25-01-2022 17:09:34 About Us Contact Usఅరేయ్ సాంబా..

అభిమానులకు కాదు కాదు..భక్తులకు పూనకాలు వస్తే ఎలా ఉంటుందో నేను తొలిసారి చూసి రోజు అది..ఆరాధించే నటుడి సినిమా అదిరిపోతే ఆ సగటు అభిమాని కళ్ళల్లో నీళ్ళు చూసిన రోజు..దాదాపు 11ఏళ్ళ నిరీక్షణ తర్వాత తన స్థాయి హిట్ పడితే బాక్స్ ఆఫీస్ ఎలా దద్దరిల్లిపోతుందో చిత్ర పరిశ్రమకు మరోసారి నిరూపించిన రోజు..అభిమాన నటుడితో ఒక అభిమాని దర్శకుడిగా..మరో అభిమాని ప్రొడ్యూసర్ గా.. కలిసి సినిమా తీస్తే ఎలా ఉంటుందో నిరూపించిన రోజు…”నాకు కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది..”అంటూ చరిత్ర సృష్టించిన రోజు..ట్రెండ్ సెట్టర్..బాక్స్ ఆఫీస్ కా బాప్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన..మిరపకాయ్ లాంటి ఘాటైన డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో..నటనకు మారుపేరుగా మారిన కమల్ హాసన్ గారి కుమార్తె శ్రుతి హసన్ హీరోయిన్ గా..రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా..బ్లాక్ బస్టర్ ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ నిర్మించిన ప్రతిష్టాత్మక చిత్రం “గబ్బర్ సింగ్”..మే 11,2012లో విదులైన సినిమా నేటికి 8ఏళ్ళు పూర్తి చేసుకుంది..


సినిమా విడుదలకు కొద్దీ నెలల ముందు..హిందీ సినిమా రీమేక్ అట..మాస్ మహరాజ్ రవితేజ తో మిరపకాయ్ అనే సినిమాతో హిట్ కొట్టిన కొత్త డైరెక్టర్ అట..దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అట..దేవి ఈసారి కూడా జల్సా లాంటి ఆల్బమ్ ఇస్తే చాలు..కళ్యాణ్ పోలీస్ అనగానే ఒక్కడు..ఒరేయ్ పోలీస్ అంటే నాకు కొమరం పులి గుర్తుకొస్తుంది..ఇది పరిస్థితి..కట్ చేస్తే పోస్టర్స్ తో సినిమా పై అంచనాలు వచ్చాయి..అప్పుడు వచ్చింది 30సెకండ్ల టీజర్..అందులో ఒక్క డైలాగ్ “నాకు కొంచెం తిక్కుంది..కానీ దానికో లెక్కుంది..”ఈ సినిమా టీజర్ రిలీజ్ దాక ఒక లెక్క ఆ తరువాత ఇంకో లెక్క..సినిమా పై అంచనాలు భారీగా పెరిగిపోయాయి..


ఆ తర్వాత నెలన్నరకి గబ్బర్ సింగ్ ఆడియో వేడుక తేదీ విడుదలైంది..ఆ వేడుకకు మెగా బ్రదర్స్ ముగ్గురు వస్తుండడంతో సినిమా వేడుక గురించి అంతా చర్చ జరిగింది..ఆ సినిమా వేడుక అనగానే ఇప్పటికి అందరికి ఫట్ మని గుర్తుకొచ్చేది సినిమా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ స్పీచ్..ఒక పక్క ఆ వేడుక చర్చ..మరోపక్క దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన పాటలు..టీవీ ఛానల్ లలో..ఎఫ్ఎమ్ లో..టి కొట్టు దగ్గర నుండి కాలేజీ బస్ దాక..ఫ్రెండ్స్ పార్టీల నుండి పెళ్లి ఫంక్షన్ దాక..ఎక్కడికి వెళ్లిన అవే పాటలు..దింతో సినిమా విడుదలకు ముందే హిట్ టాక్ తెచ్చుకుంది అనే చెప్పాలి..అయినా అభిమానుల గుండెల్లో ఏదో ఒక చిన్న భయం..అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి..ఒక వేళ సినిమా అందుకోకపోతే ఎలా అని..


మే 11,2012..ఆ రోజు రానే వచ్చింది..మంచి సమ్మర్ సీజన్ లో సినిమా విడుదలైంది..ఆంధ్రప్రదేశ్ కి 100 కిలోమీటర్ల అవతల చెన్నై దాటిన తర్వాత ఉన్న ఒక సినిమా హాల్ లో సినిమాకి మార్నింగ్ షో కి వెళ్ళాను..అప్పటికే నెల్లూరు లోని నా మిత్రులు సినిమా హిట్ అని ఫోన్లు చేశారు..అక్కడే తొలిసారి నేను సినిమా హాల్ లో అభిమానులు పూనకాలు వచ్చినట్లు ఎగరడం చూశాను..ఒకడు షర్ట్ చించుకుంటే..సినిమా తర్వాత పక్కన వాడి మిత్రుడు వాడికి తన టీ-షర్ట్ ఇవ్వడం చూశాను….నాకు ఎక్కడా సినిమా పూర్తిగా కనిపించలేదు..వినిపించలేదు..అంతాక్షరి ఎపిసోడ్ మాత్రం అందరూ బాగా నవ్వుకున్నారు..సినిమా అయ్యాక హాల్ వద్ద కొలహం చూస్తే..అక్కడ ఏమైనా జాతర జరుగుతుందేమో అని అనిపించింది..ఒక్కడు గుండెలు బాదుకుంటూ..గెట్టిగా బాబు మనం హిట్ కొట్టాం అంటూ అరుస్తూ.. ఏడ్చిన సంఘటన నాకు ఇంకా కళ్ళ ముందరే ఉంది..ఒకో డైలాగ్ ఒకో మిసైల్ లా పేలింది..అరేయ్ నెల్లూరు లో ఈ సినిమా చూసిందాల్సింది..అని బాగా బాధ పడ్డాను..సినిమా అయితే నెల్లూరు లో మూడు సార్లు చూసినా ఏదో వెలితి..


సరిగా అప్పుడే సినిమా 50రోజుల వేడుక వచ్చింది..ఈసారి పరీక్షలు అయిపోయాయి..నెల్లూరు లోనే వున్నాను..ఏ ముహూర్తన “కంటెంట్ ఉన్నోడి కట్ ఔట్ చాలు రా “అని రాశారేమో గాని..నెల్లూరు మొత్తం పవన్ కళ్యాణ్ గారి కట్ ఔట్ తో పెద్ద ర్యాలీ..సత్యం2..(ఎస్2)లో 50రోజులు వరసగా ఆడిన తొలి సినిమాగా గబ్బర్ సింగ్ రికార్డ్ సృష్టించింది..ఆ ర్యాలీ..లోపల కేక్ కట్టింగ్..అక్కడ నుండి సినిమా..అది 50వ రోజు సెకండ్ షో లా నాకు ఏ మాత్రం కనిపించలేదు..మొదటిరోజు తొలి ఆటలా అనిపించింది..సినిమా తర్వాత కూడా ఎవ్వరూ హాల్ వదిలి వెళ్లడం లేదు..అన్ని పాటలు మరోసారి వేస్తే..అప్పుడు కదిలారు..దింతో నాకు తొలిరోజు నెల్లూరు లో మిస్ అయ్యాను అనే అసంతృప్తి తీరింది..


81 సంవత్సరాల తెలుగు సినీ పరిశ్రమ రికార్డులను తిరగరాసింది..పవర్ స్టార్ బాక్స్ ఆఫీస్ స్టామినా చూపించింది..ట్రేడ్ వర్గాల అంచనాలు ప్రకారం దాదాపు నాలుగు రెట్టు సినిమా వసూలు సాదించిన్నట్లు చెబుతుంటారు..పవన్ కళ్యాణ్ అభిమానికి కాదు భక్తులకు ఫుల్ మీల్స్ పెట్టిన సినిమా అది..హరీష్ శంకర్..తన జీవితంలో ఎంత పెద్ద సినిమా తీసినా..ఎప్పటికీ హరిష్ శంకర్ అంటే గబ్బర్ సింగ్ డైరెక్టర్ గానే మిగిలిపోతారు..అంత గొప్ప సినిమాని మూడవ సినిమాతోనే అందుకున్నారు హరీష్..బండ్ల గణేష్..ఈ సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ గణేష్ గా మారిపోయారు..దేవి శ్రీ ప్రసాద్ కెరీర్ లో ఇదో మైలురాయి..అంతాక్షరి టీం..ఇప్పటికి వాళ్ళు గబ్బర్ సింగ్ ఫైటర్స్ గానే గుర్తింపు..పవన్ కళ్యాణ్ అభిమానులకు మాత్రం ఒక తొలిప్రేమ..ఒక తమ్ముడు..ఒక బద్రి..ఒక ఖుషి..ఒక గబ్భర్ సింగ్ అంటే..గబ్బర్ సింగ్ తర్వాత పవర్ స్టార్ హిట్ కొట్టినా ఎందుకో ఆయన అభిమానులు ఆ గబ్భర్ సింగ్ లాంటి సినిమా ఇంకా రాలేదు అని అంటుంటారు..ఆ సినిమా ప్రభావం అంతలా ఉంది మరి..8ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంశాలు..


చివరిగా అరేయ్ యో గబ్బర్ సింగ్ కే హోసియో ఇప్పుడు నడవండి రా “మార్కెట్ లో గబ్బర్ సింగ్ సినిమాకు ఉన్న ఫాలోయింగ్ చూస్తుంటే పిచ్చెక్కిపోతుంది..”