25-01-2022 16:24:23 About Us Contact Us


2001 పవన్ కళ్యాణ్ చివరి హిట్ ‘ఖుషి’విడుదలైన సంవత్సరం ఆ తర్వాత ఏడు సంవత్సరాలలో ఐదు సినిమాలు చేసినా,ఏవి పెద్దగా బాక్స్ ఆఫీస్ వద్ద విజయాలు సాధించలేదు.ఏడు సంవత్సరాలుగా హిట్స్ లేకున్నా పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరడం లేదు.తొలి రోజుల్లో ఓపెనింగ్స్ ఏదో హిట్ మూవీ తర్వాత సినిమా అన్నట్లు ఉన్నాయి.అప్పటికే ట్రేడ్ వర్గాలు కొన్ని వార్త మ్యాగజైన్లలో,ఈ సమయంలో పవన్ హిట్ పడితే ఎలా ఉంటుందో అని వారి అంచనాలను రాస్తువున్నారు.సరిగ్గా అప్పుడే మరో సినిమా విడుదలకు సిద్ధమైంది.2008లో దర్శకుడిగా మారిన మాటల రచయిత ‘త్రివిక్రమ్ శ్రీనివాస్’దర్శకత్వంలో,ప్రతిష్టాత్మక బ్యానర్ ‘గీతా ఆర్ట్స్’ నిర్మాణంలో ‘దేవి శ్రీ ప్రసాద్’ బాణీలు అందించిన సినిమాతో పవన్ రానున్నట్లు వార్తలు.ఆ సినిమా పేరు ‘జల్సా’ అంటూ పోస్టర్స్ వచ్చాయి.

ఇక్కడి నుండి నేను ఆ రోజుల్లో సినిమాతో ఎలాంటి అనుభూతి పొందానో చెబుతాను.ఇక ఆ రోజుల్లో ఒక కాలు ఆకాశంలోకి లేపిన పవన్ పోస్టర్ ని చూసి ఆనాటి యువత అంతా కాలుని పైకి లేపే పనిలో పడ్డారు.ఇక్కడ నాకు ఒక్కటి గుర్తు,నేను,నా మిత్రులం కూడా కొన్ని నైట్ ఫాంట్లు చించుకున్నాం,మా స్కూల్ లో ఒక్కడు క్లాస్ లొనే చించుకున్నాడట,అది ఆ రోజు మా స్కూల్ లో పెద్ద వార్త..! ఇక పాటల విషయానికి వస్తే పాటలకు మంచి స్పందన వచ్చింది.ఆటోలలో,టీ కొట్టు,సిడి షాప్స్,కటింగ్ షాప్స్ లలో ఇవే పాటలు.మా స్కూల్ ఫేర్ వెల్ పార్టీలో సంగం పైగా అన్ని ఈ సినిమా పాటలకే డాన్సులు వేశారు.నాకు అప్పట్లో ఒక వాక్ మెన్ గిఫ్ట్ వచ్చింది,ఆ పాటల సిడి కోసం వెళ్తే స్టాక్ లేవు అన్నాడు,అలా నాలుగు ఐదు సార్లు తిరగగా,ఆ తరవాత నాకు గుర్తుంది,సినిమా విడుదలైన వారానికి గాని నాకు ఆ సిడి దొరకలేదు.సినిమా విడుదలకు ముందే ఆ సినిమా క్రేజ్ ఇది.


సినిమా విడుదల తేది రానే వచ్చింది.ఏప్రిల్ 2,2008.మాకు పరీక్షల కాలం,మరో పక్క సినిమాకు టికెట్స్ దొరకడం లేదు అని కొందరు,సినిమా అదిరిపోయింది అని మరి కొందరు చెబుతూ వచ్చారు.ఎలాగోలా సినిమా విడుదలైన ఐదు రోజులకి నెల్లూరు పవన్ కళ్యాణ్ ఫాన్స్ ప్రెసిడెంట్ టోనీ అన్నని అడిగి అడిగి అడిగి,ఆయన ఇవ్వగా రాధ,మాధవ్,గోపిక అనే కాంప్లెక్స్ లో సినిమాకి సెకండ్ షో కి వెళ్ళాను.వెళ్తే ఆ సినిమా ప్రారంభంలో మహేష్ బాబు వాయిస్ ఓవర్ వినిపించింది.ఆ తర్వాత సినిమాలో సగం డైలాగ్స్ వినిపించలేదు.ఇంటర్వెల్ లో మా అమ్మ ఈ సినిమా ఈ రోజే రిలీజ్ అయిందా,రిలీజ్ రోజు ఎంయందుకు తీసుకొచ్చావ్ అని అడిగింది.కాదు అమ్మ దాదాపు వారం అయింది అంటే వింతేగా,సినిమా అయిపోయాక హాల్ బయట పోస్టర్స్ లో రిలీస్ డేట్ ఉంటుంది.అది చూపించి నమ్మించాల్సి వచ్చింది.ఆ సినిమా తర్వాత నేను మళ్ళీ ఏ పవన్ కళ్యాణ్ గారి సినిమాకి తొలి వారంలో ఇంట్లో వాళ్ళను తీసుకెళ్లలేదు.


సినిమా అయితే చూశాను కానీ నాకు ఏమి అర్థంకాలేదు.అంటే అందులో సంగం వినిపించలేదు,సంగం కనిపించలేదు.ఆ పేపర్స్ వెయ్యడం,పాటలకు అభిమానులు ఎగరాడమే సరిపోయింది.ఇక జల్సా టైటిల్ సాంగ్ అయితే అదేదో అందరూ బట్టి కొట్టి వచ్చినట్లు అందరూ అరుస్తూ పాడారు.దింతో మళ్ళీ సినిమాకి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను.కానీ ఈ సారి నాకు టికెట్స్ వెంటనే ఇవ్వలేదు ఆ ‘టోనీ’అన్న.ఒక 15 రోజులకి అనుకుంటా ప్రశాంతంగా మళ్ళీ చూశాను సినిమాని.సంజయ్ సాహుల్ గా పవన్ కళ్యాణ్ జీవించాడు అనే చెప్పాలి.ఇక పార్వతి మిలటన్,కమలని ముఖర్జీ ఉన్న కాసేపు బాగా అలరించారు.ఇక ఇలియానకు ఆ రోజు నుండి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయాను.బ్రహ్మానందం గారి కామెడీ అయితే పీక్స్..,నా ఫ్రెండ్స్ లో ఒక్కడి పేరు ప్రాణవ్ అయితే ఇప్పటికి అందరం ప్రాణవ్ థీ హెడ్ కానిస్టేబుల్ అనే పిలుస్తున్నాం.అంతలా ప్రజలలోకి వెళ్ళిపోయింది ఆ క్యారక్టర్,సునీల్,ధర్మవరపు సుబ్రమణ్యం మధ్య సన్నివేశాలు ఇప్పటికి చూసి నవ్వక తప్పదు.ఇక అడివిలో పాట సిరివెన్నెల సీతారమశాస్త్రి గారి కలం నుండి వచ్చిన మరో అద్భుతమైన పాట అని చెప్పాల్సిందే.పవన్ కళ్యాణ్,ప్రకాష్ రాజ్ మధ్య డైలాగ్స్,సీన్స్,’బద్రి’కి మించి ఉంటాయి.


ఇక పవన్ కళ్యాణ్ గారు కష్టం గురించి చెప్పే డైలాగ్ లో పవన్ నిజంగా తన బాధ చెప్తున్నట్లు ఉంటుంది.ఇలియానా,పవన్ మధ్యలో సన్నివేశాలు నాకు తెలిసి ఈ రోజుల్లో ఏ లవ్ స్టొరీ సినిమాలో కూడా అలాంటి సన్నివేశాలు కనిపించకపోవచ్చు.నాకు తెలిసిన చాలా మంది ఆ రోజుల్లో జల్సాలో కళ్యాణ్ గారు నడిపిన బైక్ అని సి.బి.జెడ్ కొన్నారు.ఇలా ఆ సినిమా గురించి రాస్తుపోతే చాలానే ఉంటాయి,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గారి నుండి పాటల రచయితలు,మ్యూజిక్ డైరెక్టర్ నుండి నటీనటుల దాక అందరూ ఆదరకొట్టిన సినిమా “జల్సా”.


మొత్తం మీద ఏడు ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ గారి అభిమానులు “ఖుషి”గా సినిమా హాళ్ళల్లో “తీన్ మార్”వేస్తూ “జల్సా”చేసిన సినిమా “జల్సా” అని చెప్పచ్చు.అలాంటి జల్సా సినిమా విడుదలై అప్పుడే 12 ఏళ్ళు గడించింది అంటే నమ్మసఖ్యంగా లేదు.నిన్నమొన్ననే సినిమాకి వెళ్లినట్లు,అన్ని విషయాలు ఇప్పటికి నా మదిలో గుర్తున్నాయ్యంటే ఆ సినిమాని,ఆ సినిమా విడుదల ముందు తర్వాత రోజులని నేను ఎంతగా ఆస్వాదించానో అర్ధమవుతుంది.మరో సినిమాకి ఇంత బాగా అన్ని గుర్తుకురావేమో మరి.12 ఏళ్ళు గడిచినా ఆ సినిమా ఇప్పటికి చూస్తూనే ఉంటారు,ఇక పాటలు అయితే నేను బీటెక్ లో చదివే రోజుల్లో కూడా జల్సా పాటలకు స్టెప్స్ వేసే వారు మా ఫ్రెండ్స్.ఇప్పటికీ ఆ పాటలు వచ్చినప్పుడు చాలా పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నవారు కాలు కడపడం చూశాను,ఆ కామెడీ డైలాగ్స్ ముందే వారు చెప్పడం చూశాను.అప్పుడే తెలిసింది ఆ సినిమా ప్రభావం ఎంతమంది మీద గెత్తిగా పడిందో..!సరే అంది అందరూ ఇంట్లోనే ఉన్నారుగా మరోసారి “జల్సా” చూస్తూ ఆ రోజులని గుర్తు చేసుకోండి.