17-04-2021 11:27:41 About Us Contact Us



పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వినపడితే వేడుక ఏదైనా.. వేదిక ఎక్కడైనా ఒక్కసారిగా ఆ సభా ప్రాంగణం అంతా మారుమోగిపోతుంది. అంతటి క్రేజ్ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ ప్రజల కోసం రాజకీయాల్లోకి వెళ్లి తాత్కాలికంగా సినిమాలకు విరామం ఇచ్చారు. వచ్చే నెల తో మూడు సంవత్సరాలు అవుతుంది ఆయన తెర పై కనపడి.. ఈ లోపు అనేక సినిమాల్లో ఆయన రెఫరెన్స్ లు వాడేశారు.. అదే వేరే విషయం. అలాంటి పవర్ స్టార్ ఇంతటి విరామం తర్వాత చేస్తున్న సినిమా వకీల్ సాబ్.


వకీల్ సాబ్ చిత్రం షూటింగ్ నిన్న పూర్తి చేసుకుంది. ఓ మై ఫ్రెండ్,MCA చిత్రాలు తెరకేక్కించిన యువ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా హిందీలో బిగ్ బి అమితాబ్ నటించిన పింక్ చిత్రం ఆధారంగా తెరకేక్కిస్తున్న చిత్రం వకీల్ సాబ్. బోణి కపూర్ ఈ చిత్రాన్ని సమర్పించారు. భారీ తారాగణంతో సినిమా పూర్తి చేశారు.


నిజానికి సంక్రాంతి బరిలో ఉండాల్సిన ఈ సినిమా.. కొన్ని కారణాల కారణంగా షూటింగ్ లో జాప్యం జరగడంతో పోస్ట్ పోన్ అయింది.పవన్ కళ్యాణ్ సూదీర్ఘ విరామం తరువాత మళ్ళీ వెండితెర మీద కనిపించనుండడంతో మెగా అభిమానుల్లోనే కాకుండా సినీ అభిమానుల్లో కూడా ఈ చిత్రం మీద భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైన దగ్గర నుండి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. అలాగే మగువా.. మగువా పాట ఇప్పటికే శ్రోతల్లో మంచి ఆదరణ పొందింది.



అభిమానులు ఎప్పుడేప్పుడా అని ఎదురు చూస్తున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం టీజర్ ని సంక్రాతి కానుకగా విడుదల చెయ్యాలి అని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సినివర్గాల సమాచారం. ఇప్పటికే డబ్బింగ్ దాదాపుగా పూర్తయింది. నిన్న హైదరాబాద్ లో జరిగిన షూటింగ్ తో సినిమాకు గుమ్మడికాయ కొట్టేశారు.నిర్మాత దిల్ రాజు.. తనకిష్టమైన పవర్ స్టార్ తో చేస్తున్న తొలి సినిమా కావడంతో ఆయన ప్రతిష్టాత్మకంగా నిర్మించారు అని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.


ఒకవేళ సంక్రాంతి కి వచ్చే చిత్రలతో పాటు పవర్ స్టార్ వకీల్ సాబ్ టీజర్ కూడా వస్తే సినీ అభిమానుల్లో జోష్ డబల్ అవుతుంది అనడంలో సందేహమే లేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక మాట.. కొన్ని సార్లు రావడం లేటవచ్చు ఏమో గాని.. రావడం మాత్రం పక్కా..! అలానే టీజర్ ఎప్పుడు వచ్చినా సామాజిక మాధ్యమాల్లో రికార్డ్స్ తిరగరాయడం కచ్చితం అని సినీ విశ్లేషకుల అంచనా.

అందరిలానే వకీల్ సాబ్ టీజర్ కోసం ఎదురుచూస్తూ..!