుంబంలో జన్మించి.. మాస్ కమ్యూనికేషన్స్ చదువుకొన్న ఒక మధ్యతరగతి కుర్రాడు చిత్ర పరిశ్రమ వైపు అడుగులు వేశాడు. ఎన్నో అవమానాలు.. మరెన్నో కష్టాను అనుభవించాడు. ఇప్పుడు,నేటి తరానికి ఆదర్శంగా నిలిచారు.తనే.. పెళ్ళి చూపులుతో పరిచయమై.. మల్లేశం తో హీరోగా మారిన నటుడు ప్రియదర్శి. నేడు అలాంటి ప్రియదర్శి పుట్టినరోజు..


ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించి.. ఎంఏ చదుకున్న దర్శి సినిమా రంగంలోకి అడుగు పెట్టాడు.తొలుత ఇంట్లో ఒప్పుకోలేదు,ఆయనా వదలలేదు.ఒక కంపెనీ లో యాడ్ ఫిలిమ్స్ కు స్క్రిప్ట్ రైటర్ గా కెరీర్ ప్రారంభించారు.ఆగస్ట్ నెల వచ్చింది.. అప్పటికే తనకు ఆఫీస్ లో పెద్దగా పని ఉండటం లేదు.దింతో పుట్టినరోజు అవ్వగానే మానేదాం అనుకున్నాడు దర్శి.కానీ,అంతకన్నా ముందే వాళ్ళు తనని ఉద్యోగం నుండి పంపించేశారు.అలా బయటకు వచ్చిన దర్శి పరిశ్రమలో నటుడిగా పదయత్నాలు మొదలు పెట్టారు.


2012 నుండి 2016 వరకు దర్శి నటుడిగా షార్ట్ ఫిలిమ్స్ చేశారు.ఎన్నో ఆఫీసుల చుట్టు తిరిగారు.. మరెన్నో ఆడిషన్స్ ఇచ్చారు.10 చోట్ల ప్రయత్నిస్తే ఒకటి లేదా రెండు చొట్ల అవకాశం వస్తుంది అని నమ్మే దర్శి.నాగోల్,ఉప్పల్ నుండి మణికొండ,జూబ్లీహిల్స్,బంజారాహిల్స్ ఇలా అన్ని సినిమా ఆఫీసులు తిరిగారు. శ్రీనగర్ కాలనీ,పంజాగుట్ట,కృష్ణానగర్ లో నాలుగేళ్ళు అలా గడిచిపోయాయి.చందా నగర్ లో వుండే దర్శి ఇలా హైదరాబాద్ మొత్తం తిరిగారు.2016లో పెళ్ళిచూపులు సినిమాతో దర్శి.. ప్రియదర్శిగా ప్రేక్షకులకు పరిచయమయ్యారు.ప్రతి నటుడికి తన సినీ జీవితంలో తాను చేసిన పాత్ర పేరు ప్రేక్షకులకు గుర్తుండేలా కొన్ని మాత్రమే ఉంటాయి.దర్శికి తొలి సినిమాతోనే ఆ అద్భుతమైన అవకాశం దొరికింది.పెళ్ళిచూపులు విడుదలైన కొత్తల్లో ఎక్కడైనా ప్రియదర్శి కనిపిస్తే.. అరేయ్ ఇప్పుడే చూశాను.. మన పెళ్ళిచూపులు కౌశిక్ ని అనే వాళ్ళు.మరి కొందరు ఏకంగా నా చావు నేను చస్తా..లేదా,టైం అంటే కౌశిక్.. కౌశిక్ అంటే టైం.. డైలాగ్ చెప్పాడుగా తనని ఇప్పుడే చూశాము అనే వారు.అంతలా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది ఆ పాత్ర.అక్కడ నుండి వెనకకు తిరిగి చూడలేదు ప్రియదర్శి.


ఈ నాలుగు సంవత్సరాలలో తమిళం.. మాలయంలో కలిపి 30కు పైగా సినిమాల్లో నటించారు.జై లవకుశ.. స్పైదర్,F2 సినిమాలలో స్టార్లతో నటించారు.ఘాజి,అ:!సినిమాలో తన నటనకు మంచి స్పందన వచ్చింది.2019లో వచ్చిన మల్లేశం సినిమాతో హీరోగా మారారు.ఆ సినిమాలో తన నటనకు ప్రేక్షకుల నుండి మాత్రమే కాక విమర్శకుల నుండి కూడా ప్రశంసలు వచ్చాయి.మిఠాయి సినిమాలో సైతం హీరోగా చేశారు.తాజాగా విడుదలైన LOSER అనే వెబ్ సిరీస్ తో మరోసారి తన నటనతో అందరిని కదిలించారు.ఇప్పుడు,రాధేయ శ్యామ్ వంటి పెద్ద సినిమా చేస్తున్నరు.అలానే,ప్రధాన పాత్రగా జాతిరత్నాలు అనే సినిమా కూడా చేస్తున్నారు.


అటు హీరోగా ఇటు కమిడియన్ గా మనని మరిన్ని సంవత్సరాలు అలరించాలని.. నా చావు నేను చస్తా అనే పుస్తకం రాస్తున్నా అని చెప్పిన కౌశిక్ అలియాస్ ప్రియదర్శి.. తన గురించి ఒక్కరు పుస్తకం రాసే స్థాయికి చేరాలి అని కోరుకుంటూ.. ప్రియదర్శి గారికి మా(బి ఆర్ మూవీ జోన్ టీం)తరపున జన్మిదిన శుభాకాంశాలు..!