24-01-2022 16:50:09 About Us Contact Us


సాధారణంగా 18 ఏళ్ల కుర్రాళ్ళు చదువుకుంటూ ఉంటారు,కానీ ఒక కుర్రాడు సినిమా రంగ ప్రవేశం చేశాడు,ఆ సినిమా 2003లో విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద జయం సాదించింది. ఏమని ఆ దర్శకుడు తేజ జయం అని పెట్టాడో 37 ఏళ్ళు వచ్చినా విజయాల తో దూసుకెళ్లిపోతున్నాడు.ఆ కుర్రాడు ఎవరో కాదు ఆనాటి నుంచి నేటి వరకు యువ కధానాయకుడు అనే ముద్రతో తన వయసు హీరోలు ఎవ్వరికీ సెట్ కానీ విధంగా ఇప్పటికీ లవ్ స్టోరీలు చేస్తూ వయసు తెలియకుండా చేస్తు దాదాపు రెండు దశాబ్దాల నుండి యూత్ ని ఆకర్షిస్తున్న యూత్ స్టార్ నితిన్.

తొలి సినిమా జయం తో విజయం అందుకున్న నితిన్,2003 లో వి.వి.వినాయక్ దర్శకత్వంలో వచ్చిన దిల్ తో యువతలో మంచి ఫాలోయింగ్ సంపాదించాడు.మళ్ళీ 2004 లో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకవత్వంలో వచ్చిన సై తో భారీ విజయం లభించింది.ఇప్పటికి సై టీవీలో వేస్తుంటే చిన్న వయసు నుండి పెద్దల దాక టీవీకి ఎత్తుకొని చూస్తుంటారు.ఇలా చిత్ర పరిశ్రమకి వచ్చిన తొలి రోజుల్లోనే తేజ,వి.వి.వినాయక్,కృష్ణ వంశీ,రాజమౌళి,రాజవేంద్ర రావు వంటి స్టార్ దర్శకుల దర్శకత్వంలో నటించి నటనలో మంచి నేర్పు పొందాడు.వరసగా మూడు సంవత్సరాలలో మూడు హిట్స్ అందుకున్న నితిన్ కి ఎవరి దిష్టి తగిలిందో కానీ ఆ తర్వాత హిట్ అనే మాట వినలేదు.ఇండియన్ స్టార్ డైరెక్టర్ లలో ఒక్కరైన ఆర్.జి.వి తో కలిసి 2009లో బాలీవుడ్ లో అగ్యాట్ చేసినా హిట్ కొట్టలేదు.ఇలా ఏడు సంవత్సరాలలో అటు క్లాస్,ఇటు మాస్,ఫామిలీ అంటూ మొత్తం 12 సినిమాలు చేసినా ప్రయోజనం లేకుండా పోయింది.

ఇంతలో 2012లో 13బి అనే ఒక దెయ్యం సినిమా తమిళంలో తీసి హిట్ కొట్టిన విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నితిన్ లవ్ స్టొరీ చేస్తున్నాడు అనగానే,దెయ్యం సినిమా చేసిన వ్యక్తితో లవ్ స్టొరీ ఏంటి అని అంతా అనుకున్నారు,ఈ సినిమా పాటల విడుదల కార్యక్రమానికి తనకు ఇష్టమైన నటుడు,చిత్ర పరిశ్రమ వేడుకలలో చాలా తక్కువగా కనిపించే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రావడంతో సినిమా గురించి ఒక్కసారిగా చర్చ మొదలైంది.దింతో ప్రజలు పాటలు వినదం మొదలెట్టారు,అనూప్ రూబెన్స్ స్వరపరిచిన ఆ పాటలు యువతను బాగా ఆకట్టుకున్నాయి.దింతో సినిమాకి మంచి హైప్ వచ్చింది.ఆ సినిమా ఎంతటి విజయం సాదించిందో మనందరికీ తెలిసిందే.

తర్వాత గుండెజారి గల్లంతయిందే తో ట్రాక్ లోకి వచ్చేశాడు నితిన్.2016లో అఆ తో తనకిష్టమైన గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేసి తన కెరియర్ లొనే అతి పెద్ద విజయం అందుకున్నాడు నితిన్.2018లో తనకిష్టమైన పవన్ కళ్యాణ్,త్రివిక్రంల నిర్మాణ సారథ్యంలో తన 25వ సినిమాగా చల్ మోహన్ రంగా సినిమా,ఫామిలీ సినిమాగా వచ్చిన శ్రీనివాస కల్యాణం సినిమాలు ఆడినా నితిన్ స్థాయి హిట్ కాదు అనేది తన అభిమానుల మాట.ఈ సంవత్సరం భీష్మ తో మళ్ళి మరో పెద్ద హిట్ అందుకున్నాడు నితిన్.తాజాగా షాలిని అనే అమ్మాయితో పెళ్లి కి కూడా సిద్ధమయ్యాడు.

ఇలా 18 ఏళ్లకే ఇండస్ట్రీకి వచ్చిన నితిన్ ఆరంభంలో వరస హిట్లు,ఆ తరువాత ఏడేళ్ల నిరీక్షణ తర్వాత మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విధానం అంతా తాను ఆరాధించే పవన్ కళ్యాణ్ గారి సినిమా జీవితంలానే ఉంటుంది.ఎంతలా అంటే 2012 వరకు వరస ప్లాప్ లలో ఉన్న పవన్ నితిన్ సినిమా వేడుకకు వచ్చి హిట్ కావాలి అని కోరుకుంటే నితిన్ సినిమా విజయం సాధించింది,అలానే అదే సంవత్సరం 3నెలల గ్యాప్ లో వచ్చిన గబ్బర్ సింగ్ తో పవర్ స్టార్ సైతం హిట్ చూశారు.అలానే జనసేన అంటూ పవన్ రాజకీయ ప్రవేశం చేస్తే 25 లక్షల విరాళం పార్టీకి అందించాడు నితిన్.ఎప్పుడు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా తను ఒక స్టార్ హీరో అనే విషయం మర్చిపోయి,పవన్ వీరాభిమానిగా మాట్లాడుతూ తన అభిమానాని చాటుకుంటు ఉంటాడు.బహుశా పవన్ కళ్యాణ్ ని ఇంతకన్నా ఎవరు ప్రేమించారేమో అనేలా ఉంటుంది ఆయన అభిమానం.నితిన్ సినిమాలో పవన్ కళ్యాణ్ పాటలు,సిన్ లు,లేకుంటే ఆయన పేరు పెట్టడం సర్వ సాధారణం.

నితిన్ కి సామాజిక స్పృహ కూడా ఎక్కువే ఎప్పుడు ఏ కష్టం సమాజానికి వచ్చినా తనదైన సహాయం చేస్తూ ఉంటాడు నితిన్.అలానే తాజాగా కరోనా విషయంలో తెలుగు సినిమా పరిశ్రమ నుండి తొలుత ఆర్థిక సహాయం ప్రకటించిన వ్యక్తి నితిన్.తన సినీ ప్రయాణంలో ఎన్నో హిట్లు,ప్లాపులు చూసిన నితిన్,హిట్ వస్తే పొంగిపోలేదు,ఫ్లాప్ వస్తే నిరసలోకి వెళ్లిపోలేదు,ఎప్పుడు ఒకేలా ఉంటూ ఎందరో యువకులకు ఆదర్శంగా నిలిచారు.అలాంటి నితిన్ నేడు 37వ పుట్టినరోజు జరుపుకొనున్నారు.నితిన్ మరిన్ని విజయాలు సాధించాలి అని,ఎప్పటికి ఇలానే యూత్ స్టార్ గా వయసుతో సంబంధం లేకుండా యువ హీరోగానే ఉండిపోవాలి అని కోరుకుంటూ తెలుగు చిత్ర పరిశ్రమ తరపున,ఆయన అభిమానుల తరపున మరి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి అభిమానుల తరపున మా బి.ఆర్.మూవీ జోన్ బృందం తరపున పుట్టిన రోజు శుభాకాంక్షలు.