25-01-2022 17:08:11 About Us Contact Us2002లో తెరంగేట్రం చేసిన “ప్రభాస్” 2009 నాటికి 10 సినిమాలు చేశాడు.’చక్రం’ సినిమాలో బాగా డబ్బులు ఉన్న పాత్ర చేసినా అది కొద్దీ సేపు మాత్రమే,ఇక తనకు అతి పెద్ద హిట్ ఇచ్చిన ‘ఛత్రపతి’లో మాత్రం బాగా స్టైల్ గా కనపడుతాడు,ఒక గ్యాంగ్ స్టర్ గా ప్రభాస్ అందులో బాగా ఆకట్టుకున్నాడు.ఆ రెండు సినిమాలు తప్ప తొలి సినిమా ‘ఈశ్వర్’ నుండి ‘బుజ్జిగాడు’ వరకు ఎక్కడా ‘ప్రభాస్’ స్టైల్ గా కనిపించే పాత్రలు ఎదురుకాలేదు.దీనికి కారణం అన్ని సినిమాలు మాస్ సినిమాలు కావడం.ఇక యోగి,మున్నా,బుజ్జిగాడు ఇలా వరసగా గ్యాంగ్ స్టర్ సినిమాలు చేసినా అవి లోకల్ గ్యాంగ్ వార్స్ మధ్య ఉండే సినిమాలు.అలాంటి సమయంలో 2009 ఏప్రిల్ 3న అంటే నేటికి 11సంవత్సరాల క్రితం ఒక సినిమా విడుదలైంది.అప్పటిదాక ఎవ్వరు ప్రభాస్ ని అలా చూపించలేదు,ఊహించలేదు కూడా…,ఆ సినిమా పేరు “బిల్లా”.


పేరుకేమో,ఇది ఒక తమిళ సినిమా రీమేక్,ఆ తమిళ సినిమానే 1970లలో ఒక బాలీవుడ్ సినిమా ‘డాన్’ కి ఆధారంగా తీసిన సినిమా.ఇది సినిమా చేస్తున్నప్పుడు సినిమా గురించి వార్తలు.కానీ తొలి పోస్టర్ విడుదల నుండి ఈ సినిమాకి అంచనాలు భారీగా పెరిగిపోయాయి.ప్రభాస్ స్టైలిష్ లుక్స్ కి ఆనాదు అందరూ ఆశ్చర్యపోయారనే చెప్పాలి.ఇక ఈ సినిమా పాటలు సైతం ఆనాటి యువతని ఒక ఊపు ఉపేశాయి.ఇక అనుష్క,నమితా పోస్టర్స్ తో సినిమాకి హైప్ మరీ పెరిగింది.ఇందులో రెబెల్ స్టార్ కృష్ణంరాజు నటిస్తున్నారనే వార్త సినిమాకు అతి పెద్ద హైలైట్.రెబెల్ స్టార్ కృష్ణంరాజు,యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ కలిసి నటించిన తొలి సినిమా ఇది.


ఇంతటి భారీ అంచనాల నడుమ 2009 ఏప్రిల్ 3న సినిమా విడుదలైంది. స్టైలిష్ లుక్స్,గన్స్,కార్ చేజ్,ఫైట్స్,రిచ్ సాంగ్స్ అన్నిటికి మించి కృష్ణంరాజు,ప్రభాస్ స్క్రీన్ షేర్ అదిరిపోయింది అనే చెప్పాలి.ఇక నమితా,అనుష్క సినిమాకు మరో హైలైట్.బిల్లా,రంగ అంటూ రెండు రోల్స్ లో ప్రభాస్ బాగా మెపించాడు.”can, can” అంటూ అందరిని అలరించాడు ప్రభాస్.అప్పటికే ఇంటర్ పరీక్షలు అయిపోవడం,ఈ సినిమా ఏప్రిల్ 3వ తేదీ,శుక్రవారం విడుదలైతే సోమవారానికి 10వ తరగతి పరీక్షలు కూడా అయిపోవడంతో సినిమా తొలి వారం రికార్డ్ వసూలు సాదించింది.ఆ తర్వాత వేసవి కాలం ముగిసేదాక బిల్లా వసూళ్లు రాబడుతూనే ఉండింది.ఈ సినిమాతో ప్రభాస్ కి అమ్మాయిలలో ఫాలోయింగ్ పెరిగిపోయింది.ఈ సినిమా తర్వాత వచ్చిన డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్ తో ప్రభాస్ ఎంతో మంది లేడీ ఫాన్స్ కి డార్లింగ్ అయిపోయాడు.ఇక డైరెక్టర్ ‘మెహర్ రమేష్’ మొత్తం సినిమాని ఒక రిచ్ & స్టైలిష్ లుక్స్ తో తీశాడు అనే చెప్పాలి.తమిళంలో విష్ణు వర్ధన్ తీసిన సినిమా స్థాయికి ఏ మాత్రం తగ్గకుండా తీశాడు మెహర్ రమేష్.ఇక నయనతార ప్లేస్ లో అనుష్క భర్తీ,కృష్ణంరాజు గారిని సినిమాలోకి తీసుకోవడం ఇలా తారాగణం ఎంపికలో కూడా డైరెక్టర్ విజయం సాధించాడు అనే చెప్పాలి.


ఇక మణిశర్మ సైతం తనవంతు బాధ్యత పూర్తిగా నిర్వహించాడు.మొత్తం ఆల్బమ్ హిట్ అయింది ఆ రోజుల్లో,ఇప్పటికి ఆ పాటలు వినగానే మనలో చాలామంది ఆ పాటలోని లిరిక్స్ పడేస్తుంటాం అంతలా ఆ రోజుల్లో ఆ పాటలు మనం విన్నాం మరి.ఈ సినిమా తర్వాత తీసిన డార్లింగ్,మిస్టర్ పర్ఫెక్ట్,రెబెల్,మిర్చి సినిమాలలో ప్రభాస్ డ్రస్సింగ్ స్టైల్ మొత్తం మారిపోయింది,అంటే ప్రభాస్ లుక్స్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే బిల్లా ముందు,బిల్లా తర్వాత అని చెప్పుకోవచ్చు.ఇలా అటు ప్రభాస్ కెర్రీర్ కి మంచి టర్నింగ్ పాయింట్ గా నిలిచిన బిల్లా సినిమా విడుదలై 11సంవత్సరాలు గడిచింది అంటే నమ్మసఖ్యంగా లేదు.ఇప్పటికి బిల్లా సినిమా ఫ్రెష్ గానే ఉంది,ఆ పాటలు మనం ఇప్పటికి వింటుంటాం.ఇప్పటికి బిల్లా సినిమా క్రేజ్ తగ్గలేదు అని చెప్పడానికి ఉదహరనే సామాజిక మాధ్యమంలో 11 ఇయర్స్ ఫర్ బిల్లా అనే శీర్షిక ట్రెండ్ అవ్వడం.ఇలాంటి ఒక మంచి స్టైలిష్ యాక్షన్ సినిమాతో మరోసారి ప్రభాస్ రావాలి అని,వచ్చి బాక్స్ ఆఫీస్ వద్ద మరోసారి స్టామినా చూపించాలి అని కొరుకుతూ ప్రభాస్ ఫాన్స్ తరపున మెహర్ రమేష్,మణిశర్మ ,అనుష్క,నమితా,కృష్ణంరాజు గార్లకు 11 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా శుభాకాంక్షలు.