05-03-2021 08:44:19 About Us Contact Us



10 ఏళ్ళ ముందు హీరోగా పరిచయమై.. ఊహలు గుసగుసలాడే.. చలో వంటి భారీ విజయాలను నమోదు చేసుకొని.. 2ఒక పైగా సినిమాలు పూర్తి చేసి..ప్రసృతం మూడు సినిమాలు చేస్తూ మంచి జోష్ మీద ఉన్న.. యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న.. కథానాయకుడు నాగ శౌర్య పుట్టినరోజు సందర్భంగా ఈ కధనం..


నాగశౌర్య పుట్టింది ఏలూరు. 6వ తరగతి నుండి స్కూల్ బంక్ కొట్టి సినిమాలు చూడటం అలవాటు అయింది ఆలా సినిమాల మీద ఆసక్తి పెరిగింది నాగశౌర్య కి ఆలా 10వ తరగతి పూర్తి చేసిన తరువాత సినిమాలలో నటిస్తా అని వాళ్ళ అమ్మ గారికి చెప్పడంతో ఆమె నువ్ డిగ్రీ పూర్తి చేసిన తరువాత నచ్చింది చెయ్యు అని షరతు పెట్టరు.


విజయవాడలో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీ హైదరాబాద్ లో చదివితే.. సినిమా అవకాశాలు కోసం ప్రయత్నాలు చెయ్యొచ్చు అనే ఉద్దేశంతో ఇంట్లో ఒప్పించి డిగ్రీ హైదరాబాద్ లో చదువుతూ సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడు.ఆలా 4ఏళ్ళు సినీ ప్రయత్నాలు చేసిన తరువాత2010లో క్రికెట్ గర్ల్స్ అండ్ బీర్ అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు. తరువాత 2013 లో ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చందమామ కధలు అనే చిత్రంలో చిన్న పాత్రలో నటించాడు.


తరువాత 2014 లో వారహి చిత్రం బ్యానర్లో అవసరాల శ్రీనివాస్ దర్శకత్వంలో “ఊహలు గుసగుసలాడే” చిత్రంలో నటీంచగా అది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దిక్కులు చూడకు రామయ్య, లక్ష్మి రావా మా ఇంటికి, జాదుగాడు, చలో, అశ్వాద్దామా వంటి చిత్రలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.


ప్రస్తుతం వరుడు కావలెను.. లక్ష్య..పోలీస్ వారి హెచ్చరిక.. చిత్రలోలో నటిస్తున్నారు. ఈ చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవాలని.. ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటుంది B R మూవీ జోన్.