24-01-2022 17:03:20 About Us Contact Us“ఖుషి”…!ఈ పేరు వినగానే,”పవర్ స్టార్ పవన్ కళ్యాణ్” గారి అభిమానుల మొహంలో గర్వం కనిపిస్తుంది,తెలుగు వారంతా ఒక చిరునవ్వు విసురుతారు.కారణం..సిద్దు,మధుల చిలిపి సన్నివేశాలు,మధురమైన కళాశాల రోజులు,చక్కటి సంభాషణలు గుర్తుకొస్తాయి కాబట్టి.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో బెంగాల్ టైగర్ సిద్దు సిద్దార్థ్ రాయ్ గా మారిపోయారు..సినిమా చూసిన వారం దాక,ఆనాటి చిన్నపిల్లల నుండి అప్పుడప్పుడే పెళ్ళైనవారి దాక,అందరూ ఆ సిద్ధును అనుకరించిన వారే..ప్రతి అమ్మాయి,తనను తాను మధుగా మారిపోయి భూమికకు మించిన బెట్టు తండ్రుల,ప్రేముకుల,మొగుళ్ల దగ్గర చేసేశారు..ఇక పాటలంతారా మణిశర్మ ఇచ్చిన ఆ పాటలు ఇప్పటికి,ఎప్పటికి మధురమే…మరో నాలుగు దశాబ్దాలు తర్వాత అప్పటి యువత పాట వింటే కూడా రెండు దశాబ్దాల ముందు యువత ఏమి అనుభూతి పొందారు,అలానే పొందుతారు..అంత ఫ్రెష్ గా ఉంటాయి బాణీలు..ఇక మంచి భావాలు గల లిరిక్స్ మనన్నీ మరో ప్రపంచంలోకి తీసుకెళుతాయి..ఇదంతా ఇప్పుడేంకంటే ఆ సినిమా వచ్చి 19 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో సామాజిక మాధ్యమంలో ట్రెండ్ అవుతున్నది కనుక.ఒక్కసారి మనం రెండు దశాబ్దాల వెనక్కి వెలుదాం..


2000 సంవత్సరంలో తమిళనాట ‘విజయ్’,’జ్యోతిక’లతో దర్శకుడు ‘ఎస్.జె.సూర్య’ దర్శకత్వంలో ఏ.ఎం.రత్నం నిర్మించిన సినిమా ఖుషి.ఈ సినిమాను ఆ దర్శక నిర్మాతలు తెలుగులో ‘పవన్ కళ్యాణ్’,’భూమిక’లతో రీమేక్ చేశారు..’మణిశర్మ’ ప్రాణం పొయ్యగా,’పి.సి.శ్రీరామ్’ సినిమాను అద్భుతంగా చూపించారు..2001 ఏప్రిల్ 27న ఈ సినిమా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.పేరుకి ఇది ఒక రీమేక్ అయినా సినిమా ఒక తెలుగబ్బాయి,అమ్మాయిల మద్య జరిగే ప్రేమ కథలనే ఉంటుంది..సిద్దు,మధుల పాత్రలలో పవన్,భూమిక చాలా సహజంగా చేశారు,కుర్రాదంటే ఇలా ఉండాలి అని పవన్ చూపిస్తే,అమ్మాయిలు అందరూ ఇలానే నడుచుకోవాలి అన్నట్లు చేసింది భూమిక..ఆ సినిమా ప్రభావం నాటి యువత పైన చాలానే ఉంది.ఖుషి బాగ్స్ అంటూ సినిమాలో కళ్యాణ్ గారు వాడిన బాగ్స్ కి పేరు వచ్చింది..సినిమాలో పవన్ కళ్యాణ్ గారు వాడిన మ్యాటీజ్ కార్ ను మా మామ 2010లో(సినిమా విడుదలై దాదాపు దశాబ్దం తర్వాత) అమ్మకానికి ఉందని తెలిసి ఇద్దరు పిల్లల తండ్రి ఆ కార్ ని సెకండ్ హాండ్ లో కొన్నారంటే,ఆయనపై ఆ సినిమా ప్రభావం ఎంతో అర్ధమవుతుంది..

ఇలా ఒక్కటేంటి పవన్ కళ్యాణ్ గారి హెయిర్ స్టైల్ నుండి,ఆయన వేసుకున్న బట్టలు,ఆఖరికి ఆయన కాల్చినట్లే సిగరెట్ ని కాల్చేందుకు ఆనాటి యువత ప్రయత్నించారు..సినిమా ఆరంభం నుండి చివరి దాక ఎక్కడా బోర్ కొట్టడు..ముఖ్యంగా సిద్దు,మధుల మధ్య జరిగే ప్రతి సన్నివేశం అందరిని అలరించింది..ఫోన్ లో ఎవరు? సన్నివేశంలో మధు పడ్డ తపన అద్భుతంగా ఉంటుంది..ఇక నడుము సన్నివేశం,సినిమా వచ్చి 19ఏళ్ళు అయినా ఇప్పటికి ఆ నడుము స్కీన్ తెలుగు ప్రేక్షకులకు కళ్లముందరే ఉంది..ఆ సన్నివేశాన్ని ఏదో ఒక సినిమాలో ఇప్పటికి వాడుతూనే వున్నారు,అంతలా ఆ స్కీన్ ప్రేక్షకులకు నచ్చింది..కార్ ఆగినట్లు చెప్పి మధు నీకు ఎవరంటే ఇష్టం అనే స్కీన్ అయితే నేను ఎప్పుడు చూసినా రిపీట్ లో చూడాల్సిందే,పవన్ కళ్యాణ్ గారి చూపులు,ఆయన హావభావాలు బలే ఉంటాయి..


అలీ తెచ్చిన గుడుంబా సినిమాకి మరో హైలైట్..మధు నాన్న కు లిఫ్ట్..బాబు,శాంతిలను కలిపే ప్రయత్నాలు..ఒక ఫైట్ వెంటనే శాంతి తండ్రి తో పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ డైలాగ్..”మీరు గుడుంబా సత్తిగారు కావచ్చు,తోకలో సత్తిగారు కావచ్చు..బట్ ఇ డోంట్ కేర్.. బికాస్ ఇ ఏం సిద్దు సిద్దార్థ్ రాయ్..”ఇలా ఒక్కటేంటి సినిమా మొత్తం మనల్ని అలరించిన సన్నివేశాలే..ఖుషి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమలో మరో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.బాక్స్ ఆఫీస్ లో పవన్ స్టామినా చూపింది.ఖుషి సినిమాలో ఫైట్స్,డైలాగ్స్,కాస్ట్యూమ్స్ తో పాటు మనం తప్పక చెప్పుకోవాల్సింది పాటలు..

ఆరు కి ఆరు పాటలు అద్భుతం..,ఒకో పాట ఒకో అనుభూతి..హిందీ రచయిత అబ్బాస్ టైర్ వాలా రాసిన”హే మేరా జహ”అంటూ దేశం కొరకు పవన్ పడిన పాట ఇప్పటికి ఉత్తేజాన్ని ఇస్తుంది..చంద్ర బోస్ గారు రాసిన “అమ్మాయే సన్నగా” పాట ఎంతమంది స్టేజ్ పైన డ్యాన్సులు వేశారో లెక్క కట్టడం కష్టం..ప్రొడ్యూసర్ ఏ.ఏం.రత్నం గారు రాసిన “చెలియా..చెలియా..”,”ప్రేమంటే సులువు కాదు రా” రెండు పాటలు ఎప్పటికి ప్రేమికులకు కొత్తగా అప్పుడే వారికోసమే రాసినట్లు ఉంటాయి..సుందల అశోక్ తేజ గారు రాసిన”హొలీ..హొలీ”మంచి మాస్ నెంబర్..ఇక పింగళి గారి “ఆడవారి మాటలకు”ఆ పాట ఎవర్ గ్రీన్ అంటే..మణిశర్మ గారు పవన్ కళ్యాణ్ కాంబో లో వచ్చిన “ఖుషి”,”తీన్ మార్” అల్ టైం హిట్ ఆల్బమ్స్ లో ఉంటాయి..


అలాంటి సినిమా వచ్చి 19ఏళ్ళు గడించింది అంటే నమ్మడం అసాధ్యమే..మొన్నటి దాక జెమినీలో ఈ సినిమా వస్తుంటే అనేకసార్లు అత్యవసరం కాకుంటే పనులు వాయిదా వేసుకొని సినిమా అయ్యాకే వెళ్ళేవాడిని..అంత బాగుంటుంది ఈ సినిమా..ఎంత చెప్పినా తక్కువే..అలాంటి సినిమా 19ఏళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సామాజిక మాధ్యమంలో వేడుకలు జరుపుతున్నారు..టాక్ ఆఫ్ ఇంటర్నెట్ అయింది..సినిమాకి పని చేసిన ప్రతి ఒక్కరికి శుభాకాంశాలు…!