25-10-2021 21:13:30 About Us Contact Us
“సింహపురి” ‘పంజా’ “సుప్రీమ్ హీరో” ‘సాయి ధరమ్ తేజ్’ పుట్టినరోజు స్పెషల్.!

“సింహపురి” ‘పంజా’ “సుప్రీమ్ హీరో” ‘సాయి ధరమ్ తేజ్’ పుట్టినరోజు స్పెషల్.!మెగా కుటుంబం నుంచి ముగ్గురి మావయ్యల ముద్దుల అల్లుడిగా 2014లో పిల్లా నువ్వు లేని జీవితం తో పరిచయమై..చూడగానే మన పక్కింటి కుర్రాడు అనే దగ్గర నుండి తెలుగువారు అందరూ.. మన ఇంటి కుర్రాడు అనేంతలా చేరువయ్యారు ధరమ్ తేజ్.తనదైన శైలిలో నటిస్తూ.. తనకంటూ ఒక ఇమేజ్ ని సాధించి.. సుప్రీమ్ హీరో గా ఎదిగారు పంజా సాయి ధరమ్ తేజ్. అటు మాస్.. ఇటు ఫామిలీ ఆడియాన్స్ కు బాగా చేరువయ్యారు తేజు.. మరిముఖ్యంగా తేజుకు అమ్మయిల ఫాలోయింగ్ కూడా కొంచెం ఎక్కువే.. అలాంటి సాయి ధరమ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ కధనం..!


1986 అక్టోబర్ 15న మద్రాస్ లో జన్మించాడు తేజు.తన బాల్యం.. కొద్ది సంవత్సరాలు నెల్లూరులో.. మరి కొద్ది సంవత్సరాలు చెన్నై లో గడిచింది.పరిశ్రమ హైదరాబాద్ చేరిన క్రమంలో హైదరాబాద్ చేరిన తేజు.. డిగ్రీ మరియు ఎంబీఏ హైదరాబాద్ లో పూర్తి చేశారు.డిగ్రీ చదివే రోజుల నుండి ఇంట్లో డబ్బులు తీసుకోవడం మానేసిన తేజు.. డబ్బుల సంపాదన కోసం మిత్రులతో కలిసి అనేక వ్యాపారాలు చేశారు.ఆ తర్వాత సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకొని తొలుత తనకు బాగా దగ్గరైన పవన్ కళ్యాణ్ గారికి తెలిపారు.ప్రతి విషయం తల్లితో పంచుకునే తేజు నెమ్మదిగా తల్లికి కూడా తెలిపారు.ఇలా ఏదో ఒక రోజు సినిమా అంటావు అని తెలుసు.. అంటూ ముందు ఎంబీఏ చదువు ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పారు తల్లి విజయ దుర్గ.అమ్మ కోసం అలా చదువు పూర్తి చేసి సినీ రంగం వైపు అడుగులు వేశాడు ఆ 23 ఏళ్ళ కుర్రాడు.


ఆ రోజుల్లో 132 కేజీల బరువు ఉన్న సాయి ధరమ్ తేజ్.. ఎటువంటి శస్త్ర చికిత్స లేకుండా.. కఠోర శ్రమతో 50 కేజీలు పైన తగ్గాడు.అంతటితో అయిపోలేదు.పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ఆయన గురువైన సత్యానంద మాస్టర్ వద్ద నటనా శిక్షణ పొందాడు.మెగా కుటుంబం నుండి వచ్చినా తేజు మాత్రం సినిమా అవకాశాల కోసం పరిశ్రమకు వచ్చిన కొత్త వారిలా ఫోటోలు పట్టుకొని దర్శక..నిర్మాతల ఆఫీసులు చుట్టు తిరిగాడు.ఫోటో వెనక పేరు సాయి అని.. ఫోన్ నెంబర్ రాసి అవకాశం ఉంటే చెప్పాలని చెప్పేవాడు.అలా తిరుగుతున్న తను ఒక రోజు మంచు మనోజ్ ఆఫీస్ లో క్రికెట్ అడుతుండగా వై.వి.ఎస్.చౌదరి గారి కంట్లో పడ్డారు.నీకు సినిమా ఇంట్రెస్ట్ ఉందా అని అడగటంతో సాయి ధరమ్ తేజ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది.


మెగా కుటుంబం నుండి వచ్చినా అవకాశాల కోసం తిరిగినా తన కష్టాలు పోలేదు.2010 లో ప్రారంభమైన రేయ్ సినిమా 2015లో విడుదలైంది.2012లో మొదలైన పిల్లా నువ్వు లేని జీవితం సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సమయంలో 2013లో శ్రీహరి గారి మరణంతో సినిమాలో అనేక సన్నివేశాలు మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చింది.ఆ తర్వాత ఆ పాత్రను జగపతిబాబు గారు చేశారు.అలా 2010లో అవకాశం లభించినా ప్రేక్షకుల ముందుకు 2014లో వచ్చాడు తేజు.అక్కడ నుండి చరిత్ర..“చిత్రలహరి” లో “రేయ్” “తేజ్ ఐ లవ్ యూ” అంటే.. “ఇంటెలిజెంట్” గా.. “పిల్లా నువ్వు లేని జీవితం””ప్రతిరోజు పండగే” అని చెప్పి.. “సుబ్రమణ్యం ఫర్ సేల్” అంటూ తన “తిక్క” తో బాక్స్ ఆఫీస్ వద్ద “విన్నర్”గా.. నిలిచిన “జవాన్”. “సోలో బ్రతుకే సో బెటర్” అంటున్న.. “సుప్రీమ్”.. “నక్షత్రం”(స్టార్).. “పంజా సాయి ధరమ్ తేజ్”..!


కెరియర్ తొలి రోజుల్లో పిల్లా నువ్వు లేని జీవితం.. సుబ్రమణ్యం ఫర్ సేల్.. సుప్రీమ్ వంటి సినిమాలతో విజయాలు అందుకున్నారు.ఆ తర్వాత వరస ప్లాప్స్ వచ్చినా ఎక్కడా తన తదుపరి చిత్రం ఓపెనింగ్స్ పై ఆ ప్రభావం కనపడలేదు.అంటే సాయి ధరమ్ తేజ్ సినిమా జయాపజయాలకు సంబంధం లేకుండా తనకంటూ ఒక మార్కెట్ ని సంపాదించుకున్నారు అని అర్థం.తిరిగి చిత్రాలహరి తో భారీ విజయం అందుకున్న సుప్రీమ్ హీరో ప్రతిరోజు పండగే సినిమాతో విజయం కొనసాగించారు.ఇప్పడు.. సోలో బ్రతుకే సో బెటర్.. మరియు దేవ కట్ట గారితో మరో సినిమా చేస్తున్నారు.


ఎప్పుడు ఎవరు కనిపించినా చిరునవ్వుతో పలకరిస్తూ.. అభిమానులతో సరదాగా మాట్లాడుతూ.. సొసైటీ కోసం తనవంతు బాధ్యతగా థింక్ పీస్(Think Peace)అనే స్వచ్చంద సంస్థకు బ్రాండ్ అంబాసిడర్ చేసేందుకు ముందు వచ్చారు తేజు.గత సంవత్సరం తన పుట్టినరోజున విజయవాడ వృధాశ్రమాని పూర్తిగా మెరుగు పరిచారు.మా పెద్ద మామ చిరంజీవి గారు చిన్నతనం నుండి నన్ను చూసుకున్నారు..మా నాగబాబు మామ ఏం చదవాలి..ఏ ఆట ఆడాలి..అలా అనేక విషయాలు నేర్పారు..మా చిన్న మామ పవన్ కళ్యాణ్ గారు నా గురువు..అంటూ ముగ్గురి గురించి ఎప్పుడు చెప్పినా తన మొహంలో గర్వంతో కూడిన ఆనందం స్పష్టంగా కనిపిస్తుంటుంది.మెగాభిమానులకు మాత్రమే కాక తెలుగు ప్రేక్షకులలో సైతం తనకంటూ ఒక ఇమేజ్ ని సంపాదించుకున్నారు తేజ్.!


ఇలా దశాబ్ద సినిమా ప్రస్థానంలో పదమూడు సినిమాలు పూర్తి చేసుకున్నారు.మెగా కుటుంబం నుండి వచ్చిన మిగతా హీరోలకు భిన్నంగా సినిమా అవకాశాల కోసం కష్టపడి.. వరస పరాజయాలను ఎదురుకొని.. తన ప్రతిభ.. కష్టం.. ఓపికతో పరిశ్రమలో స్టార్ హీరోగా ఎదిగి.. అటు మాస్ ఇటు కుటుంబ ప్రేక్షకులకు బాగా చేరువైన మన సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున పుట్టిన రోజు శుభాకాంశాలు..!

హిరణ్యకశ్యప.. శాకుంతలం అంటూ భారీ సినిమాలను ప్రకటించిన గుణశేఖర్.!

హిరణ్యకశ్యప.. శాకుంతలం అంటూ భారీ సినిమాలను ప్రకటించిన గుణశేఖర్.!తెలుగు చిత్ర పరిశ్రమలో భారీ సెట్ లకు కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే దర్శకులు గుణశేఖర్ గారు రెండు భారీ సినిమాలను ప్రకటించారు.ఒకటి హిరణ్యకశ్యప కాగా రెండవది శాకుంతలం.వివరాల్లోకి వెళ్తే..


మెగాస్టార్ చిరంజీవి గారి తో చూడాలని ఉంది.. సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక్కడు.. జూనియర్ ఎన్టీఆర్ తో చిన్నారుల శిల్పారామం.. రామాయణం. అదే బాల రామాయణం వంటి విజయవంతమైన మంచి సినిమాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకొని అరుంధతి సినిమాతో లేడీ సూపర్ స్టార్ గా ఎదిగిన అనుష్క తో రుద్రమదేవి సినిమాతో కాకతీయ సామ్రాజ్యపు విశేషాలను.. రాణి రుద్రమదేవి గారి గొప్పతనాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించిన దర్శకులు గుణశేఖర్ గారు.


ఒక్కడు సినిమాకు తాను వేసిన చార్మినార్ సెట్ గురించి ఇప్పటికి చిత్ర పరిశ్రమ మాట్లాడుతూ ఉంటుంది.ఆ తర్వాత ఆయన సినిమాలో సెట్ వెయ్యడం సర్వ సాధారణంగా మారిపోయింది.ఆయన చివరగా చేసిన రాణి రుద్రమదేవికి ఒక పక్క స్వీయ నిర్మాణం.. మరో పక్క భారీ తారాగణం.. అందులోనూ చరిత్ర.. దింతో అనేక సెట్లు వేశారు గుణశేఖర్ గారు.అలాంటి గుణశేఖర్ గారు గత సంవత్సరం జూన్ ఒకటిన అంటే రుద్రమదేవి సినిమా విడుదలై.. దాదాపు మూడున్నర సంవత్సరాల తర్వాత తన తదుపరి సినిమా ప్రకటన చేశారు.దగ్గుబాటి రానా హీరోగా హిందు పురణలలోని లక్ష్మీనరసింహస్వామికి సంబంధించి హిరణ్యకశ్యప అనే సినిమా చేస్తున్నట్లు ప్రకటించారు.గడిచిన మూడు సంవత్సరాలుగా ఆ సినిమా పనులు జరుగుతున్నట్లు చెప్పడంతో భారీ సినిమా ఖాయమని అంతా భావించారు.ఇప్పుడు లాక్ డౌన్.. మరోవైపు రానా పెళ్ళి.. చేస్తున్న సినిమాల దృశ్య ఆ భారీ సినిమా పట్టలేక్కేందుకు సమయం పడుతుండటంతో మరో సినిమా చేస్తున్నట్లు నిన్న(అక్టోబర్ 9న) ప్రకటించారు.


మహా భారతంలోని ఆదిపర్వంలో విశ్వామిత్ర మహర్షి కూతురు శకుంతల.. కన్వ మహర్షి వద్ద పెరిగిన ఆమెను హస్తినాపురి రాజైన దుస్యంత మహారాజు ప్రేమిస్తారు.ఈ ఆహ్లాదకర ప్రేమకథని ఆవిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.ఈ సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ను నిన్న విడుదల చేశారు.సినిమా టైటిల్ “శాకుంతలం”.. మెలోడీ బ్రహ్మ మణి శర్మ గారు ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు.లండన్ లో ఆర్ట్స్ & విజువల్ కల్చర్ (చిత్రాల ద్వారా సంస్కృతిని తెలపడం) చదివిన గుణశేఖర్ గారి పెద్ద కుమార్తె నీలిమ నిర్మాతగా పరిచయం కానున్నారు.గుణ టీం వర్క్స్ బ్యానర్ పై చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు.. త్వరలో పూర్తి వివరాలు ప్రకటించనున్నట్లు తెలిపారు.


అద్భుతమైన టైటిల్ పోస్టర్ తోనే భారీ అంచనాలు పెంచిన ఈ సినిమా భారీ విజయం సాధించాలని.. నేటి తరానికి మహా భారతంలోని విశేషాలు తెలియాలని కోరుకుంటూ.. నీలిమకు.. గుణశేఖర్ గారికి.. మరియు చిత్ర బృందానికి శుభాకాంశాలు..!


శాకుంతలం మోషన్ పోస్టర్

ట్రెండింగ్ నెం 1 తో మిలియన్ వ్యూస్ దాటిన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.!

ట్రెండింగ్ నెం 1 తో మిలియన్ వ్యూస్ దాటిన బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్.!అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఉదయం పదిన్నర గంటలకు(10:30) బొమ్మ బ్లాక్ బస్టర్ సినిమా టీజర్ నిన్న(అక్టోబర్ 5న) ఒక మిలియన్(10 లక్షల) వ్యూస్ దాటింది.విభిన్న పాత్రలతో విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న నందు హీరోగా.. యాంకర్ గా అటు బుల్లితెర పై దూసుకుపోటు ఇటు వెండితెరపై హీరోయిన్ గా చేస్తున్న రేష్మి గౌతమ్ హీరోయిన్ గా.. లఘు చిత్రాలతో మంచి పేరు సంపాదించిన రాజ్ విరాట్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న సినిమా “బొమ్మ బ్లాక్ బస్టర్”. ఆ టీజర్ వివరాల్లోకి వెళ్తే…


అక్టోబర్ 2న ఉదయం విడుదలైన ఈ టీజర్ యూట్యూబ్ వెంటనే లో ట్రెండింగ్ 1 కి చేరింది.. దాదాపు 48 గంటల పాటు అదే స్థానంలో నిలిచింది.మిలియన్(10లక్షల) వ్యూస్ ని చాలా వేగంగా చేరుకుంది.ఇప్పటికే చూసిన సినీ ప్రముఖులు.. ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది.సవారిలో మాస్ పాత్ర చేసిన నందు నుండి వస్తున్న తదుపరి చిత్రం కావడంతో ఫస్ట్ లుక్ కి ముందు నుండే బజ్ నడిచింది.దీనికి తోడు.. బిబి అంటూ నందు పోస్ట్ చేయడంతో సినిమా టైటిల్ కి బిగ్ బాస్ కి మధ్య చర్చ జోరుగా సాగింది.ఎట్టకేలకు టైటిల్ పోస్టర్ తో చర్చ కు తెర పడింది.ఆ తర్వాత ఈ సినిమాలో పాత్ర పేరు పోతురాజు కావడంతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజున అన్నవరం సినిమాలోని పోతురాజు డైలాగ్ తో వీడియో విడుదల చేశారు.నందు పుట్టినరోజున వచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్ అందరిని బాగా ఆకట్టుకుంది.


ప్రదీప్ మాచిరాజు విడుదల చేసిన రేష్మి గౌతమ్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ తో సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.పూరి జగన్నాథ్ గారి పుట్టినరోజున పోతురాజు రూమ్ లో ఆయన పోస్టర్స్ ఉన్న వీడియో విడుదల చెయ్యడంతో ఆయన సైతం టీజర్ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.అప్పటికే హీరో.. హీరోయిన్ ఫస్ట్ లుక్ వల్ల ప్రేక్షకులు సైతం టీజర్ కోసం ఎదురు చూశారు.నిన్న గాంధీ జయంతి సందర్భంగా టీజర్ విడుదల చేసింది చిత్ర బృందం.విశాఖ జిల్లా అచుతాపురం ఊరిలో నాటకాలు వేసుకునే పోతురాజు(నందు)పూరి జగన్నాథ్ గారి వీరాభిమాని.తన జీవిత కథను తన అభిమాన దర్శకుడు పూరికి ఇచ్చి సినిమా తియ్యమని చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అలాంటి పోతురాజు జీవిత కథ ఏమిటి?అతనికి వాణి(రేష్మి)ఎలా పరిచయమవుతుంది.. తర్వాత ఏంటి అనేది కధాంశం.ప్రతి స్కీన్ మాస్ ఆడియాన్స్ కి దగ్గరగా ఉంది.నందు స్క్రీన్ మీద ఉన్నంత సేపు హై వోల్టాజ్ లో షాట్స్ ఉన్నాయి.ఈ టీజర్ లో హీరో శ్రీ విష్ణు వాయిస్ ఓవర్ ఇచ్చారు.దర్శకుడి కష్టం మరియు ఆలోచన పోతురాజు రూమ్ మరియు నాటక మండలి రూమ్ చూస్తే తెలిసిపోతుంది.డైలాగ్స్ కూడా బాగున్నాయి.ఒక్క ముక్కలో చెప్పాలంటే టీజర్ అదిరిపోయింది భయ్యా..!


ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం సుజాత సిద్దార్థ్ సినిమాతోగ్రఫీ చేశారు.ఈ సినిమాను విజయీభవ బ్యానర్ పై ప్రవీణ్ పగడాల,బోసుబాబు నిదుమోలు,ఆనంద్ రెడ్డి మద్ది మరియు మనోహర్ రెడ్డి ఏడా నిర్మించారు.దర్శకులు పూరి జగన్నాథ్ టీజర్ బాగుందని బాహాటంగా మెచ్చుకోగా.. మరో ప్రముఖ దర్శకులు సుకుమార్ వాట్సాప్ కాల్ ద్వారా అభినందించినట్లు హీరో నందు సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు.ఫస్ట్ లుక్.. టీజర్ తోనే అటు పరిశ్రమలో ఇటు ప్రేక్షకులలో అంచనాలు భారీగా పెరిగిపోయాయి.సినిమా విడుదల తేది కోసం ఎదురుచూస్తు.. “బొమ్మ బ్లాక్ బస్టర్” కావాలని కోరుకుందాం..!

బొమ్మ బ్లాక్ బస్టర్ టీజర్

ట్రైలర్ తో ఆసక్తి రేపిన శంకర్ మార్తాండ్స్ ఎక్స పైరీ డేట్.!

ట్రైలర్ తో ఆసక్తి రేపిన శంకర్ మార్తాండ్స్ ఎక్స పైరీ డేట్.!అసలే.. వెబ్ సిరీస్ అందులో థ్రిల్లర్.. ఇంకేముంది భాషతో సంబంధం లేకుండా కేవలం సబ్ టైటిల్స్ తో చూసేస్తున్నారు మన యువత.అలాంటి వారికి ఈ లాక్ డౌన్ లో మరో థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది.తెలుగు,హిందీ భాషల్లో మన తెలుగు దర్శకుడు శంకర్ మార్తాండ్ తీసిన వెబ్ సిరీస్ ఎక్స్ పైరీ డేట్ ( Expiry Date). వచ్చే నెల (అక్టోబర్) 2న హిందీ లో.. 9న తెలుగులో.. ఈ సిరీస్ జీ5 లో విడుదల కానుంది.ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు మంచి స్పందన వస్తుంది.


ఉల్లాసంగా.. ఉత్సాహంగా,కరంట్,సింహ,అలా మొదలైంది చిత్రాలలో నటించి తెలుగు వారికి చేరువైన బాలీవుడ్ నటి.. అటు హిందీ.. ఇటు తెలుగులో జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరు తెచ్చుకున్న స్నేహ ఉల్లాల్.. బడలా సినిమాతో హిందీ ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ నటుడు టోనీ లూక్ జంటగా ఈ వెబ్ వెరీస్ లో నటిస్తున్నారు.మరో జంటగా తెలుగు,తమిళ భాషలతో పాటు హిందీలో సైతం సినిమాలు చేసిన మధు షాలిని మరియు బిగ్ బాస్ షో తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన అలీ రెజా నటించారు.


స్నేహా ఉల్లాల్ పెళ్లికి వెళ్ళిన రోజు నుండి కనిపించడం లేదని పిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్ కు చేరుకున్న టోనీ కి.. అదే మార్గంలో.. అదే పెళ్ళికి వెళ్లిన అలీ రెజా కూడా కనిపించడం లేదని మధు షాలిని పిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.మరి అక్కడ నుండి వారికి ఏమైంది?వారిద్దరికీ సంబంధం ఏమిటి?తప్పిపోయ్యారని చెప్పుతున వీరి మాటల్లో నిజమెంట?పోలీసు విచారణలో అసలు ఆ రోజు ఏమి జరిగిందని తెలిసింది??పాత్రధారులు ఎవరు?వారి వెనక ఉన్న సూత్రధారులు ఎవరనే కధాంశంతో ఈ వెబ్ సిరీస్ తెరకెకింది.ఈ వెబ్ సిరీస్ కి ప్రముఖ సంగీత దర్శకులు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు.సురేష్ రాజుతు సినిమాతోగ్రఫీ చేశారు.నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాత శరత్ మరార్ ఈ సిరీస్ ని నిర్మించారు.

Sneha ullal,madhu shalini,expiry date web series,shankar marthand

దర్శకుడు శంకర్ మార్తాండ్.. ఈ వెబ్ సిరీస్ ని బాగా తెరకెకించినట్లు.. సిరీస్ ఆద్యంతం చాలా ఉత్కంఠ బరిమతంగా సాగుతుందని.. ఈ సిరీస్ అటు హిందీ,ఇటు తెలుగులో భారీ విజయం నమోదు చేస్తుందని.. అక్టోబర్ 2వ తేదీ కోసం ఎదురు చుట్టున్నట్లు వెబ్ సిరీస్ లో నటించినవారు మరియు సాంకేతిక బృందం సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. మార్చ్ చివరి నాటికే సింహ భాగం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్.. తాజాగా మిగిలిన షూటింగ్ పూర్తి చేసుకుంది. మన హైదరాబాద్ సిటీ.. మరియు హైదరాబాద్ శివార్లలోనే చిత్రీకరణ మొత్తం చేసినట్లు సమాచారం.ఇప్పటి దాకా ఏదో దేశంలో ఎవరో తెలియని వారు నటించిన త్రిల్లర్ సిరీస్సులు చూసిన మన ప్రేక్షకులకు.. మనకు తెలిసిన వారు నటించిన మన సమాజానికి దగ్గరగా ఉన్న ఈ త్రిల్లర్ ను ఎలా ఆదరిస్తారో చూడాలి!? హిందీలో 2న.. తెలుగులో 9న విడుదల చేస్తున్నారు కనుక అప్పుడు తెలుస్తుంది. అప్పటి వరకు వేచి చూద్దాం.!

ఎక్స పైరీ డేట్ ట్రైలర్

నేడు సినిమాల ద్వారా జీవిత సత్యాలు చెప్పే పూరి పుట్టిన రోజు.!

నేడు సినిమాల ద్వారా జీవిత సత్యాలు చెప్పే పూరి పుట్టిన రోజు.!యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రాజు విశాఖ తీరంలోని బాపిరాజు కొత్తపల్లి అనే ఊరిలో ఒక అల్పపీడనం పుట్టింది.అది హైదరాబాద్ చేరుకొని రెండు దశాబ్దాల క్రితం తెలుగు చిత్ర పరిశ్రమలో తుఫాన్ గా మారింది. సునామీ వంటి బీభస్థాని సృష్టించిన ఆ తుఫాన్ పేరు పూరి జగన్నాథ్.పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బద్రి సినిమాతో పరిచయమై.. తొలి సినిమాతోనే తన సినిమాలో హీరో క్యారెక్టర్లు మున్ముందు ఎలా ఉంటాయో చూపించాడు.. పబ్లిక్ పల్స్ పట్టిన ఆ యువ దర్శకుడు.ఆ రోజు పవన్ కళ్యాణ్ సైతం ఊహించి ఉండదు తను మెడ మీద చెయ్యి పెట్టడం తన మ్యానరిజం అవుతుందని.ఇక యువత బద్రి సినిమాతో పవన్ కళ్యాణ్ గారికే కాక తొలి సినిమా దర్శకత్వం చేసిన దర్శకునికి కూడా బాగా కనెక్ట్ అయ్యారు.నాటి బద్రి నుంచి నిన్నటి ఇస్మార్ట్ శంకర్ వరకు హిట్లు,ఫ్లాప్లు అనే సంబంధం లేకుండా రెండు దశాబ్దాలుగా యువతకు బాగా చేరువైన దర్శకుడు పూరి జగన్నాథ్ గారు.నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఈ కథనం..


తొలి సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో భారీ విజయం అందుకున్న పూరి,వెంటనే జగపతిబాబు గారితో బాచి.. కన్నడలో శివ రాజ్ కుమార్ తో మన తెలుగు తమ్ముడిని రీమేక్ చేశారు.2001లో రవితేజతో ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం.. 2003 కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో అప్పు.. తెలుగులో రవితేజను స్టార్ హీరో చేసిన ఇడియట్ సినిమా చేశారు..ఆ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఆ తర్వాత అమ్మ నాన్న ఓ తమ్మిళ అమ్మాయి సీనిమాతో పూరి,రవితేజ కంబోగా వరస హాట్-ట్రిక్ హిట్స్ అందుకున్నారు.


అక్కడ నుండి వెనక్కు తిరిగి చూడలేదు.. అలనాటి అగ్ర హీరోలు నాగార్జున,బాలకృష్ణ.. నేటి తరం స్టార్లు పవన్ కళ్యాణ్,మహేష్ బాబు,తారక్,బన్నీ,రామ్ చరణ్,ప్రభాస్,రానా,గోపిచంద్,రవితేజ,వరుణ్ తేజ్,రామ్ పోటీనేని వంటి హీరోలతో సినిమాలు చేశారు..బాలీవుడ్ లో బద్రి ని రీమేక్ గా షార్ట్ సినిమా.. తన అభిమాన నటుడు బిగ్ బి అమితా బచ్చన్ గారితో బుద్దా హోగా తెర బాప్ అనే సినిమాని డైరెక్ట్ చేశారు పూరి.చిరుత.. తో నేనింతే.. అని చెప్పిన ఎక్ నిరంజన్.
ఒక పక్క జ్యోతిలక్ష్మి తో.. 143.. నేను నా రాక్షసి..అంటూ,మరో పక్క కెమరామెన్ గంగతో రాంబాబు గా మారి.. మేరీ మెహబూబా అని చెప్పిన.. ఇద్దరమ్మాయిల రోమియో. వారికి గోలిమార్ తో హార్ట్ ఎటాక్.. తెప్పించిన ఆంధ్రవాలా.. దేశముదురు.. పోకిరి.. లోఫర్..రోగ్.. మన బుజ్జిగాడు. చివరకు దేవుడు చేసిన మనుషులు.. ఇంతే అనే ఇజం నమ్మిన శివమణి.. తన టెంపర్..తో సూపర్.. బిజినెస్ మ్యాన్ గా పైసా వసూల్ సాధించారు.
ఇట్లు..
ఇస్మార్ట్ శంకర్.


ఇప్పుడు 2020లో స్టార్ హీరోగా మారిన నేటి తరం రౌడీ విజయ్ దేవరకొండ తో కలిసి దేశ స్థాయిలో భారీ సినిమా చేస్తున్నారు పూరి..ఈ సినిమా నిర్మాణంలో కరణ్ జోహార్ కుడా ఉన్నారు.ఇలా తన 20ఏళ్ళ సినీ జీవితంలో 32 సినిమాలు చేశారు.నేటి తరం దర్శకులలో చాలా మంది జీవితంలో చేసే సినిమాలు ఆయన ఈ 20ఏళ్లలో చేశారు. ఒక్క సంవత్సరంలో 3 సినిమాలు చేసినా,అతి తక్కువ రోజుల్లో సినిమాను పూర్తి చేసినా..అవన్నీ పూరి మార్క్ దర్శకత్వ ప్రతిభకు అర్థం పడతాయి.. కన్నడ లో పునీత్ రాజ్ కుమార్.. తెలుగు తో రామ్ చరణ్ వంటి సినీ వారసులను పరిశ్రమకు పరిచయం.. అక్కడ రాజ్ కుమార్.. ఇక్కడ మెగాస్టార్ చిరంజీవి గారు అడిగి చేయించుకున్నారు. డైలాగ్స్ విషయానికి వస్తే..


పవన్ కళ్యాణ్(బద్రి):- నువ్వు నందా,నందా అయితే నాకేంటి నేను బద్రి బద్రీనాథ్.
మహేష్ బాబు(పోకిరి):- ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లోక్ అవుడో వాడు పండు,నేనే..
నాగార్జున(శివమణి):- నా పేరు శివమణి,నాకు కొంచెం మెంటల్.
అల్లు అర్జున్(దేశముదురు):- జాయింట్లు జారిపోతాయి,ఫిలమెంట్లు రాలిపోతాయి..
రవితేజ(ఇడియట్):- సిటీ కి ఎంతోమంది కమిషనర్లు వస్తుంటారు..పోతుంటారు..కానీ,చంటిగాడు.. లోకల్..
ఎన్టీఆర్(టెంపర్):- నా పేరు దయా,నాకు లేనిదే అది..
ప్రభాస్(బుగ్గిగాడు):- టిప్పర్ లారీ వచ్చి గుడితే ఎలా ఉంటుందో తెలుసా..ఇలా ప్రతి సినిమాలో పదుల సంఖ్యలో డైలాగ్స్ మనకు టక్కున గుర్తొచ్చేస్తాయి..హీరోల మ్యానరిజంలలో సైతం పూరి మార్క్ ఉంటుంది.ఆయన సినిమా డైలాగ్స్ లో జీవిత సత్యాలు కూడా ఉంటాయి..ఉదాహరణకు,నాకు బాగా నచ్చిన డైలాగ్.. నేనింతే సినిమాలో.. “ఈ ప్రపంచంలో ప్రతీ ఒక్కడు స్వార్థ పరుడే ఇదే మాటచెప్తే ఏ నా కొడుకు ఒప్పుకోడు..”.ప్రపంచంలో జరుగుతున్న నిజాలని పూరి చూపించే విధానం అద్భుతం.. కొంచం ఘాటుగా చెప్పినా ఆయన ప్రతి సినిమాలో ఒక చక్కటి సందేశం ఉంటుంది.. పాటలకు పూరి సినిమాలో మరో ప్రాత్యేక స్థానం.అందుకే పూరి సినిమా పాటలు మన ప్లే లిస్ట్ లో కచ్చితంగా ఎక్కువే ఉంటాయి. ఆయన సినిమాలే జీవిత సత్యాలు, చాలామందికి ఆదర్శాలు.. ప్రేమ,దేశం పట్ల ఆయనకు ఉన్న గౌరవం ఆయన సినిమాలు చూస్తే మనకు అర్ధమవుతుంది.మనలో చాలా మంది ఆయన మాటలలో ఆటో,ఇటో వెళ్లకుండ మధ్యలో ఊగిసులడుతుంటాం..వీరే ఈ దేశానికి ప్రమాదకరం..వీరు ఉండకూడదు అనేదే తన తపనలా కనిపిస్తూ ఉంటుంది.సమాజం పట్ల తనకున్న బాధ్యత తను ఇలా సినిమాలు తీస్తూ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తుంది.


సినిమాల్లోకి రాకముందు నుండే పూరి ఇలానే ఉన్నారు.తాను విశాఖలో ఏడవ తరగతి చదువుతున్న రోజుల్లోనే తన మిత్రులతో మాట్లాడటానికి ఒక ఆఫీస్ ఏర్పచుకున్నారు.. ఆయన శైలే ఆయన పాత్రలకు ఇచ్చారంటే.సొంతగా పూరి కనెక్స్ అనే నిర్మాణ సంస్థ పెట్టి సినిమాలు నిర్మించడమే కాక చాలామందికి అవకాశాలు,మరెందరికో ఉద్యోగాలు ఇస్తున్నారు పూరి.గత సంవత్సరం తన పుట్టినరోజున(ఇదే రోజు).. సినిమాలు చెయ్యలేని వృద్ధ దర్శకులకు ఆర్థిక సహాయం అందించారు పూరి.ఇదే కాదు,చేసిన సహాయం ఎన్నడూ చెప్పుకోలేదు పూరి..సాధారణంగా ప్రేక్షకులు మాట్లాడుకుంటూ..మా హీరో పాత్రలో ఎలా జీవించగలదో చూస్తావు ఆగు,పూరి గారితో మా వాడి సినిమా వస్తుంది.హీరోయిన్ లను చూపించడంలో కూడా తనదైన మార్క్ ఉంటుంది.ఆ అమ్మాయిని సరిగ్గా ఇప్పటి వరకు ఎవరు చూపించలేదు..ఇప్పుడు పూరితో సినిమా చేస్తుంది కదా..ఇప్పుడు చూడు ఎలా చూపిస్తాడో పూరి..అంటున్నారు.


ఇలా పూరి గారి గురించి రాసుకుంటూ పోతే పుస్తకమే రాయచ్చు.తాజాగా ..తెలుగు చలన చిత్ర పరిశ్రమ సెన్ సెషన్,పంచ్ డైలాగ్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్,మాస్ సినిమాలకు పర్మనెంట్ అడ్రస్.. పూరి గారి మాటలలో చెప్పాలి అంటే..పూరీ నువ్వు తోపు రా..పూరి నువ్వు తురుము రా.. పూరి నువ్వే మా అందరి రుస్తుం..మరిన్ని దశాబ్దాలు ఇలా సినిమాలు చెయ్యాలని.. మీడియా,పోలీస్,రాజకీయం అనే తేడా లేకుండా సమాజంలో తప్పు చేసే ప్రతి యడవను కడిగేయ్యాలని కోరుకుంటూ.. నేడు యాభై నాలుగవ పుట్టిన రోజు జరుపుకుంటున్న పూరి జగన్నాథ్ గారికి మా బి.ఆర్.మూవీ జోన్ తరపున జన్మదిన శుభాకాంశాలు.!