12-04-2021 23:58:50 About Us Contact Us



విలక్షణమైన కథలతో ప్రేక్షకులను మెప్పిస్తున్న నేటి తరం కథానాయకులలో నితిన్ ఒకరు. వెంకీ కుదుముల దర్శకత్వంలో రంగ్ దే సినిమా చిత్రికరణ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుండగానే ఇంకొక చిత్రం టీజర్ విడుదల చేసి తన జోరు చూపిస్తున్నాడు ఈ యువ కథానాయకుడు.


కొత్త తరహా కథలతో ఎప్పుడు సినిమాలు తీసే దర్శకుడు చంద్ర శేఖర్ ఏలేటి దర్శకత్వంలో రకుల్ ప్రీత్ సింగ్.. ఒక కన్ను సైగతో సోషల్ మీడియా సెన్సెషన్ గా మారిన ప్రియా ప్రకాష్ వారియర్ లతో కలిసి చేస్తున్న సినిమా చెక్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ ని నూతన సంవత్సర కానుకగా విడుదల చేశారు చిత్రం బృందం.


టీజర్ చూస్తే ఉగ్రవాడిగా శిక్ష పడ్డ నితిన్ జైల్ లో బాగా చెస్ ఆడుతుంటాడు. ఆ కేస్ లో అక్రమంగా ఇరికించారని.. హీరోని నిర్దోషిగా చూపించే ప్రయత్నం రకుల్ ప్రీత్ సింగ్ చేస్తున్నట్లు చూపించారు. అసలు ఆ కేసుతో తనకు సంబంధం ఏమిటి?తాను నిజంగా తప్పు చేశాడా.. లేదా.. అనే ఆసక్తిని టీజర్ కలగచేసింది. టీజర్ చుస్తే ఇదొక సస్పెన్స్ ట్రిల్లర్ అని అర్ధమవుతుంది. టీజర్లో కళ్యాణ్ మాలిక్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సినిమాత్తోగ్రఫీ చేసిన రాహుల్ శ్రీ వత్సవ్ కెమెరా పనితనం స్పష్టంగా కనిపిస్తుంది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.



భవ్య క్రియేషన్స్ బ్యానర్ లో వి.ఆనంద్ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్ర టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 2M వ్యూస్ సొంతం చేసుకుని ఇప్పటికి యూట్యూబ్ లో ట్రేండింగ్ 1గా నిలిచింది.


ఇప్పటికే రంగ్ దే విడుదలకి సిద్ధంగా ఉండగా ఇప్పుడు చెక్ తో ఈ కొత్త ఏడాది రెండు చిత్రలతో రబోతున్నాని చెప్పకనే చెప్పాడు హీరో నితిన్. ఈ రెండు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాలు సాధించిన నితిన్ కెరీర్లో మరో మైలురాయిగా నిలవాలి అని ఆశిద్దాం.

నితిన్ చెక్ టీజర్..!